మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయమై సహకారం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. తప్పనిసరిగా కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహధ్యానం చేయండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ప్రతి వ్యవహారం విజయవంతంగా సాగుతుంది. సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం మీదే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. లేత ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివాష్టకం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యతిరేకులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలను చర్చించు కుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. పారిశ్రామికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ ప్రార్ధన మంచిది.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి విశేష ఆదరణ. వారం మధ్యలో వివాదాలు. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. అప్రయత్నంగా విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు కేసులు పరిష్కారవుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని నిర్ణయాలను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి సత్కారాలు, అవార్డులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ప్రారంభంలో సమస్యలు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే అనుకూలిస్తుంది. వాహనయోగం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహావిష్ణుధ్యానం చేయండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయం అందిస్తారు. ఒక లేఖ ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కుటుంబపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సంతోషకరంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. భూములకు సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. నిరుద్యోగులు ఉద్యోగలాభం పొందుతారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన రీతిలో పదోన్నతులు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీవేంకటేశ్వరస్తుతి మంచిది.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థికంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీపై వచ్చిన అపవాదులు, ఆరోపణల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదుర్గాస్తుతి మంచిది.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అప్రయత్నంగా పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులు పరిచయమైన సహకరిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. భూములకు సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. అనుకోని ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిÔ¶ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగలాభం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు
టారో (28 అక్టోబర్ నుంచి 3 నవంబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19)
అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంలో మీ అంతరాత్మే మీకు దోహదపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే అనవసరపు మార్పులను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. నిక్కచ్చి ధోరణి కారణంగా ప్రత్యర్థులు తయారవుతారు. ఈ వారంలో భావోద్వేగాలను ఎంతగా అదుపు చేసుకుంటే అంత క్షేమం. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా భాగస్వామితో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కొంత ఎడబాటు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఆరోగ్యంపైన, బాహ్య అలంకరణలపైన శ్రద్ధ పెంచుతారు.
లక్కీ కలర్: నారింజ
వృషభం (ఏప్రిల్ 20 – మే 20)
విందు వినోదాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఆర్థిక ఎదుగుదల కోసం అవసరమైన ప్రణాళికలను ఆచరణలో పెడతారు. తీరైన శరీరాకృతి కోసం వ్యాయామంపై శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నా, ముందుజాగ్రత్తగా ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి. సవాళ్లను స్వీకరిస్తారు. సృజనాత్మక కళా రంగాల్లోని వారికి సన్మానాలు దక్కుతాయి.
లక్కీ కలర్: లేతనీలం
మిథునం (మే 21 – జూన్ 20)
జీవితంలో కోరుకున్న కొత్తదనాన్ని సాధిస్తారు. మార్పులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. తలపెట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. ప్రతికూలతలను తొణకని స్థైర్యంతో ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మరింతగా రాణిస్తారు. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపును దక్కించుకుంటారు. విచక్షణతో వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటారు. ఒంటరిగా ఉంటున్నవారు ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. విలాసాలకు ఖర్చు చేస్తారు.
లక్కీ కలర్: పసుపు
కర్కాటకం (జూన్ 21 – జూలై 22)
అనుకోకుండా వచ్చిపడ్డ సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని పట్ల మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భావసారూప్యత గలవారి సహాయంతో తగిన కార్యాచరణను రూపొందించుకుంటారు. తలపెట్టిన పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేస్తారు. కొత్తగా ప్రారంభించదలచిన వ్యాపారాల కోసం ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.
లక్కీ కలర్: లేత ఊదా
సింహం (జూలై 23 – ఆగస్ట్ 22)
ఇంటా బయటా అనివార్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తాయి. ప్రవాహంతో పాటు ముందుకు సాగడమే మీ వంతవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలను అంది పుచ్చుకుంటారు. పని ప్రదేశంలో జనాకర్షణ పెంచుకుంటారు. పెట్టుబడులకు సానుకూలమైన కాలం ఇది. భాగస్వామ్య లావాదేవీలకు దూరంగా ఉండటం క్షేమం. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తి సఖ్యత లోపించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్: మీగడ రంగు
కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22)
అనూహ్యమైన మార్పులు ఉంటాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రత్యేక ప్రతిభా పాటవాలతో ఘన విజయాలు సాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కొంత మందకొడిగానే ఉంటుంది. తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మీ వద్దకు వచ్చే కొందరి ప్రభావంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సాయం చేస్తారు. పాత మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్: నీలం
తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్: ఆకుపచ్చ
వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్: బంగారు రంగు
ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్: ఊదా
మకరం (డిసెంబర్ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్: పసుపు
కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్: ముదురు ఊదా
మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్: లేత గులాబి
- ఇన్సియా ,టారో అనలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment