Drs. Mailavarapu Srinivasa Rao
-
నూతన వస్తు వాహనాలు సమకూరతాయి
జూలై 25 నుంచి జూలై 31 వరకు టారో బాణి మీకూ, మీ భాగస్వామికీ మధ్య కొత్తబంధం ఏర్పడవచ్చు. ఈ వారమంతా భావోద్వేగాలతో గడుపుతారు. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఫలించి, ఆర్థికపరంగా ఏదో గారడీ చేసినట్లుగా ధనసమృద్ధి కలుగుతుంది. కలిసొచ్చేరంగు: పసుప్పచ్చ ఈ వారం మీకు కొత్త అవకాశాలతో అభివృద్ధికరంగా ఉంటుంది. విదేశీవ్యక్తి నుంచి మీకు ఒక ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. జీవితంలో సమత్యులత కోసం సామరస్యత కోసం రకరకాల త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఆ మేరకు మనశ్శాంతి లభిస్తుంది కనక. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే అదృష్టం, ఆదాయ వృద్ధి కలిసికట్టుగా వస్తాయి. మీకు సంతోషాన్నిచ్చేలా విలువైన, అపురూపమైన బహుమతులు అనూహ్యంగా లభిస్తాయి. జాయింటుగా చేసే ఫైనాన్స్ వ్యాపారావకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ప్రేమికులకు మీ మనసులో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు తగిన ధైర్యం వస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్ వ్యక్తిగతంగా ఇది మీకు బాగా కలిసొచ్చే వారం. మీ సౌంద ర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తారు. మీ మేధస్సుకు పదును పెట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ మీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి. కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ కూడా ఇది మీకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వారం. ప్రపంచాన్నే జయించగలననేంత శక్తి వస్తుంది మీకు. ప్రేమికురాలిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది తగిన సమయం. ఏదైనా సరే, చేతులు దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ ఈ వారమంతా ప్రయాణాలతో గడుపుతారు. అయితే యాంత్రికమైన, వృత్తిపరమైన ప్రయాణాలు కాదు... ఆహ్లాదకరంగా, మీ మనసుకు, శరీరానికి కూడా కొత్త శక్తినిచ్చే టూర్లతో... మీ జీవన శైలి మారుతుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదం ఏర్పడవచ్చు. కెరీర్‌పరంగా మీ దిశ ఏమిటనేది నిర్ధారించుకోవలసి వస్తుంది. కలిసొచ్చే వారం: రాగిరంగు ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం కెరీర్పరంగానూ, వ్యాపార పరంగానూ మీకు లబ్ధి చేకూర్చవచ్చు. మీ బంధాన్ని కొనసాగించాలనుకుంటే మీ ఆలోచనా సరళిలో, వ్యవహార శైలిలో మార్పు చేసుకోక తప్పదని గ్రహించండి. మీరు మారడానికి ఇదే చివరి అవకాశం. సంగీతం వింటూ, పాడుతూ ఉంటే మీ అంతర్గత శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనంతట తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చే రంగు: లేత నీలం ఈ వారం మీకు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. మీరు సాధించిన ప్రాపంచిక లేదా వ్యాపార లాభాలతో ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీకంటూ బలమైన నమ్మకాలు, విలువలతో కూడిన విశ్వాసాలను, అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఇతరులతో మీ మనసులోని మాటను చెప్పుకుని ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: పచ్చ అరటి పండు రంగు మీ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఇది తగిన సమయం. అయితే అది అంత సులువు కాదు. పెద్ద యుధం చేయవలసి రావచ్చు. అనేకరకాల సమస్యలు, సవాళ్లతో సహవాసం చేయవలసి ఉంటుంది. శాంతి కావాలనుకుంటే ప్రేమను త్యజించక తప్పదు. యుద్ధం చేస్తే విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: పీచ్ రకరకాల తాయిలాలతో కూడిన స్కీములు మిమ్మల్ని అయోమయంలో పడేయవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో అనేకరకాల ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వైవాహిక బంధంలో పడతారు. రకరకాల ప్రలోభాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి. ప్రేమ కోసం పరితపిస్తున్న మీకు మీ మనసును దోచుకునే వ్యక్తి ఎదురు అవుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు మీ కోరికలు నెరవేరతాయి. వేడుకలు జరుపుకోవలసి రావచ్చు. మీ మార్గంలో అడ్డుగా నిలిచిన రకరకాల సవాళ్లు, సమస్యలను, అవరోధాలను తేలికగా అధిగమించగలుగుతారు. ఎంతోకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని మానసిక సమస్యలను ఒక పెద్ద మనిషి సహకారంతో పరిష్కరించుకుని, ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఈ వారంలో నేత్రాలకి లేదా శిరస్సుకి సంబంధించిన బాధలుండే అవకాశముంది కాబట్టి, తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువులు వచ్చిన సందర్భంలో మన ఇంటి విషయాలని చెప్పి సలహాలనీ సూచనలనీ అడగటం, వాళ్లు చెప్పబోతే వినడం కానీ మంచిది కాదు. అనవసర విషయాలు తలకెక్కించుకోకుండా గుంభనం పాటించడం మంచిది. మీ పై అధికారికి మీకు తోచిన మంచినీ వెసులుబాటునీ సూచించక, చెప్పింది చేసుకుంటూ వెళ్లిపొండి. ఇంట్లో సొంత నిర్ణయాన్ని చేసేస్తూ వెళ్లిపోవడం ఈ వారంలో మంచిది కాదు. తప్పించుకునే ధోరణిలో కాకుండా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మెత్తని గొంతుతో చెబుతూ అవతలివారు నొచ్చుకోకుండా ఉండేలా మొహమాటం లేకుండా మాట్లాడండి బంధువుల విషయంలో. ఏ పనినీ చేసుకోలేకపోతున్నామని నిరాశ పడకండి. మీ సంతానం గాని సహాయ పడడానికి రమ్మని పిలిస్తే దూరాభారమని వెళ్లడం మానక, తప్పక వెళ్లండి. మీ వ్యాపారంలో భాగస్వాముల మాటకి విలువనిస్తూ అనుభవజ్ఞుల్ని సంప్రదించి వారి మాటలో ఎంత అనునసరించ వీలుందో ఆ విషయాన్ని వారికి వివరించి చెప్పండి. వ్యతిరేక పరిస్థితులేమీ లేవు - రావు. ధనాదాయమైతే బాగుంటుంది కాని తప్పనిసరి ప్రయాణాలు కొంత శారీరక శ్రమని కలిగిస్తాయి. శత్రువులతో విరోధాన్ని పెంచుకునేలా మాటలతో యుద్ధం చేయడం కంటె వాళ్లతో తగినంత దూరంలో ఉండడం ఎంతైనా మంచిది. నూతన వస్తు వాహనాలు సమకూరే అవకాశముంది. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు. మీ ప్రణాళికలు సరైనవే అయినా శనిదృష్టి సరిగా లేనందువల్ల విఘ్నాలపాలు కావడమో లేక అసలు అమలు జరగకపోవడమో అవుతుంది. నిరుత్సాహ పడద్దు. శని గ్రహం ప్రతి వ్యక్తికీ చక్కని పాఠాన్ని నేర్పి, దాంతోపాటు నేర్పరితనాన్ని కలిగిస్తుంది. విఘ్నాల పాలౌతున్నా మీరు మీ ప్రయత్నాలని ఆపకుండా చేస్తూనే ఉండడానికి శని ప్రోత్సాహమే కారణమని గమనించండి. మీరూ మీ పనీ మీ ఇల్లూ జీవితమూ అంటూ గిరి గీసుకుని గడపాల్సిన వారం ఇది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరులకు సలహాలనీ సూచనలనీ ఇవ్వడం ఈ వారంలో మీకు సరిపడని అంశాలు. వైద్య, న్యాయరంగాలకి సంబంధించిన వృత్తుల వారు తగు జాగ్రత్తతో ఉండాలి. లేని పక్షంలో తాత్కాలికంగా పరాజయాన్ని పొందే అవకాశముంది. చేసిన పనినే మరోమారు చేయవలసి రావచ్చు. పొరపాటే గనక జరిగి ఉంటే మీ తప్పుని అంగీకరించండి. సమస్య తేలిగ్గా పరిష్కరింప బడుతుంది. వివాహ విషయాలు కానీ ఆస్తి తగాదాలు గాని దాదాపు పరిష్కారమయ్యే స్థితికి రాబోతున్నాయి. ఇలాంటి స్థితిలో పట్టుదలకి పోయి సమస్యను జటిలం చేసుకునేకంటే రాజీకి సిద్ధపడటం మంచిదని గ్రహించండి. ఎప్పుడో జరిగిపోయిన వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటే శిరోభారమే తప్ప ఒరిగేదంటూ ఏమీ ఉండదనే మీ ఆలోచన ప్రస్తుత సమస్యా పరిష్కారానికి అనుకూలించదని గ్రహించండి. కాలం అనుకూలంగా లేని సందర్భంలో మన ఆలోచన ఎందుకు అమలు జరుగుతుంది? క్రమం తప్పకండా మీరు వాడాల్సిన ఔషధాల్ని వాడుతూ ఉండండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం తాత్కాలికంగా సరిలేకపోవచ్చు. ఉద్యోగంలో అవిశ్రాంతంగా శ్రమించవలసి రావచ్చు. శారీరకంగా అలసిపోయే పరిస్థితే ఉద్యోగంలో కనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పండి శరీరారోగ్యం సహకరించదని. బంధుమిత్రుల విషయంలో బహుమతులూ ఉత్సవాలూ మొదలైనవి తారసపడితే కాస్త చూసుకుని ఖర్చు చేయడం మంచిది. ఇతరుల మెప్పుకోసం ఎక్కువగా ఖర్చు చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అనవసర ప్రయాణాల వల్ల మీ వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో అజమాయిషీ ఉండక, అది మరో కొత్త సమస్యని తెచ్చిపెట్టవ చ్చు. మీ కోపాన్ని అదుపు చేసుకోని పక్షంలో మీరంటే అభిమానించే ముఖ్యవ్యక్తులు కూడా దూరంగా జరిగిపోవచ్చు. ఆంతరంగికులైనవారిని ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేసుకోకండి. ఆర్థికంగా బలపడటం కోసం కుటుంబాన్ని మరింత బలోపేతం చేయడం కోసం మీ వంతు ప్రయత్నాన్ని మానకండి. కేవలం మీ జీవిత భాగస్వామి మాత్రమే కుటుంబ విషయంలో బాధ్యులనే ఆలోచనని వీడండి. సంతానం విషయంలో తగిన శ్రద్ధని కలిగి ఉండండి. మీరు మాట్లాడే తీరు ప్రయోజనాత్మకమా? హానికరమా? అని ఓ క్షణం గమనించి వ్యవహరించండి. కష్టాలు దాదాపు తీరినట్లే. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని యథావిధిగా నిర్వహించుకుంటూ సాగిపోండి. కొత్తగా రుణాలని చేయవద్దు. సంతానానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ సక్రమంగా జరిగిపోతాయి. హామీ ఉండడం, వాగ్దానాలని చేయడం సాక్షి సంతకాలు పెట్టడం రాజీ కుదర్చడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మొహమాటాలకి పోతే ముప్పు తప్పదు!
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఒక కొత్త ప్రేమ బంధం మీ కోసం ఎదురు చూస్తుంటుంది. పనిపరంగా ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. మీ స్వతంత్ర వైఖరి మీకు మొండివాళ్లని, అసమ్మతివాదులనీ పేరు తేవచ్చు. పని ప్రదేశంలో అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. అంద రితోనూ కలుపుగోలుగా, నిజాయితీగా ఉండండి. కలిసొచ్చే రంగు: పింక్ టారస్(ఏప్రిల్ 21-మే 20) ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక స్త్రీ సహాయం లభిస్తుంది. చేతినిండా డబ్బు వస్తుంది. ఒక విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. రొటీన్ నుంచి బయట పడి, విశ్రాంతిగా గడపవలసిన తరుణమిది. హాయిగా పర్యటనలకు వెళ్లి, ప్రశాంతతను పొందండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ జెమిని(మే 21-జూన్ 21) మీ ధోరణిని మార్చుకోవలసి వస్తుంది. మొదట్లో కొంచెం కష్టమైనా, అదే నెమ్మదిగా గాడిలో పడుతుంది. ఒక వ్యక్తిపట్ల మీరు ఆకర్షితులవుతారు. క్రమంగా అది ప్రేమకు దారి తీయవచ్చు. దాని వల్ల మీ కుటుంబంలో కల్లోలం చెలరేగవచ్చు. మీ అహం శాంతిస్తుంది. తగిన సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు వస్తుంది. కలిసొచ్చే రంగు: వైట్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) విజయం మీ తలుపు తడుతుంది. కొన్ని మార్పులు జరగవచ్చు. కష్టపడి పని చేసే మీ తత్వమే మీ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకోవలసిన తరుణమిది. ఆధ్యాత్మిక భావాలను అలవరచుకోవడం మంచిది. మనశ్శాంతి ఉంటే మీరు ఎన్ని విజయాలనైనా సొంతం చేసుకోవచ్చని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: బ్రౌన్ లియో (జూలై 24-ఆగస్టు 23) కలలలోకం నుంచి బయట పడి వాస్తవంలోకి వచ్చి, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ వారం మీకు అదృష్టకరంగా గడుస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లోటు ఉండదు. ప్రేమలో ఓటమి ఎదురు కావచ్చు. అనవసరంగా అహానికి పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. కలిసొచ్చే రంగు: గోల్డెన్ ఎల్లో వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఒక దాని మీద గట్టిగా నిలబడాలని తెలుసుకోండి. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ, నిజం. అలా చేస్తే గానీ ప్రయోజనం ఉండదు. మీ కలలు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఎదుటివారు చెప్పే సలహాలు మీ మంచికోసమేనని తెలుసుకుని, ఓపిగ్గా వినడం అలవాటు చేసుకోండి. కలిసొచ్చే రంగు: వైట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ ప్రేమ, వ్యక్తిగత జీవనం మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. ముందు పెళ్లి చేసుకోవాలా లేక ఇల్లు కొనుక్కోవాలా? ఏది ముందు? ఏది వెనకో తెలియక కొంచెం తికమక పడతారు. ఆహారం విషయంలో కఠోరంగా వ్యవహరించక తప్పదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం కోసం అనివార్యంగా ఎక్సర్సైజులు చేయండి. కలిసొచ్చే రంగు: లైట్ బ్లూ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) జీవితంలో సంభవించనున్న కొత్త మార్పులు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తవచ్చు. పెద్దమొత్తంలో డబ్బు చేతికందుతుంది. మీ కలల్ని నమ్ముకోండి. అవి సాకారం కానున్నాయి. మీ సామర్థ్యాన్ని నిరుపించుకునేందుకు గట్టిగా కృషి చేయవలసి వస్తుంది. ప్రేమ విషయంలో కొన్ని చిక్కుముళ్లు, మెలికలు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: నలుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు చదవనున్న ఒక ఆధ్యాత్మిక గ్రంథం మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకు వెళ్తుంది. మీరు సరైన మార్గంలోనే వెళ్తున్నారు. మీరు కోరుకుంటున్నట్లుగా శాంతియుతంగానే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఇంట్లో, ఆఫీసులో మరమ్మతులు చేయించవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: వయొలెట్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ పని సామర్థ్య పెరుగుతుంది. దానిమూలంగా మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. బంధాలు, బంధుత్వాల విషయంలో చోటు చేసుకోనున్న కొత్తమార్పులు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయి. జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను కలవండి. కలిసొచ్చే రంగు: పీచ్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం ఒత్తిడి, టెన్షన్లు తప్పవు. గుండె ఆరోగ్యం విషయంలో మరింత ఆందోళన పడతారు. మనసులో ఉన్న బాధను అణుచుకోవద్దు. ఆర్థికంగా మెరుగ్గానే ఉంటుంది. దూసుకుపోయే మీ స్వభావం మీకు మంచే చేస్తుంది. విందు వినోదాల్లో పడి ఆహారం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే డాక్టర్‌ను కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: కాఫీ బ్రౌన్ పైసిన్ (ఫిబ్రవరి20-మార్చి20) అన్ని కష్టాలనూ, అననుకూలతలనూ అధిగమించి, కాస్త స్థిమితపడతారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పనిలో మరింత చొరవ చూపి అధికారుల మన్ననలందుకుంటారు. మీ పరిశోధనలను, అధ్యయనాన్ని కొనసాగించండి. చిన్న చిన్న రుగ్మతలని, నొప్పులను నిర్లక్ష్యం చేస్తే పెద్ధ ఫలితాన్ని చవి చూడవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి మీకు మీరుగా తీసుకున్న నిర్ణయం మంచిదే. మళ్లీ దాన్ని అనవసర చర్చల్లో పెట్టి మనసుని ఆందోళన పరచుకోకండి. నిర్ణయాన్ని మార్చుకోవాలని భావించకండి. కుటుంబ సభ్యులకి- తగినంత గుంభన ఉండాలనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. విదేశీ ప్రయాణానికి సంసిద్ధంగా ఉండటం మంచిది. అప్పు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నమ్మి మోసపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి, ఎంతవరకూ నమ్మాలో అంతకు మించి పోవద్దు. ముఖ్యంగా వైద్యసూచనలూ సలహాలూ చికిత్స విషయాల్లో ఇద్దరు ముగ్గురి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లండి. కీర్తికండూతి కోసం పాకులాడవద్దు. ఇతరులతో పోలిక వద్దేవద్దు. మీరూ మీ కుటుంబ సభ్యులూ ఒకే మాట మీద ఉండండి. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని అత్యవసరంగా నెత్తిన పడుతూ అనుకున్న పని లేదా పనులు వాయిదా పడుతూ ఉండవచ్చు. దీన్ని అసమర్థతగా భావించక, ఈ మాత్రమైనా పనులు జరుగుతున్నాయని సంతోషించండి. శారీరకమైన అలసట కారణంగా ఈ వారం ఔషధ సేవ అవసరపడచ్చు. తేలికపాటి ఆరోగ్యపరీక్ష చేసుకుని ముందు జాగ్రత్తతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఓ విషయం ఆందోళన కలిగించవచ్చు. దాని గురించి మరింతగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని విరోధించే వ్యక్తులతో ముభావంగానే ఉండండి. వారి సహాయం కోసం చూడద్దు. మీకు మీరుగా చాడీలని వ్యాప్తి చేస్తే ఇబ్బందులు తప్పవు. మీరు ప్రయత్నించిన తీరుగా కార్యక్రమాలు ముందుకు సాగవు. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవలసి వచ్చినప్పుడు మొహమాటాలకు, భరోసాలకు పోవద్దు. ఆడంబరం కోసం అనవసరమైన వస్తువులు కొని విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. వారాంతంలో శుభవార్తని వింటారు. రుణాలని తీర్చే ప్రయత్నంలో ఉండండి. బంధుమిత్రులతో విందువినోదాల్లో ఆనందంగా గడుపుతారు. గృహాన్ని గానీ, భూమిని గానీ తాకట్టుపెట్టుకోవడం మాని కొనుక్కోవడానికే ప్రయత్నిస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. దైవకార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మికంగా గురువుని అతిగా విశ్వసించవద్దు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకుంటూ వెళ్లకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులు కావచ్చు. ఎవరిని సంతృప్తి పరచడం కోసమో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తే మొహమాటం లేకుండా రానని చెప్పండి. కుటుంబ సభ్యుల కంటే బంధుమిత్రులు ఎక్కువ కారని గ్రహించండి. పిల్లల విద్యాసంస్కారాలని తప్పక పట్టించుకోవాలి. ప్రవర్తన విషయంలో మెలకువతో ఉండండి. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉండవచ్చు. ప్రతిపనిలోనూ జాప్యం అవుతూ ఉండవచ్చు. కోర్టు వివాదాలు మరింత జాప్యమౌతూ అనిశ్చిత స్థితిలో పడేయవచ్చు. ఎవరిని సలహా సూచనలడిగినా మరింత అయోమయంలోకి నెట్టవచ్చు. దేనికైనా ఓ ప్రణాళిక అవసరమనే ఆలోచనతో ఉండండి. రావలసిన బకాయిలకోసం ప్రయత్నించండి. మానసికంగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు దైవధ్యానానికి ప్రాముఖ్యమీయండి. ప్రారంభించిన పనులన్నీ ఆటంకాలకి గురై మధ్యలో ఆగిపోవడంగాని పూర్తిగా విరమించుకోవడం గాని జరగవచ్చు. ఇదే ఫలితం ప్రయాణాల విషయంలోనూ వర్తించవచ్చు. బంధుమిత్ర శ్రేయోభిలాషులు మాట ఇచ్చారు కదా అని అతి విశ్వాసంతో ఉండవద్దు. ప్రయత్నలోపం వద్దు. రుణాలని తెచ్చుకోవద్దు, ఇవ్వవద్దు. ఇతరులు మీ కుటుంబాన్ని గురించి వాదోపవాదాలు చేసే అవకాశాన్ని ఈయకండి. గుంభన పాటించండి. పెద్దల సూచనలను స్వీకరించండి. అనుకున్న పనులు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలసించకుండా ప్రయత్నాలు చేయండి. ఆదాయం అంతంత మాత్రం కాబట్టి వ్యయ నియంత్రణని పాటించండి. తలిదండ్రులకి ఆరోగ్యపరీక్షలవసరం. ఎప్పుడో చేసిన వాగ్దానం ఇరుకున పడేయవచ్చు. ఎవరికో ఇచ్చిన హామీ మీకు సమస్యగా పరిణమించవచ్చు. ఎవరి విషయంలోనో మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ పని మీకు కంఠం పట్టుకోవచ్చు. మొగమాటం లేకుండా మాట్లాడండి తప్ప విషయాన్ని సాగదీయకండి. నేరాన్ని తలమీదికి తెచ్చుకునే విధంగా తప్పించుకోవడం, మెత్తగా ఉండడం సరి కాదని గ్రహించండి. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంతానపు చదువు విషయంలో తగినంత శ్రద్ధని చూపండి. నిజమైన ఆస్తి సంతానమే అనే విషయాన్ని గమనించి స్థిరచరాస్తుల మీద కాకుండా వీరి విద్య ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. అత్తమామలతో సత్సంబంధాలుండటం అవసరం. మరిది వదినెలతో తగుదూరాన్ని పాటించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
కొత్త బాధ్యత అప్పగిస్తే కాదనకండి
జూన్ 27 నుంచి జూలై 3 వరకు టారో బాణి మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే; కలిసొచ్చే రంగు: బ్లూ ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. కొత్తభాగస్వామితో మీ వ్యాపారం గాడిన పడుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ వారంలో పొదుపు చేయండి కానీ, పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. ఆహార ం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే తిప్పలు తప్పవు. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి; కలిసొచ్చే రంగు: గ్రీన్ మీరు భయపడుతున్నట్లుగా చెడు సంఘటనలేమీ జరగవు. మీ కెరీర్లో మార్పు ఉండవచ్చు. అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే కొత్త అవకాశం ఒకటి మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఆఫీసులో కొత్త పని ఏమైనా అప్పగిస్తే కాదనకుండా చేయండి. మీకు రానున్న ప్రమోషన్‌కు అదొక సూచనగా గ్రహించండి. ఈ వారం మీరు ప్రేమలో పడతారు; కలిసొచ్చే రంగు: ఎల్లో మీ లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, విజయం మీ వెంటే ఉందని గ్రహించండి. అత్యాధునికమైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ధనానికి లోటు ఉండదు. గతంలో మీరెప్పుడూ చూడని కొత్తప్రదేశాలకు విహార యాత్రకు వెళతారు. ప్రేమ వ్యవహారాలలో తొందరపాటును, దుడుకు తనాన్ని ప్రదర్శించకండి; కలిసొచ్చే రంగు: పర్పుల్ ప్రేమకు ఇది చాలా అనుకూలమైన వారం. చంద్రుని శుభదృష్టి వల్ల మీ ప్రేమ ఫలిస్తుంది. ఆరోగ్య పరంగా ఏమాత్రం తేడాగా అనిపించినా, అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించండి. మీ పని ప్రదేశంలో డబ్బు విషయంలో కొందరు మీ మీద అసూయగా ఉన్నారు, వారి వల్ల మీకు ముప్పు ఏర్పడవచ్చు. జాగ్రత్తపడండి; కలిసొచ్చే రంగు: సిల్వర్ మీదైన శైలిలో పనిచేసి, అందరినీ ఆకట్టుకుంటారు. మిమ్మల్ని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. జీవితమన్నాకఒడుదొడుకులు, సమస్యలు, సవాళ్లు సహజమని తెలుసుకుని, పోరాటం చేయండి. ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి; లక్కీ కలర్: గ్రీన్ షేడ్స్ మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకంటూ గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే శృంగారం, ప్రేమ కన్నా కెరీరే ప్రధానమని తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోండి. కలిసొచ్చే రంగు: ఇంక్ బ్లూ ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోకండి. పరాయి వాళ్లతో సంబంధాల ద్వారా ఫ్రశాంతతని వెదుక్కోకండి. ప్రశాంతత మీలోనే ఉందని గ్రహించండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లను మళ్లీ చేయకండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించండి; కలిసొచ్చే రంగు: గోల్డ్ అనేక రకాల అననుకూలతలను ఈవారం అధిగమిస్తారు. ఇల్లు లేదా ఉద్యోగం మారతారు. చురుగ్గా, సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. విజయానికి చేరువ అవుతారు. మీ సన్నిహితుడొకరు డబ్బు విషయంలో మీ వైఖరికి చాలా విసుగు చెంది, మీ పట్ల విముఖత చూపే అవకాశం ఉంది కనక ఆర్థిక వ్యవహారాలలో నిక్కచ్చిగా ఉండండి. కలిసొచ్చే రంగు: ఆరంజ్ ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఆరోగ్యం, ఆనందం, డబ్బు... ఈ మూడూ తాంబూలంలో పెట్టి ఎవరో ఇచ్చినట్లుగా మీకు అందుతాయి. మీ కుటుంబంలోని ఒక స్త్రీ మీకు ఎంతో అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది. పనిపట్ల మీకుండే నిబద్ధతే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందని గ్రహించండి. కొంతదూరంలో ఉన్న సన్నిహిత బంధువును కలుస్తారు; కలిసొచ్చే రంగు: ఎల్లో మీ కలలు నెరవేరతాయి. విదేశీ యానం చేయాలన్న కోరిక తీరే సమయం ఇది. ఆధ్యాత్మికపరంగా ఇది మీకు చాలా మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు అందుకు తగిన ప్రణాళిక వేసుకోవడం మంచిది. మీ పెట్టుబడులకు కొంత విరామం ఇచ్చి చూడండి. అప్పుడు తెలుస్తుంది మీ పెట్టుబడులు నిజంగా అవసరమో కాదో అనేది! కలిసొచ్చే రంగు: పర్పుల్ రకరకాల ఆలోచనలతో మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. రకరకాల అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిలో సరైనదేదో ఎంపిక చేసుకోవడమే మీ ముందున్న కర్తవ్యం. ప్రేమ విషయంలో అపార్థాలు తలెత్తుతాయి. ఫెంగ్‌షుయ్ పరికరాలతో ఇంటిని అలంకరించి, ఆనందాన్ని సొంతం చేసుకోండి. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి గ్రహస్థితి తాత్కాలికంగా అనుకూలంగా లేని కారణంగా కుటుంబ సభ్యుల మధ్య మనఃస్పర్థలు వచ్చే అవకాశముంది కాబట్టి ఎవరికి వారు తగ్గి ఉండటం మంచిది. మన కుటుంబం లోపల ఏమున్నా ఇతరుల సమక్షంలో అన్యోన్యతని నటించని పక్షంలో పరిస్థితి వేరుగా ఉండవచ్చు. శారీరకంగా అలసటకి గురవుతారు కాబట్టి కొంత విశ్రాంతిని తీసుకుంటూ పనిచేస్తూ ఉండండి. కుటుంబంలో ఐకమత్యం, సుఖశాంతులు ఉంటాయి. మీ అన్యోన్యతనీ ఐకమత్యాన్నీ అందరి ముందూ ప్రదర్శిస్తే పరిస్థితులు మరోలా ఉండొచ్చు. అపరిచితులైన వారి సహాయంతో ఇబ్బంది నుండి బయటపడే అవకాశం ఉంది. మీ ప్రతిభకి గుర్తింపుగా పెద్దసదస్సుకి ఆహ్వానం అందుతుంది లేదా వృత్తి ఉద్యోగాల్లో పెద్దల దృష్టిలో మంచిగా పడటం గానీ జరగవచ్చు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతూ వస్తాయి. భార్య కొద్దిగా మిమ్మల్ని అవమాన పరిచినా సర్దుకుపోవడం మంచిది. దూరపు ప్రాంత ప్రయాణాల విషయంలో శ్రద్ధ వహించాలి. ఒక ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోక తప్పదు. పై అధికారులతో సరిగా ప్రవర్తించాల్సిన కాలమని గుర్తించండి. వాహన సంబంధ కార్యక్రమాల్లో తగు జాగ్రత అవసరం. అనవసరమైన ఆందోళనకి గురి అవుతూ కన్పిస్తారు. భయపడవలసిన పరిస్థితి కాని, భయపెట్టే సంఘటనలు కానీ ఈ వారంలో ఏమీ లేవు-ఉండవు. ధనసంపాదన చక్కగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం నిశ్చితార్థపు మాటలు జరగవచ్చు. ఉన్న సొమ్మును స్థిరాస్తుల కొనుగోలుకు ఖర్చు చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. మీ సంపాదనకు తగ్గ ఖర్చు సిద్ధంగా ఉండవచ్చు. ఉద్యోగంలో వృత్తిలో మీ మీద కొంత వ్యతిరేకత ఉన్న కారణంగా అనవసరమైన ప్రచారం సాగవచ్చు. వృత్తి వాప్యారాల్లో గట్టి పోటీ ఉన్న సందర్భంగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణదాతల ఒత్తిడి పెద్దగా ఉండదు కాని మీ మనసుకి చిరాకుగా ఉండవచ్చు. తలిదండ్రులకి కొద్దిపాటి ఆరోగ్యపరీక్షలు అవసరం. గతవారం కన్నా బాగుంటుంది. అప్పులివ్వడం, తీసుకోవడం ఈ వారంలో వద్దు. శ్రమిస్తేనే ఫలితం అని గుర్తించండి. సంఘంలో అనుకూలత ఉంటుంది. న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు లభించవచ్చు. సంతానంలో ఒకరిని తరచూ అనారోగ్యంతో ఉంటుంటే, మరో వైద్యుని ద్వారా మెరుగైన చికిత్స ఇప్పించడం, లేదా మరో వైద్యుని సలహా తీసుకోవడం శ్రేయస్కరం. అన్నీ తెలుసునన్న అహంకారం గానీ, గట్టి ప్రయత్నాలని చేస్తున్నాననే ధీమా గానీ వద్దు. అవివాహితులకి వివాహ సూచన, విద్యార్థులకి సత్ఫలితం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కొంచెం ఆలస్యంగానైనా జరిగి తీరతాయి. జీవితానికి సంబంధించిన గడ్డు సమస్య ఉంటే అన్ని రోజులూ మనకి అనుకూలం కావనే నిజాన్ని గ్రహించి, సామరస్య ధోరణిలో వెళ్లడం మంచిది. ఒక కార్యం కోసం పదివైపుల నుంచీ ప్రయత్నాలని విశేషంగా చేస్తారు. అది అవసరం కూడా. కుటుంబ రహస్యాలని కుటుంబ సభ్యులో ఎవరూ బహిరంగపరచకుండా చూసుకోండి. ధర్మమార్గంలోనే ప్రయాణించండి. ఇతరులు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా విని మీదైన ఆలోచనతో ప్రశాంతంగానే ఎదుర్కోండి తప్ప సాహసాలని చేయవద్దు- దూకుడుతనం అసలొద్దు. ప్రశంసలకి లొంగిపోయి, మీ పరిధులని దాటి సాయం చేయవద్దు. తోటిఉద్యోగులతో ఎంత దూరంలో ఉండాలో, వాళ్లనెంత దూరంలో ఉంచాలో అలా ప్రవర్తించండి. వాహనాన్ని నడిపే టప్పుడు శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని, తీర్చవలసిన చిన్నచిన్న రుణాలనీ వెంటనే తీర్చండి. ఒకరు చెప్పిన చాడీలని మీరు ప్రచారం చేయకండి. ఇది అతి ముఖ్యం. వ్యవసాయ దారులయితే ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. ప్రభుత్వం నుండి రావలసినవేమైనా ఉంటే తప్పక వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆశించిన ఉద్యోగం వాయిదా పడవచ్చు. పోటీ పరీక్షల విషయంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దుర్వ్యసన పరుల సహవాసం మిమ్మల్ని పెద్ద ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి దూరాన్ని పాటించండి అలాంటివారితో. నయవంచకులను గుర్తించి వారి వలలో పడకుండా తప్పించుకోగలుగుతారు. అయితే వారిపై ప్రతీకారం చూపకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హామీలనీ వాగ్దానాలనీ ఏ మాత్రమూ చేయవద్దు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపటానికి ప్రయత్నించండి. నిరాశాపరులతో, పరాజయాన్ని చవి చూసిన వారితో సమయాన్ని గడపకండి. మీ ప్రవర్తన వల్ల కానీ, నేర్పరితనం వల్లగానీ, మిమ్మల్ని ఏమీ చేయలేమని అర్థం చేసుకుని మీ శత్రువులు మీకు దూరంగా వెళ్లిపోతారు. రుణాల్ని క్రమపద్ధతిలో తీరుస్తూ ఉండండి. భూమినీ, ఇంటినీ అమ్మాలనే ఆలోచన విరమించుకోండి. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి దశలో ఉంటుంది. బంధుమిత్రులకి సూచనలనీ సలహాలనీ పొరపాటున కూడా ఈయకండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు