వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు! | the opportunity to come to a strange-look! | Sakshi
Sakshi News home page

వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు!

Published Sat, Jan 9 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM

వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు!

వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు!

2016 జనవరి 9 నుంచి 15 వరకు
టారో బాణి

ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన కనిపిస్తోంది. అదే మీరు అవివాహితులయినట్లయితే మీ ప్రేమబంధం కొద్దిపాటి సవాళ్లతో కూడుకుని ఉంటుంది. మీ ప్రేమను గెలిపించుకోవడానికి ఇంచుమించు ముళ్లబాట మీద నడవాల్సి వస్తుంది. కెరీర్‌కి, పనికి సంబంధించి కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. కలిసొచ్చేరంగు: వైట్
 
టారస్  (ఏప్రిల్ 21-మే 20)
వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది. దీర్థకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదమొకదానికి ఈ వారంలో సులభ పరిష్కారం లభించనుంది. వ్యాపారంలో లేదా పనిలో పెట్టుబడి పెట్టండి. మంచి రాబడి ఉంటుంది. కలిసొచ్చే రంగు: బ్లూ
 
జెమిని (మే 21-జూన్ 21)

పనిప్రదేశంలోనూ, ఇంటిలోనూ కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. వాటిప్రభావం మీపై గణనీయంగా పడుతుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. మంచే జరుగుతుంది. ఇంటిని లేదా ఆఫీస్‌ని అందంగా అలంకరిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. కొన్ని మార్మిక సంఘటనలు జరగవచ్చు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: రెడ్    
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)
కుటుంబ సమస్యల పరిష్కారంలో దైవబలం తోడుగా ఉండటం వల్ల విజయం సాధిస్తారు. వృత్తిపరమైన సమస్యలను అధిగమిస్తారు. ప్రేమజీవితం రసకందాయంలో పడుతుంది. అంతా ఫలప్రదంగా నడుస్తుంది. ఒక సంఘటన నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మీలో మార్పు వస్తుంది. షాపింగ్‌తో బిజీగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
విస్తృతంగా ప్రయాణాలు ఉండవచ్చు.గతంలో ఆరంభించిన ఒకపనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీ చుట్టూ చేరి మిమ్మల్ని ప్రభావితం చేయాలని చూసే వారు ఉన్నప్పటికీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవడం మంచిది.  కలిసొచ్చే రంగు: ఎల్లో.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
కెరీర్‌లో మీరనుకున్న విధంగా ముందుకు వెళ్తున్నందుకు సంతోషిస్తారు. మీ ప్రత్యర్థి కంపెనీ నుంచి మీకు ఉద్యోగావకాశం వస్తుంది దానిని అంత తేలిగ్గా కొట్టేయవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితం మలుపు తిరగవచ్చు. ఎక్సర్‌సైజ్‌లు, వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించవలసిన తరుణమిది. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ఒక సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది మీ సహనానికి పరీక్ష. ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పరిస్థితులను జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొనండి. తొందరపాటు, అధైర్యంవద్దు. బేలతనం అసలేవద్దు. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
ఈ వారం ప్రమాద సూచన కనిపిస్తోంది. మీ మనస్తత్వం ప్రకారం సాహసాలు చేయడానికి ఇష్టపడరు కానీ, చేయడం వల్ల మీకు బాగానే కలిసొస్తుంది. ఆర్థికంగా కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం కంగారుపడవద్దు. అంతా సజావుగానే గడుస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
ఏ విధంగా పావులు కదిపితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. కానీ మీరు ఏదో జంకుతో వెనుకంజ వేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మంచే జరుగుతుంది. బిజినెస్‌పరంగా మీ అంచనాలు ఫలిస్తాయి. పైస్థాయి వారితో కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. ప్రేమజీవితం పట్ల కొంచెం విసుగు జనించవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
అడుగులు ఆలస్యంగా పడుతున్నాయని బాధపడవద్దు. ఆచితూచి అడుగులు వేయడం లాభదాయకమే కానీ, నష్టం కలిగించదని గుర్తుంచుకోండి. అధ్యయనం మీద దృష్టి పెట్టండి. మనశ్శాంతిగా ఉండండి. గొంతెమ్మ కోరికలను వెనక్కు నెట్టి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. షాపింగ్‌లో బిజీగా ఉంటారు. కలిసొచ్చే రంగు: సిల్వర్
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
 ధనం సమృద్ధిగా లభిస్తుంది.అనుకున్నవి జరగలేదని నిరుత్సాహపడకండి. దేనికైనా దాని టైమ్ వచ్చినప్పుడే అవుతుందని గుర్తుంచుకోండి. మీ ఇంటి ముంగిట లేదా పెరడులో తూర్పుదిశగా వెదురుమొక్కని నాటడం వల్ల కలిసొస్తుంది. మీ కుటుంబంలో కొత్త సభ్యులు జతకూడతారు. వారి రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. కలిసొచ్చేరంగు: గ్రీన్
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
సినిమా హాలుకు వెళ్లినా, ఇరుగుపొరుగుతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నా, కొత్త ఉద్యోగంలో చేరినా, అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీ ప్రియతముల రాక ఆనందం కలిగిస్తుంది. ఆఫీస్‌లో మీకిచ్చిన పనులను సమర్థంగా చేసి, శభాషనిపించుకుంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
 
సౌర వాణి
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
చెప్పలేనంత మానసిక ధైర్యం మీకొస్తుంది. ఏదో జరిగిపోతుందేమో అనే ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. కింది ఉద్యోగులూ పై అధికారులూ తోటి ఉద్యోగస్థులూ కూడా పూర్తి సహకారాన్నందిస్తారు. వ్యాపారస్థులకి తోటి భాగస్వాములు అండగా నిలబడతారు. ప్రభుత్వాధికారుల నుండి ఏ తీరు వేధింపులూ పరిశీలనలూ పరీక్షలూ లేక సుఖంగా గడుస్తుంది ఈ వారం.

టారస్ (ఏప్రిల్ 21-మే 20)
దంపతుల్లో వాదవివాదాలు పెరుగుతాయి. అయితే అన్యోన్యతా విషయంలో ఇబ్బంది తలెత్తదు. ఒక ముఖ్యమైన పనిని చేపట్టే విషయంలో ‘ఔను- కాదు’ అనే చర్చలే తప్ప పరస్పర నిందారోపణలు కావు కాబట్టి దాంపత్యానికి లోటు లేదు. సమస్య ఉండదు. ఈ సమస్యా నివారణ /పరిష్కార దిశలో మరొకరికి అవకాశాన్నివ్వకూడదని గ్రహించుకోవాలి.
 
 
జెమిని (మే 21-జూన్ 21)
అకస్మాత్తుగా వచ్చిన అనుకోని ధనంతో వస్తువులనీ ఆభరణాలనీ కొంటారు. వీలయినంత వరకూ కుటుంబాన్ని గురించిన గుంభనతో ఉండడం అంటే అన్నింటినీ వెల్లడించి చెప్పేయడం ప్రస్తుతానికి అంత మంచిది కాదు. చేస్తున్న ప్రతిపనినీ శ్రద్ధ పెట్టి చేయాల్సిందే తప్ప ఏదో యాంత్రికంగా చేయకూడదు.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
తేలికగా అంటే మరొకరి అవసరం ఏమాత్రమూ లేని పనుల్ని పూర్తి చేసుకోండి. కష్టమైన పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. శత్రువులు ప్రయత్నిస్తారు కాని మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ బాధ్యతలకి తోడుగా మరిన్ని /బాధ్యతగాని చేపట్టవలసి వస్తే మొగమాటం లేకుండా చేయలేననే మీ అశక్తతని నిదానంగా చెప్పండి.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
చేయవలసిన పనుల్లో ఏది మీతోనే పూర్తి చేసుకోగల అవకాశముందో ఆ పనుల్ని వాయిదా వేసుకోకుండా ముగించుకోండి. ఇతరుల సహకారం ప్రమేయమున్న పనుల్ని నెత్తిమీద పెట్టుకోకండి ఈ వారంలో. మీ ఉద్యోగానికో వృత్తికో వ్యాపారానికో ఓ అదనపు బాధ్యత అప్పగించే పరిస్థితులు రావచ్చు. సిద్ధపడి ఉండండి మానసికంగా.     
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కింది ఉద్యోగుల అభినందనలూ, మీపై అధికారుల ప్రశంసలూ మీకెంతో ఆనందాన్ని కల్గిస్తాయి. మీ గురించి మీరు ఆలోచించుకోండి తప్ప మీ గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం మరెవరి విషయాన్నో తలకెత్తుకుని శ్రమపడకండి. మీ గురించి మీరు మర్తిగా పట్టించుకోవలసి వారం ఇది అనుకోండి.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
వడ్డించిన విస్తరీ, వడ్డించేందుకు వ్యక్తీ, చక్కటి భోజనశాలా... ఇలా అన్నీ ఉన్నా కూడా కాలదన్నుకుంటూ ఏదో దురదృష్టం మిమ్మల్ని వెన్నాడుతున్నట్లుగా భావించుతారు మీరు. మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీకంటే రెండురెట్ల వయసుసున్న అనుభవజ్ఞుల్ని ముఖ్యంగా పక్షపాత బుద్ధి లేకుండా ధర్మాన్ని చెప్పేవారిని సంప్రదించండి. మీ సమస్య మొత్తం తీరిపోతుంది.  
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మీకు అన్యాయం జరుగుతోందన్న విషయం సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత సత్యం. ధర్మానికీ న్యాయానికీ కట్టుబడి ఉన్న మీకు జరిగిన అన్యాయానికి బెదిరిపోకండి. కత్తులూ కటారులూ కాకుండా ధర్మఖడ్గంతోనే పోరాడుతూనే ఉండండి. పట్టుదల విడవకండి. శత్రువులు దిగొస్తారు. శరీర శ్రమకీ మానసికమైన ఒత్తిడికీ సిద్ధపడి పోరాడండి. విజయం మీదే.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
విందులతో వినోదాలతో చక్కగా గడుస్తుంది ఈ వారం. దూరపు ప్రయాణాలు చేయడంగానీ, స్థలాన్ని మార్చడం గానీ జరగొచ్చు. వద్దని అనుకున్నా ఎంతగా వారించినా మీ కుటుంబంలో ఇతరుల జోక్యం తప్పనిసరి కావచ్చు. దానికి కారణం మీరు లోగడ వారికిచ్చిన చనువే. మీ కుటుంబం సుఖంగా ఉండాలంటే మౌనంగా ముభావంగా ఉండడం మంచిది.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

మీరు మీదైన వృత్తి కాకుండా మీలో దాగిన ఇతర రంగాలలోని ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోగల అవకాశం వస్తుంది. తద్వారా మీ కీర్తిప్రతిష్ఠలు మరింతగా పెరిగే సూచన కనిపిస్తోంది. మీరు చెప్పదలచిన ఏ మాటనైనా పరుష భాషతోనూ కఠిన వైఖరితోనూ చెప్పడం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మాట మెత్తగా, భావం గట్టిగా ఉండాలని గమనించండి.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
అన్నదమ్ముల మధ్యా అప్పచెల్లెళ్ల మధ్యా మంచి సహకారం పెంపొందుతుంది. వృత్తిలో అనుకూల పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు కన్పిస్తాయి. పోటీ పరీక్షలకి వెళ్లాలనీ ఉద్యోగంలో అలాగే వ్యాపారం లేదా వృత్తిలో మరింత అభివృద్ధి సాధించాలనీ ఓ ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయడం మంచిది.  
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
అన్ని రంగాల్లోనూ అననుకూలత కన్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యంలో నష్టాలు కన్పించవచ్చు. ఉద్యోగంలో తోటివారితో అభిప్రాయభేదాలూ మనఃస్పర్థలూ కన్పించవచ్చు. అనుకోకుండా బంధువులకి చెందిన ఓ స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. కృషి చేసి సాధించుకోండి.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement