Tarot Analyst
-
టారో
16 డిసెంబర్ నుంచి 22 డిసెంబర్ 2018 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పని ఒత్తిడి నుంచి కొంత విరామం దొరుకుతుంది. ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉంటాయి. కొందరికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. మీ నిజాయితీ, నిబద్ధతలే మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళతాయి. అదనపు బాధ్యతలను స్వీకరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. జీవితాన్ని మలుపు తిప్పే మార్పులు ఉంటాయి. కుటుంబంపై శ్రద్ధ పెంచాల్సిన పరిస్థితులు ఉంటాయి. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ప్రియతముల మధ్య అనురాగం గాఢమవుతుంది. లక్కీ కలర్: గులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తినా సంయమనం పాటించడమే మంచిది. వివాదాలకు పోకుండా కొంత లౌక్యం పాటిస్తే సమస్యల నుంచి గట్టెక్కే సూచనలు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి అనుకోని కానుకలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. సృజనాత్మక రంగాల్లోని వారికి ఉన్నతికి దారితీసే మంచి అవకాశాలు దక్కుతాయి. ఏకాంతంలో ఆత్మావలోకనం చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఇతరులపై మీరు పెట్టుకున్న అంచనాలు వాస్తవమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిలోనే ముందుకు సాగండి. అనవసరంగా ఇతరులను మెప్పించే ప్రయత్నాలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. చికాకు పెట్టే మనుషులు తారసపడే సూచనలు ఉన్నాయి. ఒత్తిడి కారణంగా అలసట చెందుతారు. ఏకాగ్రత క్షీణిస్తుంది. పని మీద విరక్తి పెంచుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఊహించని పోటీ ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) భవిష్యత్ అవసరాల కోసం వనరులను సమకూర్చుకుంటారు. ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేసుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. తలపెట్టిన కొన్ని పనుల్లో జాప్యం తప్పకపోవచ్చు. ఇదివరకటి సృజనాత్మక ఆలోచనలను తాజాగా ఆచరణలో పెడతారు. సృజనాత్మక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెంపొందుతాయి. మీ బృందంలో చేర్చుకోదలచిన వ్యక్తులను ఆచి తూచి ఎంపిక చేసుకుంటారు. కొత్తగా ప్రేమలో పడతారు. లక్కీ కలర్: పసుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) జీవన ప్రస్థానంలో మరింత ముందుకు సాగుతారు. సుదూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. లాభసాటి కొత్త వ్యాపారావకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. అదనపు పనిభారాన్ని తగ్గించుకోవడం మంచిది. బాధ్యతలను ఇతరులతోనూ పంచుకోవడమే మంచిది. ప్రేమికుల మధ్య అభద్రతాభావం తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: బూడిద రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) సుస్థిరత కోసం, సురక్షిత వాతావరణం కోసం మీరు సాగించే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో నిలకడగానే కొనసాగుతూ పురోగతి సాధిస్తారు. త్యాగాలు సార్థకమైన సందర్భాలు ఉద్విగ్నతను కలిగిస్తాయి. మీకు గల ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలు, సామాజిక సంబంధాలు ఉపయోగంలోకి వస్తాయి. భారీ లక్ష్యాల సాధనకు మాత్రం కొంత నిరీక్షణ తప్పకపోవచ్చు. ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరమవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. గురువులను, పాత మిత్రులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) కొంత విశ్రాంతి తర్వాత నూతనోత్తేజాన్ని సంతరించుకుంటారు. సానుకూలమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. ఉద్యోగులు కొత్త పనులేవీ తలకెత్తుకోకుండా జరుగుతున్న తతంగాన్ని గమనిస్తూ ఉండటమే మంచిది. కొత్త మిత్రబృందం ఏర్పడే సూచనలు ఉన్నాయి. భావసారూప్యత గల వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిస్తారు. అర్ధంతరంగా నిలిపివేసిన పనులను పూర్తి చేస్తారు. ప్రేమికులతో కలసి సుదూర విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. సత్ఫలితాలను సాధించగలరు. వృత్తి ఉద్యోగాల్లో కోరుకున్న స్థానానికి చేరుకోగలుగుతారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. ఇతరమైన పనుల కంటే కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. వివాదాస్పద పరిస్థితుల నుంచి లౌక్యంగా బయటపడతారు. లక్ష్య సాధన వైపు నుంచి దృష్టి మళ్లించే పరిస్థితులు ఏర్పడతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేస్తారు. స్థిరాస్తుల కొనుగోలుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: జేగురు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పని మీద ఎంత వ్యామోహం ఉన్నా, కొంత విశ్రాంతి అవసరమనే విషయాన్ని గుర్తిస్తారు. మిత్రులతో కలసి ఆటవిడుపుగా విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో ముందంజలో ఉంటారు. అసూయాపరుల కారణంగా ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. మిత్రుల్లో ఒకరికి ఆర్థిక సాయం చేయడంలో అమిత ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలిక వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రేమికుల మధ్య స్తబ్దత నెలకొంటుంది. ఇంటి అలంకరణల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: ముదురు గోధుమరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) విందు వినోదాలతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులను కలుసుకుంటారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. పని ప్రదేశంలోని మిత్రులతో ఆలోచనలను పంచుకుంటారు. వ్యాపార పారిశ్రామిక రంగంలో వారికి లాభాలు నిదానంగా, నిలకడగా చేతికందుతాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఎన్నడూ లేనంతగా ప్రేమానురాగాలు లభిస్తాయి. ఒంటరి వారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: సూర్యకాంతి రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు బాగానే ఉంటాయి. అయితే, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కోసం కుటుంబాన్ని పట్టించుకోలేని పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాల కోసం ప్రేమికులతో ఆర్థిక భాగస్వామ్యం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కలలను సాకారం చేసుకుంటారు. ప్రగాఢ వాంఛల్లో ఒకటి నెరవేరుతుంది. నిజాయితీ, నిర్భీకతతో పని ప్రదేశంలో మీదైన ముద్ర వేస్తారు. కళాకారులకు గుర్తింపు తెచ్చిపెట్టగల అవకాశాలు అందివస్తాయి. సమస్యలు వాటంతట అవే సద్దుమణిగి పోతాయి. దైవానుగ్రహం బాగుంది. లక్కీ కలర్: బంగారు రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఒక విచిత్రమైన సమాచారం ద్వారా ఆర్థిక లాభం పొందే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి దశ తిరుగుతుంది. చిరకాల నిబద్ధతకు తగిన గుర్తింపు లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త విద్యలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కళాసాధన వైపు దృష్టి సారిస్తారు. జీవితంలో ఎదగాలంటే అనుబంధాల కంటే ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యమని గుర్తిస్తారు. అనుబంధాలకు బందీగా ఉండే బలహీనతను అధిగమించలేకపోతే గొప్ప అవకాశాన్ని కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: లేత గులాబి -
టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వారం మొదట్నుంచీ ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. పరిస్థితులు కూడా అన్నీ ఒక్కసారే మీపై దాడి చేస్తున్నట్లుగా మారిపోతాయి. ప్రేమ జీవితంలో చికాకులు వచ్చిపడతాయి. ఇష్టపడ్డ వ్యక్తి మీకు దూరమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్‌పై ధీమాతో ముందుకు వెళ్లండి. జీవితంలో అపజయాలు సహజం అన్న విషయం గుర్తించండి. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటుంది. కలిసివచ్చే రంగు : తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వృత్తి జీవితంలో మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గుర్తింపు ఈవారం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే బాగా మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రేమ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నీలం మిథునం (మే 21 – జూన్ 20) మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టు మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. విజయంపై ధీమాతో పనిచేస్తారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తారు. ఓరకంగా ఈ వ్యక్తి మీలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతారనే చెప్పాలి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ఎరుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వల్లే ముందుకు కదల్లేకపోతున్నారన్న విషయాన్ని గ్రహిస్తారు. చిత్తశుద్ధితో జీవితాశయం వైపుకు అడుగులు వేయాలన్న ఆలోచన చేస్తారు. మీ ఆలోచనకు అండగా నిలబడ్డట్టుగా పరిస్థితులన్నీ మీకు అనుకూలిస్తాయి. వృత్తిజీవితంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ కీలక విషయంలో తప్పక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వచ్చి, ఇప్పటికే చాలా సమయం వృథా చేశారన్న విషయం గ్రహించండి. మీ చుట్టూ మిమ్మల్ని తప్పటడుగులు వేయించే వ్యక్తులు ఉన్నారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఈవారమంతా సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితమంతా మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. నెలాఖర్లో ఉద్యోగంలో మార్పు కనిపిస్తోంది. కొత్త అవకాశాలు చుట్టుముడతాయి. మీ స్థాయికి తగ్గ అవకాశాన్నే అందిపుచ్చుకోండి. అలాగే మీ ప్రతిభను చాటుకునే అవకాశం కూడా దక్కుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఇష్టమైన వారికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ వస్తున్న ప్రతికూల పరిస్థితులు మరికొంత కాలం అలాగే ఉంటాయి. వీటన్నింటినీ దాటాక ఊహించని విజయం ఒకటి మీ సొంతమవుతుంది. ఆ విషయాన్ని బలంగా నమ్మి ముందుకు వెళ్లండి. తరచూ కోపం తెచ్చుకోవడం వల్ల కొన్ని చికాకులు మీకై మీరు కొని తెచ్చుకుంటున్నారని గ్రహించండి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను ప్రశాంతంగా పూర్తిచేయడం అలవర్చుకోండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) జీవితమంతా ఒకేదగ్గర ఆగిపోయి, ముందుకు కదలడంలేదన్న ఆలోచనల్లో పడిపోతారు. ఈ ఆలోచనలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఈ ఆలోచనల నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని గ్రహించండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మొదట్లో అన్నీ అడ్డంకులే ఎదురైనా విజయంపై ధీమాతో పనిచేయండి. ప్రేమజీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలాఖర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈవారం మీకు అంతా కలిసివస్తుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయం అన్న విషయం గ్రహిస్తారు. ఒక కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఆర్థికపరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఇల్లు కొనుగోలు చేస్తారు. మీకిష్టమైన వ్యక్తితో కలిసి విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారం కొన్ని అనుకోని పరిస్థితులు తలెత్తుతాయి. చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోవడం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. అయితే ఇవన్నీ దాటుకొని వచ్చి నిలబడితేనే విజయం అని నమ్మండి. మీ ఆలోచనా విధానం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. చదవడం, వ్యాయామం చేయడం లాంటివి ఇష్టాలుగా మలచుకోండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొద్దిరోజులు ఆ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వెయ్యడమే మంచిది. అన్నీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అనుకునేంతలో ఒకటేదో ఇబ్బంది పెట్టేది వచ్చి పడుతుంది. ఇవన్నీ మీ ఓపికను ప్రశ్నించేవే! ఒక కొత్త వ్యక్తి రాక మీ జీవితం మొత్తాన్నీ మార్చేస్తుంది. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ చుట్టూ ఉన్నవారి బాగోగులు చూడడంలో ముందుండే మీ స్వభావమే మీ బలమని నమ్మండి. ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అన్నివిధాలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈవారంలోనే ఓ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రానున్న రోజులంతా సంతోషంగా గడుపుతారు. వృత్తిజీవితం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : పసుపు -
టారో : 26 నవంబర్ నుంచి 2 డిసెంబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారమంతా మీకు శుభ సూచకంగానే కనిపిస్తోంది. వృత్తి జీవితంలో ఓ కీలక మార్పు సంభవిస్తుంది. ఆ మార్పును ధైర్యంగా స్వీకరించండి. చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కునే మీ స్వభావం మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకువెళుతుందని నమ్మండి. ప్రేమ విషయం కొంత కలవరపెడుతుంది. ఇక్కడే ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇల్లు మారే సూచనలున్నాయి. ఇది మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. కలిసివచ్చే రంగు : నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఈవారమంతా ఉత్సాహంగా పనిచేస్తారు. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది మీలో ఒక కొత్త ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు ఆ వ్యక్తిని మీకు మరింత దగ్గర చేస్తుంది. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న ఒక పనిని ఇప్పుడు మొదలుపెడతారు. అందుకు ఇదే సరైన సమయం కూడా. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం అని గ్రహించండి. కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులూ ఉన్నా అన్నీ ఎదుర్కొని ముందుకెళతారు. కలిసివచ్చే రంగు : గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. చాలాకాలంగా పడుతోన్న కష్టాలకు ఇక స్వస్తి పలికేందుకే అన్నట్టుగా మీకు రావాల్సిన డబ్బంతా ఒక్కసారే అందుతుంది. కొత్త అవకాశాలు వచ్చిపడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటిని మాత్రమే ఎంచుకొని ముందుకెళ్లండి. ఒక విషయం గురించి నిరంతరం ఆలోచిస్తూ, కొన్నింట్లో వెనకబడతారు. ఆ విషయం మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. ప్రేమ జీవితం సాఫీగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని మీకై మీరే చిక్కుల్లో పడతారు. ప్రశాంతంగా అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా ఆ విషయంపై పూర్తి నిర్ణయం తీసుకునే ఆలోచన లేకుంటే, మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. బరువు తగ్గాలనుకుంటున్నా ఇదే సరైన సమయం. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లైతే కాస్త ఆలోచించండి. కలిసివచ్చే రంగు : లేత గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనని గ్రహించండి. కొత్త ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముడతాయి. కొత్త అవకాశాలు కూడా ఈ ఆలోచనల వల్లే దక్కుతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబర్చాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పట్నుంచో మొదలుపెట్టాలనుకొని ఆపేసిన పనులను ఇప్పటికైనా మొదలుపెట్టండి. మీకు ఇష్టమైన ఒక వ్యక్తితో వాగ్వాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ప్రేమ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఎక్కువ ఆలోచించకుండా, మీకు సరైన అవకాశాలుగా అవి కనిపిస్తే, వాటిని అందిపుచ్చుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోండి. మీ ఆలోచనా విధానంలోనూ కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అందుకు ఇదే సరైన సమయం కూడా అని గ్రహించండి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఈ వారమంతా మీరు ఉల్లాసంగా గడుపుతారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. మీ ఆలోచనలు మళ్లీ ఉత్తేజమవ్వడానికి ఈ యాత్ర బాగా ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించండి. వారితో జీవితాంతం గుర్తుపెట్టుకొనే ఆనందకర సమయాలను గడుపుతారు. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలు మెల్లిగా ఓ కొలిక్కి వచ్చేస్తాయి. కలిసివచ్చే రంగు : గోధుమ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న ఓ విజయం అతి దగ్గరలో ఉంది. ఈ విజయంతో మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. జీవితాన్ని మీదైన ఆలోచనా విధానంతోనే స్వీకరిస్తే, మీకు దక్కేదంతా సంతోషమేనన్న విషయాన్ని బలంగా నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్ద మొత్తం పెట్టుబడులు పెట్టే ఆలోచనలు ఏమైనా ఉంటే ప్రస్తుతానికి అది మానుకోండి. మీ సంతోషం కోసం మీకేం అవసరమన్న విషయాన్ని సరిగ్గా అంచనా వేసుకోండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ జీవితం ఇప్పుడు సరైన దిశలోనే వెళుతోంది. కొన్ని ఊహించని అవకాశాలు మీ గమ్యాన్ని మరింత దగ్గర చేస్తాయి. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ వదులుకోకండి. ఆ ఆలోచనా విధానంతోనే అందరికీ దగ్గరవుతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. అయితే ఎక్కువగా ఊహా ప్రపంచంలో విహరించే మీ స్వభావం మారాల్సిన అవసరం ఉంది. పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీరు ఎంతో ఇష్టంగా చేపట్టిన ఓ ముఖ్యమైన పని త్వరలోనే విజయవంతంగా పూర్తవుతుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. ఏదైనా విహారయాత్రకు వెళ్లే ఆలోచన ఉన్నట్లైతే ఇదే సరైన సమయం. మీ ఆలోచనా విధానం మిమ్మల్ని ధైర్యంగా ముందడుగు వేయించేలానే ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి. మీ చుట్టూ ఉండే వ్యక్తులతోనే కొన్ని అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అదృష్టం మీ వెన్నంటే ఉంటుందన్న విషయం గుర్తుంచుకోండి. కొన్ని ఊహించని అవకాశాలు మీ తలుపు తడతాయి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకొని ముందడుగు వేయండి. వృత్తి జీవితంలో ఓ కీలక మార్పుకు సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న నెలలో పదో రోజు ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం మీ జీవితాన్నే మలుపు తిప్పేదన్న విషయం గుర్తుంచుకోండి. కలిసివచ్చే రంగు : పీచ్ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ జీవితంలో ఊహించని ఓ మార్పు చోటుచేసుకోబోతోంది. ఆ మార్పుకు సిద్ధంగా ఉండండి. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయించే ఆయుధమని నమ్మండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మరి కొద్దిరోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్న విషయాన్ని నమ్మండి. ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం ఆలోచించకుండా మాత్రం తీసుకోవద్దు. కలిసివచ్చే రంగు : గులాబి -
టారో : 12 నవంబర్ నుంచి 18 నవంబర్, 2017 వరకు
మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ జీవితమంతా కొత్తగా మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది. సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. ధైర్యంగా ఆ సవాళ్లను ఎదుర్కోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విజయం మీకు దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. నమ్మకమే మీ ఆయుధమన్న విషయాన్ని మరవకండి. సరైన సమయంలో మీ ప్రతిభను నిరూపించుకొని ముందుకెళ్లండి. కలిసివచ్చే రంగు : నీలం వృషభం (ఏప్రిల్ 20 మే 20) ఎప్పట్లానే ఈ వారమంతా ప్రశాంతంగా మీరు కోరుకున్న విధంగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఓ గొప్ప వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. ఆ వార్త మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పీచ్ మిథునం (మే 21 జూన్ 20) అందరినీ కలుపుకుపోయే మీ శైలే మిమ్మల్ని అందరిలోకి ప్రత్యేకంగా నిలిపే అంశం. దాన్ని ఎప్పుడూ అలాగే కొనసాగించండి. ఈ వారం మీ వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. శ్రమ ఎక్కువైనట్లు అనిపిస్తే, వెంటనే పనినుంచి విశ్రాంతి తీసుకోండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కొత్త పని ఒకటి చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ పరిచయంతో మీరు మరింత ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాధిస్తారు. కలిసివచ్చే రంగు : తెలుపు కర్కాటకం (జూన్ 21 జూలై 22) ఈ వారమంతా మీకు బాగా కలిసివస్తుంది. మీరు కోరుకున్న, మీకు బాగా ఇష్టమైన ఒక పనిలో మునిగిపోతారు. అందులో విజయం సాధించాలంటే మీ శక్తినంతా కేంద్రీకరించాలన్న విషయాన్ని గుర్తించండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. బద్ధకం అన్నది మీ దరి చేరకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ చిరకాల కోరిక ఒకటి ఈవారంలోనే నెరవేరుతుంది. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొన్ని అనుకోని సంఘటనలు మీకు అశాంతిని కలిగిస్తాయి. నిరాశలోకి కూరుకుపోకుండా పరిస్థితులను ఎదిరించి నిలబడండి. వీలైతే కొంతకాలం ఏదీ ఆలోచించకుండా ప్రశాంత జీవితం గడపడానికి ప్రయత్నించిండి. ఈ ప్రశాంత జీవితంతోనే మీరు మరింత ఉత్సాహంగా పనిచేసే శక్తిని పొందుతారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. జీవితాన్ని మళ్లీ కొత్తగా ఆస్వాధించడం అలవాటు చేసుకోండి. ఒకేసారి ఎక్కువ పనులను మీద వేస్కొని ఒత్తిడికి లోనుకాకండి. కలిసివచ్చే రంగు : బూడిద కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) రెండు విరుద్ధ ఆలోచనల మధ్య ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఒత్తిడికి లోను చేసుకుంటున్నారు. ముందు అవన్నీ పక్కనబెట్టి జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. మీ ఆలోచనా విధానంలో వచ్చే ఈ మార్పే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొత్త అవకాశం ఒకటి తలుపు తడుతుంది. వృత్తిజీవితంలో చిన్న మార్పు కనిపిస్తోంది. ఇల్లు మారాలనుకుంటున్నట్లైతే ఇదే సరైన సమయం. ప్రేమ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చింది. ఆ విజయం కోసం ఎప్పట్లానే మీ శ్రమనంతా వెచ్చించి పనిచేయండి. మీ ఆలోచనా విధానాన్ని ఏ పరిస్థితుల్లోనూ మార్చుకోవద్దు. ఈ మధ్యే చేపట్టిన ఓ పని అద్భుతమైన విజయాలతో ముందుకు వెళుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ప్రోత్సహించేవారే మీచుట్టూ ఉండేలా చూసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఎప్పట్నుంచో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తోన్న విషయాలన్నీ సర్దుకుంటాయి. సంతోషంగా గడుపుతారు. ఇకపై కొత్త జీవితం మొదలవుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. పరిస్థితులకు భయపడి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయొద్దు. ప్రేమ జీవితం ఎప్పట్లానే బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : గులాబీ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ అవకాశం దగ్గరలో ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కొన్ని బహుమతులు అందుకుంటారు. విహారయాత్రలకు సన్నాహాలు చేస్తారు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. విజయం మీవైపే ఉందన్న నమ్మకంతో పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో మీ శక్తినంతా వెచ్చించి జీవితాశయం వైపుకు అడుగులు వేయండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒక కొత్త ఆలోచన మీ వృత్తి జీవితాన్ని ఉత్సాహపరుస్తుంది. ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడపడం వల్ల మరింత ఉత్తేజం వస్తుంది. కలిసివచ్చే రంగు : నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కసారే ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి. జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేస్తూ ఉండండి. అయితే ఈ పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు. కొన్నాళ్లలో అంతా సర్దుకుంటుంది. మీదైన ప్రతిభ ప్రపంచానికి పరిచయమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. కొన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు. ప్రేమ జీవితం కూడా అంత సాఫీగా సాగదు. మీపై మీకున్న నమ్మకాన్ని అలాగే ఉంచుకొని ముందుకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితం కొత్తగా మొదలవుతుంది. కొత్త జీవితం ఊహించని ఫలితాలను తెచ్చిపెడుతుంది. ప్రేమ జీవితం కూడా కొత్తగా మొదలవుతుంది. మీదైన ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతవరకైనా వెళ్లడానికి ఇష్టపడతారు. ప్రశాంతంగా, మీ అభివృద్ధికి తోడ్పడే విషయాలకు మాత్రమే ఎక్కువ సమయం కేటాయించండి. మీ చుట్టూ ఉండే మీ మంచి కోరే వ్యక్తుల నుంచి కూడా సాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : నీలం -
టారో : 21 ఆగస్టు నుంచి 27ఆగస్టు, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) నూతనోత్సాహం పుంజుకుంటారు. మార్పు దిశగా ముందంజ వేస్తారు. పాతగాయాలను భావి పురోగతికి పునాదులుగా మలచు కుంటారు. అనూహ్యమైన చోట అనూహ్యమైన పరిస్థితుల్లో ఆనందం పొందుతారు. మీ ధైర్య సాహసాలే మీకు శ్రీరామరక్షగా ఉంటాయి. ఉన్నతమైన ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగుతారు. పట్టుదలతో కృషి చేసి వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: లేతనీలం వృషభం (ఏప్రిల్ 20 - మే 20) వస్తు వ్యామోహాలకు, వ్యక్తిగత వ్యామోహాలకు దూరంగా ఉంటారు. అంతర్ముఖులై వాస్తవ పరిస్థితులను తేటతెల్లం చేసుకుంటారు. సమస్యలు, కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. లక్కీ కలర్: గోధుమ మిథునం (మే 21 - జూన్ 20) ఎంత పెద్ద భవంతికైనా పునాదులే ముఖ్యమనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మీ ఘన విజయాలకు ఇతరులు మీపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. పెద్ద అవకాశాలతో మరింత పని మీ చేతికొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడి వల్ల గాని లేదా ఇంట్లోని కుటుంబ పరిస్థితుల వల్ల గాని కొంత ఆందోళనకు లోనవుతారు. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) ప్రతికూలమైన ఆలోచనల నుంచి విముక్తి చెంది మానసిక స్వేచ్ఛ పొందాలని పరితపిస్తారు. ఈ వారంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలకు... ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలకు విహార యాత్రల కోసం వెళతారు. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగుతాయి. లక్కీ కలర్: లేత ఊదా సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ప్రేమికుల సమక్షంలోనే ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడతారు. మీ జీవితంలో శుభఘడియలు మొదలయ్యే తరుణం ఆసన్నమైంది. కళారంగంలో ఉన్నవారు మనసుకు నచ్చిన కళా సాధనలో ఎక్కువకాలం గడుపుతారు. సృజనాత్మకతకు పదును పెట్టుకుంటారు. నచ్చిన పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఉరకలేసే ఉత్సాహంతో, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇతరులను కూడా మీ పంథాలోకి మార్చుకోగలుగుతారు. ఆత్మగౌరవానికీ అహంకారానికీ తేడా తెలుసుకుంటే మంచిది. లేనిపోని అహం ప్రదర్శించడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లక్కీ కలర్: పొద్దుతిరుగుడు రంగు తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) సన్నిహితులతో, బంధువులతో సంబంధాలను పటిష్టం చేసుకుంటారు. కార్యసాఫల్యత సాధిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతిని నిలువరించే అవరోధాలు తొలగిపోతాయి. పని ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. సత్వర చికిత్స ద్వారా ఉపశమనం పొందగలరు. లక్కీ కలర్: గోధుమరంగు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నంలో చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతారు. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. విహార యాత్రల్లో సన్నిహితులతో సరదాగా గడుపుతారు. కొత్తగా ప్రేమ వ్యవహారాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) జీవితం ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. అనూహ్యంగా పరిస్థితులన్నీ సానుకూలంగా మారుతాయి. ఇంటా బయటా మార్పులు అనివార్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది. అంచనాలకు మించిన ఆదాయం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. అయితే, భ్రమల్లోనే గడపకుండా తేరుకుని వాస్తవ పరిస్థితులను గుర్తించడం మంచిది. లక్కీ కలర్: లేత ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) అహాన్ని అదుపులో ఉంచుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అనవసరపు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న లక్ష్యాలను ప్రయాసతో పూర్తి చేస్తారు. ఇతరులను సానుకూలంగా అర్థం చేసుకోవడం, పరిస్థితులతో రాజీపడటం అనివార్యమవు తుంది. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. లక్కీ కలర్: వెండిరంగు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) అనూహ్యమైన అవకాశాలు అందివస్తాయి. కొత్త పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరగవచ్చు. దీర్ఘకాలిక కార్యాచరణ కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలకు రంగం సిద్ధం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉత్సాహం సడలకుండా ముందుకు సాగుతారు. లక్కీ కలర్: లేత నారింజ మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఎలాంటి పరిమితులూ విధించుకోకుండా ముందుకు సాగుతారు. సర్వ సన్నద్ధంగా పరిస్థితులను ఎదుర్కొంటారు. ఒక సాహస కృత్యం కారణంగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. లక్కీ కలర్: లేత గులాబి - ఇన్సియా, టారో అనలిస్ట్ -
టారో :7ఆగస్టు నుంచి 13ఆగస్టు, 2016 వరకు
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19) ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. గ్రహబలం మిమ్మల్ని గెలుపుబాటలో నడిపిస్తుంది. తీరికలేని పనిఒత్తిడి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి వేగాన్ని మరింతగా పెంచాల్సి ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 - మే 20) కాలానికంటే ముందుండేలా పరుగులు తీస్తారు. గతానుభవాలను మరచి కార్యసాధన దిశగా ముందుకు సాగుతారు. సహచరులు మిమ్మల్ని ఒక పట్టాన అర్థం చేసుకోలేరు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉంటున్నవారికి తగిన తోడు లభిస్తుంది. ప్రతి చిన్న సమస్యకూ పరిష్కారాన్ని సాధిస్తూ, వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. లక్కీ కలర్: లేతనీలం మిథునం (మే 21 - జూన్ 20) విహారయాత్రల కోసం సుదూర ప్రాంతాలకు వెళతారు. జీవన భద్రతకు, వృత్తి విజయాలకు సమాన ప్రాధాన్యమిస్తారు. అనుకోని పరిణామాల వల్ల కొంత అశాంతికి గురైనా, త్వరలోనే పరిస్థితులు దారిలోకి వస్తాయి. స్వయంఉపాధిలో ఉన్నవారికి పూర్తిగా సానుకూలమైన కాలం. ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నివిధాలా అదృష్టం కలిసొస్తుంది. లక్కీ కలర్: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 - జూలై 22) అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం అశాంతి కలిగిస్తుంది. నిరాశ, నిస్పృహ అలముకుంటాయి. ఆలోచనలకు, ఆచరణకు పొంతన కుదరని పరిస్థితి ఎదురవుతుంది. బంధుమిత్రులతో కలసి విహారయాత్రలకు వెళతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొంత ఊరటనిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: వెండిరంగు సింహం (జూలై 23 - ఆగస్ట్ 22) ఉత్సాహం సన్నగిల్లుతుంది. బద్ధకంతో పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లు ఎదురవుతాయి. పని ప్రదేశంలో సమస్యలను తప్పించుకోవాలంటే ఆచి తూచి నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అలజడులు ఎదురవుతాయి. గొంతుకు సంబంధించిన సమస్యలు, శారీరక బలహీనత ఇబ్బందిపెడతాయి. లక్కీ కలర్: లేతనీలం కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22) ఇంటా బయటా పరిస్థితులు మెరుగు పడతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంతో ఉరకలు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్పెక్యులేషన్ వ్యవహారాలు, రిస్కుతో కూడిన లావాదేవీల ద్వారా లాభాలు అందివస్తాయి. చర్మ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. లక్కీ కలర్: లేతగోధుమ తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22) జీవితాన్ని వాస్తవిక దృక్పథంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ దౌత్య నైపుణ్యాలతో ఒక పెద్ద సమస్యను తేలికగా పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయపథంలో ముందుకు సాగుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. వెన్నునొప్పి ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. లక్కీ కలర్: లేతపసుపు వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21) జీవితంలో సమతుల్యత సాధించుకోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. కుటుంబ సంబంధాలలో పొరపొచ్చాలు సమసిపోయి, ప్రశాంతత నెలకొంటుంది. తిరుగులేని మీ శక్తి సామర్థ్యాలతో సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. కాలాన్ని ఏమాత్రం వృథాపోనివ్వరాదనే సంకల్పంతో పనుల్లో తలమునకలవుతారు. కళాసాధనలో సేదదీరుతారు. లక్కీ కలర్: బూడిదరంగు ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) సమస్యలు చుట్టుముట్టినా, ఆత్మస్థైర్యంతో వాటన్నింటినీ ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు తగిన కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆకాంక్షలకు తగిన ఫలితాలను సాధిస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయులతో దెబ్బతిన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు మీ వంతుగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. లక్కీ కలర్: ముదురు గోధుమ మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) అందమైన ఊహాలోకంలో విహరిస్తారు. ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోకుండా మీదైన శైలిలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలతో సత్ఫలితాలను సాధిస్తారు. మీ విజయాలను జీర్ణించుకోలేని వారి నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై, అందచందాలపై శ్రద్ధచూపుతారు. వస్త్రధారణలో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: నేరేడు కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18) మీ ఆకర్షణశక్తి అందరినీ ఆకట్టుకుంటుంది. సానుకూల దృక్పథంతో సత్ఫలితాలు సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. సరికొత్త ప్రేమలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎన్ని విజయాలు సాధించినా, ఉప్పొంగిపోకుండా ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తారు. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి దూరప్రయాణాలకు వెళతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: గోధుమరంగు మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) ఒంటరిగా ఉంటున్నవారు తగిన తోడు కోసం వెదుకులాట కొనసాగిస్తారు. ‘నవ్వుతూ బతకాలిరా’ అన్నట్లుగా నవ్వుతూ, తుళ్లుతూ... అందరినీ నవ్విస్తూ ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే, వ్యాయామంపై శ్రద్ధపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామిని కానుకలతో ఆకట్టుకుంటారు. లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ -
పనులు సజావుగా పూర్తవుతాయి
నవంబర్ 21 నుంచి 27 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) పని చేసీ చేసీ అలసిపోయిన శరీరానికీ, మనస్సుకీ కొంత విశ్రాంతి అవసరం. వీలయితే మీరు కొంత విశ్రాంతి తీసుకోండి. కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్టు లేదా ఉద్యోగావకాశం రావచ్చు. కొన్ని రకాల ప్రలోభాలకి, ఆకర్షణలకి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. జరగబోయే దాని గురించి ఊహించుకోవడం అంత మంచిది కాదని గ్రహించండి. కలిసొచ్చే రంగు: లేత గులాబీ టారస్ (ఏప్రిల్ 21-మే 20) భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. మీరు వెతుకుతున్న ప్రేమను పొందుతారు. మీ లక్ష్యాలు దాదాపు పూర్తవుతాయి. ఆడుతూ పాడుతూ హాయిగా పని చేసుకోండి. మీరేమిటన్నది మీ పనే చెబుతుంది. జీవితంలో ఎదురయ్యే వివిధ ఒడుదొడుకులను ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: నారింజ జెమిని (మే 21-జూన్ 21) అనుకున్న పనులన్నింటినీ సజావుగా, సక్రమంగా పూర్తి చేస్తారు. గత నెలరోజులుగా మీ మనసులో రూపుదిద్దుకుంటున్న ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. మీ డబ్బును మదుపు చేసేందుకు మరిన్ని మంచి మార్గాలు అన్వేషించండి. ప్రేమ విషయంలో కొంత వైఫల్యం ఎదురైనప్పటికీ మీలో ఉన్న ఆనందాన్ని, చురుకుదనాన్ని పోగొట్టుకోకండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ క్యాన్సర్ (జూన్22-జూలై 23) విజయాల బాటలో నడుస్తారు. మీరు సాధించిన విజయాలను చూసి మీరే గర్విస్తారు. మీ పనితనాన్ని చూసి, చాలా మంది మీ పట్ల మొగ్గ చూపుతారు. అయితే మీ విజయాలను చూసి గర్వించకుండా, అహంకరించకుండా, సమతుల్యతను పాటిస్తూ, జీవితంలో మరింత ఆనందాన్ని నింపుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ అసలైన శిక్షణ ఇప్పుడే ఆరంభమైందని గుర్తించండి. మొదట్లో కొంత అపరిపక్వంగా ఉన్నా, రానురానూ పరిణతి సాధిస్తారు. నేర్చుకోవడం పట్ల దృష్టి పెడితే సులువుగా చేసుకోవచ్చు. ఆఫీసులో లేదా పనిప్రదేశంలో ఇద్దరు విభిన్న మనస్తత్వాలున్న అధికారులతో పని చేయవలసి రావచ్చు. పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే గెలుపు మీదే. కలిసొచ్చే రంగు: వంకాయరంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కొత్త పనులు ప్రారంభించడం, కొత్త మార్పులు చోటు చేసుకోవడం జరగవచ్చు ఈ వారంలో. ఇష్టపడ్డవారితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోతారు. వారు మీ నుంచి విడిపోతారేమోనన్న ఆలోచనే మీకు చేదుగా అనిపిస్తుంటుంది. అయితే, మీకంత ఇబ్బంది ఏమీ రాదు. పేదల పట్ల కొంచెం ఉదారంగా ఉండండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని చికాకులు చోటు చేసుకోవచ్చు. అయితే వాటిగురించే ఆలోచిస్తూ కుంగిపోవద్దు. శారీరక ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరితోనైనా అనైతిక బంధంలో ఉంటే వెంటనే తెంచేసుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరతారు. పని మీద దృష్టి పెట్టడం మంచిది. కలిసొచ్చే రంగు: వెండిరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) వృత్తిపరంగా కొత్త మార్పులు చోటు చేసుకోవచ్చు. బదిలీ లేదా ఉద్యోగంలో స్థాన మార్పు విషయమై కొన్ని వార్తలు వింటారు. అంతా బాగుంటుందనే ఊహించండి. ప్రేమబంధం మరింత బలపడుతుంది. ఒక దూరప్రయాణం ఉండచ్చు. సృజనాత్మకంగా ఆలోచించండి, కళాత్మకంగా పని చేయండి. కలిసొచ్చే రంగు: బూడిదరంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకంటూ గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. పాత పరిచయస్థులతో ప్రేమలో పడవచ్చు. అయితే శృంగారం, ప్రేమ కన్నా కెరీరే ప్రధానమని గుర్తించడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమరంగు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒత్తిళ్లను అధిగమించడానికి నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, తీసుకున్న నిర్ణయాలను, చేసిన ఆలోచనలను వెంటనే అమలులో పెట్టడానికి ప్రయత్నించండి. లేకుంటే ఇతరులు వాటిని తమవని చెప్పుకునే అవకాశం ఉంది. కలిసొచ్చే రంగు: ఇటికరాయి రంగు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనంతట తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చేరంగు: ఆలివ్ గ్రీన్ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) వివిధ కారణాల వల్ల మీరు లోగడ దరఖాస్తు చేసిన దానికే తిరిగి ప్రయత్నించవలసి వస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారు ఆర్థికంగా నష్టపోయి మళ్లీ ప్రయత్నించి సాధించుకోవలసి వస్తుంది. వ్యాపారంలో కూడా రెండవమారు ప్రయత్నమే ఫలించే అవకాశం కనిపిస్తోంది. కాలగ్రహ ఫలితమే తప్ప మీ దోషం కాదు ఈ స్థితికి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఒకప్పుడు నమ్మకంగా చేసిన పనులన్నీ ఇప్పుడు రాతకోతల పరిస్థితికి రావచ్చు. అప్పట్లో నోటి మాట మీద తీసుకుని ఎంతెంతో చెల్లించినప్పటికీ నేడు కాగితం కావలసిందే అనే ఒత్తిడి మీపై రావచ్చు. కాగితం మీది సంతకం వజ్రాయుధమయ్యే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి అక్షరాన్ని ఆలోచించి రాయండి. పెద్దల్ని సంప్రదించి మాత్రమే పత్రాల మీద సంతకాన్ని చేయండి. జెమిని(మే 21-జూన్ 21) ఆరోగ్యంగా ఉంటారు. ప్రయత్నించిన అన్ని కార్యక్రమాలూ విజయవంతమై సుఖసంతోషాలతో గడుపుతారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలత ఉన్నా ఇక్కడ పరిష్కరించుకోవలసిన సమస్య ఉన్నందువల్ల ఈ మాసంలో విదేశీ ప్రయాణం గురించి కొంత ఆలోచించ వలసిందే! దంపతులకి ఉద్యోగరీత్యా కొంతకాలం ఎడబాటు ఉండవచ్చు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ దంపతుల్లో ఒకరికి మానసికారోగ్యం బాగుండకపోవచ్చు. సంతానానికి సంబంధించి సమస్య కారణంగా చింతతో ఉంటారు. జరిగే వ్యతిరేకతంటూ ఏమీ లేకున్నా, మానసికంగా దృఢంగా ఉండలేకపోవచ్చు. దీనికితోడు ఆర్థికంగా వ్యయం అవుతూ ధనం ఎలా వచ్చిందో అలా వెళ్లిపోతూ ఉండచ్చు కూడా. ప్రణాళికాబద్ధంగా వ్యయం చేసుకోవడం మంచిది. లియో (జూలై 24-ఆగస్టు 23) మీ దంపతులు అందరికీ అన్యోన్యంగా కనిపిస్తున్నప్పటి కీ అంత సుఖంగా ఉండ (లే)కపోవచ్చు. దానికి ఆర్థికమైన విషయాల్లో ఒకరికొకరికి అవగాహనా సమన్వయమూ సామరస్యమూ లేకపోవడమే కారణం అనిపిస్తోంది. జరిగిందాన్ని మరచి ఇప్పటికైనా ఆర్థికమైన విషయాల్లో గుంభనని వీడితే దాంపత్యం సుఖమయమై సంతోషమంటే ఏమిటో అర్థమౌతుంది. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన చిత్తవృత్తికి భిన్నంగా కోపం కలిగించే సంఘటనలు మీ మీద ప్రభావాన్ని చూపించవచ్చు. దాని గురించే ఆలోచిస్తుండే కారణంగా ఉద్యోగంలో కూడా అధికారులతో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. మీతో విరోధించిన వారికి మీరే స్వయంగా తెలియజేసుకుని పరిస్థితిని చక్కబరుచుకుంటే ఔషధసేవ తప్పుతుంది. మనసూ బుద్ధీ ఆరోగ్యవంతంగా ఉంటాయి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఒక ఆలోచనతో మీరుంటే, దాన్ని మీచుట్టూ చేరిన బంధుమిత్రులందరూ తమ సూచనలని చెప్పి వాళ్ల అభిప్రాయానికి మిమ్మల్ని దాసోహపడేలా చేసి ఉంటారు లోగడ. ఆ అభిప్రాయానికి అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితిలో ఉన్న మీకు ఎవరు చెప్పినా వినే స్థితి ఉండకపోవచ్చు. ఒక్క క్షణం వెనక్కి తిరిగి మీ గురించి మీరు ఆలోచించుకుంటే బాగుండవచ్చునేమో! స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) అకస్మాత్తుగా వచ్చిన సమస్య మిమ్మల్ని కుంగదీస్తుంది. ఇది శని కారణంగా జరుగుతున్న స్థితి మాత్రమే. మానసిక ఆందోళన, పనుల్లో జాప్యం, ఉద్యోగంలో ఒత్తిడి అనవసర వ్యయం ఏది మాట్లాడినా మరోలా ఎదుటి వారికి అర్థం గోచరించడం... వంటివన్నీ ఈ దశలో సాధారణం అని గమనించి మీ దైనందిన జీవితాన్ని గడుపుకోండి. ఇంకొంతకాలం ఇదే స్థితి ఉండవచ్చు. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) మీరు ఎవరి మాటనైనా వింటున్నట్టే ఉంటారు కానీ మీకు తోచిన రీతినే చేసే మనస్తత్వమే అధికం. మిమ్మల్ని మొగమాటపెట్టి మాట సాయం గాని, లిఖితపూర్వకమైన హామీ గాని వాగ్దానం గాని చేయించుకునే పరిస్థితి కనిపిస్తోంది. అనవసర మనోవ్యగ్రత కలగచ్చు. బురద తొక్కి కాళ్లు కడుక్కోవద్దు- సరైన తోవలో నడవండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) సంతానపరంగా ఎక్కువ వ్యయమయ్యే అవకాశం కనిపిస్తోంది. వృథాగా ఖర్చయిన పక్షంలో దాన్ని దుర్వ్యయం అంటుంది శాస్త్రం. ఇక్కడ జరుగుతున్న వ్యయం సంతాన శ్రేయస్సు అభివృద్ధుల నిమిత్తం కాబట్టి ఇది సద్వ్యయం కిందికే వస్తుంది. ఎంతో ఖర్చయినా కూడ వ్యాధి నివారణం కాని సందర్భాలుండవచ్చునేమోగాని, ఈ ఖర్చు మాత్రం సద్వ్యయమే. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం ఈ రాశివారికి ఏదైనా చిన్నబుచ్చుకునే సందర్భంగాని వస్తే తిరగబడకుండా సంయమనంతో తలవంచుకోవడం లేదా ఆ ప్రదేశాన్ని మౌనంగా వీడడం మాత్రమే చేయవలసిన పని. నా తప్పు లేనప్పుడెందుకు దూరంగా తొలగిపోవాలి? అంటూ చర్చకి దిగడం కంటే ఒక్క క్షణం ఆలోచించి ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లడం మంచిది కదా! పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కురుక్షేత్రంలో అర్జునిలా అకస్మాత్తుగా తమ ఆలోచనని నిర్వేదం నిరాశ మీదికి లగ్నం చే సి కుటుంబ సభ్యులకి కొత్త ప్రశ్న పుట్టేలా ప్రవర్తిస్తారు. గమనించుకోండి. మీ నిరాశ మొత్తం తాత్కాలికం మాత్రమే. శ్రీకృష్ణునిలా గీతోపదేశం చేసేవారెవరూ మీకు తారసపడకపోయినా కుంగిపోక మీకు మీరుగా సంయమనం పాటించడం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మే 9 నుంచి మే 15 వరకు
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) విదేశాల నుంచి మీరెంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఓ శుభవార్త అందుతుంది. అసంపూర్తిగా ఉండిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మీ విజయాలను చూసి కొందరు అసూయ పడవచ్చు. అది మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్‌ని నింపుతుంది. ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి క్రిస్టల్స్‌ని ధరించండి. కలసివచ్చే రంగు: నలుపు టారస్ (ఏప్రిల్ 21-మే 20) అవకాశాలు విరివిగా లభిస్తాయి. దేన్ని ఎంచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంపికలో జాగ్రత్త వహించండి. లక్ష్యాలను అందుకోవడానికి మీకు ఇది తగిన సమయం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. అవివాహితులకు వివాహ సూచన. కలసివచ్చే రంగు: క్రీమ్ వైట్ జెమిని (మే 21-జూన్ 21) అన్ని విషయాల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. బాధపెట్టే బంధాలను బలవంతంగా భరించకుండా ఓ మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. తద్వారా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. కలసివచ్చే రంగు: బంగారువర్ణం క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఈ వారంలో మీ జీవితంలోను, ఇంటిలోను, ఆరోగ్యంలోనూ కూడా ఊహించని మార్పులు వస్తాయి. కాస్త ఇబ్బందిపెట్టే ఈ మార్పులకు మీరు సిద్ధంగా ఉండండి. ఆర్థికపరంగా ఏర్పడిన వెలితిని పూడ్చటానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. అప్పులు మాత్రం చేయకండి. దిగులుగా అనిపించినా కుంగిపోకండి. త్వరలో మంచి రోజులొస్తాయి. కలసివచ్చే రంగు: వెండి రంగు లియో (జూలై 24-ఆగస్టు 23) మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ప్రేమలోని మాధుర్యాన్ని మీకు రుచి చూపిస్తారు. వృత్తిపరంగా కూడా ఊహించని మార్పులు కలుగుతాయి. ఇబ్బందులొచ్చినా మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. అనుకోని సహాయం అందుతుంది. వ్యాపారానికి పెట్టుబడి సమకూరుతుంది. ఆ తర్వాత మీ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. కలసివచ్చే రంగు: పీచ్ విర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అవకాశం మళ్లీ దొరకదు కాబట్టి జారవిడుచుకోవద్దు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎంతోకాలంగా మీకు ఉన్న కొన్ని అలవాట్లు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తాయి. అధిగమించడానికి ధ్యానం చేయండి. ఆర్యోగంపై శ్రద్ధ అవసరం. ఒక వ్యక్తి మనసును మీరు గెల్చుకుంటారు. కలసివచ్చే రంగు: బ్రౌన్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ జీవితంలో ఓ పెనుమార్పు సంభవించబోతోంది. ఆ మార్పు మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. బంధాలు కొద్దిగా బలహీనపడతాయి. జరిగేవాటిని మీరు ఆపలేరు కాబట్టి వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించడం మంచిది. అన్నీ పాజిటివ్‌గా తీసుకోవడం నేర్చుకోండి. అప్పుడే మనశ్శాంతిగా ఉండగలరు. కలసివచ్చే రంగు: వంకాయ రంగు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఎందుకంటే మీరు త్వరలోనే ఓ కొత్త వ్యాపారం మొదలు పెట్టడమో, ప్రాజెక్టును చేపట్టడమో జరుగుతుందని టారో కార్డ్స్ సూచిస్తున్నాయి. అది సాధించాలంటే మీ పనిలో ఎవరైనా ఒక మహిళకు భాగస్వామ్యం కల్పించండి. తప్పక విజయం సాధిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కలసివచ్చే రంగు: లేత ఊదారంగు సగిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇంతవరకూ మెల్లగా సాగిన మీ జీవితం ఒక్కసారిగా పరుగందు కుంటుంది. ఆ వేగంలో ఎత్తులూ ఎక్కుతారు. పల్లాలకూ పడతారు. కానీ అన్నిటినీ దాటుకుంటూ అద్భుతంగా ముందుకు పోతారు. ఇది మీకు ఎంతో శుభసమయం కాబట్టి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా స్వీకరించండి. విందులు చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్లే అవకాశమూ ఉంది. కలసివచ్చే రంగు: ఇండిగో క్యాప్రికాన్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈవారం మీరు వెలిగిపోతారు. ప్రమోషన్ రావడం కానీ, జీతం పెరగడం కానీ జరగవచ్చు. వ్యాపారాలు చేసేవాళ్లకు అవకాశాలు అంతగా రాకపోయినా టెన్షన్ పడక్కర్లేదు. త్వరలోనే మీరు ఆర్థికంగా బాగా పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారం చివర్లో అనుకోకుండా సంభవించే సంఘటనలు కాస్త కన్ఫ్యూజన్కు గురి చేయవచ్చు. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈవారం ఎన్ని సవాళ్లు ఎదురైనా కానీ వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. మీకు నచ్చిన రంగంలో దూసుకుపోతారు. ఆర్థిక పురోగతి వైపుగా ప్రయాణిస్తారు. వారం చివర్లో కాస్త ఖర్చులు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రపోజల్స్ వస్తే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మీకు తగిన వ్యక్తి ఎవరో తెలుసుకుని ఓకే చెప్పండి. కలసివచ్చే రంగు: పీచ్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవారం మీ ఆలోచనలు, నోటిమాటల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచించినంత మాత్రాన సరిపోదు. మాట కూడా పాజిటివ్‌గా ఉండాలని గుర్తు పెట్టుకోండి. నోటి నుంచి నో అన్న మాట రాకుండా చూసుకోండి. అదే మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. విజయాలకు చేరువ చేస్తుంది. కలసివచ్చే రంగు: నీలం ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అన్ని రంగాల వారికి వ్యతిరేక ఫలితాలుండవు. అయితే అభివృద్ధి కూడా ఉండదు. విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ ఉన్నా తగిన సమయం లేక, వ్యవసాయదారులకి పెట్టుబడులున్నా తగిన సౌకర్యాలు లేక... ఇతర రంగాల వారికి కూడా పెద్దగా కలిసొచ్చే తీరు కనిపించకపోవచ్చు. దిగులు చెందకుండా లోపాన్ని గమనించుకొని మరింత ప్రయత్నాన్ని చేసుకోండి. కలసివచ్చేరోజు: ఆదివారం టారస్ (ఏప్రిల్ 21-మే 20) మొహమాటం కారణంగా నష్టపోవచ్చు. అనవసర ప్రయాణాలు, వ్యర్థమైన వాగ్వివాదాలు, ప్రయోజనం లేని చదువులకై ప్రయత్నాలు చేసే అవకాశం బాగా ఉంది. నిర్మాణరంగం వారికి నిరుత్సాహకరంగా, వినోదరంగం వారికి కొంత ప్రతికూలంగానూ ఉండొచ్చు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రయాణాలు చేయడం వల్ల శారీరక, మానసిక స్థైర్యం దెబ్బతినవచ్చు. కలసివచ్చేరోజు: సోమవారం జెమిని (మే 21-జూన్ 21) అపరిచితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది, అత్యాశ కారణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ముఖ్యంగా వాగ్దానం తప్పక విఫలమవుతుంది. కాబట్టి వీలైనంత వరకూ జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ ఏ హామీని ఇవ్వవద్దు. సామాన్య ధోరణిలో అన్నమాట వజ్రాయుధంలా ముందునాటికి మారచ్చునని గ్రహించుకోవాలి. కలసివచ్చేరోజు: బుధవారం క్యాన్సర్ (జూన్22-జూలై 23) స్థిరమైన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ పనులు వాయిదా పడుతూ పడుతూ మొత్తానికి వారాంతానికి ఓ కొలిక్కి రావచ్చు. పొరపాటున కూడా ఎవరికీ రుణం ఇచ్చి మోసపోవద్దు. సొమ్ము తిరిగిరాదు సరికదా శత్రుత్వం ఏర్పడవచ్చు. కాబట్టి ఆర్థికంగా వీలైనంత మెలకువతో ఉండాలి. కలసివచ్చేరోజు: శనివారం లియో (జూలై 24-ఆగస్టు 23) ఎక్కువ సమయం శ్రమ చేస్తూ ఆదాయం మాత్రం తక్కువ పొందుతారు. అయితే ఈ శ్రమ మరికొద్ది కాలం పిమ్మట సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో జరిగిన తప్పుల్ని ఆత్మపరీక్ష చేసుకొని గమనించుకోగలుగుతారు. మీకు మీరే దిశానిర్దేశం చేసుకోగల సమర్థతను సంపాదించుకుంటారు. పదిమందిలో మంచి పేరును పొందుతారు. కలసివచ్చేరోజు: గురువారం విర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన కలిగి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రణాళికాలను ఏర్పర్చుకొని నమ్మకమైన వ్యక్తులతో ముందుకు సాగుతారు. స్థిరమైన ఆస్తుల్ని అమ్మదలచినా కూడా వెనకడుగు వేయడం సరైన నిర్ణయమే. ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలను పాటించండి. వ్యాధిభయం, ప్రాణభయం లేదు కానీ, అప్రమత్తతతో వ్యవహరించాలి. కలసివచ్చేరోజు: బుధవారం లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఏ పని ప్రారంభించినా ఒకటికి రెండు మార్లు ఆలోచించడం అవసరం. పెద్దలను, అనుభవజ్ఞులను సంప్రదించాల్సిన సమయం ఇది. వ్యతిరేక ధోరణుల్ని విడనాడి సానుకూలంగా ఆలోచిస్తే మానసిక ఆందోళన ఉండదు. తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టిని పూర్తిగా మానుకోండి. ఉద్యోగస్థులు శ్రద్ధతో లేని పక్షంలో వ్యతిరేక ఫలితాలనీయవచ్చు. కలసివచ్చేరోజు: మంగళవారం స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) అనవసర కోపం, పట్టుదల, తొందరతనపు మాట, జరిగిన విషయాలనే తవ్వుకోవడం, మాటకి మాట చెప్పడం వల్ల మీ వ్యాపారం, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పరిశ్రమల రంగంలో ఉన్న వారు అపరిచితుల్ని ఎంత దూరంలో ఉంచాలో, ఎంతగా మాట్లాడాలో అలా వ్యవహరించడం చాలా అవసరం. కలసివచ్చేరోజు: శుక్రవారం సగిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అన్నీ అనుకూలంగానే కనిపిస్తాయిగాని అవి అన్నీ కూడా కనిపించినంత సులభమైన అంశాలు కావని గ్రహించుకోవాలి. భార్యాభర్తల మధ్య అవగాహన అతి ముఖ్యమని గమనించుకొని తగు మాత్రపు గుంభనతో ఉండాలి. వాహనాల విషయంలో, యంత్రపరికరాల విషయంలో పూర్తి భద్రత పాటించండి. ధనాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేసుకోవాలి. కలసివచ్చేరోజు: గురువారం క్యాప్రికాన్ (డిసెంబర్ 22-జనవరి 20) గడచిన నెల మొత్తం ఎలా స్తబ్దతతో ఉందో అదే తీరుగా ఈ వారం కూడా ఉంటుంది. పెద్దగా ఆదాయం ఉండదు. శుభవార్తకోసం చూసే ఎదురు చూపుతో ఈ వారం గడిచిపోతుంది. స్థలం మార్పు చేయకుండా, భాగస్వాములతో విరోధించకుండా మరింత సంపాదించాలనే దృష్టికి పోకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ వారం సంతానానికి అవకాశం ఉంది. కలసివచ్చేరోజు: గురువారం అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మానసికంగా అధైర్యంతో ఉన్న పనుల్ని విజయవంతంగా సాధించి బయటి కొస్తారు. మోసపోయే పరిస్థితుల్ని గమనించుకొని తప్పించుకోగలుగుతారు. పరుల విషయాలకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. శత్రువుల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లండి. సమయ నియమాన్ని పాటిస్తూ పనుల్ని పూర్తి చేసుకుంటే ఈవారం మీకు బాగా కలిసివస్తుంది. కలసివచ్చేరోజు: సోమవారం పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ‘ఏ పనులూ పూర్తి కావడం లేదు-అలాగని ప్రారంభం కాకుండానే లేవు’ అనే నిరుత్సాహంతో ఉండొచ్చు. అయితే శాస్త్రం ఇక్కడ చెప్పేదొక్కటే ‘వ్యతిరేక ఫలితం కనిపించక పోవడమే అను కూల ఫలితం’ అని. కుటుంబంలో శుభకార్యం జరగవచ్చు. కుటుంబానికి వస్తు వాహనాలు కొనుగోలు చేయ వచ్చు. పనులు నిరాటంకంగా సాగడం కోసం మరో వ్యక్తిని సహాయం కోరండి. కలసివచ్చేరోజు: శనివారం డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఇక దూసుకుపోతారు!
టారో బాణి మేషం... ఈ వారమంతా ఉత్సాహంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ వేగవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగం మారే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తగిన సమయం కోసం వేచి చూడటం ఉత్తమం. కలసివచ్చే రంగు: బేబీ పింక్ వృషభం... సమస్యలు తీరతాయి. ఎప్పటి నుంచో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతాయి. లక్ష్యాలు అందుకుంటారు. కొత్త బంధాలు ఏర్పడతాయి. ఉన్న బంధాలు బలపడతాయి. కలసివచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ మిథునం... వృత్తిపరంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. అయితే వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు, మానసికంగా చిన్నపాటి ఒత్తిడులు ఎదురు కావచ్చు. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతోన్న ఒక వ్యక్తితో సంబంధం తెగిపోవచ్చు. దానివల్ల కాస్త బాధ కలిగినా కానీ, భవిష్యత్తులో మంచే జరుగుతుంది. కలసివచ్చే రంగు: లిలాక్ కర్కాటకం... కొత్త పనులు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది తగిన సమయం. మీ జ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ ఉపయోగించి జీవితంలో ఎదగడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం కాస్త బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి జిమ్‌కి వెళ్లడం, అవుట్డోర్ గేమ్స్ ఆడటం చేయండి. కలసివచ్చే రంగు: వెండిరంగు సింహం... వృత్తిపరంగా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. అన్ని విషయాల్లోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కలసివచ్చే రంగు: నారింజ రంగు కన్య... వృత్తిపరంగా ఇది మీకు ఎంతో ముఖ్యమైన సమయం. లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తారు. త్వరలోనే విజయాలను అందుకునే అవకాశం ఉంది. ఓ కొత్త వ్యక్తి మీ మనసులోకి ప్రవేశించే అవకాశం ఉంది. కలసివచ్చే రంగు: లేత గోధుమరంగు తుల... విధి నిర్వహణలోను, వ్యాపార లావాదేవీల్లోనూ కొన్ని సమస్యలు ఎదురు కావొచ్చు. అయితే మీకున్న అద్భుతమైన కమ్యునికేషన్ స్కిల్స్ ద్వారా వాటిని అధిగమిస్తారు. ఓ ముఖ్యమైన ప్రాజెక్టు మీ చేతికి అందుతుంది. దాన్ని విజయవంతంగా ప్రారంభిస్తారు. కలసివచ్చే రంగు: ఊదా రంగు వృశ్చికం... శుభవార్తలు, శుభ సంకేతాలు వెతుక్కుంటూ వస్తాయి. అంతా సంతోషమే కనిపిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కొంతకాలంగా అనుబంధాల్లో ఏర్పడిన అపార్థాలు తొలగి ఆనందాన్ని పొందుతారు. ఇంటిలోకి ఓ పసిబిడ్డ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చిన్నపాటి ఒత్తిడులు ఎదురు కావొచ్చు. కలసివచ్చే రంగు: పసుపు ధనుస్సు... ఆర్థికంగా ఎదిగేందుకు, కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి తగిన సమయం. అనుకోని వివాదాలు, సమస్యలు చుట్టుముడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇరుకున పడేసే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు మకరం... మీరు ఏదైనా పని కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఇది తగిన సమయం కాదు. కాబట్టి కాస్త ఆచితూచి అడుగేయండి. ఇతరులు చెప్పే పుకార్లకి చెవి ఒగ్గకండి. అది మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. మీ విజయానికి అడ్డంకి కావొచ్చు. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే విజయం సాధిస్తారు. ప్రశంసలూ పొందుతారు. కలసివచ్చే రంగు: ముదురు నారింజ కుంభం... వృత్తిపరంగా మీకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రసంశలు పొందుతారు. అయితే మిమ్మల్ని ఒక విధమైన ఆధ్యాత్మిక భావనలు ఈవారం చుట్టుముడతాయి. ఈ కారణంగా మీరు పనిలో కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి. కలసివచ్చే రంగు: బ్రౌన్ మీనం.. ఈవారం మీరు చాలా హుషారుగా, మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో ఉంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ల పెదవులపై సైతం మీ కారణంగా నవ్వులు పూస్తాయి. మీరు వెతుకుతోన్న లక్షణాలు గల భాగస్వామి మీకు కనిపిస్తారు. వారు మీకు తగిన జోడీ అయిన సింహరాశి వారే అయివుంటారు. మీకు అసంతృప్తి కలిగిస్తోన్న పరిస్థితులనన్నింటినీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే చాకచక్యంగా వ్యహరించడం చేతకాక ఇబ్బందుల్లో పడతారు. కలసివచ్చే రంగు: పిస్తా గ్రీన్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్