వారఫలాలు | varaphalalu inthis week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Jan 7 2018 1:21 AM | Last Updated on Sun, Jan 7 2018 1:21 AM

varaphalalu inthis week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
మీ ఆశయాలు నెరవేర తాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు రావచ్చు. బంధువులతో తగాదాలు. గులాబి, ఆరెంజ్‌ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవుపాలు, కొబ్బరినీళ్లతో వినాయకునికి అభిషేకం చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న పనులు మొదట్లో కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఆరోగ్య¿¶ ంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సగ్గుబియ్యం, బెల్లంతో చేసిన పరమాన్నం లక్ష్మీదేవికి నివేదించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థులు అనుకున్నది సా«ధిస్తారు. సభలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కార, పురస్కారాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. నలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరునికి మంగళవారం అభిషేకం చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉండి అప్పులు చేయాల్సివస్తుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. హామీలు, నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, లేత గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. 111 ఎర్రగులాబీలతో దుర్గామాతకు అర్చన చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. గత సంఘటనలు నెమరువేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. బియ్యం పరమాన్నం అమ్మవారికి నివేదించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి పిలుపు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు. అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. 11 కొబ్బరికాయలతో శివాలయంలో అభిషేకం మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మీ శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు కొన్ని తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. 21 కుడుములు వినాయకునికి సమర్పించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆశ్చర్యకరమైన విషయాలు, సంఘటనలు తెలుసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, ఆరెంజ్‌ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామికి అర్చన చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు సత్కారాలు అందుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబి, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ప్రారంభంలో ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. క్రమేపీ పరిస్థితులు ^è క్కబడతాయి. మీ ఆలోచనలు కలసివస్తాయి.  పనులు చకచకా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యమైనా మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. చోరభయం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహాలను స్తుతిస్తూ 9సార్లు  ప్రదక్షణలు చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. కుటుంబసమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మూడుసార్లు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఇంతకాలం మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబి, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో( 7 జనవరి నుంచి  13 జనవరి, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొలిక్కిరాకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రాజెక్టు ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీవైపే ఉంటుందని మరవకండి. న్యాయ సంబంధిత విషయంలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : ఊదా

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ ఆలోచనా తీరు, పద్ధతులను చక్కబెట్టుకునేందుకు మంచి సమయమిది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు సర్దుకుంటాయి. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీవైపే నిలుస్తుంది. కొత్త పదవిని అలంకరిస్తారు. మీదైన శైలిలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని కొత్త పదవిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ నాయకత్వంలో పనిచేస్తున్న వారు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది.  
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ 

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయమిది. కొత్త కోణంలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, ఇక ముందుకు కదలడం లేదేమో అనిపిస్తూ ఉన్నట్లైతే, ఇదంతా తాత్కాలికమేనని నమ్మండి. ముందంతా మంచే జరుగుతుంది. దేవుడిని ఇష్టంగా పూజించండి. కొత్త ఉత్సాహంతో జీవితం అందంగా తయారవుతుంది. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాధారణంగా ఉంటుంది. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి.
కలిసివచ్చే రంగు : లేత గోధుమ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీ జీవితాన్ని మలుపుతిప్పే మార్పు చోటు చేసుకుంటుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. అడ్డంకులేవైనా ఎదురైనట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. విజయంపై ధీమాతో కష్టపడండి. జిమ్‌లో చేరాల్సిన సమయమిది. బరువు తగ్గే ఆలోచన చేయండి. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో తీసుకునే ఈ నిర్ణయమే మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పనిచేయిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : వెండి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైన ఓ విషయంలో అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ఆలోచనలను చెడు వైపుకు మళ్లించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాలను బలంగా చెప్పడం అలవర్చుకోండి. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. నమ్మకంతో ఆ బాధ్యతలను చేపట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతారు.
కలిసివచ్చే రంగు : నలుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కలలో కూడా సాధ్యపడదు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి. మంచి గుర్తింపు సంపాదిస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నింటిపై నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. విజయం మీవైపే ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచడం మరవొద్దు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి.
కలిసివచ్చే రంగు : తెలుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడమే జీవితంలో ఒడిదుడుకులకు కారణం అన్నది తెలుసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అలవర్చుకోండి. జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ౖపైకి ఎదిగే సమయమిదే. మీకు ఇష్టమైన వ్యక్తి ఇచ్చే సూచనలు పాటించండి. కొత్త పనులు మొదలుపెడతారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత కాలంగా పూర్తి చేయాలనుకుంటున్న ఇంటి పనులు కొన్ని పూర్తవుతాయి. మానసిక ఉల్లాసానికి విహారయాత్రకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు.
కలిసివచ్చే రంగు : నీలం 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా, ఉత్సాహంగా, మీదైన శైలిలో సవాళ్లను ఎదుర్కొండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల పాటు ఏదైనా విహార యాత్రలకు వెళ్లండి. ఈ యాత్రతో మీకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సాహించే వ్యక్తులతో బాగా మాట్లాడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది.  
కలిసివచ్చే రంగు : ఊదా

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం మీకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీకు ఇష్టమైన తత్వశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : లేత గోధుమ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మలుచుకునే సమయం ఇదే. మీపై మీకున్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన ప్రమాణాలు, మీకు మీరే ఏర్పరచుకున్న నియమాలను గుర్తు తెచ్చుకొని పనిచేయండి. పెద్దలను గౌరవించడం మరవకండి. వారి ఆశీస్సులు మీకు మరింత శక్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. ఇది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోమవారాలు మీకు బాగా కలిసివస్తాయి. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి. 
కలిసివచ్చే రంగు : నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసే మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. జీవితాన్ని ఎప్పట్లానే బాగా ఆస్వాదించండి. వృత్తిపరంగా మీకు గొప్ప గుర్తింపు దక్కుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి పని కూడా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అనవసర ఖర్చులు పెరిగిపోవడాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనవసర ఖర్చులు చేస్తారు. ఇదే విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు కూడా. మీ గమ్యం వైపుకు సరైన అడుగులు వేయాల్సిన సమయమిది. మీకు ఉపకరించే కొన్ని పనుల నుంచి మీకై మీరే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మీకేం కావాలో నిర్ణయించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లాఫింగ్‌ బుద్ధను ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఆదివారాలు మీకు బాగా కలిసివస్తాయి. ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో మాట్లాడి ఎక్కువ ఉత్సాహంగా ఈవారాన్ని గడుపుతారు.
కలిసివచ్చే రంగు : బూడిద 
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement