మేషం (మార్చి 21 - ఏప్రిల్ 19)
ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. గ్రహబలం మిమ్మల్ని గెలుపుబాటలో నడిపిస్తుంది. తీరికలేని పనిఒత్తిడి ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడానికి వేగాన్ని మరింతగా పెంచాల్సి ఉంటుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్: ఎరుపు
వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
కాలానికంటే ముందుండేలా పరుగులు తీస్తారు. గతానుభవాలను మరచి కార్యసాధన దిశగా ముందుకు సాగుతారు. సహచరులు మిమ్మల్ని ఒక పట్టాన అర్థం చేసుకోలేరు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉంటున్నవారికి తగిన తోడు లభిస్తుంది. ప్రతి చిన్న సమస్యకూ పరిష్కారాన్ని సాధిస్తూ, వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు.
లక్కీ కలర్: లేతనీలం
మిథునం (మే 21 - జూన్ 20)
విహారయాత్రల కోసం సుదూర ప్రాంతాలకు వెళతారు. జీవన భద్రతకు, వృత్తి విజయాలకు సమాన ప్రాధాన్యమిస్తారు. అనుకోని పరిణామాల వల్ల కొంత అశాంతికి గురైనా, త్వరలోనే పరిస్థితులు దారిలోకి వస్తాయి. స్వయంఉపాధిలో ఉన్నవారికి పూర్తిగా సానుకూలమైన కాలం. ఆర్థికంగా మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నివిధాలా అదృష్టం కలిసొస్తుంది.
లక్కీ కలర్: ఆకుపచ్చ
కర్కాటకం (జూన్ 21 - జూలై 22)
అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం అశాంతి కలిగిస్తుంది. నిరాశ, నిస్పృహ అలముకుంటాయి. ఆలోచనలకు, ఆచరణకు పొంతన కుదరని పరిస్థితి ఎదురవుతుంది. బంధుమిత్రులతో కలసి విహారయాత్రలకు వెళతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం కొంత ఊరటనిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్: వెండిరంగు
సింహం (జూలై 23 - ఆగస్ట్ 22)
ఉత్సాహం సన్నగిల్లుతుంది. బద్ధకంతో పనులు వాయిదా వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లు ఎదురవుతాయి. పని ప్రదేశంలో సమస్యలను తప్పించుకోవాలంటే ఆచి తూచి నిక్కచ్చిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అలజడులు ఎదురవుతాయి. గొంతుకు సంబంధించిన సమస్యలు, శారీరక బలహీనత ఇబ్బందిపెడతాయి.
లక్కీ కలర్: లేతనీలం
కన్య (ఆగస్ట్ 23 - సెప్టెంబర్ 22)
ఇంటా బయటా పరిస్థితులు మెరుగు పడతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉత్సాహంతో ఉరకలు వేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్పెక్యులేషన్ వ్యవహారాలు, రిస్కుతో కూడిన లావాదేవీల ద్వారా లాభాలు అందివస్తాయి. చర్మ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు.
లక్కీ కలర్: లేతగోధుమ
తుల (సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22)
జీవితాన్ని వాస్తవిక దృక్పథంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ దౌత్య నైపుణ్యాలతో ఒక పెద్ద సమస్యను తేలికగా పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయపథంలో ముందుకు సాగుతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. వెన్నునొప్పి ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.
లక్కీ కలర్: లేతపసుపు
వృశ్చికం (అక్టోబర్ 23 - నవంబర్ 21)
జీవితంలో సమతుల్యత సాధించుకోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. కుటుంబ సంబంధాలలో పొరపొచ్చాలు సమసిపోయి, ప్రశాంతత నెలకొంటుంది. తిరుగులేని మీ శక్తి సామర్థ్యాలతో సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. కాలాన్ని ఏమాత్రం వృథాపోనివ్వరాదనే సంకల్పంతో పనుల్లో తలమునకలవుతారు. కళాసాధనలో సేదదీరుతారు.
లక్కీ కలర్: బూడిదరంగు
ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21)
సమస్యలు చుట్టుముట్టినా, ఆత్మస్థైర్యంతో వాటన్నింటినీ ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు తగిన కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆకాంక్షలకు తగిన ఫలితాలను సాధిస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయులతో దెబ్బతిన్న అనుబంధాన్ని పునరుద్ధరించుకునేందుకు మీ వంతుగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి.
లక్కీ కలర్: ముదురు గోధుమ
మకరం (డిసెంబర్ 22 - జనవరి 19)
అందమైన ఊహాలోకంలో విహరిస్తారు. ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోకుండా మీదైన శైలిలో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలతో సత్ఫలితాలను సాధిస్తారు. మీ విజయాలను జీర్ణించుకోలేని వారి నుంచి విమర్శలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై, అందచందాలపై శ్రద్ధచూపుతారు. వస్త్రధారణలో మార్పులు చేపడతారు.
లక్కీ కలర్: నేరేడు
కుంభం (జనవరి 20 - ఫిబ్రవరి 18)
మీ ఆకర్షణశక్తి అందరినీ ఆకట్టుకుంటుంది. సానుకూల దృక్పథంతో సత్ఫలితాలు సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. సరికొత్త ప్రేమలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎన్ని విజయాలు సాధించినా, ఉప్పొంగిపోకుండా ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తారు. పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలసి దూరప్రయాణాలకు వెళతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
లక్కీ కలర్: గోధుమరంగు
మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20)
ఒంటరిగా ఉంటున్నవారు తగిన తోడు కోసం వెదుకులాట కొనసాగిస్తారు. ‘నవ్వుతూ బతకాలిరా’ అన్నట్లుగా నవ్వుతూ, తుళ్లుతూ... అందరినీ నవ్విస్తూ ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. అయితే, వ్యాయామంపై శ్రద్ధపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామిని కానుకలతో ఆకట్టుకుంటారు.
లక్కీ కలర్: ముదురు ఆకుపచ్చ
టారో :7ఆగస్టు నుంచి 13ఆగస్టు, 2016 వరకు
Published Sun, Aug 7 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement
Advertisement