టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు | Tarot: from January 14 to January 20, 2018 | Sakshi
Sakshi News home page

టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు

Published Sun, Jan 14 2018 1:24 AM | Last Updated on Sun, Jan 14 2018 1:24 AM

Tarot: from January 14 to January 20, 2018

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వారం మొదట్నుంచీ ఏదో కోల్పోయినట్లుగా ఉంటారు. పరిస్థితులు కూడా అన్నీ ఒక్కసారే మీపై దాడి చేస్తున్నట్లుగా మారిపోతాయి. ప్రేమ జీవితంలో చికాకులు వచ్చిపడతాయి. ఇష్టపడ్డ వ్యక్తి మీకు దూరమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్‌పై ధీమాతో ముందుకు వెళ్లండి. జీవితంలో అపజయాలు సహజం అన్న విషయం గుర్తించండి. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : తెలుపు 

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వృత్తి జీవితంలో మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గుర్తింపు ఈవారం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే బాగా మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆస్తి వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రేమ జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : నీలం 

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ మార్పులకు తగ్గట్టు మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకోవాల్సి వస్తుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. విజయంపై ధీమాతో పనిచేస్తారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తారు. ఓరకంగా ఈ వ్యక్తి మీలో ఆత్మవిశ్వాసాన్ని బాగా పెంచుతారనే చెప్పాలి. ఇల్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం వల్లే ముందుకు కదల్లేకపోతున్నారన్న విషయాన్ని గ్రహిస్తారు. చిత్తశుద్ధితో జీవితాశయం వైపుకు అడుగులు వేయాలన్న ఆలోచన చేస్తారు. మీ ఆలోచనకు అండగా నిలబడ్డట్టుగా పరిస్థితులన్నీ మీకు అనుకూలిస్తాయి. వృత్తిజీవితంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం దొరుకుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : నారింజ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ కీలక విషయంలో తప్పక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వచ్చి, ఇప్పటికే చాలా సమయం వృథా చేశారన్న విషయం గ్రహించండి. మీ చుట్టూ మిమ్మల్ని తప్పటడుగులు వేయించే వ్యక్తులు ఉన్నారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : పసుపు 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారమంతా సాఫీగా సాగిపోతుంది. వృత్తి జీవితమంతా మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. నెలాఖర్లో ఉద్యోగంలో మార్పు కనిపిస్తోంది. కొత్త అవకాశాలు చుట్టుముడతాయి. మీ స్థాయికి తగ్గ అవకాశాన్నే అందిపుచ్చుకోండి. అలాగే మీ ప్రతిభను చాటుకునే అవకాశం కూడా దక్కుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. ఇష్టమైన వారికి ఎక్కువ సమయం కేటాయించండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తూ వస్తున్న ప్రతికూల పరిస్థితులు మరికొంత కాలం అలాగే ఉంటాయి. వీటన్నింటినీ దాటాక ఊహించని విజయం ఒకటి మీ సొంతమవుతుంది. ఆ విషయాన్ని బలంగా నమ్మి ముందుకు వెళ్లండి. తరచూ కోపం తెచ్చుకోవడం వల్ల కొన్ని చికాకులు మీకై మీరు కొని తెచ్చుకుంటున్నారని గ్రహించండి. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను ప్రశాంతంగా పూర్తిచేయడం అలవర్చుకోండి. 
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితమంతా ఒకేదగ్గర ఆగిపోయి, ముందుకు కదలడంలేదన్న ఆలోచనల్లో పడిపోతారు. ఈ ఆలోచనలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఈ ఆలోచనల నుంచి ఎంత త్వరగా  బయటపడితే అంత మంచిదని గ్రహించండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. మొదట్లో అన్నీ అడ్డంకులే ఎదురైనా విజయంపై ధీమాతో పనిచేయండి. ప్రేమజీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ నెలాఖర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : గులాబి 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఈవారం మీకు అంతా కలిసివస్తుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేసేందుకు ఇదే సరైన సమయం అన్న విషయం గ్రహిస్తారు. ఒక కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఆర్థికపరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఇల్లు కొనుగోలు చేస్తారు. మీకిష్టమైన వ్యక్తితో కలిసి విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : నారింజ 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారం కొన్ని అనుకోని పరిస్థితులు తలెత్తుతాయి. చేపట్టిన పనులన్నీ మధ్యలోనే ఆగిపోవడం మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది. అయితే ఇవన్నీ దాటుకొని వచ్చి నిలబడితేనే విజయం అని నమ్మండి. మీ ఆలోచనా విధానం కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకండి. చదవడం, వ్యాయామం చేయడం లాంటివి ఇష్టాలుగా మలచుకోండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. 
కలిసివచ్చే రంగు : వెండి 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొద్దిరోజులు ఆ నిర్ణయం తీసుకోకుండా వాయిదా వెయ్యడమే మంచిది. అన్నీ మీరు అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అనుకునేంతలో ఒకటేదో ఇబ్బంది పెట్టేది వచ్చి పడుతుంది. ఇవన్నీ మీ ఓపికను ప్రశ్నించేవే! ఒక కొత్త వ్యక్తి రాక మీ జీవితం మొత్తాన్నీ మార్చేస్తుంది. వారాంతంలో ఓ శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
మీ చుట్టూ ఉన్నవారి బాగోగులు చూడడంలో ముందుండే మీ స్వభావమే మీ బలమని నమ్మండి. ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అన్నివిధాలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈవారంలోనే ఓ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. రానున్న రోజులంతా సంతోషంగా గడుపుతారు. వృత్తిజీవితం అద్భుతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. 
కలిసివచ్చే రంగు : పసుపు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement