టారో : 21 ఆగస్టు నుంచి 27ఆగస్టు, 2016 వరకు | Taro | Sakshi
Sakshi News home page

టారో : 21 ఆగస్టు నుంచి 27ఆగస్టు, 2016 వరకు

Published Sun, Aug 21 2016 1:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

టారో : 21 ఆగస్టు నుంచి 27ఆగస్టు, 2016 వరకు

టారో : 21 ఆగస్టు నుంచి 27ఆగస్టు, 2016 వరకు

మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
నూతనోత్సాహం పుంజుకుంటారు. మార్పు దిశగా ముందంజ వేస్తారు. పాతగాయాలను భావి పురోగతికి పునాదులుగా మలచు కుంటారు. అనూహ్యమైన చోట అనూహ్యమైన పరిస్థితుల్లో ఆనందం పొందుతారు. మీ ధైర్య సాహసాలే మీకు శ్రీరామరక్షగా ఉంటాయి. ఉన్నతమైన ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగుతారు. పట్టుదలతో కృషి చేసి వృత్తి ఉద్యోగాల్లో సత్ఫలితాలను సాధిస్తారు.
లక్కీ కలర్: లేతనీలం
 
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)

వస్తు వ్యామోహాలకు, వ్యక్తిగత వ్యామోహాలకు దూరంగా ఉంటారు. అంతర్ముఖులై వాస్తవ పరిస్థితులను తేటతెల్లం చేసుకుంటారు. సమస్యలు, కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
లక్కీ కలర్: గోధుమ
 
మిథునం (మే 21 - జూన్ 20)
ఎంత పెద్ద భవంతికైనా పునాదులే ముఖ్యమనే విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. మీ ఘన విజయాలకు ఇతరులు మీపై ప్రశంసల జల్లు కురిపిస్తారు. పెద్ద అవకాశాలతో మరింత పని మీ చేతికొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడి వల్ల గాని లేదా ఇంట్లోని కుటుంబ పరిస్థితుల వల్ల గాని కొంత ఆందోళనకు లోనవుతారు.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
 
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
ప్రతికూలమైన ఆలోచనల నుంచి విముక్తి చెంది మానసిక స్వేచ్ఛ పొందాలని పరితపిస్తారు. ఈ వారంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాలకు... ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాలకు విహార యాత్రల కోసం వెళతారు. ప్రేమ వ్యవహారాలు ఉల్లాసంగా సాగుతాయి.
లక్కీ కలర్: లేత ఊదా
 
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ప్రేమికుల సమక్షంలోనే ఎక్కువ కాలం గడపడానికి ఇష్టపడతారు. మీ జీవితంలో శుభఘడియలు మొదలయ్యే తరుణం ఆసన్నమైంది. కళారంగంలో ఉన్నవారు మనసుకు నచ్చిన కళా సాధనలో ఎక్కువకాలం గడుపుతారు. సృజనాత్మకతకు పదును పెట్టుకుంటారు. నచ్చిన పనులు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.
లక్కీ కలర్: ఎరుపు
 
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఉరకలేసే ఉత్సాహంతో, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇతరులను కూడా మీ పంథాలోకి మార్చుకోగలుగుతారు. ఆత్మగౌరవానికీ అహంకారానికీ తేడా తెలుసుకుంటే మంచిది. లేనిపోని అహం ప్రదర్శించడం వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
లక్కీ కలర్: పొద్దుతిరుగుడు రంగు
 
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
సన్నిహితులతో, బంధువులతో సంబంధాలను పటిష్టం చేసుకుంటారు. కార్యసాఫల్యత సాధిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతిని నిలువరించే అవరోధాలు తొలగిపోతాయి. పని ఒత్తిడితో ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. సత్వర చికిత్స ద్వారా ఉపశమనం పొందగలరు.
లక్కీ కలర్: గోధుమరంగు
 
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు సాధిస్తారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నంలో చిన్న చిన్న ఆనందాలకు దూరమవుతారు. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. విహార యాత్రల్లో సన్నిహితులతో సరదాగా గడుపుతారు. కొత్తగా ప్రేమ వ్యవహారాలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ
 
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
జీవితం ప్రణాళికాబద్ధంగా సాగుతుంది. అనూహ్యంగా పరిస్థితులన్నీ సానుకూలంగా మారుతాయి. ఇంటా బయటా మార్పులు అనివార్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది.  అంచనాలకు మించిన ఆదాయం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. అయితే, భ్రమల్లోనే గడపకుండా తేరుకుని వాస్తవ పరిస్థితులను గుర్తించడం మంచిది.
లక్కీ కలర్: లేత ఆకుపచ్చ
 
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
అహాన్ని అదుపులో ఉంచుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అనవసరపు తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకున్న లక్ష్యాలను ప్రయాసతో పూర్తి చేస్తారు. ఇతరులను సానుకూలంగా అర్థం చేసుకోవడం, పరిస్థితులతో రాజీపడటం అనివార్యమవు తుంది. భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
లక్కీ కలర్: వెండిరంగు
 
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
అనూహ్యమైన అవకాశాలు అందివస్తాయి. కొత్త పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు జరగవచ్చు. దీర్ఘకాలిక కార్యాచరణ కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలకు రంగం సిద్ధం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో  ఉత్సాహం సడలకుండా ముందుకు సాగుతారు.
లక్కీ కలర్: లేత నారింజ
 
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఎలాంటి పరిమితులూ విధించుకోకుండా  ముందుకు సాగుతారు. సర్వ సన్నద్ధంగా పరిస్థితులను ఎదుర్కొంటారు. ఒక సాహస కృత్యం కారణంగా జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెడతారు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
లక్కీ కలర్: లేత గులాబి
- ఇన్సియా, టారో అనలిస్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement