టారో : 12 నవంబర్‌ నుంచి 18 నవంబర్, 2017 వరకు | Tarot: from 12 November to 18 November, 2017 | Sakshi
Sakshi News home page

టారో : 12 నవంబర్‌ నుంచి 18 నవంబర్, 2017 వరకు

Published Sun, Nov 12 2017 9:20 AM | Last Updated on Sun, Nov 12 2017 9:20 AM

Tarot: from 12 November to 18 November, 2017 - Sakshi

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
మీ జీవితమంతా కొత్తగా మొదలయ్యే సమయం దగ్గర పడుతోంది. సరికొత్త సవాళ్లు ఎదురవుతాయి. ధైర్యంగా ఆ సవాళ్లను ఎదుర్కోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విజయం మీకు దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. నమ్మకమే మీ ఆయుధమన్న విషయాన్ని మరవకండి. సరైన సమయంలో మీ ప్రతిభను నిరూపించుకొని ముందుకెళ్లండి. 
కలిసివచ్చే రంగు : నీలం 

వృషభం (ఏప్రిల్‌ 20  మే 20)
ఎప్పట్లానే ఈ వారమంతా ప్రశాంతంగా మీరు కోరుకున్న విధంగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఓ గొప్ప వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. ఆ వార్త మీ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : పీచ్‌ 

మిథునం (మే 21 జూన్‌ 20)
అందరినీ కలుపుకుపోయే మీ శైలే మిమ్మల్ని అందరిలోకి ప్రత్యేకంగా నిలిపే అంశం. దాన్ని ఎప్పుడూ అలాగే కొనసాగించండి. ఈ వారం మీ వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. శ్రమ ఎక్కువైనట్లు అనిపిస్తే, వెంటనే పనినుంచి విశ్రాంతి తీసుకోండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కొత్త పని ఒకటి చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ పరిచయంతో మీరు మరింత ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాధిస్తారు. 
కలిసివచ్చే రంగు : తెలుపు

కర్కాటకం (జూన్‌ 21  జూలై 22)
ఈ వారమంతా మీకు బాగా కలిసివస్తుంది. మీరు కోరుకున్న, మీకు బాగా ఇష్టమైన ఒక పనిలో మునిగిపోతారు. అందులో విజయం సాధించాలంటే మీ శక్తినంతా కేంద్రీకరించాలన్న విషయాన్ని గుర్తించండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. బద్ధకం అన్నది మీ దరి చేరకుండా చూసుకోండి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ చిరకాల కోరిక ఒకటి ఈవారంలోనే నెరవేరుతుంది. 
కలిసివచ్చే రంగు : నారింజ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొన్ని అనుకోని సంఘటనలు మీకు అశాంతిని కలిగిస్తాయి. నిరాశలోకి కూరుకుపోకుండా పరిస్థితులను ఎదిరించి నిలబడండి. వీలైతే కొంతకాలం ఏదీ ఆలోచించకుండా ప్రశాంత జీవితం గడపడానికి ప్రయత్నించిండి. ఈ ప్రశాంత జీవితంతోనే మీరు మరింత ఉత్సాహంగా పనిచేసే శక్తిని పొందుతారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి. జీవితాన్ని మళ్లీ కొత్తగా ఆస్వాధించడం అలవాటు చేసుకోండి. ఒకేసారి ఎక్కువ పనులను మీద వేస్కొని ఒత్తిడికి లోనుకాకండి. 
కలిసివచ్చే రంగు : బూడిద 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
రెండు విరుద్ధ ఆలోచనల మధ్య ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఒత్తిడికి లోను చేసుకుంటున్నారు. ముందు అవన్నీ పక్కనబెట్టి జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించడం అలవాటు చేసుకోండి. మీ ఆలోచనా విధానంలో వచ్చే ఈ మార్పే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొత్త అవకాశం ఒకటి తలుపు తడుతుంది. వృత్తిజీవితంలో చిన్న మార్పు కనిపిస్తోంది. ఇల్లు మారాలనుకుంటున్నట్లైతే ఇదే సరైన సమయం. ప్రేమ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చింది. ఆ విజయం కోసం ఎప్పట్లానే మీ శ్రమనంతా వెచ్చించి పనిచేయండి. మీ ఆలోచనా విధానాన్ని ఏ పరిస్థితుల్లోనూ మార్చుకోవద్దు. ఈ మధ్యే చేపట్టిన ఓ పని అద్భుతమైన విజయాలతో ముందుకు వెళుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ప్రోత్సహించేవారే మీచుట్టూ ఉండేలా చూసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. 
కలిసివచ్చే రంగు : నారింజ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఎప్పట్నుంచో మిమ్మల్ని నిరుత్సాహపరుస్తోన్న విషయాలన్నీ సర్దుకుంటాయి. సంతోషంగా గడుపుతారు. ఇకపై కొత్త జీవితం మొదలవుతుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. పరిస్థితులకు భయపడి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకడుగు వేయొద్దు. ప్రేమ జీవితం ఎప్పట్లానే బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : గులాబీ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ అవకాశం దగ్గరలో ఉంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరేంటో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతారు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కొన్ని బహుమతులు అందుకుంటారు. విహారయాత్రలకు సన్నాహాలు చేస్తారు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : గులాబీ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. విజయం మీవైపే ఉందన్న నమ్మకంతో పనిచేయండి. ఆత్మవిశ్వాసంతో మీ శక్తినంతా వెచ్చించి జీవితాశయం వైపుకు అడుగులు వేయండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఒక కొత్త ఆలోచన మీ వృత్తి జీవితాన్ని ఉత్సాహపరుస్తుంది. ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడపడం వల్ల మరింత ఉత్తేజం వస్తుంది. 
కలిసివచ్చే రంగు : నీలం 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఒక్కసారే ఆర్థిక సమస్యలు వచ్చి పడతాయి. జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేస్తూ ఉండండి. అయితే ఈ పరిస్థితులు ఎక్కువ రోజులు ఉండవు. కొన్నాళ్లలో అంతా సర్దుకుంటుంది. మీదైన ప్రతిభ ప్రపంచానికి పరిచయమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. కొన్ని నిద్రలేని రాత్రులు గడుపుతారు. ప్రేమ జీవితం కూడా అంత సాఫీగా సాగదు. మీపై మీకున్న నమ్మకాన్ని అలాగే ఉంచుకొని ముందుకు వెళ్లండి. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితం కొత్తగా మొదలవుతుంది. కొత్త జీవితం ఊహించని ఫలితాలను తెచ్చిపెడుతుంది. ప్రేమ జీవితం కూడా కొత్తగా మొదలవుతుంది. మీదైన ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతవరకైనా వెళ్లడానికి ఇష్టపడతారు. ప్రశాంతంగా, మీ అభివృద్ధికి తోడ్పడే విషయాలకు మాత్రమే ఎక్కువ సమయం కేటాయించండి. మీ చుట్టూ ఉండే మీ మంచి కోరే వ్యక్తుల నుంచి కూడా సాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : నీలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement