ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం | his week you will bring good change | Sakshi
Sakshi News home page

ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం

Published Sat, Aug 15 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం

ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం

ఆగస్టు 15 నుంచి 21 వరకు
 
టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఈ వారం కొంచెం స్తబ్ధుగా, మందకొడిగా ఉండవచ్చు. అయితే పనులు జరగనంత మాత్రాన అదేమీ చెడుకాలమని కాదు. మీ విజయంలో అది కూడా ఒక భాగమే అని గ్రహించండి. మీ శరీరం ఒకచోట, మనసు మరోచోట అన్నట్లుగా ఉంటుంది. మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్లండి, కలవాలనుకున్న వారిని కలవండి. లేదంటే ఒంటరితనంతో బాధపడతారు. కలిసొచ్చే రంగు: గ్రే
 
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
ఎంతో కాలంగా మీరు కలవాలనుకుంటున్న వారిని కలుస్తారు. మీకున్న రకరకాల సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారు. అనవసర మొహమాటాలను విడిచిపెట్టడం మంచిది. కాలం కొద్దిగా గడ్డుగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అది మీ జీవితంలో మీకు పాఠాన్ని నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నంగానే గుర్తించండి. కలిసొచ్చే రంగు: నీలం
 
జెమిని (మే 21-జూన్ 21)
జీవితం క్షణం తీరుబడి లేనట్టుగా గడిచిపోతుంటుంది. మీ జీవన గమనంలో కొద్దిపాటి మార్పు చేర్పులు చేసుకుంటూ, కొత్త పద్ధతులని అనుసరించకపోతే రొటీన్ లైఫ్‌తో బోర్ అనిపించక మానదు. పిరికితనాన్ని, నెగటివ్ ఆలోచనలను విడిచిపెట్టండి. మీకు లేనివాటిని గురించి తలచుకుని బాధపడవద్దు. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
మీ లక్ష్యానికి ఒక స్పష్టత వస్తుంది. అనవసర విషయాలకు అతిగా స్పందించడం మంచి లక్షణం కాదని గ్రహించండి. గడ్డు పరిస్థితులను, క్లిష్ట సమయాలను మీరు ఎదుర్కొనే తీరే రేపు మీ భవితను నిర్ణయిస్తుంది, అవే మీకు జీవిత పాఠాలను నేర్పిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.  ప్రేమ వ్యవహారాలలో తొందర వద్దు. కలిసొచ్చే రంగు: పీచ్
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

మీ శక్తి సామర్థ్యాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుని, అందుకు తగ్గ లక్ష్యాలనే ఎంచుకోవడం మంచిది. మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లి, పరిచయంలేని వ్యక్తులతో పని చేయవలసి వస్తుంది. కంగారు పడవద్దు. జీవితంలో రహస్యాలను జాగ్ర త్తగా కాపాడుకోకపోతే కలిగే పర్యవసానాలు ఏమిటో తెలుసుకుంటారు ఈవారం. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)

మీదైన శైలిలో పని చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు; ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన బంధాలను నిలుపుకునే విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే ఆ తర్వాత భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్కీ కలర్: వయొలెట్
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీ కలలను సాకారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. పాజిటివ్ ఎనర్జీని నింపుకోవడం వల్ల కలిగే మంచి ఏమిటో మీకు అనుభవంలోకి వస్తుంది. మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకు గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)

ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోవాలనుకోకండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లనుంచి గుణపాఠాన్ని తీసుకుని, వాటిని మళ్లీ చేయకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించడం వల్ల భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న నలుపు రంగు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
ఇల్లు లేదా ఉద్యోగం మారతారు. చురుగ్గా ఉండండి. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. అనేక రకాల అననుకూలతలను ఈవారం అధిగమిస్తారు. విజయానికి చేరువ అవుతారు. ఎంత సన్నిహితులైనా, డబ్బు వ్యవహారాలలో నిక్కచ్చిగా లేకపోతే పేచీ తప్పదని గ్రహించండి. మొహమాటానికి తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

అనూహ్యమైన ఓ అవకాశం మీ తలుపు తట్టవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీరు ఎంత ఆలోచనాపరులైనప్పటికీ భావోద్వేగాల విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేకపోతే ఇబ్బందులు తప్పవు కాబట్టి వాటిని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించండి. నిజాయితీగా పని చే స్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్
 
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
మీ కలలు ఫలిస్తాయి. విదేశీ యానం చేయాలన్న మీ కోరిక తీరుతుంది. ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు తగిన ప్రణాళిక వేసుకోండి. గతాన్నే తలచుకుంటూ బాధపడక, భవిష్యత్ కార్యాచరణని ఆలోచించుకుని, తగ్గట్టుగా వ్యవహరించండి. జీవితంలో ఏమి జరిగినా, దానిని  అందుకునేందుకు సంసిద్ధంగా ఉండండి. కలిసొచ్చే రంగు: వైట్
 
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 ఇనుము బాగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని కావలసిన ఆకారంలోకి మలచుకోగలం. అలాగే మీరు బాగా పని చేసి, మంచి పేరు తెచ్చుకోండి. ప్రమోషన్ కొట్టండి. ఒక విషయంలో గట్టి నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. సిద్ధంగా ఉండండి. మీ లక్ష్యాలను, కలలను సాకారం చేసుకునేందుకు ఇది తగిన సమయం. ఆలసించకండి. ఆశాభంగం పొందకండి. కలిసొచ్చే రంగు: ఎరుపు
 
ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
సౌర వాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

బంధుమిత్రులు మీ నుండి సహాయాన్ని అర్థించే వీలుంది. వారు చేస్తున్న పని ఎంతవరకూ సరియైనదో గమనించుకుని వ్యవహరించండి. మీపై అధికారులు మీ శ్రమనీ మీ నేర్పరితనాన్నీ గుర్తించడం లేదని దిగులు పడకండి. ఎప్పటిలానే మీ వృత్తిధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తూ ఉండండి. తగిన కాలం రాబోతోంది. అప్పటివరకూ ఓపిక పట్టక తప్పదు.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
ఇంటి మరమ్మతులు, అద్దె ఇల్లు మారడం లేదా ఏవో కొన్ని సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని సమీప ప్రదేశంలో ఉన్న ఊరికి మకాంని మార్చడం వంటి ఆలోచనలని తాత్కాలికంగా వాయిదా వేయండి. ఈ విషయమై మీ దంపతుల ఆలోచనలని మించి, మరెవరూ గొప్ప ఆలోచనని చేయనే చేయరని గ్రహించండి. సంతానం విషయంలో తగు జాగ్రత్తతో ఉండండి.
 
జెమిని (మే 21-జూన్ 21)
 తెలిసి తెలిసీ ఇబ్బందుల్లో పడతారు. వీలయినంత తొందరలో కళ్లు తెరిచి బయట పడడానికి ప్రయత్నించి ఇబ్బంది తొలగించుకుంటారు. మీ ప్రేమ వ్యవహారం లేదా రుణ వ్యవహారం పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. ఎంత గుంభనగా మీరు వ్యవహారం చేయదలిస్తే అంత తప్పు చేయబోతున్నారన్నమాట. సంయమనంతో వ్యవహరించండి.
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)
 నిజమైన సహాయాన్ని మీకు ఎవరెవ రు చేస్తారో, చేయడానికి సిద్ధంగా ఉన్నారో గమనించుకోగలిగిన కాలం ఇది. కష్టం- సుఖం, లాభం- నష్టం, ఆనందం- దుఃఖం అన్నీ సమపరిమాణంలో ఉంటాయి ఈ వారమంతా. మీ మంచితనం కారణంగా ఏ ఇబ్బందికీ లోను కాకుండా గడిపేస్తారు, వచ్చే ఇబ్బందిని వాయిదా వేసుకుని- ఆపద తప్పినట్లే అని ఆనందించకండి.
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 శత్రువుల సంఖ్యని తగ్గించుకోదలిచిన కొద్దీ పెరుగుతూ కన్పిస్తారు. తాత్కాలిక అనారోగ్యం కలగవచ్చు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగడం వల్ల సంతోషంగా ఉంటారు. విదేశీయానాహ్వానం అందవచ్చు. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. అవసరమయితే ఇక్కడి పనుల్ని విడిచైనా వెళ్లండి. ముందునాటికి లాభపడతారు.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఆదాయం కంటె ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోవడం మంచిది. ఆడంబరాలకి పోకుండా ఉంటే ఆదాయ వ్యయాలు అదుపులో ఉంటాయని గమనించండి. దేనికోసం రుణం చేయడమైందో ఆ రుణాన్ని దానికే వినియోగించండి. ఆర్థిక క్రమశిక్షణని పాటించండి . ఉద్యోగంలో ఒత్తిడి తప్ప ఒడిదుడుకులు ఏమీ రావు.
 
 లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 మనఃస్పర్ధతో వాదవివాదాలతో న్యాయస్థానాల వెంట వెళ్లడం కంటె మరో మార్గం ఉందేమో  ఆలోచించుకోండి. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి శారీరక వ్యాధిని తెచ్చిపెడతాయనేది నాటికాలపు వైద్యం చెప్పిన మాట. పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థయాత్రలూ విహార యాత్రలూ చేసే అవకాశముంది. నిరుత్సాహపరులైన మిత్రులకి దూరంగా ఉండటం మంచిది.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
ప్రయత్నాలని పట్టుబట్టి విడవకుండా చే స్తూండడం బట్టి కొంత అనుకూలత కన్పించే అవకాశం ఉంది. మీ బుద్ధికున్న గట్టితనం, హృదయానికున్న దిటవు కారణంగా కష్టాలని అనుభవిస్తూ కూడా విధులు సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. వర్తమాన పరిస్థితుల అనుకూలత కోసం దైవధ్యానం చేసుకోవడం మంచిది.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
అనారోగ్యం వస్తుందేమోనని నిరంతరం అనుకోవడానికి మించిన అనారోగ్యం మరోటి లేదని గ్రహించండి. మీకు ఓ గ్రహపు దృష్టి సరిలేదనే మాట నిజమే అయినా మీ ఊహా దుఃఖాలన్నీ నిజమై పోవని గమనించండి. అనుభవజ్ఞులూ పెద్దలూ మంచీ చెడూ తెలిసిన వారిని సేవిస్తుంటే ధైర్యం వస్తుంది. ధైర్యం కలిగినప్పుడు శారీరక అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయనే లేదు.
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
మీకున్న పరిచయాలతో ఇతరులు మీ ద్వారా పనులని సాధించుకోవాలని చూస్తారు. మంచిదే కాని అందరినీ విశ్వసించడం అంత మంచిది కాదని తెలుసుకోండి. ఏదైనా విషయముంటే దాన్ని సాగదీయక, సాధ్యమైనంత త్వరలో  నిర్ణయాన్ని ప్రకటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రస్తుతం చేస్తున్న చేయబోతున్న రుణం మంచిపని కోసమే ఔతుంది.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఏదో జరిగిపోతోందనే భ్రమలో ఉంటారు. ఏదయినా ఓ మంచి పనిని దైవసంబంధంగా చేయాలనే భావన కలుగుతుంది. సమస్య ఏదైనా ఎదురయినప్పుడు సంయమనంతో ఉండండి తప్ప దానికోసమే ప్రయత్నిస్తూ మానసికంగా అలసిపోకండి. తప్పక సమస్య మీకు అనుకూలంగానే పరిష్కరింపబడుతుంది. భయం లేదు.
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఓ శుభకార్యం చోటు చేసుకోవచ్చు. వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం అనుకూలం కాదు. చేస్తున్న వ్యాపారంతో కొంతకాలంపాటు సంతృప్తి పడండి తప్ప, కొత్త వ్యాపారం, ఉద్యోగం, వృత్తికోసం తపన పడకండి. దంపతుల అన్యోన్యత కారణంగా ఈవారం బాగుంటుంది.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement