జూన్ 13 నుంచి జూన్ 19 వరకు.... | Taro the style | Sakshi
Sakshi News home page

జూన్ 13 నుంచి జూన్ 19 వరకు....

Published Fri, Jun 12 2015 10:30 PM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

జూన్ 13 నుంచి జూన్ 19 వరకు....

జూన్ 13 నుంచి జూన్ 19 వరకు....

టారో బాణి
 
ఏరిస్  (మార్చి 21- ఏప్రిల్ 20)
కొత్త అవకాశాలు వస్తాయి. పుష్కలంగా ధనం చేతికందుతుంది. విలాసంగా గడుపుతారు. మీరు ఉద్యోగి అయితే ప్రమోషన్ ఖాయం. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకెదురవుతున్న తిరస్కృతులు, నిరాశలు, వంచనలు జీవితంలో మామూలేనని, అలాంటివాటికి త్వరలో ముగింపు ఉందని గ్రహించి, నిబ్బరంగా ముందుకెళ్లండి; కలిసొచ్చే రంగు: గ్రీన్ షేడ్
 
 టారస్ (ఏప్రిల్ 21-మే 20)

 సంయమనంతో, సమతుల్యంతో ఉండి మీ విజయం సాధించండి. వారమంతా క్షణం తీరికలేకుండా గడిపేస్తారు. మీరు ఏదైనా బంధంలో ఉండి ఉంటే, దాని నుంచి బయట పడటం మంచిది. పనికి, ప్రేమకూ పొత్తు కుదరక పోయినా, ప్రేమతో చేస్తే పనులు జరుగుతాయి. చేసిన తప్పుల నుంచి బయటపడి, వివేకంతో మెలగండి; కలిసొచ్చే రంగు: బ్రౌన్
 
 జెమిని (మే 21-జూన్ 21)
 మీరు వెళుతున్న మార్గంలో ప్రధానమైన మలుపులు ఉండవచ్చు. ఏ దారిలో ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. పనిలో కాస్త దూకుడును తగ్గించుకోవడం మంచిది. వృత్తిపరంగా మీరు ప్రతిభావంతులు కావచ్చు కాని, కొంచెం విశ్రాంతి కూడా అవసరం కదా! ప్రేమబంధంలో మీరే కాస్త చొరవ చూపించవలసి రావచ్చు; కలిసొచ్చే రంగు: పీచ్
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
ఈ వార మంతా కొంచెం బద్ధకంగా గడుపుతారు. మీకు అడ్డు చెప్పువారు ఎవరూ లేరు కదా అని  కీలకమైన నిర్ణయాలు మీ అంతట మీరు తీసుకోవద్దు. ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. మీ కోరిక ఈ వారంలో తప్పక నెరవేరుతుంది. కొత్త వ్యాపారాన్ని లేదా ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. మీదైన శైలిలో ముందుకెళ్లి విజయం సాధించండి; కలిసొచ్చే రంగు: ఆరంజ్ షేడ్స్
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 మీ బలాబలాలను, నిజానిజాలను పరిశీలించి నిర్థారణ చేసుకోదగ్గ వారం ఇది. ప్రేమ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆనందం ఉన్నా, అందుకు తగ్గ స్థాయిలో అభద్రతాభావం వెంటాడవచ్చు. అయితే అది కేవలం మీ అనుమానం మాత్రమే అని గ్రహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి; కలిసొచ్చే రంగు: వైట్
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీ ఇంటిని ఆధునీకరించుకోవలసిన, జీవితంలో కొత్తదనం నింపుకోవలసిన సమయం ఇది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మీ ప్రాజెక్ట్ ఒకటి ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎటు నడిపిస్తే అటు నడవడమే జీవితం అని గ్రహించండి; కలిసొచ్చే రంగు: పర్పుల్
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 జీవితమన్నాక ఆటుపోట్లు తప్పవు. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన కుంగిపోనక్కరలేదు.  పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కొంచెం బలహీన పరిచినా, అది తాత్కాలికమేనని తెలుసుకోండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. డబ్బు కూడా మీ వెనకాల పడుతుంది. వారమంతా సంతోషంగా గడుపుతారు; కలిసొచ్చే రంగు: గ్రీన్
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 చీకటి తర్వాత వెలుగు, దుఃఖం తర్వాత సుఖం మామూలేనని గ్రహించండి. ఎటువంటి సంఘటనలు ఎదురైనా, నిబ్బరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్‌మెంట్లు, అదనపు బరువు బాధ్యతలు మీ మీద పడవచ్చు. సిద్ధం కండి. మరింత సంతోషకరమైన, సౌఖ్యదాయకమైన జీవితం మీ కోసం ఎదురు చూస్తోంది; కలిసొచ్చే రంగు:పసుప్పచ్చ
 
 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
 మీకున్న జ్ఞానాన్ని, విద్యను డబ్బు సంపాదన కోసం ఎందుకు ఉపయోగించకూడదు? ఆలోచించి చూడండి. అలాగని నిబంధనలు అతిక్రమించవద్దు. ఇంతకాలం మీకు సహాయంగా ఉన్న వారికి ఇప్పుడు మీరు సాయం చేయవలసి రావచ్చు. కొత్త బంధం ఏర్పరచుకోవాలంటే మీకు కొంత సమయం, సందర్భం అవసరం అని గ్రహించండి; కలిసొచ్చే రంగు: వెండి రంగు
 
 క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

 పనిలోనూ, మీ ప్రేమ బంధంలోనూ కొత్తదనం చూపించవలసిన తరుణం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ ధైర్యం ముందు, దృఢనిశ్చయం ముందు తలవంచి తీరతాయి. కొత్త ప్రాజెక్టులు, లావాదేవీలు ప్రారంభించడానికి ఇది తగిన సమయం. ఎప్పటినుంచో బకాయి పడి ఉన్న అప్పులు తీర్చేయడం వల్ల నిశ్చింతగా ఉంటారు; కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్
 
 అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
 కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వెలుగుకు ముందు చీకటి తప్పదని తెలుసుకోండి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలోని భ్రమలు తొలగిపోవడానికి ఇది తగిన సమయం. మీరు వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాకపోయినా, వెతుక్కుంటూ వస్తే మీరు మాత్రం ఏం చేయగలరు? వాదోపవాదాలకు తావివ్వవద్దు. మీ మూడ్ చెదిరిపోకుండా చూసుకోండి; కలిసొచ్చేరంగు: గ్రీన్
 
 పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20)
 సవాళ్లను ఎదుర్కొనడానికి రెడీగా ఉండండి. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. పార్టీలతో, సామాజిక కార్యకలాపాలతో వారమంతా చాలా బిజీగా గడిపేస్తారు. గతంలో మంచి క్రీడాకారులు కావడం వల్లనే ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకోండి. పనిమీద విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. తగిన పత్రాలతో సిద్ధంగా ఉండండి; కలిసొచ్చే రంగు: లేత పసుపు.
 ఇన్సియా కె.
 టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
ఏరిస్  (మార్చి 21- ఏప్రిల్ 20)
కొన్ని రంగాల వారికి ముఖ్యంగా విద్యావైద్యరంగాలవారికి మంచి గుర్తింపు, పురస్కారాలు లభించవచ్చు. వ్యాపార, వినోదరంగాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. స్త్రీలకి అనారోగ్య సూచన. శారీరక శ్రమ, మానసికమైన బడలిక. సకాల భోజనం, సకాల నిద్ర, తగినంత విశ్రాంతి అవసరం. వీలయినంత తక్కువ మాట్లాడటం మంచిది ఈ వారంలో.

 టారస్ (ఏప్రిల్ 21-మే 20)
అనూహ్యమైన ఖర్చులు, దానికి తగ్గట్టు అనూహ్యమైన ఆదాయం ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వినోదరంగంలో ఉన్న వారికి ఆరోగ్య భంగ సూచ న ఉంది. ప్రభుత్వేతర సంస్థల్లోని అత్యున్నత స్థాయి ఉద్యోగులకి తగిన మన్నన, గౌరవం లభిస్తాయి. పదోన్నతి, స్థానచలనం కలగవచ్చు. మనసులో మాటని గుంభనంగా ఉంచుకోవడం మంచిది.

 జెమిని (మే 21-జూన్ 21)
ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు సంస్థకోసమే మనం పుట్టలేదని గ్రహించి, ఇంతకంటే గొప్ప ఆదాయం ఉందనిపించే చోటుకి మారడం తప్పు కాదు. ఈ వారంలో ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పు కలిగితే కొనసాగండి లేని పక్షంలో సరైన చోటుకోసం వేట ప్రారంభించండి. కుటుంబం తర్వాతే సంస్థ అని గుర్తించండి.

క్యాన్సర్ (జూన్22-జూలై 23)
బంధుమిత్రుల రాకపోకలతో, విందువినోదాలతో సంతోషంగా గడుస్తుంది. భూమి, గృహం, ఇండ్లస్థలం వంటివి కొనాలనే ఆలోచనగానీ కొనడం గానీ సంభవించవచ్చు. అయిన వారి దగ్గర అప్పు మాత్రం తీసుకోద్దు. సంతానావకాశ సూచన గాని, సంతాన ప్రాప్తిగానీ కావచ్చు. అనుకూలంగా గడిచే వారం ఇది. అసూయాపరులతో జాగ్రత్త.

లియో (జూలై 24-ఆగస్టు 23)
మీ పిల్లల చదువు విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సత్ఫలితాల కారణంగా చక్కని చదువులో మంచి కళాశాలలో చేరతారు. శుభకార్యాల కోసం కొద్దిగా శ్రమిస్తే విజయం మీ వెంటే ఉండగలదు. ఉద్యోగం చేస్తున్న వారు పోటీపరీక్షలకి శ్రమించి సిద్ధపడితే పదోన్నతి ఖాయం. వీలయినంత ఎక్కువగా దైవారాధన చేయండి.

 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
అదృష్టవశాత్తూ మీరు పడుతున్న శ్రమనీ మీ కృషినీ ఉద్యోగంలో మీరు చూపుతున్న ప్రతిభనీ పైవాళ్లు గుర్తిస్తారు. ప్రశంసిస్తారు. ఇంతకుముందున్న ఆర్థికమాంద్యం తొలగి, ఆర్థికపరంగా కొంత ధైర్యం లభిస్తుంది. కుటుంబంలోనూ, బంధువర్గంలోనూ మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆడంబరానికీ, అట్టహాసానికీ పోకుండా మీదైన శైలిలోనే సాగడం మంచిది.

 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీరు కిందిస్థాయి ఉద్యోగి అయితే పై అధికారులతో ఏ మాత్రం విభేదించద్దు. మీరు ఉన్నతాధికారి అయి ఉంటే మీ కింది వారిని కలుపుకుపోవడం మంచిది. లేదంటే అందరూ కలిసి విరోధించి పరిస్థితిని దూరంగా తీసుకుపోవచ్చు. సామరస్యభావంతో ఉండండి. ఇదే పద్ధతిని మీరు భార్య అయితే భర్తతోనూ, భర్త అయితే భార్యతోనూ ఈ వారమంతా అనుసరించడం అవసరం.

 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
నిరుత్సాహమనేది వద్దేవద్దు. జీవితంలో చూడదగిన, వినదగిన, వినగలిగిన ఎన్నో మధుర ఘట్టాలు మున్ముందున్నాయి. తాత్కాలిక దుఃఖమనేది మహానుభావులకూ వచ్చిందే. ముఖ్యమైన సదస్సులకి ఆహ్వానం అందితే లేదా పెద్దలతో పరిచయ అవకాశాలు కలిగితే సద్వినియోగం చేసుకోండి. ఆ పరిచయం లేదా ఆ అవకాశం మిమ్మల్ని పై స్థాయికి తీసుకువెళుతుంది.

 శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
పెద్దజీతంతో దూరపు చోట ఉద్యోగం లభించిందని పొంగిపోకండి, కుటుంబానికి దూరం అయితే జీవితమే దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త వ్యాపారావకాశాన్ని గుడ్డిగా అనుసరించకుండా మీకు అనుకూలురూ, మార్గదర్శకులూ అయిన వారితో సంప్రదించి మాత్రమే ముందడుగు వేయడం మంచిది.

క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
వస్తువుల కొనుగోళ్లలో పడిపోయి ప్రణాళికని మించి వ్యయం చేసే అవకాశముంది- జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నానికో లేదా ఉద్యోగపు రాకపోకలకో అంచనాలకి మించి వ్యయం చేస్తారు. విద్యార్థుల్లో అలాగే వృత్తి వ్యాపారాలలో అదనపు ఆదాయపు తక్కువ కావడాన అసంతృప్తి కలగవచ్చు. మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటూ ధైర్యాన్ని చెప్పుకుంటూ గడపాల్సిన వారం ఇది.

అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
బాగా తెలిసి తెలిసి/ అలాగే ఎంతో తెలిసిన వ్యక్తిని నమ్మి ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది. మరో నెలరోజుల్లో బయటపడి పోతారని గమనించుకుని ధైర్యంతో ఉంటూ ఆ ప్రమాదం నుండి బయటికి వచ్చే ప్రయత్నాలని మాన కండి. అనాలోచితంగా అప్పు ఇవ్వడం, ఉమ్మడి ఆస్తి విషయంలో తెలివి తక్కువగా ఓ నిర్ణయాన్ని ప్రకటించడం వంటివి ఈ వారంలో జరగవచ్చు.

పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20)
వాహనాన్ని కొనాలనే ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. ఎన్నాళ్లనుంచో పరిష్కరించుకోని సమస్యకి పరిష్కారం ఓ ఆలోచన రూపంలో వస్తుంది. మరో కొంత కాలంలో అనుకూలంగా పరిష్కరింపబడుతుంది. గృహాన్నో, భూమినో మరమ్మతు చేయడం కోసం రుణాన్ని తీసుకోవడం గాని లేదా దాచుకున్న ధనాన్ని వ్యయపరచుకోవడం గాని చేస్తారు. అది మంచికేనని గ్రహించండి.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
 సంస్కృత పండితులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement