ఇక దూసుకుపోతారు! | Tarot Analyst | Sakshi
Sakshi News home page

ఇక దూసుకుపోతారు!

Published Sat, May 2 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

ఇక దూసుకుపోతారు!

ఇక దూసుకుపోతారు!

టారో బాణి
 
మేషం... ఈ వారమంతా ఉత్సాహంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ వేగవంతంగా పూర్తవుతాయి.  ఉద్యోగం మారే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. తగిన సమయం కోసం వేచి చూడటం ఉత్తమం. కలసివచ్చే రంగు: బేబీ పింక్
 
వృషభం... సమస్యలు తీరతాయి. ఎప్పటి నుంచో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు, ప్రాజెక్టులు ఇప్పుడు పూర్తవుతాయి. లక్ష్యాలు అందుకుంటారు.  కొత్త బంధాలు ఏర్పడతాయి. ఉన్న బంధాలు బలపడతాయి.  కలసివచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్
 
మిథునం... వృత్తిపరంగా అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది.  అయితే వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు, మానసికంగా చిన్నపాటి ఒత్తిడులు ఎదురు కావచ్చు. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతోన్న ఒక వ్యక్తితో సంబంధం తెగిపోవచ్చు. దానివల్ల కాస్త బాధ కలిగినా కానీ, భవిష్యత్తులో మంచే జరుగుతుంది.  కలసివచ్చే రంగు: లిలాక్
 
కర్కాటకం... కొత్త పనులు, ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది తగిన సమయం. మీ జ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ ఉపయోగించి జీవితంలో ఎదగడానికి ఇదే మంచి సమయం. ఆరోగ్యం కాస్త బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి జిమ్‌కి వెళ్లడం, అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం చేయండి. కలసివచ్చే రంగు: వెండిరంగు
 
సింహం... వృత్తిపరంగా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులతో సంబంధాలు బలపడతాయి. అన్ని విషయాల్లోనూ దూసుకుపోతారు. ప్రేమ వ్యవహారాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
 కలసివచ్చే రంగు: నారింజ రంగు
 
కన్య... వృత్తిపరంగా ఇది మీకు ఎంతో ముఖ్యమైన సమయం. లక్ష్యసాధన దిశగా అడుగులు వేస్తారు. త్వరలోనే విజయాలను అందుకునే అవకాశం ఉంది.  ఓ కొత్త వ్యక్తి మీ మనసులోకి ప్రవేశించే అవకాశం ఉంది.
 కలసివచ్చే రంగు: లేత గోధుమరంగు
 
తుల... విధి నిర్వహణలోను, వ్యాపార లావాదేవీల్లోనూ కొన్ని సమస్యలు ఎదురు కావొచ్చు. అయితే మీకున్న అద్భుతమైన కమ్యునికేషన్ స్కిల్స్ ద్వారా వాటిని అధిగమిస్తారు.  ఓ ముఖ్యమైన ప్రాజెక్టు మీ చేతికి అందుతుంది. దాన్ని విజయవంతంగా ప్రారంభిస్తారు. కలసివచ్చే రంగు: ఊదా రంగు
 
వృశ్చికం... శుభవార్తలు, శుభ సంకేతాలు వెతుక్కుంటూ వస్తాయి. అంతా సంతోషమే కనిపిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. కొంతకాలంగా అనుబంధాల్లో ఏర్పడిన అపార్థాలు తొలగి ఆనందాన్ని పొందుతారు. ఇంటిలోకి ఓ పసిబిడ్డ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చిన్నపాటి ఒత్తిడులు ఎదురు కావొచ్చు. కలసివచ్చే రంగు: పసుపు
 
ధనుస్సు... ఆర్థికంగా ఎదిగేందుకు, కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి, కొత్త బాధ్యతలు స్వీకరించడానికి తగిన సమయం. అనుకోని వివాదాలు, సమస్యలు చుట్టుముడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఇరుకున పడేసే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు
 
మకరం... మీరు ఏదైనా పని కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే మాత్రం ఇది తగిన సమయం కాదు. కాబట్టి కాస్త ఆచితూచి అడుగేయండి. ఇతరులు చెప్పే పుకార్లకి చెవి ఒగ్గకండి. అది మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. మీ విజయానికి అడ్డంకి కావొచ్చు. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే విజయం సాధిస్తారు. ప్రశంసలూ పొందుతారు.  కలసివచ్చే రంగు: ముదురు నారింజ
 
కుంభం... వృత్తిపరంగా మీకు అదనపు బాధ్యతలు లభిస్తాయి. వాటిని మీరు సమర్థవంతంగా నిర్వర్తించి ప్రసంశలు పొందుతారు. అయితే మిమ్మల్ని ఒక విధమైన ఆధ్యాత్మిక భావనలు ఈవారం చుట్టుముడతాయి. ఈ కారణంగా మీరు పనిలో కాస్త స్లో అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోండి.
 కలసివచ్చే రంగు: బ్రౌన్
 
మీనం.. ఈవారం మీరు చాలా హుషారుగా, మంచి సెన్సాఫ్ హ్యూమర్‌తో ఉంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ల పెదవులపై సైతం మీ కారణంగా నవ్వులు పూస్తాయి. మీరు వెతుకుతోన్న లక్షణాలు గల భాగస్వామి మీకు కనిపిస్తారు. వారు మీకు తగిన జోడీ అయిన సింహరాశి వారే అయివుంటారు. మీకు అసంతృప్తి కలిగిస్తోన్న పరిస్థితులనన్నింటినీ అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అయితే చాకచక్యంగా వ్యహరించడం చేతకాక ఇబ్బందుల్లో పడతారు. కలసివచ్చే రంగు: పిస్తా గ్రీన్
 
 ఇన్సియా కె.  టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement