వారఫలాలు | Vara fhalalu 27-01-2019 | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Jan 27 2019 1:25 AM | Last Updated on Sun, Jan 27 2019 1:25 AM

Vara fhalalu 27-01-2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులు సకాలంలో చకచకా పూర్తి కాగలవు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. గృహæ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కళారంగం వారికి  సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. యుక్తితో కొన్ని ఇబ్బందులు,  సమస్యల నుంచి బయటపడతారు. ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. ఉద్యోగ యత్నాలు మరింత సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకున్న  ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో  వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల  నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. విద్యార్థుల ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో  పుంజుకుంటాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని  చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధల నుంచి బయటపడతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు.  అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, గృహయోగాలు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలను సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మ«ధ్యలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. పసుపు, నేరేడురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు. సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు అనుకూలించినా లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు  మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈ వారం విజయాల బాటలో నడుస్తారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఆసక్తికర సమాచారం తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. మానసిక అశాంతి.  తెలుపు, పసుపు రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.  వివాదాల నుంచి బయటపడతారు. సహనం, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు గుర్తింపుతో పాటు, పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వివాదాలు.  ఆకుపచ్చ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీమాటకు ఎదురుండదు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషం. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాల విస్తరణలోనూ, పెట్టుబడుల సమీకరణలోనూ  ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు  హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవార్డులు లభిస్తాయి. తెలుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రత్యర్థులు కూడా మీకు వెన్నంటి నిలుస్తారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేతనీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కార్యోన్ముఖులై పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.  కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు. ఊహించని ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (27 జనవరి నుంచి  2 ఫిబ్రవరి 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
జీవితంలోని కొత్త దశ మొదలవుతుంది. అద్భుతమైన అవకాశాలు అనూహ్యంగా కలసి వస్తాయి. సంపద పెరుగుతుంది. విలాసాలను ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. సాయం అవసరమైనప్పుడు మొహమాటం వీడి ఇతరుల సాయాన్ని కోరండి. కోరుకున్న సాయం తప్పక దొరుకుతుంది. ప్రేమానుబంధాలలో నిరాశాపూరితమైన పరిస్థితులు తలెత్తే సూచనలు ఉన్నాయి. భావోద్వేగపరంగా సంయమనం పాటించడం మంచిది. ధైర్యంగా, స్వతంత్రంగా ముందుకు సాగితేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు.
లక్కీ కలర్‌: ఎరుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఇంటా బయటా సంయమనం పాటించడమే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పని ప్రదేశంలో ఆగ్రహావేశాలను అదుపు చేసుకుంటేనే క్షేమం. ప్రత్యర్థుల నుంచి కవ్వింపు చర్యలు ఎదురు కావచ్చు. వాగ్వాదాలకు దిగితే అనవసరంగా నిందలు పడాల్సి వస్తుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మనసు పరిపరి విధాల పరుగు తీస్తుంది. ప్రియతముల నుంచి ప్రేమ కోసం పరితపిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సహాయం పొందాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. అనుకోని దూర ప్రయాణాలు చేస్తారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆశావహమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. దూకుడు పెంచడం ద్వారా మరిన్ని విజయాలను చేజిక్కించుకుంటారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. అప్పులు తీర్చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. బరువును అదుపు చేసుకోవడానికి వ్యాయామం వైపు దృష్టి సారిస్తారు. ఊగిసలాటలో పడిన ప్రేమానుబంధాలను తిరిగి బలోపేతం చేసుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇప్పటి వరకు సాధించిన విజయాలను బేరీజు వేసుకుంటారు. మిమ్మల్ని మీరే విజేతగా భావిస్తారు. ఎలాంటి వారైనా మిమ్మల్ని వారి నియంత్రణలోకి తీసుకోలేరు. ఆర్థికంగా అద్భుతమైన కాలం ఇది. పెట్టుబడులపై ఆశించిన దానికి మించిన లాభాలు వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇదివరకే కొన్న ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. విలాసాల కోసం బాగా ఖర్చు చేస్తారు. స్నేహితులకు, ప్రియతములకు కానుకలు ఇస్తారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: తుప్పు రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వ్యాయామం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కఠినమైన లక్ష్యాలను సాధిస్తారు. అధికారుల మన్ననలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొత్తగా మొదలైన ప్రేమానుబంధం మిమ్మల్ని ఆనందంలో ఓలలాడిస్తుంది. పెద్దలను, గురువులను కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: తెలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఇంటికి మరమ్మతులు, అలంకరణలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. చిరకాలంగా వాయిదా వేస్తున్న పనిని పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రియతములను అర్థం చేసుకోవడం ప్రహేళికలా తయారవుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ పెరుగుతుంది. అరుదైన ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నేరేడు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
పనులను పూర్తి చేయడంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. చిరకాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రేమానుబంధాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: తెలుపు
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement