Srinivasa Rao mailavarapu
-
తల్లిదండ్రులకు ఆరోగ్యపరీక్షలు అవసరం
డిసెంబర్ 5 నుంచి 11 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) సంవత్సరాంతానికి వచ్చాం కదా అని ఈ వారమంతా పాత జ్ఞాపకాలతో భావోద్వేగాలతో గడుపుతారు. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఫలించి, ఆర్థికపరంగా ఏదో గారడీ చేసినట్లుగా ధనసమృద్ధి కలుగుతుంది. కలిసొచ్చేరంగు: నారింజ టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఈ వారం మీకు కొత్త అవకాశాలతో అభివృద్ధికరంగా ఉంటుంది. విదేశీవ్యక్తి నుంచి మీకు ఒక ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. జీవితంలో సమత్యులత కోసం సామరస్యత కోసం రకరకాల త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఆ మేరకు మనశ్శాంతి లభిస్తుంది కనక. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే జెమిని (మే 21-జూన్ 21) అదృష్టం, ఆదాయ వృద్ధి కలిసికట్టుగా వస్తాయి. మీకు సంతోషాన్నిచ్చేలా విలువైన, అపురూపమైన బహుమతులు అనూహ్యంగా లభిస్తాయి. జాయింటుగా చేసే ఫైనాన్స్ వ్యాపారావకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ప్రేమికులకు మీ మనసులో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు తగిన ధైర్యం వస్తుంది. కలిసొచ్చేరంగు: ఎమరాల్డ్ గ్రీన్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) వ్యక్తిగతంగా ఇది మీకు బాగా కలిసొచ్చే వారం. మీ సౌంద ర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తారు. మీ మేధస్సుకు పదును పెట్టుకుంటారు. ఈ వారం అంతా అదృష్టకరంగా గడుస్తుంది. కలిసొచ్చే రంగు: వెండిరంగు లియో (జూలై 24-ఆగస్టు 23) మీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి. కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ కూడా ఇది మీకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వారం. ప్రపంచాన్నే జయించగలననేంత శక్తి వస్తుంది మీకు. మీరు ప్రేమించే వారిని/ జీవిత భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది తగిన సమయం. చేతులు దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: లేత నీలిరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) జీవితం మరింత సౌకర్యంగా మారుతుంతి. దాంతో మీ జీవన శైలి మారుతుంది. అయితే మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదం ఏర్పడవచ్చు. కెరీర్‌పరంగా మీ దిశ ఏమిటనేది నిర్ధారించుకోవలసి వస్తుంది. అనూహ్యమైన మార్గాల నుంచి డబ్బు వస్తుంది. ప్రేమ ముదురు పాకాన పడుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. కలిసొచ్చే వారం: రాగి రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం కెరీర్పరంగానూ, వ్యాపార పరంగానూ మీకు లబ్ధి చేకూర్చవచ్చు. మీ బంధాన్ని కొనసాగించాలనుకుంటే మీ ఆలోచనా సరళిలో, వ్యవహార శైలిలో మార్పు చేసుకోక తప్పదు. మీరు మారడానికి ఇదే చివరి అవకాశం. సంగీతం వింటూ, పాడుతూ ఉంటే మీ అంతర్గత శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఈ వారం మీకు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. మీరు సాధించిన ప్రాపంచిక లేదా వ్యాపార లాభాలతో ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీకంటూ బలమైన నమ్మకాలు, విలువలతో కూడిన విశ్వాసాలను, అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఇతరులతో మీ మనసులోని మాటను చెప్పుకుని ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఇది తగిన సమయం. అయితే అది అంత సులువు కాదు. పెద్ద యుధం చేయవలసి రావచ్చు. అనేకరకాల సమస్యలు, సవాళ్లతో సహవాసం చేయవలసి ఉంటుంది. శాంతి కావాలనుకుంటే ప్రేమను త్యజించక తప్పదు. యుద్ధం చేస్తే విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీప్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) రకరకాల తాయిలాలతో కూడిన కొనుగోళ్లు మిమ్మల్ని అయోమయంలో పడేయవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో అనేకరకాల ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వైవాహిక బంధంలో పడతారు. రకరకాల ప్రలోభాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి. ప్రేమ కోసం పరితపిస్తున్న మీకు మీ మనసును దోచుకునే వ్యక్తి ఎదురు అవుతారు. కలిసొచ్చే రంగు: గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఒక పెద్ద సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు. పెద్ద అవరోధాన్ని అధిగమిస్తారు. కెరీర్ పరంగా డబుల్ జంప్ చేస్తారు. సామాజిక జీవితాన్ని బిజీబిజీగా గడిపేస్తారు. ఆరోగ్యపరంగా అయితే, మంచి ఎక్సర్సైజులు చేయడం అవసరం. ఈ వారం టూర్లు, వినోదపర్యటనలు ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: సిల్కీ ఎల్లో టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ సంతానపరంగా మీకు ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. మీ సంతానం పై అధికారులయిన పక్షంలో కిందిస్థాయి సిబ్బందితో మైత్రిని ఏర్పాటు చేసుకుని సంస్థని సక్రమంగా నడిచేలా చేసుకోగల కాలమిది. అదే తీరుగా పెద్దలనీ అనుభవజ్ఞులనీ అడిగి నూతనమైన మెళకువలని గమనించుకోగల కాలం ఇదే. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రయత్నించండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఎంతో మిత్రునిగా, ఆత్మీయునిగా అండదండలుగా ఉండే ఒకరి దురాలోచన మీకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే వంచనకు గురయ్యారని తెలిసీ, మళ్లీ ఆదరించడం మాత్రం సరికాదు. జరిగిన పొరపాటును గ్రహించుకోండి తప్ప, ఆ నష్టపోయిన దానికి ప్రయత్నించవద్దు. సంతానంలో ఒకరి పరిస్థితి కొంత బాధని కల్గించవచ్చు. జెమిని (మే 21-జూన్ 21) మీలో దాగిన ప్రతిభకి ఓ పురస్కారం వచ్చే అవకాశం ఉంది. మీలో గుంభన తక్కువైన కారణంగా మీ ఆలోచనకే కొద్ది మార్పు చేర్పులు చేసి, దాన్ని తమదిగా ఇతరులు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆలోచన అన్యాక్రాంతం కాకుండా చూసుకోండి. మీ మొహమాటమే మీ చేతికి మీరు వేసుకునే సంకెళ్లవంటిదని గుర్తించండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) అనవసరమైన ఆందోళనకి గురి అవుతూ కన్పిస్తారు. భయపడవలసిన పరిస్థితి కాని, భయపెట్టే సంఘటనలు కానీ ఈ వారంలో ఏమీ లేవు-ఉండవు. ధనసంపాదన చక్కగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం నిశ్చితార్థపు మాటలు జరగవచ్చు. ఉన్న సొమ్మును స్థిరాస్తుల కొనుగోలుకు ఖర్చు చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది. లియో (జూలై 24-ఆగస్టు 23) ఎంత సంపాదిస్తున్నారో దానికి సరిపడినంత ఖర్చు సిద్ధంగా ఉండవచ్చు. ఉద్యోగంలో వృత్తిలో మీ మీద కొంత వ్యతిరేకత ఉన్న కారణంగా అనవసరమైన ప్రచారం సాగవచ్చు. ధైర్యంగా ఉండండి. మీ వైపు తప్పక బలగం ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణదాతల ఒత్తిడి పెద్దగా ఉండదు. తలిదండ్రులకి ఆరోగ్యపరీక్షలు అవసరం. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) అప్పులివ్వడం, తీసుకోవడం ఈ వారంలో వద్దు. శ్రమించడానికి సిద్ధంగా ఉండాలి. సంఘంలో మంచి అనుకూలత ఉంటుంది. న్యాయస్థానంలో మీకు అనుకూలమైన తీర్పు లభించవచ్చు. సంతానంలో ఒకరిని తరచూ అనారోగ్యంతో ఉంటుంటే, మరో వైద్యుని ద్వారా మెరుగైన చికిత్స ఇప్పించడం, లేదా మరో వైద్యుని సలహా తీసుకోవడం శ్రేయస్కరం. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) అన్నీ తెలుసునన్న అహంకారం గానీ, గట్టి ప్రయత్నాలని చేస్తున్నాననే ధీమా గానీ ఉండకూడదు. అవివాహితులకి వివాహ సూచన, విద్యార్థులకి సత్ఫలితం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కొంచెం ఆలస్యంగానైనా జరిగి తీరతాయి. జీవితానికి సంబంధించిన గడ్డు సమస్య ఉన్నట్లయితే అభిమానానికీ, పట్టుదలకీ పోకుండా సామరస్య ధోరణిలో వెళ్లడం మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఒక కార్యం కోసం పదివైపుల నుంచీ ప్రయత్నాలని విశేషంగా చేస్తారు. అది అవసరం కూడా. కుటుంబ రహస్యాలని మీ ఇంటి నుండి కుటుంబ సభ్యులో ఎవరూ బహిరంగపరచకుండా చూసుకోండి. ధర్మమార్గంలోనే ప్రయాణించండి. విజయం మీదేనని గ్రహించండి. ఇతరులు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా విని మీదైన ఆలోచనతో ప్రశాంతంగానే ఎదుర్కోండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ప్రశంసలకి లొంగిపోయి, మీ పరిధులని దాటి మాటసహాయం లేదా ఆర్థిక సహాయం గాని చేయవద్దు. తోటి ఉద్యోగులతో ఎంత దూరంలో ఉండాలో, వాళ్లనెంత దూరంలో ఉంచాలో అలా ప్రవర్తించడం మంచిది. వాహనాన్ని నడిపే విషయంలో తగుమాత్రపు శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని, తీర్చవలసిన చిన్నచిన్న రుణాలనీ వెంటనే తీర్చండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వ్యవసాయ దారులయితే ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. ప్రభుత్వం నుండి రావలసినవేమైనా ఉంటే తప్పక వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆశించిన ఉద్యోగం వాయిదా పడవచ్చు. పోటీ పరీక్షల విషయంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దుర్వ్యసన పరుల సహవాసం మిమ్మల్ని పెద్ద ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి దూరాన్ని పాటించండి అలాంటివారితో. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) నమ్మకంగా వంచించే వ్యక్తుల్ని గుర్తించి వారి మోసంలో పడకుండా తప్పించుకోగలుగుతారు. మిమ్మల్ని వంచింపబోయారనే దృష్టితో ప్రతీకార బుద్ధితో ఉండకండి. మనకి కష్టం రాలేదనే ఆనందంతో ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హామీలనీ వాగ్దానాలనీ ఏ మాత్రమూ చేయవద్దు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపటానికి ప్రయత్నించండి. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) మీ శత్రువులు మీకు దూరంగా వెళ్లిపోతారు. మీ ధర్మ ప్రవర్తన వల్ల కానీ, మీ నేర్పరితనం వల్లగానీ, వాళ్లు మిమ్మల్ని ఏమీ చేయలేమని అర్థం చేసుకుంటారు. రుణాల్ని క్రమపద్ధతిలో తీరుస్తూ ఉండండి. ఆస్తులు అమ్మాలనే ఆలోచన విరమించుకోండి. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి దశలో ఉంటుంది. బంధుమిత్రులకి సూచనలనీ సలహాలనీ ఇవ్వకండి. మైలవరపు శ్రీనివాసరావు -
అంతరాత్మ మాట వినండి
అక్టోబర్ 24 నుంచి 30 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారంలో చాలా సాహసోపేతమైన పనులు చేస్తారు. దృఢనిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీలోని భయాలను జయించండి. పాజిటివ్ థింకింగ్ వల్ల అనేకమైన అడ్డంకులను, చిక్కుసమస్యలను అధిగమిస్తారు. ఎవరు, ఎంతగా బలహీనపరచాలని చూసినా చెదరకండి. విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఉత్సాహాన్ని, జయాలను చేకూర్చే వారమిది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. పెద్దహోదాలో ఉన్న ఉద్యోగులు, అధికారులు మంచి గుర్తింపును పొందుతారు. కిందిస్థాయి వారితో ఉదారంగా వ్యవహరించడం, దానధర్మాలు చేయడం మంచిది. అలసిన శరీరాన్ని విహార యాత్రలతో సేదతీర్చండి. కలిసొచ్చే రంగు: పచ్చరాయి రంగు జెమిని (మే 21-జూన్ 21) అందమైన మీ శరీరం, మృదువైన మీ మాట మీకు ఇబ్బందులు తేవచ్చు. అయితే స్వచ్ఛమైన మీ మనసు, ప్రేమించే మీ తత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోండి. అవివాహితులకు తగిన సంబంధం కుదురుతుంది. నాన్పుడు ధోరణిని మాని, చకచకా నిర్ణయాలు తీసుకోండి. కలిసొచ్చే రంగు: కెంపు రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ కలలను ఫలప్రదం చేసుకోవడానికి ఇది తగిన సమయం. మీది తీరని కోరిక అనుకుని నిరుత్సాహపడకండి. మీ లక్ష్యం నెరవేరదు అని నీరుకారిపోకండి. ఆ రెంటినీ ఎంతో అవలీలగా సాధిస్తారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు కుట్రలు, కుతంత్రాలను వాటితోనే ఎదుర్కోవాలని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు లియో (జూలై 24-ఆగస్టు 23) మార్పు అనివార్యం. అందుకు సిద్ధంగా ఉండండి. మీ అంతరాత్మ మాట వినండి. వివిధ విషయాలపట్ల మీకున్న అపారమైన పరిజ్ఞానానికి మీ చుట్టుపక్కల వారందరూ అమితంగా ఆశ్చర్యపోతారు. మీ అంతరంగిక శక్తులను మరింతగా వెలికి తీసేందుకు ప్రయత్నించండి. మేధస్సుకు మరింత పదును పెట్టండి. కలిసొచ్చే రంగు:వంకాయరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మిమ్మల్ని మభ్యపెట్టి, మీ ద్వారా పనులు చేసుకునేందుకు యత్నాలు జరగవచ్చు. ఏమాత్రం ప్రలోభపడినా, చిక్కుల్లో పడక తప్పదు. మీ నీతి, నిజాయితీలని విడిచిపెట్టకండి. చీకటి శక్తులు, అరాచకవాదులతో తీవ్రపోరాటం తప్పదు. రేఖీని ఫాలో అవడం మంచిది. నచ్చిన వారితో ఆనందంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) పకి మెచ్చుకుంటూనే వెనకాల గోతులు తవ్వేవారు, రకరకాల వదంతులు ప్రచారం చేసేవాళ్లు కాచుకుని ఉన్నారు. అందమైన స్త్రీలని మీ మీద ఎరగా ప్రయోగించి, మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా వ్యవహరించండి. సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు కష్టంగా ఉన్నా, ధైర్యంగా ముందుకెళ్లండి. కలిసొచ్చే రంగు:ముదురు ఎరుపు స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎదురు చూసే ముఖ్యమైన మార్పు రానుంది. అందుకు తగ్గట్టు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. కట్లను చూసి భయపడితే ఎలా? పగలు ఉంటుంది, వెలుగూ ఉంటుంది కదా! మీకున్న జ్ఞానాన్ని, మీ సహజమైన ధైర్యాన్ని, సానుకూల దృక్పథాలనే ఆయుధాలుగా చేసుకుని సమస్యలను తరిమి కొట్టండి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు, వెండిరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ నిరాడంబర జీవనవిధానం వల్లే మీకు మేలూ, కీడూ కూడా! ఇది ఇలాగే ఇంకొంతకాలం కొనసాగించడం మంచిది. సమాజం దృష్టిలో మీరు ఎంతో మంచివారిగా, నిరాడంబరులుగా నిలిచిపోతారు. అయితే కొన్ని అనూహ్యమైన, అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రేమలో పడవచ్చు. కలిసొచ్చే రంగు: నీలిమందు రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఎంతో ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. మీ మూలంగా మీ చుట్టుపక్కల వారు కూడా సంతోషంగా ఉంటారు. మీ సాన్నిధ్యంలో అందరూ ఎంతో ఊరట పొందుతారు. ఎన్ని పనులున్నా ఆడుతూ పాడుతూ అవలీలగా చేసేస్తారు. మొన్నటి దసరా పండుగ మీకు మిగిల్చిన ఆనందాన్ని, కలిగించిన అదృష్టాన్ని వదులుకోకండి. కలిసొచ్చే రంగు: బంగారు రంగు అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీరు ఎంతో శక్తిమంతులు. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఒక్కోసారి మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం సడలుతుంటుంది. ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించి, మీ శక్తిసామర్థ్యాలను మీకు గుర్తు చేస్తే తిరిగి ఉత్సాహం తెచ్చుకుంటారు. ఆధ్యాత్మికంగా మీలో మార్పు కలుగుతుంది. దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది.. కలిసొచ్చే రంగు: మీగడలాంటి తెల్లటి రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ ప్రేయసి లేదా జీవిత భాగస్వామి మిమ్మల్ని నిందించవచ్చు. వారితో విభేదాలు రావచ్చు. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. అయితే దీనిమూలంగా కొన్ని కొత్త సమస్యలు, ససవాళ్లు ఎదురు కావచ్చు. మిమ్మల్ని చేతకానివాళ్లు అనుకునే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసుకు వచ్చి, వాటిని నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: మెరిసే నీలిరంగు ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) తొందరపాటు ఆలోచనలు చేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయవద్దు. అలాగే అనవసరమైన చర్చలు, వాదోపవాదాలూ లేవదీయడం కూడా మంచిది కాదు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. వాటిని సజావుగా అమలు చేయండి. మీ అభిప్రాయాన్ని ముఖం మీద కొట్టినట్లుగా కాకుండా మృదువుగా చెప్పడం మంచిది. టారస్ (ఏప్రిల్ 21-మే 20) కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ఐకమత్య పరిస్థితినీ ఓ కంట కనిపెట్టండి. అనవసర ఘర్షణలతో వ్యక్తుల మధ్య కొన్ని తేడాలు వస్తూ ఉండవచ్చు. దీనివల్ల సంసారం బయటపడవచ్చు. ముఖ్యంగా మాట పట్టింపు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. అన్నింటినీ మించి బంధువులు మనింటి విషయాలను ఆరాతీస్తున్నారేమో కనిపెట్టి ఉండండి. జెమిని (మే 21-జూన్ 21) అతి ముఖ్యమూ, జీవితాన్ని ఓ చక్కటి మలుపు తిప్పే ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారేమో గమనించుకోండి. వీలయినంత తొందరగా పూర్తి చేసుకోండి. సంతానం గురించిన శ్రద్ధని పాటించి తీరాలి. బంధువులతో సత్సంబంధాలు నెరపండి కానీ, బంధువులే లోకంగా ఉంటే పనులన్నీ వెనకబడతాయి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఏ సమయానికి ఏది వీలో, ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఎప్పటికప్పుడు ఆలోచించుకుని లౌక్యంగా ఇవతలకి వచ్చేయడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. నిజాయితీగా ఇది నాకు నచ్చదు అనే విషయాన్ని సమయానుకూలంగా స్పష్టంగా చెప్పేయండి. మొగమాటాన్ని వీడండి. అంతర్భయం వద్దు. లియో(జూలై 24-ఆగస్టు 23) లోగడ చేసిన రుణాలు ఒకటో రెండో కొద్దిగా బాధించవచ్చు. అయితే వాటివల్ల అంత ఇబ్బంది లేదని గమనించండి. కొత్తవ్యాపారం ప్రారంభించడం ఇప్పట్లో అంత మంచిది కాదు. మీ కులవృత్తిని లేదా లోగడ మీకు అనుభవం ఉన్న వృత్తినీ ఎంచుకున్న పక్షంలో మీకు తిరుగుండదు. మీకున్న పలుకుబడి కారణంగా ఎందరెందరో మీకు సాయపడవచ్చు. దిగులు పడకండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పరాకు పడుతూ చేస్తున్న ఉద్యోగంలో కొన్ని పొరపాట్లని చేసే అవకాశం ఉంది. ఆడంబరం కోసం కొంత వ్యయం చేస్తారనిపిస్తోంది. ప్రయాణ సందర్భాల్లో వస్తువుల జాగ్రత్త అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని సకాలంలో చెల్లించడం, ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించడం, కిందిస్థాయి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనకి గురి చేయవచ్చు. ఇంటాబయటా చిన్న చిన్న సమస్యల కారణంగా మానసికంగా కొంత నలిగిపోయే అవకాశముంది. ఆర్థికంగా కొంత లోటు ఉండవచ్చు. దానిని పూడ్చుకునేందుకు తగిన మార్గాలను అన్వేషించుకోండి. సమస్యలకు రాజీ మార్గమే సరైనదేమో ఆలోచించుకోండి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎంతో విశ్వసించిన వ్యక్తి మిమ్మల్ని మోసగించడం లేదా మీకే ద్రోహం చేయడం వంటివి జరగవచ్చు. అతిగా నమ్మడమనేది మీ దోషమే తప్ప వారిది కాదనుకుని, భవిష్యకాలాన్ని గురించి ఆలోచించండి. జరిగిన దాని మీద దృష్టి పెడుతూ, వర్తమానాన్ని పాడు చేసుకోకండి. మీకు ద్రోహం చేసిన వారి విషయంలో పగ, ద్వేషం, అరాచకం వంటి దిశగా ఆలోచించకండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు రైతులయిన పక్షంలో చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. బంధువుల్లో జరిగే శుభకార్య నిర్వహణా భారాన్ని మీరే మోస్తారు. ఒకవిధంగా ఆలోచిస్తే మీకు పెద్దరికాన్ని ఇస్తే కాదనకుండా చేయడం మీకెంతో ఇష్టం. అయితే శరీర శ్రమని గుర్తించి సహాయపడండి. స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం తలపెట్టే ఆలోచన ఉంటే దానిని జనవరి 15 వరకూ వాయిదా వేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఆధ్యాత్మిక గురువులను కలవడం, పుణ్యక్షేత్రాలని సందర్శించడం జరగవచ్చు. మీ సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. వీలయినంత వరకూ దూరప్రయాణాలని మానుకుని ఉన్నచోటులోనే ఎదగడానికి యత్నించడం ఉత్తమం. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వవద్దు. ఇచ్చాక వెనుకాడద్దు. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ పై అధికారులు ఏమాత్రపు దోషం మీలో దొరుకుతుందనే దృష్టితో పరిశీలిస్తున్నారనే భావంతో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి వంటివానిని అప్రమత్తంగా నిర్వహించండి. పాత వాహనాలని అమ్మి కొత్తవి కొనాలనుకోవడం, ఇంటిని మార్చడం లేదా పాత ఇంటిని అమ్మి కొత్తదాన్ని అప్పు చేసి మరీ కొనాలనుకోవడం వంటివాటిని కొద్దికాలంపాటు వాయిదా వేయండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఆర్థికమైన పేచీలు కుటుంబంలో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉందని గ్రహించి, ముందే మేల్కొని ఆర్థిక క్రమశిక్షణని పాటించండి. మీరు తీసుకోవలసిన పత్రాలని జాగ్రత్తగా పరిశీలించడం, ప్రయాణాలలో మీ వస్తువులను ఇతరులకు అప్పగించకుండా మీరే జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు