తల్లిదండ్రులకు ఆరోగ్యపరీక్షలు అవసరం | Parents need health tests | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు ఆరోగ్యపరీక్షలు అవసరం

Published Sat, Dec 5 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 PM

తల్లిదండ్రులకు ఆరోగ్యపరీక్షలు అవసరం

తల్లిదండ్రులకు ఆరోగ్యపరీక్షలు అవసరం

డిసెంబర్ 5 నుంచి 11 వరకు
టారో బాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
సంవత్సరాంతానికి వచ్చాం కదా అని ఈ వారమంతా పాత జ్ఞాపకాలతో భావోద్వేగాలతో గడుపుతారు. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఫలించి, ఆర్థికపరంగా ఏదో గారడీ చేసినట్లుగా ధనసమృద్ధి కలుగుతుంది. కలిసొచ్చేరంగు: నారింజ
 
టారస్  (ఏప్రిల్ 21-మే 20)
ఈ వారం మీకు కొత్త అవకాశాలతో అభివృద్ధికరంగా ఉంటుంది. విదేశీవ్యక్తి నుంచి మీకు ఒక ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. జీవితంలో సమత్యులత కోసం సామరస్యత కోసం రకరకాల త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఆ మేరకు మనశ్శాంతి లభిస్తుంది కనక. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే
 
జెమిని  (మే 21-జూన్ 21)
అదృష్టం, ఆదాయ వృద్ధి కలిసికట్టుగా వస్తాయి. మీకు సంతోషాన్నిచ్చేలా విలువైన, అపురూపమైన బహుమతులు అనూహ్యంగా లభిస్తాయి. జాయింటుగా చేసే ఫైనాన్స్ వ్యాపారావకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ప్రేమికులకు మీ మనసులో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు తగిన ధైర్యం వస్తుంది. కలిసొచ్చేరంగు: ఎమరాల్డ్ గ్రీన్
 
క్యాన్సర్  (జూన్22-జూలై 23)

వ్యక్తిగతంగా ఇది మీకు బాగా కలిసొచ్చే వారం. మీ సౌంద ర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తారు. మీ మేధస్సుకు పదును పెట్టుకుంటారు. ఈ వారం అంతా అదృష్టకరంగా గడుస్తుంది. కలిసొచ్చే రంగు: వెండిరంగు
 
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

మీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి. కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ కూడా ఇది మీకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వారం. ప్రపంచాన్నే జయించగలననేంత శక్తి వస్తుంది మీకు. మీరు ప్రేమించే వారిని/ జీవిత భాగస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది తగిన సమయం.   చేతులు దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: లేత నీలిరంగు
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
జీవితం మరింత సౌకర్యంగా మారుతుంతి. దాంతో మీ జీవన శైలి మారుతుంది. అయితే మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదం ఏర్పడవచ్చు. కెరీర్‌పరంగా మీ దిశ ఏమిటనేది నిర్ధారించుకోవలసి వస్తుంది. అనూహ్యమైన మార్గాల నుంచి డబ్బు వస్తుంది. ప్రేమ ముదురు పాకాన పడుతుంది. బాగా ఎంజాయ్ చేస్తారు. కలిసొచ్చే వారం: రాగి రంగు
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం కెరీర్‌పరంగానూ, వ్యాపార పరంగానూ మీకు లబ్ధి చేకూర్చవచ్చు. మీ బంధాన్ని కొనసాగించాలనుకుంటే మీ ఆలోచనా సరళిలో, వ్యవహార శైలిలో మార్పు చేసుకోక తప్పదు. మీరు మారడానికి ఇదే చివరి అవకాశం. సంగీతం వింటూ, పాడుతూ ఉంటే మీ అంతర్గత శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
ఈ వారం మీకు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. మీరు సాధించిన ప్రాపంచిక లేదా వ్యాపార లాభాలతో ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీకంటూ బలమైన నమ్మకాలు, విలువలతో కూడిన విశ్వాసాలను, అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఇతరులతో మీ మనసులోని మాటను చెప్పుకుని ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: సిల్వర్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
 మీ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఇది తగిన సమయం. అయితే అది అంత సులువు కాదు. పెద్ద యుధం చేయవలసి రావచ్చు. అనేకరకాల సమస్యలు, సవాళ్లతో సహవాసం చేయవలసి ఉంటుంది. శాంతి కావాలనుకుంటే ప్రేమను త్యజించక తప్పదు. యుద్ధం చేస్తే విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీప్
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
రకరకాల తాయిలాలతో కూడిన కొనుగోళ్లు మిమ్మల్ని అయోమయంలో పడేయవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో అనేకరకాల ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వైవాహిక బంధంలో పడతారు. రకరకాల ప్రలోభాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి. ప్రేమ కోసం పరితపిస్తున్న మీకు మీ మనసును దోచుకునే వ్యక్తి ఎదురు అవుతారు. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)

ఒక పెద్ద సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు. పెద్ద అవరోధాన్ని అధిగమిస్తారు. కెరీర్ పరంగా డబుల్ జంప్ చేస్తారు. సామాజిక జీవితాన్ని బిజీబిజీగా గడిపేస్తారు. ఆరోగ్యపరంగా అయితే, మంచి ఎక్సర్‌సైజులు చేయడం అవసరం. ఈ వారం టూర్లు, వినోదపర్యటనలు ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: సిల్కీ ఎల్లో
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
 
సౌర వాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

 మీ సంతానపరంగా మీకు ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. మీ సంతానం పై అధికారులయిన పక్షంలో కిందిస్థాయి సిబ్బందితో మైత్రిని ఏర్పాటు చేసుకుని సంస్థని సక్రమంగా నడిచేలా చేసుకోగల కాలమిది. అదే తీరుగా పెద్దలనీ అనుభవజ్ఞులనీ అడిగి నూతనమైన మెళకువలని గమనించుకోగల కాలం ఇదే. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ప్రయత్నించండి.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)

ఎంతో మిత్రునిగా, ఆత్మీయునిగా అండదండలుగా ఉండే ఒకరి దురాలోచన మీకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే వంచనకు గురయ్యారని
తెలిసీ, మళ్లీ ఆదరించడం మాత్రం సరికాదు. జరిగిన పొరపాటును గ్రహించుకోండి తప్ప, ఆ నష్టపోయిన దానికి ప్రయత్నించవద్దు. సంతానంలో ఒకరి పరిస్థితి కొంత బాధని కల్గించవచ్చు.
 
జెమిని (మే 21-జూన్ 21)
మీలో దాగిన ప్రతిభకి ఓ పురస్కారం వచ్చే అవకాశం ఉంది. మీలో గుంభన తక్కువైన కారణంగా మీ ఆలోచనకే కొద్ది మార్పు చేర్పులు చేసి, దాన్ని తమదిగా ఇతరులు చెప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఆలోచన అన్యాక్రాంతం కాకుండా చూసుకోండి. మీ మొహమాటమే మీ చేతికి మీరు వేసుకునే సంకెళ్లవంటిదని గుర్తించండి.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
అనవసరమైన ఆందోళనకి గురి అవుతూ కన్పిస్తారు. భయపడవలసిన పరిస్థితి కాని, భయపెట్టే సంఘటనలు కానీ ఈ వారంలో ఏమీ లేవు-ఉండవు. ధనసంపాదన చక్కగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం నిశ్చితార్థపు మాటలు జరగవచ్చు. ఉన్న సొమ్మును స్థిరాస్తుల కొనుగోలుకు ఖర్చు చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
ఎంత సంపాదిస్తున్నారో దానికి సరిపడినంత ఖర్చు సిద్ధంగా ఉండవచ్చు. ఉద్యోగంలో వృత్తిలో మీ మీద కొంత వ్యతిరేకత ఉన్న కారణంగా అనవసరమైన ప్రచారం సాగవచ్చు. ధైర్యంగా ఉండండి. మీ వైపు తప్పక బలగం ఉంటుంది. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణదాతల ఒత్తిడి పెద్దగా ఉండదు. తలిదండ్రులకి ఆరోగ్యపరీక్షలు అవసరం.
 
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)
అప్పులివ్వడం, తీసుకోవడం ఈ వారంలో వద్దు. శ్రమించడానికి సిద్ధంగా ఉండాలి. సంఘంలో మంచి అనుకూలత ఉంటుంది. న్యాయస్థానంలో మీకు అనుకూలమైన తీర్పు లభించవచ్చు. సంతానంలో ఒకరిని తరచూ అనారోగ్యంతో ఉంటుంటే, మరో వైద్యుని ద్వారా మెరుగైన చికిత్స ఇప్పించడం, లేదా మరో వైద్యుని సలహా తీసుకోవడం శ్రేయస్కరం.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
అన్నీ తెలుసునన్న అహంకారం గానీ, గట్టి ప్రయత్నాలని చేస్తున్నాననే ధీమా గానీ ఉండకూడదు. అవివాహితులకి వివాహ సూచన, విద్యార్థులకి సత్ఫలితం, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి కొంచెం ఆలస్యంగానైనా జరిగి తీరతాయి. జీవితానికి సంబంధించిన గడ్డు సమస్య ఉన్నట్లయితే అభిమానానికీ, పట్టుదలకీ పోకుండా సామరస్య ధోరణిలో వెళ్లడం మంచిది.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 ఒక కార్యం కోసం పదివైపుల నుంచీ ప్రయత్నాలని విశేషంగా చేస్తారు. అది అవసరం కూడా. కుటుంబ రహస్యాలని మీ ఇంటి నుండి కుటుంబ సభ్యులో ఎవరూ బహిరంగపరచకుండా చూసుకోండి. ధర్మమార్గంలోనే ప్రయాణించండి. విజయం మీదేనని గ్రహించండి. ఇతరులు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా విని మీదైన ఆలోచనతో ప్రశాంతంగానే ఎదుర్కోండి.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
ప్రశంసలకి లొంగిపోయి, మీ పరిధులని దాటి మాటసహాయం లేదా ఆర్థిక సహాయం గాని చేయవద్దు. తోటి ఉద్యోగులతో ఎంత దూరంలో ఉండాలో, వాళ్లనెంత దూరంలో ఉంచాలో అలా ప్రవర్తించడం మంచిది. వాహనాన్ని నడిపే విషయంలో తగుమాత్రపు శ్రద్ధ అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని, తీర్చవలసిన చిన్నచిన్న రుణాలనీ వెంటనే తీర్చండి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

 వ్యవసాయ దారులయితే ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. ప్రభుత్వం నుండి రావలసినవేమైనా ఉంటే తప్పక వస్తాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆశించిన ఉద్యోగం వాయిదా పడవచ్చు. పోటీ పరీక్షల విషయంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దుర్వ్యసన పరుల సహవాసం మిమ్మల్ని పెద్ద ఇబ్బందికి గురి చేయవచ్చు కాబట్టి దూరాన్ని పాటించండి అలాంటివారితో.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
 నమ్మకంగా వంచించే వ్యక్తుల్ని గుర్తించి వారి మోసంలో పడకుండా తప్పించుకోగలుగుతారు. మిమ్మల్ని వంచింపబోయారనే దృష్టితో ప్రతీకార బుద్ధితో ఉండకండి. మనకి కష్టం రాలేదనే ఆనందంతో ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. హామీలనీ వాగ్దానాలనీ ఏ మాత్రమూ చేయవద్దు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడపటానికి ప్రయత్నించండి.
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)

 మీ శత్రువులు మీకు దూరంగా వెళ్లిపోతారు. మీ ధర్మ ప్రవర్తన వల్ల కానీ, మీ నేర్పరితనం వల్లగానీ, వాళ్లు మిమ్మల్ని ఏమీ చేయలేమని అర్థం చేసుకుంటారు. రుణాల్ని క్రమపద్ధతిలో తీరుస్తూ ఉండండి. ఆస్తులు అమ్మాలనే ఆలోచన విరమించుకోండి. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి దశలో ఉంటుంది. బంధుమిత్రులకి సూచనలనీ సలహాలనీ ఇవ్వకండి.

మైలవరపు శ్రీనివాసరావు
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement