వారఫలాలు | varaphalalu inthis week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Jul 15 2018 12:47 AM | Last Updated on Sun, Jul 15 2018 12:47 AM

varaphalalu inthis week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనులలో పురోగతి కనిపిస్తుంది. బంధువర్గంతో తగాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ నిర్ణయాలలో కుటుంబసభ్యులను మెప్పిస్తారు. వాహనయోగం. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ మెరుగుపడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. కోర్టు కేసులలో పురోగతి కనిపిస్తుంది.వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు కలసిరావు. బంధువులతో విభేదాలు నెలకొనవచ్చు. ఆరోగ్యం మందగిస్తుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. శ్రమాధిక్యం. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం నిరాశ పరుస్తుంది. విద్యార్థులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  గృహ నిర్మాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార లావాదేవీలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. కళాకారులకు నిరుత్సాహం. వారం  మధ్యలో విందువినోదాలు. శుభవార్తలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు లక్ష్యాలు నెరవేరతాయి. పలుకుబడి మరింతగా పెరుగుతుంది. కుటుంబసభ్యులతో తగాదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తివృద్ధి. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకమే. రుణబాధలు తొలగుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు తిరిగి దక్కుతాయి.  తీర్థయాత్రలు చేస్తారు.  వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులకు అవకాశం. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో సోదరులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. గృహ నిర్మాణాలపై అంచనాలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నీలం, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ను పూజించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని వివాదాలు, సమస్యలు క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వివాహయత్నాలలో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో చికాకులు తొలగి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి నూతనోత్సాహం, కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో  అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని ఇబ్బందులు తీరి మనశ్శాంతి పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సభలు,సమావేశాలకు హాజరవుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం, సలహాలతో పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఎదురుండదు, పదోన్నతులు రావచ్చు. పారిశ్రామివర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితి ఉంటుంది. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు  కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.        కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. నలుపు, ఆకుపచ్చరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకూల పరిస్థితులు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింతగా పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.           ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వాహనయోగం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఈ వారంలో అధిక శ్రమ పెరుగుతుంది. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(15 జూలై నుంచి  21 జూలై, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. హాస్యచతురతలోను, సాహస ప్రవృత్తిలోను మీ అభిరుచిని నిలుపుకుంటారు. ఆశించిన లక్ష్యాల దిశగా ముందుకు సాగే క్రమంలో మీరు ఆటవిడుపు కార్యక్రమాలకు కొంత దూరం కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇతరులు నిర్దేశించిన లక్ష్యాల సాధన కోసం పాటుపడటం కంటే, మీరు సాధించదలచిన లక్ష్యాలను మీరే నిర్దేశించుకుని, వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారు. క్లిష్ట పరిస్థితుల్లో స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మీరు తిరుగుబాటుకు సైతం సిద్ధపడతారు. ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారు.
లక్కీ కలర్‌: ఎరుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కీలక సందర్భాల్లో çసున్నితంగా వ్యవహరిస్తారు. మీ సృజనాత్మకతకు ప్రశంసలు లభిస్తాయి. సవాళ్లతో కూడిన సమస్యలతో కొంత సతమతమయ్యే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి మందకొడిగా ఉంటుంది. సత్వర నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవరోధాలను అధిగమిస్తారు. గతానుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో జీవితాన్ని తిరిగి తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారు. చిరకాల మిత్రుల సహకారంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఒడ్డునపడతారు.
లక్కీ కలర్‌: లేత నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
పాత జ్ఞాపకాలను తవ్వుకోవడం వల్ల మానసిక అశాంతి రేగుతుందే తప్ప ప్రయోజనం ఉండదని తెలుసుకుంటారు. సహానుభూతితో స్పందించే సన్నిహితుల సమక్షంలో సాంత్వన పొందుతారు. సృజనాత్మకతను చాటుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో మార్పులు తప్పకపోవచ్చు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అసూయాపరుల కారణంగా మనస్తాపం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. ఇంటా బయటా మార్పులకు రంగం సిద్ధం చేసుకుంటారు.
లక్కీ కలర్‌: తెలుపు 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అవకాశాలు వరుసగా అందివస్తాయి. కఠోర పరిశ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. ఆశయ సాధనలో విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో మీదైన వైఖరిని స్పష్టం చేస్తారు. సమస్యలను నాన్చకుండా సత్వరమే పరిష్కరించుకుంటారు. సామాజికంగా పలుకుబడిని పెంచుకుంటారు. రాజకీయాల్లో రాణిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాల్సి వస్తుంది. ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. పిల్లలో సమయం వెచ్చిస్తారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కార్యాచరణపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. వాస్తవిక దృక్పథంతో ఆచరణయోగ్యమైన పనులనే తలపెడతారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సాధనతో సమకూర్చుకున్న ప్రతిభా పాటవాలు, నైపుణ్యాలే కాకుండా సామాజిక సంబంధాలు కూడా మీ ఉన్నతిలో కీలక పాత్ర పోషిస్తాయి. స్పష్టత, నిబద్ధత లేని వ్యవహారాలకు దూరంగా ఉంటారు. పెట్టుబడులపై ఊహించిన వాటి కంటే ఎక్కువ లాభాలు లభిస్తాయి. పని ఒత్తిడి పెరిగి ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది. సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: నీలం

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటారు. మీ జీవితానికి పునాదులు వేసిన సిద్ధాంతాలను సమీక్షించుకుంటారు. మీ యోగ్యత మేరకు ఫలితాలను పొందుతారు. ఊహకు అందని రీతిలో మీ చిరకాల స్వప్నాలు కొన్ని నెరవేరడం మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. మిమ్మల్ని పరీక్షించదలచిన కొందరు వ్యక్తుల కారణంగా అసహనం పెంచుకుంటారు. బంధు మిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. విహారయాత్రలకు వెళతారు. ఆటవిడుపుగా పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్య సమస్యలు చక్కబడతాయి. ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపుతారు.
లక్కీ కలర్‌: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వరుస పనులతో తీరిక లేకుండా ఉక్కిరిబిక్కిరవుతారు. ఆర్థిక వ్యవహారాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఖర్చులకు కళ్లెం వేస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. ఆత్మనిగ్రహంతో ముందుకు సాగుతారు. నైపుణ్యాలను పెంచుకునేందుకు మరింతగా శ్రమిస్తారు. ఆశించిన లక్ష్యాలను సాధించడానికి తగిన వ్యూహాలను రూపొందించుకుంటారు. ఆరోగ్యం స్వల్పంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నారింజ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సృజనాత్మకతకు పదును పెడతారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూలతను సాధిస్తారు. అసాధారణమైన అభిరుచులు గలవారితో విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. వర్తమాన వాస్తవ పరిస్థితులకు, అవాస్తవికమైన మీ ఆలోచనలకు మధ్య గందగోళాన్ని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో చిక్కులు తప్పకపోవచ్చు. ఆశించిన ఫలితాలను సాధించడానికి అమితంగా పరిశ్రమించాల్సి వస్తుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. వృథా కాలక్షేపాలకు దూరంగా ఉండటం మంచిది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. 
లక్కీ కలర్‌: నలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత పురోగతి కంటే మనశ్శాంతిని ఎక్కువగా కోరుకుంటారు. సంతోషం కలిగించే శుభవార్తను వింటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తి చేస్తారు. అధ్యయనానికి, ధ్యానానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం క్షేమం. స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలు నెరవేరుతాయి. సమయానికి సన్నిహిత మిత్రుల నుంచి ఆర్థిక సాయం లభిస్తుంది. 
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. బృందంతో కలసి చేపట్టే పనుల్లో మీ ప్రతిభను నిరూపించుకుంటారు. ఉత్పాదకత కోసం మీరే చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపించే సూచనలు ఉన్నాయి. మిత్రులతో మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. త్వరగా పనులు పూర్తి చేయాలనే ఆతృతతో ఇతరుల మనసు నొప్పిస్తారు. కొంత సంయమనం పాటిస్తే అపార్థాలు తలెత్తే అవకాశాలు తగ్గుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. ఆహారపు అలవాట్లలో మార్పులు చేపడతారు. 
లక్కీ కలర్‌: లేత నారింజ 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఏళ్ల తరబడి వేధిస్తూ వస్తున్న సమస్యలు మరింతగా ఆందోళన కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలలో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మీ సమస్యలపై స్పందిచని వ్యక్తులను దూరం పెడతారు. మిత్రుల సాయంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆరోగ్యం క్షీణించే సూచనలు ఉన్నాయి. కొత్తగా చేపట్టాలనుకున్న పనులు వాయిదా పడతాయి. లక్ష్య సాధనలో అనవసర జాప్యం తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగుతారు.
లక్కీ కలర్‌: కాఫీ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ కళానైపుణ్యానికి, సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కళా సృజనాత్మక రంగాల్లోని వారు సత్కారాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ నిరూపించుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. మిత్రులను ఆదుకుంటారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. కుటుంబంలో ఉల్లాసభరితమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. ఇంటికి అలంకరణలు చేపడతారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement