ఓ అవకాశం మీ తలుపు తడుతుంది | A chance tadutundi your door | Sakshi
Sakshi News home page

ఓ అవకాశం మీ తలుపు తడుతుంది

Published Fri, Jul 10 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

A chance tadutundi your door

టారో బాణి
 

 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
 చాలా కాలంగా మీరు చూడాలనుకుంటున్న వారిని కలుస్తారు. మీ మనసు చెబుతున్న దానిని వింటారు. మీకున్న రకరకాల సందేహాలను నివృతి చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారు. భయం, భావోద్వేగాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అనవసర మొహమాటాలను విడిచిపెట్టడం మంచిది. కలిసొచ్చే రంగు: నీలం
 
 టారస్  (ఏప్రిల్ 21-మే 20)

 పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. కుటుంబ అవసరాలను తీరుస్తారు. జీవితభాగస్వామితో, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికతలో, ధ్యానంలో ముందుకెళతారు. సృజనాత్మకంగా గడుపుతారు. మీ అభిరుచులకు తగ్గట్టు పని చేయండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 జెమిని (మే 21-జూన్ 21)

 మీ ధోరణిని మార్చుకోవలసిన తరుణమిది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న విచారం, కోపం, నిరాశలను పారద్రోలాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అన్నింటిలోనూ సమతూకాన్ని పాటించడం మంచిది. పెండింగ్‌లో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)
 ఆత్మవిశ్వాసంతోనూ, సంతోషంతోనూ జీవితాన్ని ఎదుర్కోండి. క్లిష్టసమయాలు ఉండవచ్చు. కానీ అవే మిమ్మల్ని బలోపేతం చేస్తాయని గుర్తుంచుకోండి. అవివాహితులకు కొందరితో ఏర్పడ్డ పరిచయాలు కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. స్థిరాస్తి అమ్మకం విషయంలో తొందరపాటు తగదు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 భ్రమలను విడిచిపెట్టి, అదను కోసం ఆశగా ఎదురు చూడడంలో తప్పేముంది? ఉదాశీనతను విడిచిపెట్టి, చురుగ్గా ఉండండి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తూ హుషారుగా ఉంటేనే కదా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకునేది! పిల్లలతో సమయం వెచ్చిస్తే మీకూ కొత్త విషయాలు తెలుస్తాయి. కలిసొచ్చే రంగు: పింక్ షేడ్స్
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)

 ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికిది మంచి సమయం. ఉద్యోగరీత్యా దూరప్రయాణం ఉండొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. జీవితమనే నౌక ఎటు తిప్పితే అటు తిరుగుతూ, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి చేరడమే జీవితమంటే! మీ భాగస్వామికి మీ సహాయ సహకారాలను అందించాల్సి వస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 జీవితమనే ప్రయాణానికి అంతంటూ ఉండదు. లక్ష్యాలు, ధ్యేయాలు లేకుండా జీవించాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు ఒక లక్ష్యాన్ని చేరుకుంటే ఇంకా తొమ్మిదివందల తొంభైతొమ్మిది లక్ష్యాలు నీ ముందుంటాయి. మనస్సును, శరీరాన్నీ చురుగ్గా ఉంచుకోండి. శారీరకారోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే జిమ్‌లో చేరండి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 మీరు క నే కలలను బట్టి, వాటిని నెరవేర్చుకునేందుకు మీరు వేసుకునే ప్రణాళికలపైనే మీ భవిష్యత్తు. భవిష్యత్ ప్రణాళిక లేనివాడే సిసలైన సెలబ్రిటీ. ఈ క్షణంలో సంతోషంగా, పరిపూర్ణంగా జీవిస్తాడు. సమృద్ధిగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లవచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
 ఇతరుల విషయంలో తీర్పులు చెప్పడాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం మంచిది. ప్రేమ, శృంగారం, సంతోషం ఈ వారంలో మీకు బాగా యోగిస్తాయి. అదృష్టం, అభివృద్ధి ఈ వారం మీ వెంటే ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఈ మీ తలుపు తడుతుంది. కలిసొచ్చే రంగు: గోల్డెన్ బ్రౌన్
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

 ఈ వారమంతా కుటుంబంతో కలసి హాయిగా పిక్నిక్కులతో సేదదీరతారు.  పనిలో మీరు త్వరిత నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. మీ ఆత్మవిశ్వాసం, అవగాహన శక్తి ఇనుమడిస్తాయి. దీర్ఘకాలంగా కోర్టులో ఉన్న కేసు ఒకటి మీకు ఊరటనిస్తుంది. అనారోగ్యకరమైన పరిస్థితుల నుంచి బయట పడతారు. కలిసొచ్చే రంగు: ఆలివ్
 
 అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

  మీకు అదృష్టకరమైన వారంగా చెప్పవచ్చు. మీతో సహా ముగ్గురు కలిసి చేసే భాగస్వామ్య వ్యాపారంలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది.ప్రణాళికాబద్ధంగా పని చేసి, లక్ష్యాన్ని చేరుకోండి. విజయాన్ని అందుకోండి. కుటుంబపరంగా చాలా సౌఖ్యదాయకంగా గడిచిపోతుంది ఈ వారం. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్
 
 పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 పనిలో అందరి మన్ననలూ అందుకుంటారు. ఈ వారమంతా బోలెడన్ని అవకాశాలు, కొత్త కొత్త ప్రతిపాదనలు మీ తలుపు తడతాయి. అవన్నీ అద్భుతమైన భవిష్యత్తుకు నాందిపలుకుతాయి. మీ దిశ మార్చుకుని, కొత్త పంథా తీసుకుంటే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. కలిసొచ్చే రంగు: ఎరుపు
 
 ఇన్సియా కె.
 టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
 సౌర వాణి

 
 ఓ మంచిపని కోసం లేదా శుభకార్యం నిమిత్తం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రుణం లభిస్తుంది. కుటుంబం మొత్తం సంతృప్తిగా గడుపుతారు. మీ కింది ఉద్యోగులతో, భాగస్వాములతో, సేవకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పరోక్షంలో కూడ మీ సంస్థ కార్యక్రమాలు సవ్యంగా సాగడం మీకు ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి.
 
 మీరు చేబదులుగా తీసుకున్న రుణంగాని, పత్రం మీద రాసి తీసుకున్న అప్పుగాని మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేయచ్చు. ఫలాని సమయానికి తప్ప తీర్చడం సాధ్యపడదని నిదానంగా పెద్దమనుషుల సమక్షంలో చెప్పండి. సమస్య జటిలం కానే కాదు. తొందరపాటుతో వేటినో కొనబోవడం అమ్మబోవడం వంటి ఆలోచనలు చేయవద్దు.
 
 మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చేతకాని వారనుకుంటున్నారని దిగులు పడకండి. కాలం కలిసిరాని సమయంలో ఇలాంటి అడ్డంకులెన్ని వచ్చినా విజయం మీదేనని గుర్తించండి. మీరు ఇతరులకి ఖర్చు చేసినదీ- ఇతరులకు మీరు ఖర్చు చేసినదీ స్పష్టంగా ఒక చోట లెక్క వేసుకుని ఉంచడం చాలా అవసరం.
 
 మీ గురించి ఎంతగానో ఎదురుగా గొప్పగా ప్రశంసిస్తూ మీకు మాత్రం అవకాశం రానివ్వకుండా చేస్తుంటారు కొందరు. మీకొచ్చిన నష్టమేమీ లేదు. మీ ప్రతిభ తప్పక గుర్తింపుకొస్తుంది. కుటుంబంలోని అనైకమత్యం గురించిన మానసిక వ్యధ వుండచ్చు మీకు. మీరు మాత్రం ధర్మబద్ధంగానే వ్యవహరించండి. వక్రమార్గాన ప్రయాణించవద్దు.
 
 మీకు ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా ధైర్యం కొంత సడలి ఉండచ్చు. పట్టుదలకీ అహంకారానికీ పోకుండా కార్యరంగంలో సరైన తీరులో ప్రవర్తిస్తూ ఉండండి. పైనా కిందా ఉండే ఉద్యోగులతో మిత్రభావంతో మెలగండి. మీకు సంబంధించని వ్యవహారాల మీద అజమాయిషీని మానుకోండి. ఖర్చులు పెరిగిపోయిన దృష్ట్యా రుణం చేయవలసి రావచ్చు.
 
 నిరుద్యోగులయిన వారికి ఉద్యోగం లభిస్తుంది కాని సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మీ పిత్రార్జితమైన స్థలాన్నో ఇంటినో కాజేయాలనే దుర్బుద్ధితో ఎవరైనా ఉండచ్చు కాబట్టి ముందుకు ముందే ఆ ఆలోచన లేని తీరుగా మాటల్లో చెప్పండి. ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం వద్దే వద్దు.
 
 ఈ వారంలో మీకు ఏ తీరు ప్రతికూలతా లేకపోయినప్పటికీ అనుకూలత మాత్రం ఉండదు. శుభాశుభ మిశ్రమంగా గడిచిపోతుంది. అనవసరమైన దీర్ఘాలోచనలతో అనారోగ్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
 
 మాటలో మెత్తగా... వ్యవహారంలో కఠినంగా ఉండండి. వద్దు వద్దంటున్న వారితో సంబంధాన్ని కొనసాగించుకోవాలని అనుకోకండి. విరోధాన్ని శీఘ్రంగా వదిలించుకునే ఉపాయాన్ని అన్వేషించుకోండి. అందరూ సహాయకులుగా ఉండి కూడా ఏ విధమైన ప్రయోజనమూ చేకూరని స్థితి ఈ వారం మీది. కాబట్టి దైవాన్నే ధ్యానిస్తూ ఉండండి.
 
 మీ పై అధికారుల వల్ల మీకు లాభం కలుగుతుంది. సంతోషకరంగా అనిపిస్తుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలించకపోవచ్చు, ఉద్యోగంలో దూరపు ప్రదేశాలకి వెళ్లవలసి రావచ్చు. ఈ దూరపు ఉద్యోగాన్ని కాదన్నా ఏ నష్టమూ మీకు జరగదు.
 
 అనుకున్న పనులన్నీ వాయిదా పడుతూ, ఆగుతూ అసంతృప్తిని కలిగించవచ్చు. పరిస్థితుల్లో మార్పు గోచరిస్తుంది తప్ప సంపూర్ణ విజయం సిద్ధించకపోవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకుని ఉండక తప్పదు. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని శ్రద్ధగా పట్టించుకోండి. సంతానానికి కలిగిన ఓ విజయం మీకు  సంతృప్తినియ్యచ్చు.
 ఉద్యోగంలో బదిలీకి ప్రయత్నం వద్దు. వాగ్వివాదం వద్దు. అధికారులతో చనువూ దగ్గరితనం కూడా వద్దు. చేస్తున్న వ్యాపారంలో కొత్త మెళకువలని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. సంస్థ ఎందుకు నష్టంలో నడుస్తోందో దాని మీద దృష్టి పెట్టండి. సకాలంలో పత్రాలని పంపని కారణంగా ప్రభుత్వం నుండి మీకు కొన్ని చిక్కులు కలగవచ్చు.
 
 చర్మవ్యాధిగాని ఉండినట్లయితే వైద్యం చేయించుకోవాలని మరవకండి. సంతానంలో పట్టుదలా పెంకితనం మానసికాందోళనని కల్గించవచ్చు కాబట్టి చనువుగా మెలుగుతూ ఉండండి. ఆర్థికలోటు రాకుండా ఉండేందుకు మీరు చేస్తున్న వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. మడమలు, పాదాల నొప్పులు వస్తే అశ్రద్ధ చేయకండి.
 
 డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement