Taro the style
-
వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు!
2016 జనవరి 9 నుంచి 15 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన కనిపిస్తోంది. అదే మీరు అవివాహితులయినట్లయితే మీ ప్రేమబంధం కొద్దిపాటి సవాళ్లతో కూడుకుని ఉంటుంది. మీ ప్రేమను గెలిపించుకోవడానికి ఇంచుమించు ముళ్లబాట మీద నడవాల్సి వస్తుంది. కెరీర్‌కి, పనికి సంబంధించి కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. కలిసొచ్చేరంగు: వైట్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది. దీర్థకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదమొకదానికి ఈ వారంలో సులభ పరిష్కారం లభించనుంది. వ్యాపారంలో లేదా పనిలో పెట్టుబడి పెట్టండి. మంచి రాబడి ఉంటుంది. కలిసొచ్చే రంగు: బ్లూ జెమిని (మే 21-జూన్ 21) పనిప్రదేశంలోనూ, ఇంటిలోనూ కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. వాటిప్రభావం మీపై గణనీయంగా పడుతుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. మంచే జరుగుతుంది. ఇంటిని లేదా ఆఫీస్‌ని అందంగా అలంకరిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. కొన్ని మార్మిక సంఘటనలు జరగవచ్చు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: రెడ్ క్యాన్సర్(జూన్22-జూలై 23) కుటుంబ సమస్యల పరిష్కారంలో దైవబలం తోడుగా ఉండటం వల్ల విజయం సాధిస్తారు. వృత్తిపరమైన సమస్యలను అధిగమిస్తారు. ప్రేమజీవితం రసకందాయంలో పడుతుంది. అంతా ఫలప్రదంగా నడుస్తుంది. ఒక సంఘటన నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మీలో మార్పు వస్తుంది. షాపింగ్‌తో బిజీగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లియో (జూలై 24-ఆగస్టు 23) విస్తృతంగా ప్రయాణాలు ఉండవచ్చు.గతంలో ఆరంభించిన ఒకపనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీ చుట్టూ చేరి మిమ్మల్ని ప్రభావితం చేయాలని చూసే వారు ఉన్నప్పటికీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఎల్లో. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) కెరీర్లో మీరనుకున్న విధంగా ముందుకు వెళ్తున్నందుకు సంతోషిస్తారు. మీ ప్రత్యర్థి కంపెనీ నుంచి మీకు ఉద్యోగావకాశం వస్తుంది దానిని అంత తేలిగ్గా కొట్టేయవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితం మలుపు తిరగవచ్చు. ఎక్సర్సైజ్లు, వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించవలసిన తరుణమిది. కలిసొచ్చే రంగు: గ్రీన్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ఒక సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది మీ సహనానికి పరీక్ష. ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పరిస్థితులను జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొనండి. తొందరపాటు, అధైర్యంవద్దు. బేలతనం అసలేవద్దు. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఈ వారం ప్రమాద సూచన కనిపిస్తోంది. మీ మనస్తత్వం ప్రకారం సాహసాలు చేయడానికి ఇష్టపడరు కానీ, చేయడం వల్ల మీకు బాగానే కలిసొస్తుంది. ఆర్థికంగా కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం కంగారుపడవద్దు. అంతా సజావుగానే గడుస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఏ విధంగా పావులు కదిపితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. కానీ మీరు ఏదో జంకుతో వెనుకంజ వేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మంచే జరుగుతుంది. బిజినెస్‌పరంగా మీ అంచనాలు ఫలిస్తాయి. పైస్థాయి వారితో కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. ప్రేమజీవితం పట్ల కొంచెం విసుగు జనించవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అడుగులు ఆలస్యంగా పడుతున్నాయని బాధపడవద్దు. ఆచితూచి అడుగులు వేయడం లాభదాయకమే కానీ, నష్టం కలిగించదని గుర్తుంచుకోండి. అధ్యయనం మీద దృష్టి పెట్టండి. మనశ్శాంతిగా ఉండండి. గొంతెమ్మ కోరికలను వెనక్కు నెట్టి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. షాపింగ్‌లో బిజీగా ఉంటారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ధనం సమృద్ధిగా లభిస్తుంది.అనుకున్నవి జరగలేదని నిరుత్సాహపడకండి. దేనికైనా దాని టైమ్ వచ్చినప్పుడే అవుతుందని గుర్తుంచుకోండి. మీ ఇంటి ముంగిట లేదా పెరడులో తూర్పుదిశగా వెదురుమొక్కని నాటడం వల్ల కలిసొస్తుంది. మీ కుటుంబంలో కొత్త సభ్యులు జతకూడతారు. వారి రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. కలిసొచ్చేరంగు: గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సినిమా హాలుకు వెళ్లినా, ఇరుగుపొరుగుతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నా, కొత్త ఉద్యోగంలో చేరినా, అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీ ప్రియతముల రాక ఆనందం కలిగిస్తుంది. ఆఫీస్‌లో మీకిచ్చిన పనులను సమర్థంగా చేసి, శభాషనిపించుకుంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: ఎల్లో టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చెప్పలేనంత మానసిక ధైర్యం మీకొస్తుంది. ఏదో జరిగిపోతుందేమో అనే ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. కింది ఉద్యోగులూ పై అధికారులూ తోటి ఉద్యోగస్థులూ కూడా పూర్తి సహకారాన్నందిస్తారు. వ్యాపారస్థులకి తోటి భాగస్వాములు అండగా నిలబడతారు. ప్రభుత్వాధికారుల నుండి ఏ తీరు వేధింపులూ పరిశీలనలూ పరీక్షలూ లేక సుఖంగా గడుస్తుంది ఈ వారం. టారస్ (ఏప్రిల్ 21-మే 20) దంపతుల్లో వాదవివాదాలు పెరుగుతాయి. అయితే అన్యోన్యతా విషయంలో ఇబ్బంది తలెత్తదు. ఒక ముఖ్యమైన పనిని చేపట్టే విషయంలో ‘ఔను- కాదు’ అనే చర్చలే తప్ప పరస్పర నిందారోపణలు కావు కాబట్టి దాంపత్యానికి లోటు లేదు. సమస్య ఉండదు. ఈ సమస్యా నివారణ /పరిష్కార దిశలో మరొకరికి అవకాశాన్నివ్వకూడదని గ్రహించుకోవాలి. జెమిని (మే 21-జూన్ 21) అకస్మాత్తుగా వచ్చిన అనుకోని ధనంతో వస్తువులనీ ఆభరణాలనీ కొంటారు. వీలయినంత వరకూ కుటుంబాన్ని గురించిన గుంభనతో ఉండడం అంటే అన్నింటినీ వెల్లడించి చెప్పేయడం ప్రస్తుతానికి అంత మంచిది కాదు. చేస్తున్న ప్రతిపనినీ శ్రద్ధ పెట్టి చేయాల్సిందే తప్ప ఏదో యాంత్రికంగా చేయకూడదు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) తేలికగా అంటే మరొకరి అవసరం ఏమాత్రమూ లేని పనుల్ని పూర్తి చేసుకోండి. కష్టమైన పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. శత్రువులు ప్రయత్నిస్తారు కాని మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ బాధ్యతలకి తోడుగా మరిన్ని /బాధ్యతగాని చేపట్టవలసి వస్తే మొగమాటం లేకుండా చేయలేననే మీ అశక్తతని నిదానంగా చెప్పండి. లియో (జూలై 24-ఆగస్టు 23) చేయవలసిన పనుల్లో ఏది మీతోనే పూర్తి చేసుకోగల అవకాశముందో ఆ పనుల్ని వాయిదా వేసుకోకుండా ముగించుకోండి. ఇతరుల సహకారం ప్రమేయమున్న పనుల్ని నెత్తిమీద పెట్టుకోకండి ఈ వారంలో. మీ ఉద్యోగానికో వృత్తికో వ్యాపారానికో ఓ అదనపు బాధ్యత అప్పగించే పరిస్థితులు రావచ్చు. సిద్ధపడి ఉండండి మానసికంగా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కింది ఉద్యోగుల అభినందనలూ, మీపై అధికారుల ప్రశంసలూ మీకెంతో ఆనందాన్ని కల్గిస్తాయి. మీ గురించి మీరు ఆలోచించుకోండి తప్ప మీ గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం మరెవరి విషయాన్నో తలకెత్తుకుని శ్రమపడకండి. మీ గురించి మీరు మర్తిగా పట్టించుకోవలసి వారం ఇది అనుకోండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) వడ్డించిన విస్తరీ, వడ్డించేందుకు వ్యక్తీ, చక్కటి భోజనశాలా... ఇలా అన్నీ ఉన్నా కూడా కాలదన్నుకుంటూ ఏదో దురదృష్టం మిమ్మల్ని వెన్నాడుతున్నట్లుగా భావించుతారు మీరు. మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీకంటే రెండురెట్ల వయసుసున్న అనుభవజ్ఞుల్ని ముఖ్యంగా పక్షపాత బుద్ధి లేకుండా ధర్మాన్ని చెప్పేవారిని సంప్రదించండి. మీ సమస్య మొత్తం తీరిపోతుంది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీకు అన్యాయం జరుగుతోందన్న విషయం సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత సత్యం. ధర్మానికీ న్యాయానికీ కట్టుబడి ఉన్న మీకు జరిగిన అన్యాయానికి బెదిరిపోకండి. కత్తులూ కటారులూ కాకుండా ధర్మఖడ్గంతోనే పోరాడుతూనే ఉండండి. పట్టుదల విడవకండి. శత్రువులు దిగొస్తారు. శరీర శ్రమకీ మానసికమైన ఒత్తిడికీ సిద్ధపడి పోరాడండి. విజయం మీదే. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) విందులతో వినోదాలతో చక్కగా గడుస్తుంది ఈ వారం. దూరపు ప్రయాణాలు చేయడంగానీ, స్థలాన్ని మార్చడం గానీ జరగొచ్చు. వద్దని అనుకున్నా ఎంతగా వారించినా మీ కుటుంబంలో ఇతరుల జోక్యం తప్పనిసరి కావచ్చు. దానికి కారణం మీరు లోగడ వారికిచ్చిన చనువే. మీ కుటుంబం సుఖంగా ఉండాలంటే మౌనంగా ముభావంగా ఉండడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీరు మీదైన వృత్తి కాకుండా మీలో దాగిన ఇతర రంగాలలోని ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోగల అవకాశం వస్తుంది. తద్వారా మీ కీర్తిప్రతిష్ఠలు మరింతగా పెరిగే సూచన కనిపిస్తోంది. మీరు చెప్పదలచిన ఏ మాటనైనా పరుష భాషతోనూ కఠిన వైఖరితోనూ చెప్పడం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మాట మెత్తగా, భావం గట్టిగా ఉండాలని గమనించండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అన్నదమ్ముల మధ్యా అప్పచెల్లెళ్ల మధ్యా మంచి సహకారం పెంపొందుతుంది. వృత్తిలో అనుకూల పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు కన్పిస్తాయి. పోటీ పరీక్షలకి వెళ్లాలనీ ఉద్యోగంలో అలాగే వ్యాపారం లేదా వృత్తిలో మరింత అభివృద్ధి సాధించాలనీ ఓ ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయడం మంచిది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) అన్ని రంగాల్లోనూ అననుకూలత కన్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యంలో నష్టాలు కన్పించవచ్చు. ఉద్యోగంలో తోటివారితో అభిప్రాయభేదాలూ మనఃస్పర్థలూ కన్పించవచ్చు. అనుకోకుండా బంధువులకి చెందిన ఓ స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. కృషి చేసి సాధించుకోండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మొహమాటాలకి పోతే ముప్పు తప్పదు!
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఒక కొత్త ప్రేమ బంధం మీ కోసం ఎదురు చూస్తుంటుంది. పనిపరంగా ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. మీ స్వతంత్ర వైఖరి మీకు మొండివాళ్లని, అసమ్మతివాదులనీ పేరు తేవచ్చు. పని ప్రదేశంలో అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. అంద రితోనూ కలుపుగోలుగా, నిజాయితీగా ఉండండి. కలిసొచ్చే రంగు: పింక్ టారస్(ఏప్రిల్ 21-మే 20) ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక స్త్రీ సహాయం లభిస్తుంది. చేతినిండా డబ్బు వస్తుంది. ఒక విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. రొటీన్ నుంచి బయట పడి, విశ్రాంతిగా గడపవలసిన తరుణమిది. హాయిగా పర్యటనలకు వెళ్లి, ప్రశాంతతను పొందండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ జెమిని(మే 21-జూన్ 21) మీ ధోరణిని మార్చుకోవలసి వస్తుంది. మొదట్లో కొంచెం కష్టమైనా, అదే నెమ్మదిగా గాడిలో పడుతుంది. ఒక వ్యక్తిపట్ల మీరు ఆకర్షితులవుతారు. క్రమంగా అది ప్రేమకు దారి తీయవచ్చు. దాని వల్ల మీ కుటుంబంలో కల్లోలం చెలరేగవచ్చు. మీ అహం శాంతిస్తుంది. తగిన సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు వస్తుంది. కలిసొచ్చే రంగు: వైట్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) విజయం మీ తలుపు తడుతుంది. కొన్ని మార్పులు జరగవచ్చు. కష్టపడి పని చేసే మీ తత్వమే మీ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకోవలసిన తరుణమిది. ఆధ్యాత్మిక భావాలను అలవరచుకోవడం మంచిది. మనశ్శాంతి ఉంటే మీరు ఎన్ని విజయాలనైనా సొంతం చేసుకోవచ్చని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: బ్రౌన్ లియో (జూలై 24-ఆగస్టు 23) కలలలోకం నుంచి బయట పడి వాస్తవంలోకి వచ్చి, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ వారం మీకు అదృష్టకరంగా గడుస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లోటు ఉండదు. ప్రేమలో ఓటమి ఎదురు కావచ్చు. అనవసరంగా అహానికి పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. కలిసొచ్చే రంగు: గోల్డెన్ ఎల్లో వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఒక దాని మీద గట్టిగా నిలబడాలని తెలుసుకోండి. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ, నిజం. అలా చేస్తే గానీ ప్రయోజనం ఉండదు. మీ కలలు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఎదుటివారు చెప్పే సలహాలు మీ మంచికోసమేనని తెలుసుకుని, ఓపిగ్గా వినడం అలవాటు చేసుకోండి. కలిసొచ్చే రంగు: వైట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ ప్రేమ, వ్యక్తిగత జీవనం మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. ముందు పెళ్లి చేసుకోవాలా లేక ఇల్లు కొనుక్కోవాలా? ఏది ముందు? ఏది వెనకో తెలియక కొంచెం తికమక పడతారు. ఆహారం విషయంలో కఠోరంగా వ్యవహరించక తప్పదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం కోసం అనివార్యంగా ఎక్సర్సైజులు చేయండి. కలిసొచ్చే రంగు: లైట్ బ్లూ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) జీవితంలో సంభవించనున్న కొత్త మార్పులు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తవచ్చు. పెద్దమొత్తంలో డబ్బు చేతికందుతుంది. మీ కలల్ని నమ్ముకోండి. అవి సాకారం కానున్నాయి. మీ సామర్థ్యాన్ని నిరుపించుకునేందుకు గట్టిగా కృషి చేయవలసి వస్తుంది. ప్రేమ విషయంలో కొన్ని చిక్కుముళ్లు, మెలికలు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: నలుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు చదవనున్న ఒక ఆధ్యాత్మిక గ్రంథం మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకు వెళ్తుంది. మీరు సరైన మార్గంలోనే వెళ్తున్నారు. మీరు కోరుకుంటున్నట్లుగా శాంతియుతంగానే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఇంట్లో, ఆఫీసులో మరమ్మతులు చేయించవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: వయొలెట్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ పని సామర్థ్య పెరుగుతుంది. దానిమూలంగా మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. బంధాలు, బంధుత్వాల విషయంలో చోటు చేసుకోనున్న కొత్తమార్పులు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయి. జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను కలవండి. కలిసొచ్చే రంగు: పీచ్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం ఒత్తిడి, టెన్షన్లు తప్పవు. గుండె ఆరోగ్యం విషయంలో మరింత ఆందోళన పడతారు. మనసులో ఉన్న బాధను అణుచుకోవద్దు. ఆర్థికంగా మెరుగ్గానే ఉంటుంది. దూసుకుపోయే మీ స్వభావం మీకు మంచే చేస్తుంది. విందు వినోదాల్లో పడి ఆహారం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే డాక్టర్‌ను కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: కాఫీ బ్రౌన్ పైసిన్ (ఫిబ్రవరి20-మార్చి20) అన్ని కష్టాలనూ, అననుకూలతలనూ అధిగమించి, కాస్త స్థిమితపడతారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పనిలో మరింత చొరవ చూపి అధికారుల మన్ననలందుకుంటారు. మీ పరిశోధనలను, అధ్యయనాన్ని కొనసాగించండి. చిన్న చిన్న రుగ్మతలని, నొప్పులను నిర్లక్ష్యం చేస్తే పెద్ధ ఫలితాన్ని చవి చూడవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి మీకు మీరుగా తీసుకున్న నిర్ణయం మంచిదే. మళ్లీ దాన్ని అనవసర చర్చల్లో పెట్టి మనసుని ఆందోళన పరచుకోకండి. నిర్ణయాన్ని మార్చుకోవాలని భావించకండి. కుటుంబ సభ్యులకి- తగినంత గుంభన ఉండాలనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. విదేశీ ప్రయాణానికి సంసిద్ధంగా ఉండటం మంచిది. అప్పు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నమ్మి మోసపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి, ఎంతవరకూ నమ్మాలో అంతకు మించి పోవద్దు. ముఖ్యంగా వైద్యసూచనలూ సలహాలూ చికిత్స విషయాల్లో ఇద్దరు ముగ్గురి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లండి. కీర్తికండూతి కోసం పాకులాడవద్దు. ఇతరులతో పోలిక వద్దేవద్దు. మీరూ మీ కుటుంబ సభ్యులూ ఒకే మాట మీద ఉండండి. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని అత్యవసరంగా నెత్తిన పడుతూ అనుకున్న పని లేదా పనులు వాయిదా పడుతూ ఉండవచ్చు. దీన్ని అసమర్థతగా భావించక, ఈ మాత్రమైనా పనులు జరుగుతున్నాయని సంతోషించండి. శారీరకమైన అలసట కారణంగా ఈ వారం ఔషధ సేవ అవసరపడచ్చు. తేలికపాటి ఆరోగ్యపరీక్ష చేసుకుని ముందు జాగ్రత్తతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఓ విషయం ఆందోళన కలిగించవచ్చు. దాని గురించి మరింతగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని విరోధించే వ్యక్తులతో ముభావంగానే ఉండండి. వారి సహాయం కోసం చూడద్దు. మీకు మీరుగా చాడీలని వ్యాప్తి చేస్తే ఇబ్బందులు తప్పవు. మీరు ప్రయత్నించిన తీరుగా కార్యక్రమాలు ముందుకు సాగవు. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవలసి వచ్చినప్పుడు మొహమాటాలకు, భరోసాలకు పోవద్దు. ఆడంబరం కోసం అనవసరమైన వస్తువులు కొని విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. వారాంతంలో శుభవార్తని వింటారు. రుణాలని తీర్చే ప్రయత్నంలో ఉండండి. బంధుమిత్రులతో విందువినోదాల్లో ఆనందంగా గడుపుతారు. గృహాన్ని గానీ, భూమిని గానీ తాకట్టుపెట్టుకోవడం మాని కొనుక్కోవడానికే ప్రయత్నిస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. దైవకార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మికంగా గురువుని అతిగా విశ్వసించవద్దు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకుంటూ వెళ్లకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులు కావచ్చు. ఎవరిని సంతృప్తి పరచడం కోసమో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తే మొహమాటం లేకుండా రానని చెప్పండి. కుటుంబ సభ్యుల కంటే బంధుమిత్రులు ఎక్కువ కారని గ్రహించండి. పిల్లల విద్యాసంస్కారాలని తప్పక పట్టించుకోవాలి. ప్రవర్తన విషయంలో మెలకువతో ఉండండి. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉండవచ్చు. ప్రతిపనిలోనూ జాప్యం అవుతూ ఉండవచ్చు. కోర్టు వివాదాలు మరింత జాప్యమౌతూ అనిశ్చిత స్థితిలో పడేయవచ్చు. ఎవరిని సలహా సూచనలడిగినా మరింత అయోమయంలోకి నెట్టవచ్చు. దేనికైనా ఓ ప్రణాళిక అవసరమనే ఆలోచనతో ఉండండి. రావలసిన బకాయిలకోసం ప్రయత్నించండి. మానసికంగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు దైవధ్యానానికి ప్రాముఖ్యమీయండి. ప్రారంభించిన పనులన్నీ ఆటంకాలకి గురై మధ్యలో ఆగిపోవడంగాని పూర్తిగా విరమించుకోవడం గాని జరగవచ్చు. ఇదే ఫలితం ప్రయాణాల విషయంలోనూ వర్తించవచ్చు. బంధుమిత్ర శ్రేయోభిలాషులు మాట ఇచ్చారు కదా అని అతి విశ్వాసంతో ఉండవద్దు. ప్రయత్నలోపం వద్దు. రుణాలని తెచ్చుకోవద్దు, ఇవ్వవద్దు. ఇతరులు మీ కుటుంబాన్ని గురించి వాదోపవాదాలు చేసే అవకాశాన్ని ఈయకండి. గుంభన పాటించండి. పెద్దల సూచనలను స్వీకరించండి. అనుకున్న పనులు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలసించకుండా ప్రయత్నాలు చేయండి. ఆదాయం అంతంత మాత్రం కాబట్టి వ్యయ నియంత్రణని పాటించండి. తలిదండ్రులకి ఆరోగ్యపరీక్షలవసరం. ఎప్పుడో చేసిన వాగ్దానం ఇరుకున పడేయవచ్చు. ఎవరికో ఇచ్చిన హామీ మీకు సమస్యగా పరిణమించవచ్చు. ఎవరి విషయంలోనో మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ పని మీకు కంఠం పట్టుకోవచ్చు. మొగమాటం లేకుండా మాట్లాడండి తప్ప విషయాన్ని సాగదీయకండి. నేరాన్ని తలమీదికి తెచ్చుకునే విధంగా తప్పించుకోవడం, మెత్తగా ఉండడం సరి కాదని గ్రహించండి. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంతానపు చదువు విషయంలో తగినంత శ్రద్ధని చూపండి. నిజమైన ఆస్తి సంతానమే అనే విషయాన్ని గమనించి స్థిరచరాస్తుల మీద కాకుండా వీరి విద్య ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. అత్తమామలతో సత్సంబంధాలుండటం అవసరం. మరిది వదినెలతో తగుదూరాన్ని పాటించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు....
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త అవకాశాలు వస్తాయి. పుష్కలంగా ధనం చేతికందుతుంది. విలాసంగా గడుపుతారు. మీరు ఉద్యోగి అయితే ప్రమోషన్ ఖాయం. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకెదురవుతున్న తిరస్కృతులు, నిరాశలు, వంచనలు జీవితంలో మామూలేనని, అలాంటివాటికి త్వరలో ముగింపు ఉందని గ్రహించి, నిబ్బరంగా ముందుకెళ్లండి; కలిసొచ్చే రంగు: గ్రీన్ షేడ్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) సంయమనంతో, సమతుల్యంతో ఉండి మీ విజయం సాధించండి. వారమంతా క్షణం తీరికలేకుండా గడిపేస్తారు. మీరు ఏదైనా బంధంలో ఉండి ఉంటే, దాని నుంచి బయట పడటం మంచిది. పనికి, ప్రేమకూ పొత్తు కుదరక పోయినా, ప్రేమతో చేస్తే పనులు జరుగుతాయి. చేసిన తప్పుల నుంచి బయటపడి, వివేకంతో మెలగండి; కలిసొచ్చే రంగు: బ్రౌన్ జెమిని (మే 21-జూన్ 21) మీరు వెళుతున్న మార్గంలో ప్రధానమైన మలుపులు ఉండవచ్చు. ఏ దారిలో ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. పనిలో కాస్త దూకుడును తగ్గించుకోవడం మంచిది. వృత్తిపరంగా మీరు ప్రతిభావంతులు కావచ్చు కాని, కొంచెం విశ్రాంతి కూడా అవసరం కదా! ప్రేమబంధంలో మీరే కాస్త చొరవ చూపించవలసి రావచ్చు; కలిసొచ్చే రంగు: పీచ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఈ వార మంతా కొంచెం బద్ధకంగా గడుపుతారు. మీకు అడ్డు చెప్పువారు ఎవరూ లేరు కదా అని కీలకమైన నిర్ణయాలు మీ అంతట మీరు తీసుకోవద్దు. ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. మీ కోరిక ఈ వారంలో తప్పక నెరవేరుతుంది. కొత్త వ్యాపారాన్ని లేదా ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. మీదైన శైలిలో ముందుకెళ్లి విజయం సాధించండి; కలిసొచ్చే రంగు: ఆరంజ్ షేడ్స్ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ బలాబలాలను, నిజానిజాలను పరిశీలించి నిర్థారణ చేసుకోదగ్గ వారం ఇది. ప్రేమ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆనందం ఉన్నా, అందుకు తగ్గ స్థాయిలో అభద్రతాభావం వెంటాడవచ్చు. అయితే అది కేవలం మీ అనుమానం మాత్రమే అని గ్రహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి; కలిసొచ్చే రంగు: వైట్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ఇంటిని ఆధునీకరించుకోవలసిన, జీవితంలో కొత్తదనం నింపుకోవలసిన సమయం ఇది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మీ ప్రాజెక్ట్ ఒకటి ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎటు నడిపిస్తే అటు నడవడమే జీవితం అని గ్రహించండి; కలిసొచ్చే రంగు: పర్పుల్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితమన్నాక ఆటుపోట్లు తప్పవు. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన కుంగిపోనక్కరలేదు. పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కొంచెం బలహీన పరిచినా, అది తాత్కాలికమేనని తెలుసుకోండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. డబ్బు కూడా మీ వెనకాల పడుతుంది. వారమంతా సంతోషంగా గడుపుతారు; కలిసొచ్చే రంగు: గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) చీకటి తర్వాత వెలుగు, దుఃఖం తర్వాత సుఖం మామూలేనని గ్రహించండి. ఎటువంటి సంఘటనలు ఎదురైనా, నిబ్బరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్మెంట్లు, అదనపు బరువు బాధ్యతలు మీ మీద పడవచ్చు. సిద్ధం కండి. మరింత సంతోషకరమైన, సౌఖ్యదాయకమైన జీవితం మీ కోసం ఎదురు చూస్తోంది; కలిసొచ్చే రంగు:పసుప్పచ్చ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీకున్న జ్ఞానాన్ని, విద్యను డబ్బు సంపాదన కోసం ఎందుకు ఉపయోగించకూడదు? ఆలోచించి చూడండి. అలాగని నిబంధనలు అతిక్రమించవద్దు. ఇంతకాలం మీకు సహాయంగా ఉన్న వారికి ఇప్పుడు మీరు సాయం చేయవలసి రావచ్చు. కొత్త బంధం ఏర్పరచుకోవాలంటే మీకు కొంత సమయం, సందర్భం అవసరం అని గ్రహించండి; కలిసొచ్చే రంగు: వెండి రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) పనిలోనూ, మీ ప్రేమ బంధంలోనూ కొత్తదనం చూపించవలసిన తరుణం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ ధైర్యం ముందు, దృఢనిశ్చయం ముందు తలవంచి తీరతాయి. కొత్త ప్రాజెక్టులు, లావాదేవీలు ప్రారంభించడానికి ఇది తగిన సమయం. ఎప్పటినుంచో బకాయి పడి ఉన్న అప్పులు తీర్చేయడం వల్ల నిశ్చింతగా ఉంటారు; కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వెలుగుకు ముందు చీకటి తప్పదని తెలుసుకోండి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలోని భ్రమలు తొలగిపోవడానికి ఇది తగిన సమయం. మీరు వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాకపోయినా, వెతుక్కుంటూ వస్తే మీరు మాత్రం ఏం చేయగలరు? వాదోపవాదాలకు తావివ్వవద్దు. మీ మూడ్ చెదిరిపోకుండా చూసుకోండి; కలిసొచ్చేరంగు: గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సవాళ్లను ఎదుర్కొనడానికి రెడీగా ఉండండి. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. పార్టీలతో, సామాజిక కార్యకలాపాలతో వారమంతా చాలా బిజీగా గడిపేస్తారు. గతంలో మంచి క్రీడాకారులు కావడం వల్లనే ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకోండి. పనిమీద విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. తగిన పత్రాలతో సిద్ధంగా ఉండండి; కలిసొచ్చే రంగు: లేత పసుపు. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొన్ని రంగాల వారికి ముఖ్యంగా విద్యావైద్యరంగాలవారికి మంచి గుర్తింపు, పురస్కారాలు లభించవచ్చు. వ్యాపార, వినోదరంగాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. స్త్రీలకి అనారోగ్య సూచన. శారీరక శ్రమ, మానసికమైన బడలిక. సకాల భోజనం, సకాల నిద్ర, తగినంత విశ్రాంతి అవసరం. వీలయినంత తక్కువ మాట్లాడటం మంచిది ఈ వారంలో. టారస్ (ఏప్రిల్ 21-మే 20) అనూహ్యమైన ఖర్చులు, దానికి తగ్గట్టు అనూహ్యమైన ఆదాయం ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వినోదరంగంలో ఉన్న వారికి ఆరోగ్య భంగ సూచ న ఉంది. ప్రభుత్వేతర సంస్థల్లోని అత్యున్నత స్థాయి ఉద్యోగులకి తగిన మన్నన, గౌరవం లభిస్తాయి. పదోన్నతి, స్థానచలనం కలగవచ్చు. మనసులో మాటని గుంభనంగా ఉంచుకోవడం మంచిది. జెమిని (మే 21-జూన్ 21) ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు సంస్థకోసమే మనం పుట్టలేదని గ్రహించి, ఇంతకంటే గొప్ప ఆదాయం ఉందనిపించే చోటుకి మారడం తప్పు కాదు. ఈ వారంలో ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పు కలిగితే కొనసాగండి లేని పక్షంలో సరైన చోటుకోసం వేట ప్రారంభించండి. కుటుంబం తర్వాతే సంస్థ అని గుర్తించండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) బంధుమిత్రుల రాకపోకలతో, విందువినోదాలతో సంతోషంగా గడుస్తుంది. భూమి, గృహం, ఇండ్లస్థలం వంటివి కొనాలనే ఆలోచనగానీ కొనడం గానీ సంభవించవచ్చు. అయిన వారి దగ్గర అప్పు మాత్రం తీసుకోద్దు. సంతానావకాశ సూచన గాని, సంతాన ప్రాప్తిగానీ కావచ్చు. అనుకూలంగా గడిచే వారం ఇది. అసూయాపరులతో జాగ్రత్త. లియో (జూలై 24-ఆగస్టు 23) మీ పిల్లల చదువు విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సత్ఫలితాల కారణంగా చక్కని చదువులో మంచి కళాశాలలో చేరతారు. శుభకార్యాల కోసం కొద్దిగా శ్రమిస్తే విజయం మీ వెంటే ఉండగలదు. ఉద్యోగం చేస్తున్న వారు పోటీపరీక్షలకి శ్రమించి సిద్ధపడితే పదోన్నతి ఖాయం. వీలయినంత ఎక్కువగా దైవారాధన చేయండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అదృష్టవశాత్తూ మీరు పడుతున్న శ్రమనీ మీ కృషినీ ఉద్యోగంలో మీరు చూపుతున్న ప్రతిభనీ పైవాళ్లు గుర్తిస్తారు. ప్రశంసిస్తారు. ఇంతకుముందున్న ఆర్థికమాంద్యం తొలగి, ఆర్థికపరంగా కొంత ధైర్యం లభిస్తుంది. కుటుంబంలోనూ, బంధువర్గంలోనూ మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆడంబరానికీ, అట్టహాసానికీ పోకుండా మీదైన శైలిలోనే సాగడం మంచిది. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీరు కిందిస్థాయి ఉద్యోగి అయితే పై అధికారులతో ఏ మాత్రం విభేదించద్దు. మీరు ఉన్నతాధికారి అయి ఉంటే మీ కింది వారిని కలుపుకుపోవడం మంచిది. లేదంటే అందరూ కలిసి విరోధించి పరిస్థితిని దూరంగా తీసుకుపోవచ్చు. సామరస్యభావంతో ఉండండి. ఇదే పద్ధతిని మీరు భార్య అయితే భర్తతోనూ, భర్త అయితే భార్యతోనూ ఈ వారమంతా అనుసరించడం అవసరం. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) నిరుత్సాహమనేది వద్దేవద్దు. జీవితంలో చూడదగిన, వినదగిన, వినగలిగిన ఎన్నో మధుర ఘట్టాలు మున్ముందున్నాయి. తాత్కాలిక దుఃఖమనేది మహానుభావులకూ వచ్చిందే. ముఖ్యమైన సదస్సులకి ఆహ్వానం అందితే లేదా పెద్దలతో పరిచయ అవకాశాలు కలిగితే సద్వినియోగం చేసుకోండి. ఆ పరిచయం లేదా ఆ అవకాశం మిమ్మల్ని పై స్థాయికి తీసుకువెళుతుంది. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) పెద్దజీతంతో దూరపు చోట ఉద్యోగం లభించిందని పొంగిపోకండి, కుటుంబానికి దూరం అయితే జీవితమే దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త వ్యాపారావకాశాన్ని గుడ్డిగా అనుసరించకుండా మీకు అనుకూలురూ, మార్గదర్శకులూ అయిన వారితో సంప్రదించి మాత్రమే ముందడుగు వేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వస్తువుల కొనుగోళ్లలో పడిపోయి ప్రణాళికని మించి వ్యయం చేసే అవకాశముంది- జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నానికో లేదా ఉద్యోగపు రాకపోకలకో అంచనాలకి మించి వ్యయం చేస్తారు. విద్యార్థుల్లో అలాగే వృత్తి వ్యాపారాలలో అదనపు ఆదాయపు తక్కువ కావడాన అసంతృప్తి కలగవచ్చు. మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటూ ధైర్యాన్ని చెప్పుకుంటూ గడపాల్సిన వారం ఇది. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) బాగా తెలిసి తెలిసి/ అలాగే ఎంతో తెలిసిన వ్యక్తిని నమ్మి ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది. మరో నెలరోజుల్లో బయటపడి పోతారని గమనించుకుని ధైర్యంతో ఉంటూ ఆ ప్రమాదం నుండి బయటికి వచ్చే ప్రయత్నాలని మాన కండి. అనాలోచితంగా అప్పు ఇవ్వడం, ఉమ్మడి ఆస్తి విషయంలో తెలివి తక్కువగా ఓ నిర్ణయాన్ని ప్రకటించడం వంటివి ఈ వారంలో జరగవచ్చు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వాహనాన్ని కొనాలనే ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. ఎన్నాళ్లనుంచో పరిష్కరించుకోని సమస్యకి పరిష్కారం ఓ ఆలోచన రూపంలో వస్తుంది. మరో కొంత కాలంలో అనుకూలంగా పరిష్కరింపబడుతుంది. గృహాన్నో, భూమినో మరమ్మతు చేయడం కోసం రుణాన్ని తీసుకోవడం గాని లేదా దాచుకున్న ధనాన్ని వ్యయపరచుకోవడం గాని చేస్తారు. అది మంచికేనని గ్రహించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు