మే 9 నుంచి మే 15 వరకు | Tarot Analyst | Sakshi
Sakshi News home page

మే 9 నుంచి మే 15 వరకు

Published Sat, May 9 2015 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

మే 9 నుంచి మే 15 వరకు

మే 9 నుంచి మే 15 వరకు

టారో బాణి
 
ఏరిస్  (మార్చి 21- ఏప్రిల్ 20)

విదేశాల నుంచి మీరెంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఓ శుభవార్త అందుతుంది. అసంపూర్తిగా ఉండిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మీ విజయాలను చూసి కొందరు అసూయ పడవచ్చు. అది మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్‌ని నింపుతుంది. ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి క్రిస్టల్స్‌ని ధరించండి. కలసివచ్చే రంగు: నలుపు
 
 టారస్  (ఏప్రిల్ 21-మే 20)

అవకాశాలు విరివిగా లభిస్తాయి. దేన్ని ఎంచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంపికలో జాగ్రత్త వహించండి. లక్ష్యాలను అందుకోవడానికి మీకు ఇది తగిన సమయం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. అవివాహితులకు వివాహ సూచన. కలసివచ్చే రంగు: క్రీమ్ వైట్
 
జెమిని  (మే 21-జూన్ 21)

అన్ని విషయాల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. బాధపెట్టే బంధాలను బలవంతంగా భరించకుండా ఓ మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. తద్వారా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. కలసివచ్చే రంగు: బంగారువర్ణం
 
క్యాన్సర్  (జూన్22-జూలై 23)

ఈ వారంలో మీ జీవితంలోను, ఇంటిలోను, ఆరోగ్యంలోనూ కూడా ఊహించని మార్పులు వస్తాయి. కాస్త ఇబ్బందిపెట్టే ఈ మార్పులకు మీరు సిద్ధంగా ఉండండి. ఆర్థికపరంగా ఏర్పడిన వెలితిని పూడ్చటానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. అప్పులు మాత్రం చేయకండి. దిగులుగా అనిపించినా కుంగిపోకండి. త్వరలో మంచి రోజులొస్తాయి. కలసివచ్చే రంగు: వెండి రంగు
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ప్రేమలోని మాధుర్యాన్ని మీకు రుచి చూపిస్తారు. వృత్తిపరంగా కూడా ఊహించని మార్పులు కలుగుతాయి. ఇబ్బందులొచ్చినా మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. అనుకోని సహాయం అందుతుంది. వ్యాపారానికి పెట్టుబడి సమకూరుతుంది. ఆ తర్వాత మీ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. కలసివచ్చే రంగు: పీచ్
 
విర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)

ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అవకాశం మళ్లీ దొరకదు కాబట్టి జారవిడుచుకోవద్దు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎంతోకాలంగా మీకు ఉన్న కొన్ని అలవాట్లు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తాయి. అధిగమించడానికి ధ్యానం చేయండి. ఆర్యోగంపై శ్రద్ధ అవసరం. ఒక వ్యక్తి మనసును మీరు గెల్చుకుంటారు. కలసివచ్చే రంగు: బ్రౌన్
 
 లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

మీ జీవితంలో ఓ పెనుమార్పు సంభవించబోతోంది. ఆ మార్పు మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. బంధాలు కొద్దిగా బలహీనపడతాయి. జరిగేవాటిని మీరు ఆపలేరు కాబట్టి వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించడం మంచిది. అన్నీ పాజిటివ్‌గా తీసుకోవడం నేర్చుకోండి. అప్పుడే మనశ్శాంతిగా ఉండగలరు. కలసివచ్చే రంగు: వంకాయ రంగు
 
స్కార్పియో  (అక్టోబర్ 24-నవంబర్ 22)

ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఎందుకంటే మీరు త్వరలోనే ఓ కొత్త వ్యాపారం మొదలు పెట్టడమో, ప్రాజెక్టును చేపట్టడమో జరుగుతుందని టారో కార్డ్స్ సూచిస్తున్నాయి. అది సాధించాలంటే మీ పనిలో ఎవరైనా ఒక మహిళకు భాగస్వామ్యం కల్పించండి. తప్పక విజయం సాధిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కలసివచ్చే రంగు: లేత ఊదారంగు
 
 
 సగిటేరియస్   (నవంబర్23-డిసెంబర్ 21)

ఇంతవరకూ మెల్లగా సాగిన మీ జీవితం ఒక్కసారిగా పరుగందు కుంటుంది. ఆ వేగంలో ఎత్తులూ ఎక్కుతారు. పల్లాలకూ పడతారు. కానీ అన్నిటినీ దాటుకుంటూ అద్భుతంగా ముందుకు పోతారు. ఇది మీకు ఎంతో శుభసమయం కాబట్టి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా స్వీకరించండి. విందులు చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్లే అవకాశమూ ఉంది. కలసివచ్చే రంగు: ఇండిగో
 
 క్యాప్రికాన్  (డిసెంబర్ 22-జనవరి 20)

ఈవారం మీరు వెలిగిపోతారు. ప్రమోషన్ రావడం కానీ, జీతం పెరగడం కానీ జరగవచ్చు. వ్యాపారాలు చేసేవాళ్లకు అవకాశాలు అంతగా రాకపోయినా టెన్షన్ పడక్కర్లేదు. త్వరలోనే మీరు ఆర్థికంగా బాగా పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారం చివర్లో అనుకోకుండా సంభవించే సంఘటనలు కాస్త కన్‌ఫ్యూజన్‌కు గురి చేయవచ్చు. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు
 
అక్వేరియస్  (జనవరి 21-ఫిబ్రవరి 19)

ఈవారం ఎన్ని సవాళ్లు ఎదురైనా కానీ వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. మీకు నచ్చిన రంగంలో దూసుకుపోతారు. ఆర్థిక పురోగతి వైపుగా ప్రయాణిస్తారు. వారం చివర్లో కాస్త ఖర్చులు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రపోజల్స్ వస్తే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మీకు తగిన వ్యక్తి ఎవరో తెలుసుకుని ఓకే చెప్పండి. కలసివచ్చే రంగు: పీచ్
 
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)

ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవారం మీ ఆలోచనలు, నోటిమాటల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచించినంత మాత్రాన సరిపోదు. మాట కూడా పాజిటివ్‌గా ఉండాలని గుర్తు పెట్టుకోండి. నోటి నుంచి నో అన్న మాట రాకుండా చూసుకోండి. అదే మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. విజయాలకు చేరువ చేస్తుంది. కలసివచ్చే రంగు: నీలం
 
 
ఇన్సియా కె.  టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
 
 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

 అన్ని రంగాల వారికి వ్యతిరేక ఫలితాలుండవు. అయితే అభివృద్ధి కూడా ఉండదు. విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ ఉన్నా తగిన సమయం లేక, వ్యవసాయదారులకి పెట్టుబడులున్నా తగిన సౌకర్యాలు లేక... ఇతర రంగాల వారికి కూడా పెద్దగా కలిసొచ్చే తీరు కనిపించకపోవచ్చు. దిగులు చెందకుండా లోపాన్ని గమనించుకొని మరింత ప్రయత్నాన్ని చేసుకోండి. కలసివచ్చేరోజు: ఆదివారం
 
 టారస్  (ఏప్రిల్ 21-మే 20)

 మొహమాటం కారణంగా నష్టపోవచ్చు. అనవసర ప్రయాణాలు, వ్యర్థమైన వాగ్వివాదాలు, ప్రయోజనం లేని చదువులకై ప్రయత్నాలు చేసే అవకాశం బాగా ఉంది. నిర్మాణరంగం వారికి నిరుత్సాహకరంగా, వినోదరంగం వారికి కొంత ప్రతికూలంగానూ ఉండొచ్చు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రయాణాలు చేయడం వల్ల శారీరక, మానసిక స్థైర్యం దెబ్బతినవచ్చు. కలసివచ్చేరోజు: సోమవారం
 
జెమిని  (మే 21-జూన్ 21)


అపరిచితుల  వల్ల నష్టపోయే అవకాశం ఉంది, అత్యాశ కారణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ముఖ్యంగా వాగ్దానం తప్పక విఫలమవుతుంది. కాబట్టి వీలైనంత వరకూ జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ ఏ హామీని ఇవ్వవద్దు. సామాన్య ధోరణిలో అన్నమాట వజ్రాయుధంలా ముందునాటికి మారచ్చునని గ్రహించుకోవాలి. కలసివచ్చేరోజు: బుధవారం
 
 
క్యాన్సర్  (జూన్22-జూలై 23)
 
 స్థిరమైన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ పనులు వాయిదా పడుతూ పడుతూ మొత్తానికి వారాంతానికి ఓ కొలిక్కి రావచ్చు. పొరపాటున కూడా ఎవరికీ రుణం ఇచ్చి మోసపోవద్దు. సొమ్ము తిరిగిరాదు సరికదా శత్రుత్వం ఏర్పడవచ్చు. కాబట్టి ఆర్థికంగా వీలైనంత మెలకువతో ఉండాలి. కలసివచ్చేరోజు: శనివారం
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

 ఎక్కువ సమయం శ్రమ చేస్తూ ఆదాయం మాత్రం తక్కువ పొందుతారు. అయితే ఈ శ్రమ మరికొద్ది కాలం పిమ్మట సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో జరిగిన తప్పుల్ని ఆత్మపరీక్ష చేసుకొని గమనించుకోగలుగుతారు. మీకు మీరే దిశానిర్దేశం చేసుకోగల సమర్థతను సంపాదించుకుంటారు. పదిమందిలో మంచి పేరును పొందుతారు. కలసివచ్చేరోజు: గురువారం
 
విర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)

 పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన కలిగి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రణాళికాలను ఏర్పర్చుకొని నమ్మకమైన వ్యక్తులతో ముందుకు సాగుతారు. స్థిరమైన ఆస్తుల్ని అమ్మదలచినా కూడా వెనకడుగు వేయడం సరైన నిర్ణయమే. ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలను పాటించండి. వ్యాధిభయం, ప్రాణభయం లేదు కానీ, అప్రమత్తతతో వ్యవహరించాలి. కలసివచ్చేరోజు: బుధవారం
 
 లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 ఏ పని ప్రారంభించినా ఒకటికి రెండు మార్లు ఆలోచించడం అవసరం. పెద్దలను, అనుభవజ్ఞులను సంప్రదించాల్సిన సమయం ఇది. వ్యతిరేక ధోరణుల్ని విడనాడి సానుకూలంగా ఆలోచిస్తే మానసిక ఆందోళన ఉండదు. తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టిని పూర్తిగా మానుకోండి. ఉద్యోగస్థులు శ్రద్ధతో లేని పక్షంలో వ్యతిరేక ఫలితాలనీయవచ్చు. కలసివచ్చేరోజు: మంగళవారం
 
 స్కార్పియో  (అక్టోబర్ 24-నవంబర్ 22)

 అనవసర కోపం, పట్టుదల, తొందరతనపు మాట, జరిగిన విషయాలనే తవ్వుకోవడం, మాటకి మాట చెప్పడం వల్ల మీ వ్యాపారం, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పరిశ్రమల రంగంలో ఉన్న వారు అపరిచితుల్ని ఎంత దూరంలో ఉంచాలో, ఎంతగా మాట్లాడాలో అలా వ్యవహరించడం చాలా అవసరం. కలసివచ్చేరోజు: శుక్రవారం
 
 సగిటేరియస్   (నవంబర్23-డిసెంబర్ 21)


 అన్నీ అనుకూలంగానే కనిపిస్తాయిగాని అవి అన్నీ కూడా కనిపించినంత సులభమైన అంశాలు కావని గ్రహించుకోవాలి. భార్యాభర్తల మధ్య అవగాహన అతి ముఖ్యమని గమనించుకొని తగు మాత్రపు గుంభనతో ఉండాలి. వాహనాల విషయంలో, యంత్రపరికరాల విషయంలో పూర్తి భద్రత పాటించండి. ధనాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేసుకోవాలి. కలసివచ్చేరోజు: గురువారం
 
 క్యాప్రికాన్  (డిసెంబర్ 22-జనవరి 20)

 గడచిన నెల మొత్తం ఎలా స్తబ్దతతో ఉందో అదే తీరుగా ఈ వారం కూడా ఉంటుంది. పెద్దగా ఆదాయం ఉండదు. శుభవార్తకోసం చూసే ఎదురు చూపుతో ఈ వారం గడిచిపోతుంది. స్థలం మార్పు చేయకుండా, భాగస్వాములతో విరోధించకుండా మరింత సంపాదించాలనే దృష్టికి పోకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ వారం సంతానానికి అవకాశం ఉంది. కలసివచ్చేరోజు: గురువారం
 
అక్వేరియస్  (జనవరి 21-ఫిబ్రవరి 19)
 
 మానసికంగా అధైర్యంతో ఉన్న పనుల్ని విజయవంతంగా సాధించి బయటి కొస్తారు. మోసపోయే పరిస్థితుల్ని గమనించుకొని తప్పించుకోగలుగుతారు. పరుల విషయాలకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. శత్రువుల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లండి. సమయ నియమాన్ని పాటిస్తూ పనుల్ని పూర్తి చేసుకుంటే ఈవారం మీకు బాగా కలిసివస్తుంది. కలసివచ్చేరోజు: సోమవారం
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)


  ‘ఏ పనులూ పూర్తి కావడం లేదు-అలాగని ప్రారంభం కాకుండానే లేవు’ అనే నిరుత్సాహంతో ఉండొచ్చు. అయితే శాస్త్రం ఇక్కడ చెప్పేదొక్కటే ‘వ్యతిరేక ఫలితం కనిపించక పోవడమే అను కూల ఫలితం’ అని. కుటుంబంలో శుభకార్యం జరగవచ్చు. కుటుంబానికి వస్తు వాహనాలు కొనుగోలు చేయ వచ్చు. పనులు నిరాటంకంగా సాగడం కోసం మరో వ్యక్తిని సహాయం కోరండి. కలసివచ్చేరోజు: శనివారం
 
 
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement