వారఫలాలు 19/11/2017 - 25/11/2017 | varaphalalu in this week | Sakshi
Sakshi News home page

వారఫలాలు 19/11/2017 - 25/11/2017

Published Sun, Nov 19 2017 1:58 AM | Last Updated on Sun, Nov 19 2017 1:58 AM

varaphalalu in this week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కాస్త అసంతృప్తి. వారం చివరిలో విందువినోదాలు. కార్యజయం. గులాబి, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఉడికించిన ఉలవలు ఆవుకు పెట్టండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఇంటాబయటా అనుకూలస్థితి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.  వాహనయోగం. నూతన పరిచయాలు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అంచనాలు నిజమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశునికి అభిషేకం చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కానీ, అవి నెమ్మదిగా సర్దుకుంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు నిదానంగా కొనసాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ఉద్యోగలాభం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కష్టపడ్డా ఫలితం కనిపించనిస్థితి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత అసంతృప్తి చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చే యించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు.  ఇంటాబయటా ఒత్తిళ్లు పెరుగవచ్చు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొంత వరకూ గట్టెక్కుతారు. ఆర్థికపరమైన హామీలు వద్దు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు ఉంటాయి. కళాకారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు పులిహోర నివేదించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. నైపుణ్యాన్ని చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. గులాబి, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. తీర్థయాత్రలు చేస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం, పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలలో మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన బాకీలు కూడా అందుతాయి. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి అభినందనలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌కు పూజలు చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మీ శక్తియుక్తులు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల ప్రజ్ఞాపాటవాలు వెలుగుచూస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు అనుకూలత. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ వద్ద మూడు కొబ్బరికాయలు కొట్టండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. మీపై ప్రేమాభిమానాలు చూపే వారు పెరుగుతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఎరుపు, లేత గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో
19 నవంబర్‌ నుంచి 25 నవంబర్, 2017 వరకు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కొత్త పనులు మొదలుపెడతారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. ఆత్మవిశ్వాసంతో విజయంపై ధీమాగా ఉంటూ పనిచేయండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ కొద్దిరోజులు గడపండి. ఇందుకోసం ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ప్రతిభను కనబర్చుకోవడానికి ఇదే మంచి సమయం.
కలిసివచ్చే
రంగు : గోధుమ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ ఆలోచనలు కొత్త రూపు సంతరించుకుంటాయి. కొద్దికాలంగా మీకు దూరంగా ఉంటూ వచ్చిన వారంతా మళ్లీ దగ్గరవుతారు. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఊహించని మార్పు చోటుచేసుకోబోతోంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఈ మార్పు సంభవిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఎప్పట్నుంచో పంచుకోవాలనుకుంటున్న విషయాలన్నీ పంచుకోండి.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ప్రపంచంలోని కష్టాలన్నీ మీకే ఉన్నాయని బాధపడే మీ ఆలోచనా విధానం మారాల్సి ఉంది. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండి. ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఈ సమయంలో ప్రశాంతంగా మీ గమ్యం ఏంటో ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. అయితే డబ్బు సంపాదించాలన్న ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టే మీ స్వభావం కూడా మంచిది కాదు. మీ జీవితాన్ని మలుపుతిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ప్రేమ జీవితం కొత్తగా మొదలవుతుంది.
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీకు రానున్నదంతా మంచి కాలమే. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొత్త పనులు మొదలుపెడతారు. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ఎప్పట్నుంచో కోరుకుంటోన్న విజయం కూడా దగ్గరలో ఉంది. అందుకు మీ శక్తినంతా వెచ్చించి పనిచేయాల్సి ఉంటుందని నమ్మండి. మీ ఒంటరి జీవితం కూడా ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కలిసివచ్చే రంగు : గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ వైపే ఉంటుందన్న విషయాన్ని బలంగా నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న పనులన్నీ పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడతాయి. మీదైన ఆలోచనను ప్రపంచానికి చెప్పాలనుకుంటారు.
కలిసివచ్చే రంగు : నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ప్రేమ జీవితంలో ఓ కీలక మార్పు చోటుచేసుకుంటుంది. ఒత్తిడిలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ భవిష్యత్తుకు ఏది మంచిదో ఆ వైపే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వృత్తి జీవితం బాగుంటుంది. మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడంలో జాగ్రత్త చూపాల్సిన సమయం ఇదే. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సమయపాలన లేకపోవడం మిమ్మల్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటుందని గ్రహించండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ప్రస్తుతం మీ జీవితం ఒక దగ్గర ఎటూ కదలకుండా ఆగిపోయింది. అందుకు కారణాలేంటన్న దానిపై ఆలోచన పెట్టండి. మీ ఆలోచనా విధానం మారాల్సిన సమయం కూడా ఇదే. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల్ని దూరం చేసుకోవద్దు.
కలిసివచ్చే రంగు : తెలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అన్నింటికీ ఎదురెళ్లే మీ ఆలోచనా విధానమే మీ ఆయుధం. ఈ ఆలోచనా విధానం వల్లే మీరు ఊహించని ఓ అద్భుతమైన అవకాశం తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించి ముందుకు వెళ్లండి. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. మిమ్మల్ని తక్కువ చేస్తూ వచ్చిన వారికి సరైన సమాధానం ఇచ్చేలా ఓ విజయం మీకు చేరువవుతోంది.
కలిసివచ్చే రంగు : గులాబి

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ వృత్తిరీత్యా మీ పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. అది మీ వృత్తి జీవితంలో చోటు చోసుకునే మార్పే అయినా ప్రభావం అన్నింటిపై ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా అంతా మంచికే అనుకోండి.
కలిసివచ్చే రంగు : గోధుమ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కొద్దిరోజులు ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈ ఆలోచనే మీకు కొందరిని దూరం చేస్తుంది. జీవితాశయం వైపుకు అడుగులు ఎలా వేయాలా అని ఆలోచిస్తారు. అన్నింటికీ సిద్ధమయ్యాకే ఆ వైపు అడుగులు వేస్తే మంచిది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత కోసం మీ జీవిత భాగస్వామితో ఏదైనా విహారయాత్రకు వెళ్లండి.
కలిసివచ్చే రంగు : నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఏ పని చేసినా నిరుత్సాహంగా ఉండే మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఒక దారిని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్లండి. పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వృత్తి జీవితంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు బాగా ఇష్టమైన వ్యక్తితో మీ జీవితానికి సరిపడే ఆనందాన్నిచ్చే సాయంత్రాలను గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : ఊదా

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతా గందరగోళంగా ఉంటుంది. మీ పై స్థాయి వ్యక్తులతో గొడవ సూచనలు కనిపిస్తున్నాయి. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ జీవితంలో కూడా ఒడిదుడుకులు తప్పవు. తొందరగా నిర్ణయం తీసుకునే మీ స్వభావం మీకు ఈ కష ్టసమయంలోనూ బాగా పనికొస్తుంది. జరగవని తెలిసిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ చుట్టూ మిమ్మల్ని తక్కువ చేసే మనుషులు ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి.
కలిసివచ్చే రంగు : నీలం
ఇన్సియా టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement