వారఫలాలు | Va | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Sep 2 2018 1:39 AM | Last Updated on Sun, Sep 2 2018 1:39 AM

Va - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులు శత్రువులుగా మారతారు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకార ం చుడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో వివాదాలు తీరతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులను ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సమయానికి సొమ్ము అంది అవసరాలు తీరతాయి. విద్యార్థుల సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యహృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని పనులు నెమ్మదించినా సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా బలపడతారు. సమస్యల  బారి నుంచిబయటపడతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో అనుకోని పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. తెలుపు, నీలంరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
బంధువుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీ సేవలకు తగిన గుర్తింపు రాగలదు. ముఖ్యమైనపనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించేసమయం. స్థిరాస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సొగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. కుటుంబ,ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ప్రశంసలు, ఆదరణ లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. నూతన గృహయోగం. వివాహ వేడుకలు నిర్వహిస్తారు. సంఘంలో మరింత గౌరవం లభిస్తుంది. సంతానరీత్యా శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు కాస్త తీరతాయి. శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులు ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. నీలం, పసుపురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఎదురుండదు. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో వైరం. ఆకుపచ్చ, తెలుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుంది.  సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. భూమి సంబంధిత లాభాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో వివాదాలు. కొంత అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(2 సెప్టెంబర్‌ నుంచి  8 సెప్టెంబర్‌ 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారంతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఇతరుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించడం అవసరం. ప్రేమ వ్యవహారాల్లో తలెత్తే పొరపొచ్చాలను స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించుకోవడం మంచిది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వరుస విజయాలతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంటా బయటా సంతృప్తికరమైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రేమికుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. ఇతరులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. దూర ప్రాంతాలకు విహార యాత్రల కోసం వెళతారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
లక్కీ కలర్‌: బూడిద రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
తలపెట్టిన పనులన్నింటినీ ఆశించిన రీతిలోనే పూర్తి చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది. జాగ్రత్తతో కూడిన ప్రణాళికలు మీ విజయాలకు బాటలు వేస్తాయి. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కృతనిశ్చయంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వ్యాయామం ప్రారంభిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. పలుకుబడి గల వ్యక్తుల నుంచి సాయం అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు.
లక్కీ కలర్‌: ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటి సాధన కోసం అహరహం శ్రమిస్తారు. పనికి మొదటి ప్రాధాన్యమిస్తారు. కఠినమైన పోటీల్లో విజయాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు చేయూత ఇస్తారు. ఆర్థిక పరిస్థితిని మదింపు వేసుకుంటారు. అనవసరపు ఖర్చులకు కళ్లెం వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. శక్తికి మించిన పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ఇతరులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. 
లక్కీ కలర్‌: ముదురు నారింజ

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఇంటా బయటా అనివార్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తాయి. ప్రవాహంతో పాటు ముందుకు సాగడమే మీ వంతవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలను అంది పుచ్చుకుంటారు. పని ప్రదేశంలో జనాకర్షణ పెంచుకుంటారు. పెట్టుబడులకు సానుకూలమైన కాలం ఇది. భాగస్వామ్య లావాదేవీలకు దూరంగా ఉండటం క్షేమం. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తి సఖ్యత లోపించే సూచనలు ఉన్నాయి. 
లక్కీ కలర్‌: గోధుమ రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
అనూహ్యమైన మార్పులు ఉంటాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రత్యేక ప్రతిభా పాటవాలతో ఘన విజయాలు సాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కొంత మందకొడిగానే ఉంటుంది. తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మీ వద్దకు వచ్చే కొందరి ప్రభావంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సాయం చేస్తారు. పాత మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: గులాబి

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్‌: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి.
లక్కీ కలర్‌: ఊదా

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది.
లక్కీ కలర్‌: వెండి రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ  
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement