వారఫలాలు | varaphalalu inthis week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Feb 25 2018 1:03 AM | Last Updated on Sun, Feb 25 2018 1:03 AM

varaphalalu inthis week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గతాన్ని తలచుకుని ఆశ్చర్యానికి లోనవుతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక విషయాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు తప్పవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు మార్పులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. కొత్త పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలలో ముందడుగు పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు లాభిస్తాయి. కార్యజయంతో ఉత్సాహం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. దూరపు బం«ధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అదనంగా వచ్చే ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభ సూచనలు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో కొంతమేరకు పురోగతి కనిపిస్తుంది. మీ అంచనాలు, ఊహలు నిజమవుతాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలలో విజయం. కొన్ని సమస్యల నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు. వస్తువులు, వాహనాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు గుర్తింపు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి.  పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. కళాకారులకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు, పురస్కారాలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు అనుకున్న ప్రకారం పూర్తి చేస్తారు. ఆత్మీయులు సలహాలు అందిస్తారు. రావలసిన సొమ్ము కొంతమేర అందుతుంది. విద్యార్థులకు కొత్త అశలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారులకు లాభాలు దక్కే చాన్స్‌. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ,లేత పసుపురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో(25 ఫిబ్రవరి నుంచి  3 మార్చి, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారమంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి జీవితం ఊహించనంత వేగంగా దూసుకుపోతుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. చాలాకాలంగా మిమ్మల్ని ఊరిస్తోన్న ఓ విజయం దగ్గరలోనే ఉంది. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : గులాబీ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడిపేస్తారు. ఎప్పుడో మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన చాలా పనులను ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టి విజయం వైపుకు అడుగులు వెయ్యాలని భావిస్తారు. మీ ఆలోచనలు కూడా మిమ్మల్ని ఖాళీగా ఉంచకుండా పరుగులు పెట్టిస్తాయి. ఒక గొప్ప విజయం మీకు దగ్గరలోనే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పనిచేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : నీలం 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈవారం వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులకు తగ్గట్టు పనిచేసేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. జీవితంలో ఏదీ కష్టపడకుండా రాదన్న విషయాన్ని గుర్తుంచుకొని, మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించండి. కొన్ని విషయాలు ఇప్పుడు బాధపెట్టినంత మాత్రాన అవి ఎప్పుడూ అలాగే ఉండిపోతాయని కాదని నమ్మండి. ఆత్మ విశ్వాసం, అందరినీ ప్రేమగా చూసే మీ ఆలోచనా విధానమే మీ ఆయుధాలు. వాటిని ఎప్పుడూ వదులుకోకుండా విజయానికి చేరువకండి. ప్రేమ జీవితం బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
గతాన్ని గురించి ఎంత ఆలోచించినా,  మీరేమీ మార్చలేరన్న విషయం తెలుసుకోండి. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతితక్కువ రోజుల్లోనే ఆ వ్యక్తికి బాగా దగ్గరవుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేయగల స్థాయి మీది. ఆ మీ స్థాయి ఏళ్లుగా మిమ్మల్ని మీరు నిర్మించుకున్న విధానం వల్లనే వచ్చిందని బలంగా నమ్మండి. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ఓ గొప్ప అవకాశం ఈవారమే మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని, మీ చుట్టూ ఉండేవారికి ఆదర్శంగా నిలిచే విజయాన్ని పొందుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా అవి కేవలం మీ చిత్తశుద్ధిని పరీక్షించడానికే అని తెలుసుకోండి. 
కలిసివచ్చే రంగు : బూడిద 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే మీ స్వభావమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని బలంగా నమ్మండి. అసలు కష్టాలే లేని జీవితమన్నది ఒక మిథ్య. అలాంటి జీవితం గురించి ఆలోచిస్తూ, కష్టాలను చూసి భయపడిపోతే మీరనుకున్నది ఏదీ సాధించలేరని తెలుసుకోండి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : తెలుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వృత్తి జీవితానికి సంబంధించి ఓ కీలక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఈరోజు మీరెక్కడున్నారో, రేపు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఆలోచించి పనిచేయండి. జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆస్వాదించడంలోనే ఆనందం దాగుందన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకండి. కొత్త ఇల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లైతే అందుకు ఇదే సరైన సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : పసుపు 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని, వాటిని అలాగే ఆస్వాదించే గుణం మీకు అవసరం. వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. అతి సాధారణంగా కనిపించే కొన్ని విషయాలు గొప్పవిగా మీకు ఈ రోజు కనిపించకపోయినా కొన్ని రోజులు పోయాక వాటి గొప్పదనం మీరే తెలుసుకుంటారు.  
కలిసివచ్చే రంగు : కాషాయ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఫలితం గురించి ఆలోచించకుండా మీదైన శ్రమనంతా వెచ్చించి పనిచేయండి. ఒక గొప్ప విజయం మీకు దగ్గర్లోనే ఉంది. దాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. అయితే ఆ విజయాన్ని గురించే ఆలోచించకుండా మీ పని మీరు చేస్తూ వెళ్లండి. ప్రేమ జీవితం బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఏదో శక్తి మిమ్మల్ని బలంగా వెనక్కి లాగుతున్న భావన నుంచి ఎప్పుడైతే బయటపడతారో ఆ రోజే మీరు కొత్తగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఆరోజు ఎంత త్వరగా వస్తుందన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మీకు నచ్చిన తీరులో పనిచేసుకుంటూ వెళ్లండి. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తి వల్లే మీకు ఆ అవకాశం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : వెండి 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ప్రతిసారీ మీకొచ్చే ప్రశ్నలన్నింటికీ మీరు కోరుకునే సమాధానాలే దొరికితే అది జీవితం అయిపోదు. కొన్ని సమాధానాలు ఎలా ఉన్నా, వాటిని అలాగే తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని దక్కించుకోవడం కోసం మీరు ఇన్నాళ్లు పడిన కష్టం కూడా మిమ్మల్ని జీవితంలో ఇప్పటికే విజయం సాధించిన వ్యక్తిగా నిలుపుతుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే.  ప్రేమ జీవితం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. 
కలిసివచ్చే రంగు : వయొలెట్‌ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వృత్తి జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తితోనే చిన్న వివాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది ఆలోచించండి. భవిష్యత్‌పై మీకున్న ఆశలను ఎప్పుడూ సజీవంగా ఉంచుకోండి. అదే మిమ్మల్ని ఎప్పటికప్పుడు జీవితాశయం వైపునకు ధైర్యంగా అడుగులు వేయిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. 
కలిసివచ్చే రంగు : పసుపు 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement