అంతరాత్మ మాట వినండి | Listen to the voice of conscience | Sakshi
Sakshi News home page

అంతరాత్మ మాట వినండి

Published Sat, Oct 24 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 11:22 AM

అంతరాత్మ మాట వినండి

అంతరాత్మ మాట వినండి

అక్టోబర్ 24 నుంచి 30 వరకు
టారో బాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఈ వారంలో చాలా సాహసోపేతమైన పనులు చేస్తారు. దృఢనిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీలోని భయాలను జయించండి. పాజిటివ్ థింకింగ్ వల్ల అనేకమైన అడ్డంకులను, చిక్కుసమస్యలను అధిగమిస్తారు. ఎవరు, ఎంతగా బలహీనపరచాలని చూసినా చెదరకండి. విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 ఉత్సాహాన్ని, జయాలను చేకూర్చే వారమిది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. పెద్దహోదాలో ఉన్న ఉద్యోగులు, అధికారులు మంచి గుర్తింపును పొందుతారు. కిందిస్థాయి వారితో ఉదారంగా వ్యవహరించడం, దానధర్మాలు చేయడం మంచిది. అలసిన శరీరాన్ని  విహార యాత్రలతో సేదతీర్చండి. కలిసొచ్చే రంగు: పచ్చరాయి రంగు
 
జెమిని (మే 21-జూన్ 21)
అందమైన మీ శరీరం, మృదువైన మీ మాట మీకు ఇబ్బందులు తేవచ్చు. అయితే స్వచ్ఛమైన మీ మనసు, ప్రేమించే మీ తత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోండి. అవివాహితులకు తగిన సంబంధం కుదురుతుంది. నాన్పుడు ధోరణిని మాని, చకచకా నిర్ణయాలు తీసుకోండి. కలిసొచ్చే రంగు: కెంపు రంగు
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)
 మీ కలలను ఫలప్రదం చేసుకోవడానికి ఇది తగిన సమయం. మీది తీరని కోరిక అనుకుని నిరుత్సాహపడకండి. మీ లక్ష్యం నెరవేరదు అని నీరుకారిపోకండి. ఆ రెంటినీ ఎంతో అవలీలగా సాధిస్తారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు కుట్రలు, కుతంత్రాలను వాటితోనే ఎదుర్కోవాలని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు
 
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

మార్పు అనివార్యం. అందుకు సిద్ధంగా ఉండండి. మీ అంతరాత్మ మాట వినండి. వివిధ విషయాలపట్ల మీకున్న అపారమైన పరిజ్ఞానానికి మీ చుట్టుపక్కల వారందరూ అమితంగా ఆశ్చర్యపోతారు. మీ అంతరంగిక శక్తులను మరింతగా వెలికి తీసేందుకు ప్రయత్నించండి. మేధస్సుకు మరింత పదును పెట్టండి. కలిసొచ్చే రంగు:వంకాయరంగు
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మిమ్మల్ని మభ్యపెట్టి, మీ ద్వారా పనులు చేసుకునేందుకు యత్నాలు జరగవచ్చు. ఏమాత్రం ప్రలోభపడినా, చిక్కుల్లో పడక తప్పదు. మీ నీతి, నిజాయితీలని విడిచిపెట్టకండి. చీకటి శక్తులు, అరాచకవాదులతో తీవ్రపోరాటం తప్పదు. రేఖీని ఫాలో అవడం మంచిది. నచ్చిన వారితో ఆనందంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
పకి మెచ్చుకుంటూనే వెనకాల గోతులు తవ్వేవారు, రకరకాల వదంతులు ప్రచారం చేసేవాళ్లు కాచుకుని ఉన్నారు. అందమైన స్త్రీలని మీ మీద ఎరగా ప్రయోగించి, మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా వ్యవహరించండి. సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు కష్టంగా ఉన్నా, ధైర్యంగా ముందుకెళ్లండి. కలిసొచ్చే రంగు:ముదురు ఎరుపు
 
 
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
మీరు ఎదురు చూసే ముఖ్యమైన మార్పు రానుంది. అందుకు తగ్గట్టు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. కట్లను చూసి భయపడితే ఎలా? పగలు ఉంటుంది, వెలుగూ ఉంటుంది కదా! మీకున్న జ్ఞానాన్ని, మీ సహజమైన ధైర్యాన్ని, సానుకూల దృక్పథాలనే ఆయుధాలుగా చేసుకుని సమస్యలను తరిమి కొట్టండి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు, వెండిరంగు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
 మీ నిరాడంబర జీవనవిధానం వల్లే మీకు మేలూ, కీడూ కూడా! ఇది ఇలాగే ఇంకొంతకాలం కొనసాగించడం మంచిది. సమాజం దృష్టిలో మీరు ఎంతో మంచివారిగా, నిరాడంబరులుగా నిలిచిపోతారు. అయితే కొన్ని అనూహ్యమైన, అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రేమలో పడవచ్చు. కలిసొచ్చే రంగు: నీలిమందు రంగు
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
 ఎంతో ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. మీ మూలంగా మీ చుట్టుపక్కల వారు కూడా సంతోషంగా ఉంటారు. మీ సాన్నిధ్యంలో అందరూ ఎంతో ఊరట పొందుతారు. ఎన్ని పనులున్నా ఆడుతూ పాడుతూ అవలీలగా చేసేస్తారు. మొన్నటి దసరా పండుగ మీకు మిగిల్చిన ఆనందాన్ని, కలిగించిన అదృష్టాన్ని వదులుకోకండి. కలిసొచ్చే రంగు: బంగారు రంగు
 
 
 అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
 మీరు ఎంతో శక్తిమంతులు. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఒక్కోసారి మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం సడలుతుంటుంది. ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించి, మీ శక్తిసామర్థ్యాలను మీకు గుర్తు చేస్తే తిరిగి ఉత్సాహం తెచ్చుకుంటారు. ఆధ్యాత్మికంగా మీలో మార్పు కలుగుతుంది. దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది.. కలిసొచ్చే రంగు: మీగడలాంటి తెల్లటి రంగు
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 మీ ప్రేయసి లేదా జీవిత భాగస్వామి మిమ్మల్ని నిందించవచ్చు. వారితో విభేదాలు రావచ్చు. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. అయితే దీనిమూలంగా కొన్ని కొత్త సమస్యలు, ససవాళ్లు ఎదురు కావచ్చు. మిమ్మల్ని చేతకానివాళ్లు అనుకునే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసుకు వచ్చి, వాటిని నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: మెరిసే నీలిరంగు
 
 ఇన్సియా కె.
 టారో అండ్  ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
 
సౌర వాణి
 

ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)
తొందరపాటు ఆలోచనలు చేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయవద్దు. అలాగే అనవసరమైన చర్చలు, వాదోపవాదాలూ లేవదీయడం కూడా మంచిది కాదు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. వాటిని సజావుగా అమలు చేయండి. మీ అభిప్రాయాన్ని ముఖం మీద కొట్టినట్లుగా కాకుండా మృదువుగా చెప్పడం మంచిది.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ఐకమత్య పరిస్థితినీ ఓ కంట కనిపెట్టండి. అనవసర ఘర్షణలతో వ్యక్తుల మధ్య కొన్ని తేడాలు వస్తూ ఉండవచ్చు. దీనివల్ల సంసారం బయటపడవచ్చు. ముఖ్యంగా మాట పట్టింపు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. అన్నింటినీ మించి బంధువులు మనింటి విషయాలను ఆరాతీస్తున్నారేమో కనిపెట్టి ఉండండి.
 
జెమిని  (మే 21-జూన్ 21)
అతి ముఖ్యమూ, జీవితాన్ని ఓ చక్కటి మలుపు తిప్పే ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారేమో గమనించుకోండి. వీలయినంత తొందరగా పూర్తి చేసుకోండి. సంతానం గురించిన శ్రద్ధని పాటించి తీరాలి. బంధువులతో సత్సంబంధాలు నెరపండి కానీ, బంధువులే లోకంగా ఉంటే పనులన్నీ వెనకబడతాయి.
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)
 ఏ సమయానికి ఏది వీలో, ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఎప్పటికప్పుడు ఆలోచించుకుని లౌక్యంగా ఇవతలకి వచ్చేయడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. నిజాయితీగా ఇది నాకు నచ్చదు అనే విషయాన్ని సమయానుకూలంగా స్పష్టంగా చెప్పేయండి. మొగమాటాన్ని వీడండి. అంతర్భయం వద్దు.
 
లియో(జూలై 24-ఆగస్టు 23)
లోగడ చేసిన రుణాలు ఒకటో రెండో కొద్దిగా బాధించవచ్చు. అయితే వాటివల్ల అంత ఇబ్బంది లేదని గమనించండి. కొత్తవ్యాపారం ప్రారంభించడం ఇప్పట్లో అంత మంచిది కాదు. మీ కులవృత్తిని లేదా లోగడ మీకు అనుభవం ఉన్న వృత్తినీ ఎంచుకున్న పక్షంలో మీకు తిరుగుండదు. మీకున్న పలుకుబడి కారణంగా ఎందరెందరో మీకు సాయపడవచ్చు. దిగులు పడకండి.
 
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
పరాకు పడుతూ చేస్తున్న ఉద్యోగంలో కొన్ని పొరపాట్లని చేసే అవకాశం ఉంది. ఆడంబరం కోసం కొంత వ్యయం చేస్తారనిపిస్తోంది. ప్రయాణ సందర్భాల్లో వస్తువుల జాగ్రత్త అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని సకాలంలో చెల్లించడం, ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించడం, కిందిస్థాయి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం.
 
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనకి గురి చేయవచ్చు. ఇంటాబయటా చిన్న చిన్న సమస్యల కారణంగా మానసికంగా కొంత నలిగిపోయే అవకాశముంది. ఆర్థికంగా కొంత లోటు ఉండవచ్చు. దానిని పూడ్చుకునేందుకు తగిన మార్గాలను అన్వేషించుకోండి. సమస్యలకు రాజీ మార్గమే సరైనదేమో ఆలోచించుకోండి.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 మీరు ఎంతో విశ్వసించిన వ్యక్తి మిమ్మల్ని మోసగించడం లేదా మీకే ద్రోహం చేయడం వంటివి జరగవచ్చు. అతిగా నమ్మడమనేది మీ దోషమే తప్ప వారిది కాదనుకుని, భవిష్యకాలాన్ని గురించి ఆలోచించండి. జరిగిన దాని మీద దృష్టి పెడుతూ, వర్తమానాన్ని పాడు చేసుకోకండి. మీకు ద్రోహం చేసిన వారి విషయంలో పగ, ద్వేషం, అరాచకం వంటి దిశగా ఆలోచించకండి.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
మీరు రైతులయిన పక్షంలో చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. బంధువుల్లో జరిగే శుభకార్య నిర్వహణా భారాన్ని మీరే మోస్తారు. ఒకవిధంగా ఆలోచిస్తే మీకు పెద్దరికాన్ని ఇస్తే కాదనకుండా చేయడం మీకెంతో ఇష్టం. అయితే శరీర శ్రమని గుర్తించి సహాయపడండి. స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం తలపెట్టే ఆలోచన  ఉంటే దానిని జనవరి 15 వరకూ వాయిదా వేయడం మంచిది.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఆధ్యాత్మిక గురువులను కలవడం, పుణ్యక్షేత్రాలని సందర్శించడం జరగవచ్చు. మీ సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. వీలయినంత వరకూ దూరప్రయాణాలని మానుకుని ఉన్నచోటులోనే ఎదగడానికి యత్నించడం ఉత్తమం. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వవద్దు. ఇచ్చాక వెనుకాడద్దు.
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
మీ పై అధికారులు ఏమాత్రపు దోషం మీలో దొరుకుతుందనే దృష్టితో పరిశీలిస్తున్నారనే భావంతో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి వంటివానిని అప్రమత్తంగా నిర్వహించండి. పాత వాహనాలని అమ్మి కొత్తవి కొనాలనుకోవడం, ఇంటిని మార్చడం లేదా పాత ఇంటిని అమ్మి కొత్తదాన్ని అప్పు చేసి మరీ కొనాలనుకోవడం వంటివాటిని కొద్దికాలంపాటు వాయిదా వేయండి.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
ఆర్థికమైన పేచీలు కుటుంబంలో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉందని గ్రహించి, ముందే మేల్కొని ఆర్థిక క్రమశిక్షణని పాటించండి. మీరు తీసుకోవలసిన పత్రాలని జాగ్రత్తగా పరిశీలించడం, ప్రయాణాలలో మీ వస్తువులను ఇతరులకు అప్పగించకుండా మీరే జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement