వారఫలాలు (21 జనవరి నుంచి 27 జనవరి 2018 వరకు) | varaphalalu inthis week | Sakshi
Sakshi News home page

వారఫలాలు (21 జనవరి నుంచి 27 జనవరి 2018 వరకు)

Published Sun, Jan 21 2018 1:05 AM | Last Updated on Sun, Jan 21 2018 1:05 AM

varaphalalu inthis week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పూర్వవైభవం. ఉద్యోగస్తుల ఆశలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. పనులు వాయిదా. పసుపు, గులాబి రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. అరుదైన సత్కారాలు పొందుతారు. ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. లేత నీలం, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. బంధువుల ప్రోద్బలంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయికి చేరతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనయోగం. ముఖ్యమైన చర్చలు సఫలం.  కళాకారులకు ఊహించని సత్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఊహించని అవకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వాహన, గృహయోగాలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరగవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఎరుపు, లేతగులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులు నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రత్యర్థులతో రాజీకి యత్నిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్యసమాచారం ఊరటనిస్తుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు.  ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వీడండి. ఒక సమాచారం విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. ఒత్తిడులు. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుంటారు.  ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. వారం ప్రారంభంలో శుభవార్తలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.  భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. ఆస్తి విషయంలో  నూతన ఒప్పందాలు.  సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. వ్యాపారాలు ఆశాజనకంగా  ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత ్తపనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య  సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. లేత ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చే స్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. విద్యార్థులు, నిరుద్యోగులయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబి, నేరేడు రంగులు.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో (21 జనవరి నుంచి  27 జనవరి, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. గత కొద్దిరోజుల క్రితమే మొదలుపెట్టిన ఓ పని ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కష్టపడి పనిచేసే మీ తత్వమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే శక్తి అని నమ్మండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతుంటాయి. అయినప్పటికీ మీ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా చూసుకోండి. అనుకున్న విజయం కోసం ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు. ఈ ప్రయాణాన్ని ఇష్టపడండి. విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇది మీకు ఓ కొత్త శక్తినిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఈవారమంతా మీరు ఊహించినట్టుగానే సాఫీగా సాగిపోతుంది. మీకు సన్నిహితులైన ఓ వ్యక్తికి అండగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. చాలాకాలంగా ముందుకు కదలని ఒక పని గురించి బాగా ఆలోచిస్తారు. ఆ పని ఇప్పుడే మొదలుపెట్టడం వల్ల జరగబోయే మంచిని గ్రహిస్తారు. జీవితాన్ని మలుపు తిప్పే ఓ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది.
కలిసివచ్చే రంగు : గులాబి 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం ఓ గొప్ప విజయం సాధిస్తారు. చాలాకాలంగా ఈ విజయం కోసమే ఎదురుచూస్తున్నందున, రాబోయే రోజులను ఉత్సాహంగా గడుపుతారు. కష్టపడి పనిచేసే మీ తత్వమే మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తికి తక్కువ సమయంలోనే బాగా దగ్గరవుతారు. వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా సునిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకుంటారు. ఇది మీలో ఊహించని మార్పు తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారం చివర్లో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. 
కలిసివచ్చే రంగు : వయొలెట్‌ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారం మీకంతా కొత్తగా ఉంటుంది. మీరు ఏమాత్రం ఊహించని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మీపై మీకు ధీమా ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని నమ్మండి. ఏం మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తితో ఒక గొడవ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త.  కలిసివచ్చే రంగు : పసుపు 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఇప్పటికైనా అలాంటి ఒక ఆలోచన రావడం మంచిదే. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవితమంతా ఒకేదగ్గర ఆగిపోయినట్టు భావిస్తారు. ఈ ఆలోచనను వీలైనంత త్వరగా దూరం చేసుకుంటే మంచిది. ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. 
కలిసివచ్చే రంగు : తెలుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మీరు ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఓ పనికి కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఆ అవాంతరాలకు కారణాలు ఏమై ఉంటాయన్న విషయం బాగా ఆలోచించండి. ప్రేమ జీవితం కాస్త గందరగోళంగా ఉంటుంది. సమస్య ఎక్కడ ఉందో ఆలోచించి, అందుకు మీరేం చేయాలో అర్థం చేసుకోండి. మీ ఆలోచనల్లో, ప్రపంచాన్ని ఆస్వాదించే విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడానికి వెనుకాడకండి. కలిసివచ్చే రంగు : గులాబి 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఈవారం మీకంతా సాఫీగా సాగిపోతుంది. ఒక కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పుకునే అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. అందరితో సరదాగా కలిసిపోయే మీ స్వభావాన్ని అలాగే ఉంచుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ సమయం మిమ్మల్ని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. కష్టపడి పనిచేస్తేనే మీ కలల ప్రపంచాన్ని చేరుకుంటారని నమ్మండి. వరుసగా అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరేం చేయాలో ఆలోచించుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : ఎరుపు 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఈవారం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఆ దిశగా మొదటి అడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి రానున్న రోజుల్లో మెరుగుపడుతుంది. ఖాళీ అన్నదే లేకుండా కష్టపడితేనే విజయం మిమ్మల్ని వరిస్తుందని నమ్మండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పసుపు 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలు కూడా చక్కబడతాయి. రానున్న రోజులంతా సంతోషంగా గడుపుతారు. మీకిష్టమైన వ్యక్తి మీకు పక్కనే ఉండడం ఉత్సాహాన్నిస్తుంది. మీ ప్రతిభతో చుట్టూ ఉండేవారి అభిమానాన్ని చూరగొంటారు. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. అయితే ఖరీదైన వస్తువులను కొంటూనే మళ్లీ బాధపడే మీ స్వభావం మారాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ భయాలన్నింటినీ వీడి, ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ముఖ్యమని నమ్మండి. ఆ దిశగా వెళ్లేందుకు మీరు ఏమేం చేయాలో కూడా ఆలోచించండి. అన్నింటికీ ఇతరులపై ఆధారపడే మీ స్వభావం కూడా మారాల్సి ఉంది. ఒక కీలక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం స్వయంగా మీరే తీసుకోవడం వల్ల ఏ ఫలితం వస్తుందన్న విషయం ఆలోచించకుండా ముందుకెళ్లండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఇచ్చే కొన్ని సలహాలు మాత్రం ఎప్పట్లాగే మీకు పనికొస్తాయి. కొన్ని చెడు అలవాట్లను ఇప్పటికైనా దూరం చేసుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.  కలిసివచ్చే రంగు : నీలం
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement