కొత్త బాధ్యత అప్పగిస్తే కాదనకండి | Don't say no when new obligation comes | Sakshi
Sakshi News home page

కొత్త బాధ్యత అప్పగిస్తే కాదనకండి

Published Fri, Jun 26 2015 11:52 PM | Last Updated on Mon, Oct 22 2018 8:40 PM

కొత్త బాధ్యత అప్పగిస్తే కాదనకండి - Sakshi

కొత్త బాధ్యత అప్పగిస్తే కాదనకండి

జూన్ 27 నుంచి జూలై 3 వరకు

టారో బాణి

మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే; కలిసొచ్చే రంగు: బ్లూ
 ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. కొత్తభాగస్వామితో మీ వ్యాపారం గాడిన పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ వారంలో పొదుపు చేయండి కానీ, పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఆహార ం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే తిప్పలు తప్పవు. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి; కలిసొచ్చే రంగు: గ్రీన్
 మీరు భయపడుతున్నట్లుగా చెడు సంఘటనలేమీ జరగవు. మీ కెరీర్‌లో  మార్పు ఉండవచ్చు. అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కొత్త అవకాశం ఒకటి మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఆఫీసులో కొత్త పని ఏమైనా అప్పగిస్తే కాదనకుండా చేయండి. మీకు రానున్న ప్రమోషన్‌కు అదొక సూచనగా గ్రహించండి. ఈ వారం మీరు ప్రేమలో పడతారు; కలిసొచ్చే రంగు: ఎల్లో
 మీ లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, విజయం మీ వెంటే ఉందని గ్రహించండి. అత్యాధునికమైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనానికి లోటు ఉండదు. గతంలో మీరెప్పుడూ చూడని కొత్తప్రదేశాలకు విహార యాత్రకు వెళతారు. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటును, దుడుకు తనాన్ని ప్రదర్శించకండి; కలిసొచ్చే రంగు: పర్పుల్
 ప్రేమకు ఇది చాలా అనుకూలమైన వారం. చంద్రుని శుభదృష్టి వల్ల మీ ప్రేమ ఫలిస్తుంది. ఆరోగ్య పరంగా ఏమాత్రం తేడాగా అనిపించినా, అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి. మీ పని ప్రదేశంలో డబ్బు విషయంలో కొందరు మీ మీద అసూయగా ఉన్నారు, వారి వల్ల మీకు ముప్పు ఏర్పడవచ్చు. జాగ్రత్తపడండి; కలిసొచ్చే రంగు: సిల్వర్
 మీదైన శైలిలో పనిచేసి, అందరినీ ఆకట్టుకుంటారు. మిమ్మల్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. జీవితమన్నాకఒడుదొడుకులు, సమస్యలు, సవాళ్లు సహజమని తెలుసుకుని, పోరాటం చేయండి. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి; లక్కీ కలర్: గ్రీన్ షేడ్స్
 మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకంటూ గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే శృంగారం, ప్రేమ కన్నా కెరీరే ప్రధానమని తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోండి. కలిసొచ్చే రంగు: ఇంక్ బ్లూ
 ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోకండి. పరాయి వాళ్లతో సంబంధాల ద్వారా ఫ్రశాంతతని వెదుక్కోకండి. ప్రశాంతత మీలోనే ఉందని గ్రహించండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లను మళ్లీ చేయకండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించండి; కలిసొచ్చే రంగు: గోల్డ్
 అనేక రకాల అననుకూలతలను ఈవారం అధిగమిస్తారు. ఇల్లు లేదా ఉద్యోగం మారతారు. చురుగ్గా, సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. విజయానికి చేరువ అవుతారు. మీ సన్నిహితుడొకరు డబ్బు విషయంలో మీ వైఖరికి చాలా విసుగు చెంది, మీ పట్ల విముఖత చూపే అవకాశం ఉంది కనక ఆర్థిక వ్యవహారాలలో నిక్కచ్చిగా ఉండండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఆరోగ్యం, ఆనందం, డబ్బు... ఈ మూడూ తాంబూలంలో పెట్టి ఎవరో ఇచ్చినట్లుగా మీకు అందుతాయి. మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. పనిపట్ల మీకుండే నిబద్ధతే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందని గ్రహించండి. కొంతదూరంలో ఉన్న సన్నిహిత బంధువును కలుస్తారు; కలిసొచ్చే రంగు: ఎల్లో
 మీ కలలు నెరవేరతాయి. విదేశీ యానం చేయాలన్న కోరిక తీరే సమయం ఇది. ఆధ్యాత్మికపరంగా ఇది మీకు చాలా మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం మంచిది. మీ పెట్టుబడులకు కొంత విరామం ఇచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది మీ పెట్టుబడులు నిజంగా అవసరమో కాదో అనేది! కలిసొచ్చే రంగు: పర్పుల్
 రకరకాల ఆలోచనలతో మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. రకరకాల అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిలో సరైనదేదో ఎంపిక చేసుకోవడమే మీ ముందున్న కర్తవ్యం. ప్రేమ విషయంలో అపార్థాలు తలెత్తుతాయి. ఫెంగ్‌షుయ్ పరికరాలతో ఇంటిని అలంకరించి, ఆనందాన్ని సొంతం చేసుకోండి. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్
 ఇన్సియా కె.
 టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
సౌర వాణి

గ్రహస్థితి తాత్కాలికంగా అనుకూలంగా లేని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్థలు వచ్చే అవకాశముంది కాబట్టి ఎవరికి వారు తగ్గి ఉండటం మంచిది. మన కుటుంబం లోపల  ఏమున్నా ఇతరుల సమక్షంలో అన్యోన్యతని నటించని పక్షంలో పరిస్థితి వేరుగా ఉండవచ్చు. శారీరకంగా అలసటకి గురవుతారు కాబట్టి కొంత విశ్రాంతిని తీసుకుంటూ పనిచేస్తూ ఉండండి.
 కుటుంబంలో ఐకమత్యం, సుఖశాంతులు ఉంటాయి. మీ అన్యోన్యతనీ ఐకమత్యాన్నీ అందరి ముందూ ప్రదర్శిస్తే పరిస్థితులు మరోలా ఉండొచ్చు. అపరిచితులైన వారి సహాయంతో ఇబ్బంది నుండి బయటపడే అవకాశం ఉంది. మీ ప్రతిభకి గుర్తింపుగా పెద్దసదస్సుకి ఆహ్వానం అందుతుంది లేదా వృత్తి ఉద్యోగాల్లో పెద్దల దృష్టిలో మంచిగా పడటం గానీ జరగవచ్చు.
 ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతూ వస్తాయి. భార్య కొద్దిగా మిమ్మల్ని అవమాన పరిచినా సర్దుకుపోవడం మంచిది. దూరపు ప్రాంత ప్రయాణాల విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోక తప్పదు. పై అధికారులతో సరిగా ప్రవర్తించాల్సిన కాలమని గుర్తించండి. వాహన సంబంధ కార్యక్రమాల్లో తగు జాగ్రత అవసరం.
 అనవసరమైన ఆందోళనకి గురి అవుతూ కన్పిస్తారు. భయపడవలసిన పరిస్థితి కాని, భయపెట్టే సంఘటనలు కానీ ఈ వారంలో ఏమీ లేవు-ఉండవు. ధనసంపాదన చక్కగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం నిశ్చితార్థపు మాటలు జరగవచ్చు. ఉన్న సొమ్మును స్థిరాస్తుల కొనుగోలుకు ఖర్చు చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది.  
 మీ సంపాదనకు తగ్గ ఖర్చు సిద్ధంగా ఉండవచ్చు. ఉద్యోగంలో వృత్తిలో మీ మీద కొంత వ్యతిరేకత ఉన్న కారణంగా అనవసరమైన ప్రచారం సాగవచ్చు. వృత్తి వాప్యారాల్లో గట్టి పోటీ ఉన్న సందర్భంగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణదాతల ఒత్తిడి పెద్దగా ఉండదు కాని మీ మనసుకి చిరాకుగా ఉండవచ్చు. తలిదండ్రులకి కొద్దిపాటి ఆరోగ్యపరీక్షలు అవసరం.
 గతవారం కన్నా బాగుంటుంది. అప్పులివ్వడం, తీసుకోవడం ఈ వారంలో వద్దు. శ్రమిస్తేనే ఫలితం అని గుర్తించండి. సంఘంలో అనుకూలత ఉంటుంది. న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభించవచ్చు. సంతానంలో ఒకరిని తరచూ అనారోగ్యంతో ఉంటుంటే, మరో వైద్యుని ద్వారా మెరుగైన చికిత్స ఇప్పించడం, లేదా మరో వైద్యుని సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
 అన్నీ తెలుసునన్న అహంకారం గానీ, గట్టి ప్రయత్నాలని చేస్తున్నాననే ధీమా గానీ వద్దు. అవివాహితులకి వివాహ సూచన, విద్యార్థులకి సత్ఫలితం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కొంచెం ఆలస్యంగానైనా జరిగి తీరతాయి. జీవితానికి సంబంధించిన గడ్డు సమస్య ఉంటే అన్ని రోజులూ మనకి అనుకూలం కావనే నిజాన్ని గ్రహించి, సామరస్య ధోరణిలో వెళ్లడం మంచిది.
 ఒక కార్యం కోసం పదివైపుల నుంచీ ప్రయత్నాలని విశేషంగా చేస్తారు. అది అవసరం కూడా. కుటుంబ రహస్యాలని కుటుంబ సభ్యులో ఎవరూ బహిరంగపరచకుండా చూసుకోండి. ధర్మమార్గంలోనే ప్రయాణించండి. ఇతరులు మిమ్మల్ని  ఎంత రెచ్చగొట్టినా విని మీదైన ఆలోచనతో ప్రశాంతంగానే ఎదుర్కోండి తప్ప సాహసాలని చేయవద్దు- దూకుడుతనం అసలొద్దు.
 ప్రశంసలకి లొంగిపోయి, మీ పరిధులని దాటి సాయం చేయవద్దు. తోటిఉద్యోగులతో ఎంత దూరంలో ఉండాలో, వాళ్లనెంత దూరంలో ఉంచాలో అలా ప్రవర్తించండి. వాహనాన్ని నడిపే టప్పుడు శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని, తీర్చవలసిన చిన్నచిన్న రుణాలనీ వెంటనే తీర్చండి. ఒకరు చెప్పిన చాడీలని మీరు ప్రచారం చేయకండి. ఇది అతి ముఖ్యం.
 వ్యవసాయ దారులయితే ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. ప్రభుత్వం నుండి రావలసినవేమైనా ఉంటే తప్పక వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆశించిన ఉద్యోగం వాయిదా పడవచ్చు. పోటీ పరీక్షల విషయంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దుర్వ్యసన పరుల సహవాసం మిమ్మల్ని పెద్ద ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి దూరాన్ని పాటించండి అలాంటివారితో.
 నయవంచకులను గుర్తించి వారి వలలో పడకుండా తప్పించుకోగలుగుతారు. అయితే వారిపై ప్రతీకారం చూపకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హామీలనీ వాగ్దానాలనీ ఏ మాత్రమూ చేయవద్దు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపటానికి ప్రయత్నించండి. నిరాశాపరులతో, పరాజయాన్ని చవి చూసిన వారితో సమయాన్ని గడపకండి.
 మీ ప్రవర్తన వల్ల కానీ, నేర్పరితనం వల్లగానీ, మిమ్మల్ని ఏమీ చేయలేమని అర్థం చేసుకుని మీ శత్రువులు మీకు దూరంగా వెళ్లిపోతారు. రుణాల్ని క్రమపద్ధతిలో తీరుస్తూ ఉండండి. భూమినీ, ఇంటినీ అమ్మాలనే ఆలోచన విరమించుకోండి. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి దశలో ఉంటుంది. బంధుమిత్రులకి సూచనలనీ సలహాలనీ పొరపాటున కూడా ఈయకండి.
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement