వారఫలాలు | varafalalu in this week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Jul 29 2018 1:03 AM | Last Updated on Sun, Jul 29 2018 1:03 AM

varafalalu in this week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న కార్యక్రమాలు సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా కూడా మరింత బలం చేకూరుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. కార్యదక్షతతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు ఊహించని విధంగా గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కవచ్చు. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని నిర్ణయాలలో ఎటూతేల్చుకోని పరిస్థితి. దూరపు బంధువుల నుంచి కీలక సందేశం. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. కొన్ని సమస్యలు మొదట్లో చికాకు పర్చినా ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కళారంగం వారికి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలులో ప్రతిబంధకాలు కాస్త చికాకు పరుస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు దక్కుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత ఊరట. అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు దక్కవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సూచనలు.  ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరతాయి.  వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తెలుపు, లేత గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రత్యర్థులను సైతం మెప్పించి మీ దారికి తెచ్చుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బం«ధువులతో వివాదాలు తీరి సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. సోదరులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం  చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. గులాబీ,లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రుణబాధలు తీరి ఊరట చెందుతారు. పనులు చకచకా సాగుతాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది.  నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలపై బంధువర్గంతో చర్చిస్తారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానంచేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సైతం అందే సూచనలు. బంధువులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. సేవాభావంతో ఇతరులకు సహాయపడతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు ఊరిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. మానసిక అశాంతి. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల వేటలో పడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.కుటుంబసభ్యులతో వైరం. శ్రమకు తగిన ఫలితం రాక డీలాపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపండి. వాహనాల విషయంలో అప్రమత్తత అవసరం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరమవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పట్టుదలతో కష్టసాధ్యమైన పనులు సైతం పూర్తి చేస్తారు. ఆత్మీయులు చేదోడుగా నిలిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమీకరించుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యం మందగిస్తుంది. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఎంతటి పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఊహించని విధంగా మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. బంధువర్గంతో వివాదాలు కాస్త తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో  మీ అభ్యంతరాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు రాగలదు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకథారాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (29 జూలై నుంచి  4 ఆగస్టు, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ప్రస్తుతం మీరు చేపట్టే పనులన్నీ భవిష్యత్తులో చక్కని ఫలితాలను అందిస్తాయి. కఠోర పరిశ్రమ, చెక్కు చెదరని సంకల్పబలం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. పెట్టుబడుల నుంచి లాభాలు పొందడానికి మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెట్టే ముందు వాటిలోని సాధకబాధకాలను  క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మంచిది. జీవితంలో మార్పు తెచ్చే ఒక కొత్త ప్రతిపాదన మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. 
కలిసివచ్చే రంగు : గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. ఇదివరకటి నష్టాల నుంచి క్రమంగా తేరుకుంటారు. భావోద్వేగాల ప్రభావంతో కాకుండా, బుద్ధికి పదును పెట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమస్యలన్నీ సమసిపోతాయి. రానున్న రోజులు సంతోషభరితంగా ఉంటాయి. ఇతరులు చెప్పే జాలి కథలు విని కరిగిపోకండి. మిమ్మల్ని వాడుకోవాలనే దురుద్దేశంతో కొందరు మీ వద్ద కట్టుకథలు చెబుతారు. ఇతరుల విషయాలను పట్టించుకోకుండా పూర్తిగా మీ పని మీద, మీ కుటుంబం మీద మాత్రమే శ్రద్ధ చూపడం మంచిది. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి ఇదే తగిన సమయం.
కలిసివచ్చే రంగు : గోధుమ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
స్వేచ్ఛను కోరుకుంటారు. మీదైన తీరిక సమయాన్ని కోరుకుంటారు. విధి నిర్వహణ బాధ్యతల నుంచి తాత్కాలికంగా సెలవు తీసుకుని విహార యాత్రలకు వెళతారు. ఇంట్లోను, కార్యాలయంలోను మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. వ్యాపారపరంగా లాభసాటి సమాచారాన్ని తెలుసుకుంటారు. దూరమైన పాత అనుబంధాల పునరుద్ధరణ కోసం పాటుపడతారు. జీవితాన్ని పూర్తిగా మీ అదుపులోకి తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడే కొత్త మార్గంలోకి అడుగు పెడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
కలిసివచ్చే రంగు : నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అనిశ్చిత పరిస్థితుల్లో ఊగిసలాడతారు. ప్రస్తుత సమస్యల నుంచి గట్టెక్కడానికి తగిన భరోసా లభిస్తుంది. కోరుకున్నవి సాధించడానికి, కలలను సాకారం చేసుకోవడానికి తగిన నిర్ణయాత్మక చర్యలను చేపడతారు. సమయస్ఫూర్తితో మీరు తీసుకునే నిర్ణయాలు అసాధారణమైన ఫలితాలను ఇస్తాయి. పాత ఆలోచనను తాజాగా ఆచరణలో పెట్టడం ద్వారా లేదా ఫలితం దక్కకుండాపోయిన ఇదివరకటి పని ద్వారా ఊహించని లాభాలు పొందుతారు. కొత్త సహచరులు చేరువవుతారు. అందరి ఆలోచనలూ ఒకే రీతిలో ఉండవని తెలుసుకుంటారు. లౌక్యంతో పనులు సాధిస్తారు.
కలిసివచ్చే రంగు : పసుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
జనం మూకుమ్మడిగా అనుసరించే ధోరణిని గుడ్డిగా అనుసరించకుండా, మీదైన మార్గంలో మీరు ప్రయాణిస్తారు. మీ ఆలోచనలకు, మీ కోరికలకు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. సుదూర ప్రాంతాలకు విహారయాత్రలు చేస్తారు. కొత్త ప్రదేశాలను చూస్తారు. ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ముందడుగు వేస్తారు. జీవితంలో పురోగతి మొదలవుతుంది. వ్యాపార, పారిశ్రామిక వర్గాల వారికి లాభాలు భారీగా ఉంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
కలిసివచ్చే రంగు : బూడిద రంగు

కన్య (ఆగస్టు 23 – సెప్టెంబర్‌ 22)
కలతలు, కలహాలు కనుమరుగై తిరిగి ప్రశాంతత ఏర్పడుతుంది. భారీ మార్పులకు నాందీ ప్రస్తావన జరుగుతుంది. అకస్మాత్తుగా తలెత్తే ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. తీరిక సమయాన్ని మౌనంగా ఆత్మావలోకనం చేసుకోవడానికి కేటాయిస్తారు. మౌనం వల్ల కలిగే లాభాలను అనుభవపూర్వకంగా అర్థం చేసుకుంటారు. నిదానంగా పరిస్థితులన్నీ అదుపులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో చక్కని అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి.
కలిసివచ్చే రంగు : లేతాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
పని ఒత్తిడికి దూరంగా కొంత విరామం, విశ్రాంతి కోరుకుంటారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. విశ్రాంతి తర్వాత శక్తిని, నూతనోత్తేజాన్ని పుంజుకుంటారు. తలపెట్టిన భారీ పనులను ఈ వారం వాయిదా వేయడమే మంచిది. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను కూడా తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి, కళా రాజకీయ రంగాల్లోని వారికి జనాకర్షణ పెరుగుతుంది. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆహార విహారాల్లో మార్పులు చేపట్టి ఆరోగ్యం చక్కదిద్దుకుంటారు.
కలిసివచ్చే రంగు : నీలం

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
పరిస్థితులపై వాస్తవికంగా అంచనాలు వేస్తారు. సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. అందరితోనూ కలివిడిగా ఉంటూనే, గోప్యతను పాటిస్తారు. స్థిరాస్తులపై పెట్టుబడులు కలసి వస్తాయి. సమయానికి రుణాలు అందుతాయి. ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో లాభసాటి ఫలితాలను ఇస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. బంధు మిత్రులతో కలసి వేడుకలు జరుపుకొంటారు. విలాసాలను ఆస్వాదిస్తారు. విందు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్యంపై కూడా కాస్త దృష్టి ఉంచుకుంటే మేలు. 
కలిసివచ్చే రంగు : తుప్పు రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పని పట్ల ఎంతగా తపన ఉన్నా, కొంత విశ్రాంతి కూడా అవసరం. మితిమీరిన పనులన్నీ నెత్తిన వేసుకుని ఆరోగ్యానికి చేటు తెచ్చుకోకండి. పోటీలో ముందంజలో ఉండాలని భావించడం తప్పేమీ కాదు గాని, అందుకోసం శక్తికి మించిన ప్రయాసపడటం క్షేమం కాదు. మిత్రులకు ధన సహాయం చేసే విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని పురోగతి కొంత మందకొడిగా ఉంటుంది. ఇతరులను అంచనా వేయడంలో పొరపాట్లు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత ఏర్పడుతుంది. కళారంగంలోని వారికి ఉత్సాహం కొరవడుతుంది.
కలిసివచ్చే రంగు : చాక్లెట్‌ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సాధించిన విజయాలకు సంబరాలు జరుపుకుంటారు. ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానం అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత గడ్డు పరిస్థితులు నెలకొంటాయి. సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. లౌక్యం పాటించడం మంచిది. ఆర్థిక లాభాలు అందుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరుకుతుంది. నిజమైన ప్రేమలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు. విహార యాత్రలకు వెళతారు. ఒక కీలక సమాచారాన్ని తెలుసుకుంటారు.
కలిసివచ్చే రంగు : లేత పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
పిల్లల కోసం మరింత సమయం కేటాయిస్తారు. ప్రేమించిన వారితో ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల కంటే కుటుంబానికి అధిక ప్రాధాన్యమిస్తారు. ఆర్థిక లాభాలు బాగుంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపాటు తగదు. ఆచి తూచి వ్యవహరించకుంటే లేనిపోని చిక్కులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అదృష్టం మీ వెంటే ఉంది. చిరకాల స్వప్నం సాకారమవుతుంది. ఒత్తిడికి లోను కాకుండా నిశ్చింతగా ఉండండి. సమస్యలన్నీ వాటంతట అవే సమసిపోతాయి. స్థిరాస్తి వ్యవహారాలు లాభాలను తెచ్చిపెడతాయి.
కలిసివచ్చే రంగు : బంగారు రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక నిర్ణయాల్లో దూకుడు కొనసాగిస్తారు. ఎంతటి పనినైనా ఆటలాగా తీసుకుంటారు. మీరు ఆడే ఈ ఆటలో గెలుపు మీదే. అన్నీ హేతువుకే లొంగుతాయనే వాదనను విశ్వసించరు. హేతువుకు మించినదేదో ఉందనే స్పృహతో ఆధ్యాత్మిక ప్రయాణం సాగిస్తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. కొందరు విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి. జనాకర్షణ పెరుగుతుంది. సామాజికంగా పలుకుబడి గల వారు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు.
కలిసివచ్చే రంగు : తెలుపు
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement