వారఫలాలు | Varaphalalu in this week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Sep 23 2018 1:10 AM | Last Updated on Sun, Sep 23 2018 1:11 AM

Varaphalalu in this week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఛండీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు.  శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వాహన యోగం.  విద్యార్థులకు ఊహించని విజయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోతాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చాతుర్యంతో ఎదుటవారిని సైతం ఆకట్టుకుని పనులు చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో కలహాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. 

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. బాకీలు సైతం అందుతాయి. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం మరింత తగ్గుతుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో ప్రత్యేక  గౌరవం పొందుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు.  విలువైన వస్తువులు సేకరిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. సోదరులు, మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. పాతజ్ఞాపకాలు గుర్తుకు రాగలవు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. వారం  ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకంటూ గౌరవం పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు విశేష గుర్తింపు తథ్యం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వ్యయప్రయాసలు  తప్పవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది.  వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కాస్త నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు వింటారు. సోదరుల నుంచి ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పాత మిత్రుల కలయిక. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలకు హాజరవుతారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. నలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటì æసంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. వాహనయోగం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పనులు సమయానికి పూర్తి. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రత్యేక హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో
23 సెప్టెంబర్‌ నుంచి  29 సెప్టెంబర్, 2018 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కాలంతో పోటీపడతారు. ఆశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించడానికి, తలపెట్టిన పనులను త్వరగా పూర్తి చేయడానికి విరామం తీసుకోకుండా శ్రమిస్తారు. వృత్తి నిపుణులు రాణిస్తారు. ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ మార్పు ఆలోచనలను వాయిదా వేసుకోవడమే మంచిది. మీ ఆకాంక్షలకు తగిన మార్పుల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు కొంత మందకొడిగా ఉన్నట్లు అనిపించినా, సమీప భవిష్యత్తులోనే మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది.
లక్కీ కలర్‌: ఆకాశ నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వర్తమాన కాలం కంటే అధునాతనంగా ఉండే మీ ఆలోచనలను మీ చుట్టూ ఉండే సహచరులు అర్థం చేసుకోలేకపోతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయులతో అనుబంధాలు మరింత బలపడతాయి. కొత్త అనుబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో జటిలమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొని అధికారుల ప్రశంసలు పొందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో కలసి ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకల్లో సందడి చేస్తారు. సన్నిహితులతో కలసి విహార యాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితంలో భద్రతను కోరుకుంటారు. అలాగే విజయాలనూ ఆకాంక్షిస్తారు. భావోద్వేగాలను నిలకడగా ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేస్తారు. ముందుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి కాకపోవడంతో సహనం కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్వయం ఉపాధిలో కొనసాగుతున్న వారికి వారాంతంలో ఆర్థిక లబ్ధి కలిగించే చక్కని అవకాశం కలసి వస్తుంది. ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పి జీవిత భాగస్వామి సలహాలను పట్టించుకోవడం మంచిది. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. బద్ధకం పెరుగుతుంది.
లక్కీ కలర్‌: లేత ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మిమ్మల్ని మీరు అంతుచిక్కని వేరే ప్రపంచంలో తప్పిపోయినట్లుగా భావిస్తారు. ఆలోచనలను ఒక దారికి తెచ్చుకోవడానికి ప్రయాసపడతారు. జ్ఞానానికీ, ఊహలకూ మధ్య కొనసాగే ఊగిసలాటతో సతమతమవుతారు. ఇంతవరకు ఇంటి వరకు మాత్రమే పరిమితమైన మీ దృష్టిని బా«హ్య ప్రపంచంలోకి సారిస్తారు. పని మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతారు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న పోటీలో స్వయంకృతాపరాధాల కారణంగా వెనుకబడిపోతారు. సన్నిహితులతో వాగ్వాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. క్రీడలపై, వ్యాయామంపై శ్రద్ధ చూపుతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఊహా ప్రపంచంలో విహరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఘనతను నిరూపించే సందర్భాలు ఎదురవుతాయి. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు క్రమంగా సానుకూలంగా మారుతాయి. ప్రేమ వ్యవహారంలో ఎదురయ్యే సవాళ్లు కొంత అలజడి కలిగిస్తాయి. చేతికందిన పెన్నిధి చేజారిపోతుందేమోనని ఆందోళన చెందుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆశీస్సులు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీకూ మీ జీవిత భాగస్వామికీ గల అనుబంధంలో ఎలాంటి సమస్యలూ లేకపోయినా, మీరు ఒక కొత్త వ్యక్తి ఆకర్షణలో చిక్కుకుంటారు. దాని ఫలితంగా మానసికంగా నిలకడగా ఉండలేకపోతారు. అందాన్ని కాపాడుకోవడానికి సన్నిహితుల నుంచి సలహాలు కోరుకుంటారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. పెట్టుబడుల మీద ఆదాయం అంచనాలకు మించి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇదివరకు మీరు సాధించిన విజయాలకు ప్రతిఫలంగా పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు ఆర్థికంగా కలసి వస్తాయి.
లక్కీ కలర్‌: లేత గోధుమ రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సంభాషణా చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడమే కాకుండా, వృత్తిపరమైన విజయాలను అవలీలగా సాధిస్తారు. ఒక గొప్ప పనిని మీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. సవాళ్లకు ఎదురు నిలుస్తారు. విద్యార్థులు చదువుల్లో పోటీ పడతారు. ప్రేమికుల మధ్య అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరుకుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులను కలుసుకుంటారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఇప్పటివరకు పీడిస్తున్న భయాందోళనలు తొలగిపోతాయి. అనుబంధాల్లో నెలకొన్న పొరపొచ్చాలు తేలికగా సమసిపోతాయి. పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబంలో తిరిగి ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రణాళికలను ఆచరణ పెట్టడంలో ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. మానసిక ఉల్లాసం కోసం కళలను అభ్యసించడం ప్రారంభిస్తారు. కళా సాధన మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ప్రేమికుల మధ్య కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయంగా పరపతి పెంచుకుంటారు. ప్రత్యర్థులను కట్టడి చేస్తారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పొరపాట్లను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడటం మేలు. పొగడ్తలతో ముంచెత్తి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కలసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అసూయాపరులు మిమ్మల్ని దెబ్బతీయడానికి చాటుగా ప్రయత్నాలు సాగిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల నుంచి ఊహించని సవాళ్లు తప్పకపోవచ్చు. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తారు.
లక్కీ కలర్‌: ఎరుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో విపరీతమైన పోటీని ఎదుర్కొంటారు. కొందరు మీకు వ్యతిరేకంగా వదంతులను ప్రచారం చేస్తారు. ఇతరుల భావోద్వేగాలు మీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వేళాపాళా లేని పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు ప్రారంభిస్తారు.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మంచి చెడులలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి ఎదురవతుంది. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన విజయాలు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఇంతవరకు గడిపిన ఉక్కిరిబిక్కిరి జీవితం నుంచి కొంత స్వేచ్ఛ దొరుకుతుంది. వాయిదా వేస్తూ వస్తున్న వ్యాపకాలలో నిమగ్నమయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఇంతవరకు కొనసాగిన జీవితంపై ఆత్మావలోకనం చేసుకుంటారు. శక్తికి మించిన బాధ్యతల భారాన్ని అనివార్యంగా తలకెత్తుకోవాల్సి రావచ్చు. దైవబలాన్ని నమ్ముకుంటారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఇంటా బయటా మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో సన్నిహితులతో సరదాగా గడుపుతారు. హాస్య చతురతతో జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో ఘన విజయాలు సాధిస్తారు.  సామాజిక హోదా పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. లౌక్యం లేని ముక్కుసూటిదనం కారణంగా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం తగినంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement