Sanskrit scholars
-
Jnanpith Awards 2023: గుల్జార్, రామభద్రలకు జ్ఞానపీఠ్
న్యూఢిల్లీ: ప్రముఖ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ప్రతిష్టాత్మక 58వ జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ విషయం వెల్లడించింది. 2023వ సంవత్సరానికి గాను ఈ ఇద్దరు ప్రముఖులకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేసింది. 2022వ సంత్సరానికి గాను గోవా రచయిత దామోదర్ మౌజోకు జ్ఞానపీఠ్ లభించింది. ప్రసిద్ధ బాలీవుడ్ సినీ రచయిత, ఉర్దూ కవి సంపూరణ్ సింగ్ కాల్రా అలియాస్ గుల్జార్(89)ను ఇప్పటికే ఎన్నో పురస్కారాలు వరించాయి. 2002లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించారు. 2013లో దాదాసాహెబ్ ఫాలే్క, 2004లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఐదు సార్లు జాతీయ ఫిలిం అవార్డు పొందారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, మాచీస్, ఓంకారా, దిల్ సే, గురు వంటి చిత్రాల్లో ఆయన రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. స్లమ్‌డాగ్ మిలియనీర్‌లోని ‘జై హో’ పాటకు 2009లో ఆస్కార్ అవార్డు దక్కింది. బహుముఖ ప్రజ్ఞాశాలి రామభద్రాచార్య ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన జగద్గురు రామభద్రాచార్య(74) మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో తులసీ పీఠాన్ని స్థాపించారు. రామానంద ప రంపరలో ప్రస్తుతం ఉన్న నలుగురు జగద్గురువుల్లో ఆయన కూడా ఒకరు. రెండు నెలల వయసులో ఇన్ఫెక్షన్ వల్ల కంటి చూపు కోల్పోయారు. ఐదేళ్ల వయసులోనే భగవద్గీతను, ఎనిమిదేళ్ల వయసులో రామచరితమానస్‌ను కంఠస్తం చేశారు. రామభద్రాచార్య బహు ముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచారు. 22 భాషల్లో మాట్లాడగలరు. సంస్కృతం, హిందీ, అవ«దీ, మైథిలీ తదితర భాషల్లో రచనలు చేశారు. 240కిపైగా పుస్తకాలు రాశారు.2015లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. -
నింగికెగిసిన సాహిత్య శిఖరం
కరీంనగర్ కల్చరల్/సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి (86) కన్నుమూశారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఒకటిన్నర సమయంలో శ్రీపురంకాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న నరసింహాచార్యులు, గోపమాంబ దంపతులకు జన్మించిన విజయసారథి చిన్నప్పటి నుంచే పద్య రచన చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఉర్దూ మాధ్యమంలోనే అయినప్పటికీ సంస్కృత పండితుడిగా రాణించారు. భాష్యం విజయసారథి పాండిత్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2020 జనవరి 25న పద్మశ్రీ అవార్డు ప్రకటించగా 2021 నవంబర్ 8న అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మందాకిని కావ్యంతో ‘మహాకవి’గా గుర్తింపు: ఏడు సంవత్సరాల వయసునుంచే విజయసారథి సంస్కృతం నేర్చుకున్నారు. విజయ సారథికి మహాకవిగా గుర్తింపు తెచ్చిన కావ్యం మందాకిని. మందాకిని రచనను ఆయన కేవలం 48 గంటల్లోనే పూర్తి చేశారు. 150కిపైగా గ్రంథాలను భిన్నమైన సంస్కృత ప్రక్రియల్లో ఆయన రచించారు. తెలంగాణ ప్రభుత్వం ‘విశిష్ట సాహిత్య పురస్కారం’, తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యా లయం అందించే మహామహోపాధ్యాయ పురస్కారం, బిర్లా ఫాండేషన్ వాచస్పతి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను ఆయన అందుకున్నారు. సీఎం కేసీఆర్ సంతాపం సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీభాష్యం విజయసారథి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. శ్రీభాష్యం సాహితీ సేవలను సీఎం స్మరించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా శ్రీభాష్యం మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
సమస్యే లేదు – వేరే అర్థం ఎందుకు?
పత్రికలలో ‘‘2500 ఏళ్లుగా పాణిని వ్యాకరణాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’’ అనే వార్త చదివి తెల్లబోయాను. రిషిరాజ్ పోపట్ అనే 27 ఏళ్ల యువకుడు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పీహెడీ చేస్తున్నారట. అతడు చేసిన ప్రతిపాదన ఇది. సంస్కృత వ్యాకరణం పన్నెండు సంవత్సరాలు చద వాలని ప్రసిద్ధి. పూర్వం అలా చదివేవారు. ఇరవై ఏడేళ్ల యువకుడు ఇంగ్లీషులో చదివి ఇలా చెప్పడం ఒక వింత. తమ జీవితాలను విద్యాతపస్సులకు అంకితం చేసిన మునులు వరరుచి, పతంజలి. వారు వ్యాకరణ శాస్త్ర గ్రంథాలను రచించిన వారు. పతంజలి ముని యోగ శాస్త్రాన్ని రచించిన వారు. ప్రపంచంలో చాలా యోగాలకు ఆయన యోగశాస్త్రం మూలం. ‘మహా భాష్యం వా పాఠయేత్, మహా రాజ్యం వా పాలయేత్’ అని ఆర్యోక్తి. పతంజలి ముని వ్యాకరణ మహా భాష్యాన్ని పాఠం చెప్పడం ఒక పెద్ద రాజ్యాన్ని పాలించడంతో సమానం. మహా భాష్యమైనా పాఠం చెప్పాలి. మహా రాజ్యమైనా ఏలాలని పై సంస్కృత సూక్తికి అర్థం. తరువాత కైయటుడు, భట్టోజి దీక్షితులు, నాగేశ భట్టు మొదలైన వారు బహుశాస్త్ర పండితులు. వీరు వ్రాసిన గ్రంథాలన్నీ అర్థం చేసుకోవడమే గొప్ప విషయం. వీరందరినీ కించపరిచే ఇతడు చెప్పిన విషయాన్ని పరిశీలించాలి. ఒక పదం తయారు చేయడంలో రెండు సూత్రాలు ఒకేసారి ప్రవర్తిస్తూంటే వానిలో ఏ సూత్రం ప్రవర్తింప చేయాలనే విష యంలో పాణిని ముని ‘విప్రతిషేధే పరం కార్యమ్’ అనే సూత్రం చెప్పారు. సమానమైన బలం కలిగిన రెండు సూత్రాలకు వైరుధ్యం కలిగినపుడు వరుస క్రమంలో తరువాత ఉన్న సూత్రం ఎంచు కోవాలి అని పాణిని మునిని అనుసరించిన గ్రంథకర్తలు తెలిపారు. ‘‘ఈ పద్ధతి వ్యాకరణం ద్వారా అనేకమైన తప్పు రూపాలను తయారు చేస్తుంది’’ అని ఇతడి ప్రతిపాదన. కాబట్టి ఇతడు ఈ సూత్రానికి వేరే అర్థం చెబుతున్నారు. ఒక పదం తయారు చేసే క్రమంలో ఒకచోట రెండు సూత్రాలు ప్రవర్తించవలసినపుడు వాటికి వైరుధ్యం వస్తే ఆ పదంలో రెండో భాగంలో ప్రవర్తించ వలసిన సూత్రాన్నే ప్రవర్తింప చేయాలి. ఈ పద్ధతిని అవలంబిస్తే సుమారు అన్ని పదాల తయారీలో సరైన సమాధానం లభిస్తుందని ఇతడి ప్రతిపాదన సారాంశం. ఉదాహరణానికి మంత్ర + భిస్ అని ఉన్నపుడు 7 అ – 3 పా – 103 సంఖ్యగల సూత్రంచే మంత్రంలోని త్ర వర్ణమందు గల అకారానికి ఏ కారం వస్తుంది. దీనివల్ల మంత్రేభిః అనే అసాధు రూపం ఏర్పడుతుంది. 7 అ – 1 పా – 9 సంఖ్యగల సూత్రంచే భిస్ కు ఐస్ వస్తుంది. మంత్ర + ఐస్ = మంత్రైః అని తయారవుతుంది. ఇది సరి అయిన రూపం. కాబట్టి రెండు సూత్రాలకు విప్రతిషేధం వస్తే వరుస క్రమంలో తరువాతి సూత్రం అని చెప్పకూడదు. మంత్ర + భిస్ అనే చోట తరువాత ఉన్న ఐస్ కి భిస్ వస్తోంది. ఇది పదంలో కుడివైపున జరిగే కార్యం. దానిని విధించే సూత్రాన్ని ఎంచుకోవాలని పాణిని అభిప్రాయం. దీనివలన మంత్రైః అనే సరి అయిన రూపం ఏర్పడుతుందని రిషి రాజ్ ప్రతిపాదనం. సూత్ర గ్రంథాలలో అల్పాక్షరాలలో అనల్పమయిన అర్థాన్ని ఇముడ్చుతారు. దానిలో సారం చాలా ఉంటుంది. దోషం ఉండదు. ఇలాంటి సూత్రాలు విద్యను కంఠస్థం చేయడానికి ఉపయోగిస్తాయి. కాని విద్యార్థికి సూత్రంలో భావం ఎలా తెలుస్తుంది? గురువుల వల్ల, సూత్ర గ్రంథాల అధ్యయనం వల్ల, సూత్రాలపై రాసిన వ్యాఖ్యల వల్ల తెలుస్తుంది. సూత్ర గ్రంథాలకు గురుశిష్య పరంపరగా వచ్చిన అర్థమే గ్రంథకర్త అభిప్రాయం అయ్యే అవకాశాలు అధికం. అలాగే గురు శిష్య పరంపరగా ఈ సూత్రాల అధ్యయనం సాగేది. ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి పూర్వ గ్రంథాలు చెప్పినది తప్పు అనడం సమంజసం కాదు. కాత్యాయనునికి వరరుచి అని మరో పేరు. ఆయన వార్తికాలన్నీ మహా భాష్యంలో ఉన్నాయి. విడిగా లేవు. పతంజలి యోగ శాస్త్రం వ్రాశారు. వీరి వ్యాకరణ భాష్యాన్ని మహా భాష్యం అంటారు. బహువచనే ఝల్యేత్ 7 అ – 3 పా – 103 సూ. ఝలాదౌ బహు వచనే సుపి పరే అతోఙ్గ స్యైకార స్సా్యత్ రామేభ్యః ఇది పతంజలి భాష్యం. పై సూత్రం మంత్ర + భిస్ అన్నచోట త్ర కారానికి ఏత్వం విధించగలదు. ఇది తరువాతి సూత్రం కనుక మంత్రే + భిస్ అని అయ్యే అవకాశం ఉంది. అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. ‘అకారాన్తా దఙ్గా ద్భి స ఐస్ స్యాత్, రామైః’ ఇది భాష్యంలోనిది. మంత్ర + భిస్ అని ఉన్నపుడు పై సూత్రం చే ఐస్ వచ్చి మంత్రైః అని అవుతుంది. విప్రతిషేధే పరం కార్యమ్ ఈ సూత్రం చేత సమాన బలం కలిగిన రెండు సూత్రాలు ఒక చోట ప్రవర్తించవలసి వస్తే తరువాత ఉన్న సూత్రం ప్రవర్తించాలి. కానీ ఇక్కడ వరుసలో పూర్వం ఉన్న సూత్రం ప్రవర్తించిన రూపమే సరియైనది. కారణ మేమిటి ? అతో భిస ఐస్ 7 అ – 1 పా – 9 సూ. వృక్షైః, ఇహ పరత్వా దేత్వం ప్రాప్నోతి. ... కృతైత్త్వే భూత పూర్వ మకారం భవిష్యతి. ఐస్తు నిత్యమ్. ... కృతే ప్యేత్వే ప్రాప్నోతి అకృతేపి ప్రాప్నోతి. నిత్యత్వా ధైత్వే కృతే విహత నిమిత్తత్వాత్ ఏత్వం న భవిష్యతి. – వ్యాకరణ మహాభాష్యం (244 పు.) 7 అ – 3 పా – 103 వ సూత్రం పర సూత్రం కనుక దాని చేత మంత్ర + భిస్ అనే చోట త్ర కారంలో అకారానికి... ఏత్వం చేస్తే ఆ ఏకార స్థానంలో పూర్వం ఉన్నది అకారం కనుక అపుడు కూడా భిస్‌కు ఐస్ వస్తుంది. కావున ఐస్ నిత్యం. ఐస్ చేస్తే ఝలాది వర్ణం పరంగా లేదు కనుక ఏత్వం రాదు అని భాష్యకారులు చెప్పారు. మంత్రలోని త్ర కారంలో ఉన్న అకారానికి వచ్చిన ఏ కారం అకారం వంటిది ఎలా అవుతుందని ప్రశ్న. సంస్కృత వ్యాక రణంలో ‘యథోత్తరం మునీనాం ప్రామాణ్యమ్’ అని నియమము. పాణిని ముని సూత్రాలకు భాష్యం లేకపోతే అవి అర్థం కావు. పాణిని ముని సూత్రాలకంటే కాత్యాయన ముని వార్తికాలకు, అంతకంటె పతంజలి ముని భాష్యానికి ప్రామాణ్యం ఎక్కువ. వార్తికాలు, భాష్యం లేకపోతే పాణిని సూత్రాలు మొత్తం సంస్కృత పద సముద్రానికి లక్షణం చెప్పలేవు. పతంజలి ముని ఒక శ్లోకం ఉదాహరించారు. శ్లో. ఏత్వం భిసి పరత్వాచ్చే దత ఐస్క భవిష్యతి కృత ఐత్వే భూత పూర్వా్య ధైస్తు నిత్య స్తథాసతి ఇది కాత్యాయన ముని వార్తికం అయి ఉంటుంది. కాబట్టి ఈ కారిక, పతంజలి ముని వచనం ప్రమాణంగా తీసుకుని ఐస్‌ను విధించే సూత్రం నిత్యమని చెప్పడం సముచితమే. ‘త్రిముని వ్యాకరణమ్’ అని ఆర్యోక్తి. ముగ్గురూ వ్యాకరణ విషయంలో ప్రామాణికులే. పరం కంటే నిత్యం బలమయినది. కనుక ఏత్వం రాకుండా ఐస్ వచ్చిందని భావం. పర సూత్రం కంటె నిత్యం బల మయినదని ‘పూర్వ పర నిత్యాన్తరఙ్గానా ముత్తరోత్తరం బలీయః’ అనే పరిభాష తెలుపుతుంది. కావున పర సూత్రమైన ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రాన్ని నిత్య సూత్రమైన ‘అతో భిస ఐస్’ బాధించింది. మంత్ర + ఐస్ = మంత్రైః అయ్యింది. ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రమెలా అవుతుంది? ఏత్వం ఒక వర్ణానికి చెందిన విధి కదా అని ప్రశ్న. ఒక వర్ణానికి చెందిన విధిలో ఆదేశం స్థానివంటిది కాదని నిషేధం ఉంది. అపుడు ఏకారం అకారం వంటిది కాదు. ఇక్కడ భాష్యం వార్తికం ఎలా సరిపడతాయని ఆక్షేపం వస్తుంది. ‘అచః పరస్మిన్ పూర్వవిధౌ’ అనే సూత్రానికి మహాభాష్యంలో ‘అజాదేశః పరనిమిత్తకః పూర్వస్య విధిం ప్రతి స్థానివద్ భవతి. కుతః పూర్వస్య ఆదేశాద్’ అనే వాక్యాలున్నాయి. మంత్ర + భిస్ అనే చోట ‘బహువచనే ఝల్యేత్’ అనే సూత్రంచే త్రకారంలో ఉన్న అకారానికి ఏత్వం వచ్చి మంత్రే + భిస్ అయ్యింది. ఇప్పుడు ‘అతో భిస ఐస్’ అనే సూత్రం చేత ‘భిస్’నకు ఐత్వం వస్తున్నపుడు ఆదేశం అయిన ఐస్ కంటే పూర్వ మందున్న ఏకారానికి స్థానివద్భావం చేస్తే భిస్ నకు ఐస్ ప్రాప్తించి మంత్రైః అవుతుంది. కాబట్టి పైన పతంజలి ముని, కాత్యాయన ముని పేర్కొన్నట్లు ‘అతో భిస ఐస్’ నిత్య సూత్రం అయ్యింది. పరం కంటె నిత్యం ప్రబలం కనుక మంత్రైః అనే రూపం సిద్ధిస్తోంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి తప్పు, సమస్య, గందర గోళం లేవు. రిషి రాజ్ పోపట్ పరిశోధన చేసి ఒక సూత్రానికి కొత్త అర్థం చెప్పి సంస్కృత వ్యాకరణ మార్గంలో ఋషి పుంగవులను, ఋషి తుల్యులను కించ పరిచాడు. తాను విప్రతిషేధే అనే సూత్రానికి కొత్త అర్థం చెప్పడం వల్ల కొన్ని రూపాలు కుదరడం లేదు. ఇది అతడి ప్రసంగం చూసి చేసిన విమర్శ. అతడి సిద్ధాంత గ్రంథాన్ని విమర్శిస్తే అదో పెద్ద గ్రంథమవుతుందేమో! (క్లిక్ చేయండి: జ్ఞాపకాలు విప్పి చెప్పిన కథనాలు) - డాక్టర్ చిఱ్ఱావూరి శివరామ కృష్ణ శర్మ వ్యాసకర్త రీడర్ (విశ్రాంత) ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్టణం -
ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం
ఆగస్టు 15 నుంచి 21 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారం కొంచెం స్తబ్ధుగా, మందకొడిగా ఉండవచ్చు. అయితే పనులు జరగనంత మాత్రాన అదేమీ చెడుకాలమని కాదు. మీ విజయంలో అది కూడా ఒక భాగమే అని గ్రహించండి. మీ శరీరం ఒకచోట, మనసు మరోచోట అన్నట్లుగా ఉంటుంది. మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్లండి, కలవాలనుకున్న వారిని కలవండి. లేదంటే ఒంటరితనంతో బాధపడతారు. కలిసొచ్చే రంగు: గ్రే టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఎంతో కాలంగా మీరు కలవాలనుకుంటున్న వారిని కలుస్తారు. మీకున్న రకరకాల సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారు. అనవసర మొహమాటాలను విడిచిపెట్టడం మంచిది. కాలం కొద్దిగా గడ్డుగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అది మీ జీవితంలో మీకు పాఠాన్ని నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నంగానే గుర్తించండి. కలిసొచ్చే రంగు: నీలం జెమిని (మే 21-జూన్ 21) జీవితం క్షణం తీరుబడి లేనట్టుగా గడిచిపోతుంటుంది. మీ జీవన గమనంలో కొద్దిపాటి మార్పు చేర్పులు చేసుకుంటూ, కొత్త పద్ధతులని అనుసరించకపోతే రొటీన్ లైఫ్‌తో బోర్ అనిపించక మానదు. పిరికితనాన్ని, నెగటివ్ ఆలోచనలను విడిచిపెట్టండి. మీకు లేనివాటిని గురించి తలచుకుని బాధపడవద్దు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ లక్ష్యానికి ఒక స్పష్టత వస్తుంది. అనవసర విషయాలకు అతిగా స్పందించడం మంచి లక్షణం కాదని గ్రహించండి. గడ్డు పరిస్థితులను, క్లిష్ట సమయాలను మీరు ఎదుర్కొనే తీరే రేపు మీ భవితను నిర్ణయిస్తుంది, అవే మీకు జీవిత పాఠాలను నేర్పిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాలలో తొందర వద్దు. కలిసొచ్చే రంగు: పీచ్ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ శక్తి సామర్థ్యాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుని, అందుకు తగ్గ లక్ష్యాలనే ఎంచుకోవడం మంచిది. మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లి, పరిచయంలేని వ్యక్తులతో పని చేయవలసి వస్తుంది. కంగారు పడవద్దు. జీవితంలో రహస్యాలను జాగ్ర త్తగా కాపాడుకోకపోతే కలిగే పర్యవసానాలు ఏమిటో తెలుసుకుంటారు ఈవారం. కలిసొచ్చే రంగు: ఎల్లో వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన శైలిలో పని చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు; ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన బంధాలను నిలుపుకునే విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే ఆ తర్వాత భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్కీ కలర్: వయొలెట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ కలలను సాకారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. పాజిటివ్ ఎనర్జీని నింపుకోవడం వల్ల కలిగే మంచి ఏమిటో మీకు అనుభవంలోకి వస్తుంది. మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకు గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోవాలనుకోకండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లనుంచి గుణపాఠాన్ని తీసుకుని, వాటిని మళ్లీ చేయకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించడం వల్ల భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న నలుపు రంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇల్లు లేదా ఉద్యోగం మారతారు. చురుగ్గా ఉండండి. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. అనేక రకాల అననుకూలతలను ఈవారం అధిగమిస్తారు. విజయానికి చేరువ అవుతారు. ఎంత సన్నిహితులైనా, డబ్బు వ్యవహారాలలో నిక్కచ్చిగా లేకపోతే పేచీ తప్పదని గ్రహించండి. మొహమాటానికి తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అనూహ్యమైన ఓ అవకాశం మీ తలుపు తట్టవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీరు ఎంత ఆలోచనాపరులైనప్పటికీ భావోద్వేగాల విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేకపోతే ఇబ్బందులు తప్పవు కాబట్టి వాటిని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించండి. నిజాయితీగా పని చే స్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ కలలు ఫలిస్తాయి. విదేశీ యానం చేయాలన్న మీ కోరిక తీరుతుంది. ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు తగిన ప్రణాళిక వేసుకోండి. గతాన్నే తలచుకుంటూ బాధపడక, భవిష్యత్ కార్యాచరణని ఆలోచించుకుని, తగ్గట్టుగా వ్యవహరించండి. జీవితంలో ఏమి జరిగినా, దానిని అందుకునేందుకు సంసిద్ధంగా ఉండండి. కలిసొచ్చే రంగు: వైట్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఇనుము బాగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని కావలసిన ఆకారంలోకి మలచుకోగలం. అలాగే మీరు బాగా పని చేసి, మంచి పేరు తెచ్చుకోండి. ప్రమోషన్ కొట్టండి. ఒక విషయంలో గట్టి నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. సిద్ధంగా ఉండండి. మీ లక్ష్యాలను, కలలను సాకారం చేసుకునేందుకు ఇది తగిన సమయం. ఆలసించకండి. ఆశాభంగం పొందకండి. కలిసొచ్చే రంగు: ఎరుపు ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) బంధుమిత్రులు మీ నుండి సహాయాన్ని అర్థించే వీలుంది. వారు చేస్తున్న పని ఎంతవరకూ సరియైనదో గమనించుకుని వ్యవహరించండి. మీపై అధికారులు మీ శ్రమనీ మీ నేర్పరితనాన్నీ గుర్తించడం లేదని దిగులు పడకండి. ఎప్పటిలానే మీ వృత్తిధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తూ ఉండండి. తగిన కాలం రాబోతోంది. అప్పటివరకూ ఓపిక పట్టక తప్పదు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఇంటి మరమ్మతులు, అద్దె ఇల్లు మారడం లేదా ఏవో కొన్ని సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని సమీప ప్రదేశంలో ఉన్న ఊరికి మకాంని మార్చడం వంటి ఆలోచనలని తాత్కాలికంగా వాయిదా వేయండి. ఈ విషయమై మీ దంపతుల ఆలోచనలని మించి, మరెవరూ గొప్ప ఆలోచనని చేయనే చేయరని గ్రహించండి. సంతానం విషయంలో తగు జాగ్రత్తతో ఉండండి. జెమిని (మే 21-జూన్ 21) తెలిసి తెలిసీ ఇబ్బందుల్లో పడతారు. వీలయినంత తొందరలో కళ్లు తెరిచి బయట పడడానికి ప్రయత్నించి ఇబ్బంది తొలగించుకుంటారు. మీ ప్రేమ వ్యవహారం లేదా రుణ వ్యవహారం పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. ఎంత గుంభనగా మీరు వ్యవహారం చేయదలిస్తే అంత తప్పు చేయబోతున్నారన్నమాట. సంయమనంతో వ్యవహరించండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) నిజమైన సహాయాన్ని మీకు ఎవరెవ రు చేస్తారో, చేయడానికి సిద్ధంగా ఉన్నారో గమనించుకోగలిగిన కాలం ఇది. కష్టం- సుఖం, లాభం- నష్టం, ఆనందం- దుఃఖం అన్నీ సమపరిమాణంలో ఉంటాయి ఈ వారమంతా. మీ మంచితనం కారణంగా ఏ ఇబ్బందికీ లోను కాకుండా గడిపేస్తారు, వచ్చే ఇబ్బందిని వాయిదా వేసుకుని- ఆపద తప్పినట్లే అని ఆనందించకండి. లియో (జూలై 24-ఆగస్టు 23) శత్రువుల సంఖ్యని తగ్గించుకోదలిచిన కొద్దీ పెరుగుతూ కన్పిస్తారు. తాత్కాలిక అనారోగ్యం కలగవచ్చు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగడం వల్ల సంతోషంగా ఉంటారు. విదేశీయానాహ్వానం అందవచ్చు. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. అవసరమయితే ఇక్కడి పనుల్ని విడిచైనా వెళ్లండి. ముందునాటికి లాభపడతారు. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఆదాయం కంటె ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోవడం మంచిది. ఆడంబరాలకి పోకుండా ఉంటే ఆదాయ వ్యయాలు అదుపులో ఉంటాయని గమనించండి. దేనికోసం రుణం చేయడమైందో ఆ రుణాన్ని దానికే వినియోగించండి. ఆర్థిక క్రమశిక్షణని పాటించండి . ఉద్యోగంలో ఒత్తిడి తప్ప ఒడిదుడుకులు ఏమీ రావు. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మనఃస్పర్ధతో వాదవివాదాలతో న్యాయస్థానాల వెంట వెళ్లడం కంటె మరో మార్గం ఉందేమో ఆలోచించుకోండి. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి శారీరక వ్యాధిని తెచ్చిపెడతాయనేది నాటికాలపు వైద్యం చెప్పిన మాట. పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థయాత్రలూ విహార యాత్రలూ చేసే అవకాశముంది. నిరుత్సాహపరులైన మిత్రులకి దూరంగా ఉండటం మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రయత్నాలని పట్టుబట్టి విడవకుండా చే స్తూండడం బట్టి కొంత అనుకూలత కన్పించే అవకాశం ఉంది. మీ బుద్ధికున్న గట్టితనం, హృదయానికున్న దిటవు కారణంగా కష్టాలని అనుభవిస్తూ కూడా విధులు సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. వర్తమాన పరిస్థితుల అనుకూలత కోసం దైవధ్యానం చేసుకోవడం మంచిది. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనారోగ్యం వస్తుందేమోనని నిరంతరం అనుకోవడానికి మించిన అనారోగ్యం మరోటి లేదని గ్రహించండి. మీకు ఓ గ్రహపు దృష్టి సరిలేదనే మాట నిజమే అయినా మీ ఊహా దుఃఖాలన్నీ నిజమై పోవని గమనించండి. అనుభవజ్ఞులూ పెద్దలూ మంచీ చెడూ తెలిసిన వారిని సేవిస్తుంటే ధైర్యం వస్తుంది. ధైర్యం కలిగినప్పుడు శారీరక అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయనే లేదు. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీకున్న పరిచయాలతో ఇతరులు మీ ద్వారా పనులని సాధించుకోవాలని చూస్తారు. మంచిదే కాని అందరినీ విశ్వసించడం అంత మంచిది కాదని తెలుసుకోండి. ఏదైనా విషయముంటే దాన్ని సాగదీయక, సాధ్యమైనంత త్వరలో నిర్ణయాన్ని ప్రకటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రస్తుతం చేస్తున్న చేయబోతున్న రుణం మంచిపని కోసమే ఔతుంది. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఏదో జరిగిపోతోందనే భ్రమలో ఉంటారు. ఏదయినా ఓ మంచి పనిని దైవసంబంధంగా చేయాలనే భావన కలుగుతుంది. సమస్య ఏదైనా ఎదురయినప్పుడు సంయమనంతో ఉండండి తప్ప దానికోసమే ప్రయత్నిస్తూ మానసికంగా అలసిపోకండి. తప్పక సమస్య మీకు అనుకూలంగానే పరిష్కరింపబడుతుంది. భయం లేదు. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఓ శుభకార్యం చోటు చేసుకోవచ్చు. వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం అనుకూలం కాదు. చేస్తున్న వ్యాపారంతో కొంతకాలంపాటు సంతృప్తి పడండి తప్ప, కొత్త వ్యాపారం, ఉద్యోగం, వృత్తికోసం తపన పడకండి. దంపతుల అన్యోన్యత కారణంగా ఈవారం బాగుంటుంది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఓ అవకాశం మీ తలుపు తడుతుంది
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చాలా కాలంగా మీరు చూడాలనుకుంటున్న వారిని కలుస్తారు. మీ మనసు చెబుతున్న దానిని వింటారు. మీకున్న రకరకాల సందేహాలను నివృతి చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారు. భయం, భావోద్వేగాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అనవసర మొహమాటాలను విడిచిపెట్టడం మంచిది. కలిసొచ్చే రంగు: నీలం టారస్ (ఏప్రిల్ 21-మే 20) పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. కుటుంబ అవసరాలను తీరుస్తారు. జీవితభాగస్వామితో, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికతలో, ధ్యానంలో ముందుకెళతారు. సృజనాత్మకంగా గడుపుతారు. మీ అభిరుచులకు తగ్గట్టు పని చేయండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ జెమిని (మే 21-జూన్ 21) మీ ధోరణిని మార్చుకోవలసిన తరుణమిది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న విచారం, కోపం, నిరాశలను పారద్రోలాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అన్నింటిలోనూ సమతూకాన్ని పాటించడం మంచిది. పెండింగ్‌లో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఆత్మవిశ్వాసంతోనూ, సంతోషంతోనూ జీవితాన్ని ఎదుర్కోండి. క్లిష్టసమయాలు ఉండవచ్చు. కానీ అవే మిమ్మల్ని బలోపేతం చేస్తాయని గుర్తుంచుకోండి. అవివాహితులకు కొందరితో ఏర్పడ్డ పరిచయాలు కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. స్థిరాస్తి అమ్మకం విషయంలో తొందరపాటు తగదు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) భ్రమలను విడిచిపెట్టి, అదను కోసం ఆశగా ఎదురు చూడడంలో తప్పేముంది? ఉదాశీనతను విడిచిపెట్టి, చురుగ్గా ఉండండి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తూ హుషారుగా ఉంటేనే కదా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకునేది! పిల్లలతో సమయం వెచ్చిస్తే మీకూ కొత్త విషయాలు తెలుస్తాయి. కలిసొచ్చే రంగు: పింక్ షేడ్స్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికిది మంచి సమయం. ఉద్యోగరీత్యా దూరప్రయాణం ఉండొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. జీవితమనే నౌక ఎటు తిప్పితే అటు తిరుగుతూ, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి చేరడమే జీవితమంటే! మీ భాగస్వామికి మీ సహాయ సహకారాలను అందించాల్సి వస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితమనే ప్రయాణానికి అంతంటూ ఉండదు. లక్ష్యాలు, ధ్యేయాలు లేకుండా జీవించాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు ఒక లక్ష్యాన్ని చేరుకుంటే ఇంకా తొమ్మిదివందల తొంభైతొమ్మిది లక్ష్యాలు నీ ముందుంటాయి. మనస్సును, శరీరాన్నీ చురుగ్గా ఉంచుకోండి. శారీరకారోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే జిమ్‌లో చేరండి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు క నే కలలను బట్టి, వాటిని నెరవేర్చుకునేందుకు మీరు వేసుకునే ప్రణాళికలపైనే మీ భవిష్యత్తు. భవిష్యత్ ప్రణాళిక లేనివాడే సిసలైన సెలబ్రిటీ. ఈ క్షణంలో సంతోషంగా, పరిపూర్ణంగా జీవిస్తాడు. సమృద్ధిగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లవచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇతరుల విషయంలో తీర్పులు చెప్పడాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం మంచిది. ప్రేమ, శృంగారం, సంతోషం ఈ వారంలో మీకు బాగా యోగిస్తాయి. అదృష్టం, అభివృద్ధి ఈ వారం మీ వెంటే ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఈ మీ తలుపు తడుతుంది. కలిసొచ్చే రంగు: గోల్డెన్ బ్రౌన్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ వారమంతా కుటుంబంతో కలసి హాయిగా పిక్నిక్కులతో సేదదీరతారు. పనిలో మీరు త్వరిత నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. మీ ఆత్మవిశ్వాసం, అవగాహన శక్తి ఇనుమడిస్తాయి. దీర్ఘకాలంగా కోర్టులో ఉన్న కేసు ఒకటి మీకు ఊరటనిస్తుంది. అనారోగ్యకరమైన పరిస్థితుల నుంచి బయట పడతారు. కలిసొచ్చే రంగు: ఆలివ్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీకు అదృష్టకరమైన వారంగా చెప్పవచ్చు. మీతో సహా ముగ్గురు కలిసి చేసే భాగస్వామ్య వ్యాపారంలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది.ప్రణాళికాబద్ధంగా పని చేసి, లక్ష్యాన్ని చేరుకోండి. విజయాన్ని అందుకోండి. కుటుంబపరంగా చాలా సౌఖ్యదాయకంగా గడిచిపోతుంది ఈ వారం. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పనిలో అందరి మన్ననలూ అందుకుంటారు. ఈ వారమంతా బోలెడన్ని అవకాశాలు, కొత్త కొత్త ప్రతిపాదనలు మీ తలుపు తడతాయి. అవన్నీ అద్భుతమైన భవిష్యత్తుకు నాందిపలుకుతాయి. మీ దిశ మార్చుకుని, కొత్త పంథా తీసుకుంటే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. కలిసొచ్చే రంగు: ఎరుపు ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఓ మంచిపని కోసం లేదా శుభకార్యం నిమిత్తం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రుణం లభిస్తుంది. కుటుంబం మొత్తం సంతృప్తిగా గడుపుతారు. మీ కింది ఉద్యోగులతో, భాగస్వాములతో, సేవకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పరోక్షంలో కూడ మీ సంస్థ కార్యక్రమాలు సవ్యంగా సాగడం మీకు ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. మీరు చేబదులుగా తీసుకున్న రుణంగాని, పత్రం మీద రాసి తీసుకున్న అప్పుగాని మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేయచ్చు. ఫలాని సమయానికి తప్ప తీర్చడం సాధ్యపడదని నిదానంగా పెద్దమనుషుల సమక్షంలో చెప్పండి. సమస్య జటిలం కానే కాదు. తొందరపాటుతో వేటినో కొనబోవడం అమ్మబోవడం వంటి ఆలోచనలు చేయవద్దు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చేతకాని వారనుకుంటున్నారని దిగులు పడకండి. కాలం కలిసిరాని సమయంలో ఇలాంటి అడ్డంకులెన్ని వచ్చినా విజయం మీదేనని గుర్తించండి. మీరు ఇతరులకి ఖర్చు చేసినదీ- ఇతరులకు మీరు ఖర్చు చేసినదీ స్పష్టంగా ఒక చోట లెక్క వేసుకుని ఉంచడం చాలా అవసరం. మీ గురించి ఎంతగానో ఎదురుగా గొప్పగా ప్రశంసిస్తూ మీకు మాత్రం అవకాశం రానివ్వకుండా చేస్తుంటారు కొందరు. మీకొచ్చిన నష్టమేమీ లేదు. మీ ప్రతిభ తప్పక గుర్తింపుకొస్తుంది. కుటుంబంలోని అనైకమత్యం గురించిన మానసిక వ్యధ వుండచ్చు మీకు. మీరు మాత్రం ధర్మబద్ధంగానే వ్యవహరించండి. వక్రమార్గాన ప్రయాణించవద్దు. మీకు ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా ధైర్యం కొంత సడలి ఉండచ్చు. పట్టుదలకీ అహంకారానికీ పోకుండా కార్యరంగంలో సరైన తీరులో ప్రవర్తిస్తూ ఉండండి. పైనా కిందా ఉండే ఉద్యోగులతో మిత్రభావంతో మెలగండి. మీకు సంబంధించని వ్యవహారాల మీద అజమాయిషీని మానుకోండి. ఖర్చులు పెరిగిపోయిన దృష్ట్యా రుణం చేయవలసి రావచ్చు. నిరుద్యోగులయిన వారికి ఉద్యోగం లభిస్తుంది కాని సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మీ పిత్రార్జితమైన స్థలాన్నో ఇంటినో కాజేయాలనే దుర్బుద్ధితో ఎవరైనా ఉండచ్చు కాబట్టి ముందుకు ముందే ఆ ఆలోచన లేని తీరుగా మాటల్లో చెప్పండి. ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం వద్దే వద్దు. ఈ వారంలో మీకు ఏ తీరు ప్రతికూలతా లేకపోయినప్పటికీ అనుకూలత మాత్రం ఉండదు. శుభాశుభ మిశ్రమంగా గడిచిపోతుంది. అనవసరమైన దీర్ఘాలోచనలతో అనారోగ్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాటలో మెత్తగా... వ్యవహారంలో కఠినంగా ఉండండి. వద్దు వద్దంటున్న వారితో సంబంధాన్ని కొనసాగించుకోవాలని అనుకోకండి. విరోధాన్ని శీఘ్రంగా వదిలించుకునే ఉపాయాన్ని అన్వేషించుకోండి. అందరూ సహాయకులుగా ఉండి కూడా ఏ విధమైన ప్రయోజనమూ చేకూరని స్థితి ఈ వారం మీది. కాబట్టి దైవాన్నే ధ్యానిస్తూ ఉండండి. మీ పై అధికారుల వల్ల మీకు లాభం కలుగుతుంది. సంతోషకరంగా అనిపిస్తుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలించకపోవచ్చు, ఉద్యోగంలో దూరపు ప్రదేశాలకి వెళ్లవలసి రావచ్చు. ఈ దూరపు ఉద్యోగాన్ని కాదన్నా ఏ నష్టమూ మీకు జరగదు. అనుకున్న పనులన్నీ వాయిదా పడుతూ, ఆగుతూ అసంతృప్తిని కలిగించవచ్చు. పరిస్థితుల్లో మార్పు గోచరిస్తుంది తప్ప సంపూర్ణ విజయం సిద్ధించకపోవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకుని ఉండక తప్పదు. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని శ్రద్ధగా పట్టించుకోండి. సంతానానికి కలిగిన ఓ విజయం మీకు సంతృప్తినియ్యచ్చు. ఉద్యోగంలో బదిలీకి ప్రయత్నం వద్దు. వాగ్వివాదం వద్దు. అధికారులతో చనువూ దగ్గరితనం కూడా వద్దు. చేస్తున్న వ్యాపారంలో కొత్త మెళకువలని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. సంస్థ ఎందుకు నష్టంలో నడుస్తోందో దాని మీద దృష్టి పెట్టండి. సకాలంలో పత్రాలని పంపని కారణంగా ప్రభుత్వం నుండి మీకు కొన్ని చిక్కులు కలగవచ్చు. చర్మవ్యాధిగాని ఉండినట్లయితే వైద్యం చేయించుకోవాలని మరవకండి. సంతానంలో పట్టుదలా పెంకితనం మానసికాందోళనని కల్గించవచ్చు కాబట్టి చనువుగా మెలుగుతూ ఉండండి. ఆర్థికలోటు రాకుండా ఉండేందుకు మీరు చేస్తున్న వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. మడమలు, పాదాల నొప్పులు వస్తే అశ్రద్ధ చేయకండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు