వారఫలాలు 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థికపరమైన ఇబ్బందులు చికాకులు తప్పవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. విమర్శలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పనులలో అవరోధాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశాజనకం. ఉద్యోగులకు పనిభారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో కొంత అనుకూలత. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చన చేయండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. మీ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగులకు Sకీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు తథ్యం. తెలుపు, చాక్లెట్‌రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణాలయ దర్శనం మంచిది.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో సమస్యలు కొంతమేరకు పరిష్కారం. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు,మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు,బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వాహన,గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఈవారం పట్టింది బంగారమే. ఆశించినంత ఆదాయం. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు కూడా మీ దారికి వస్తారు. కార్యక్రమాలలో విజయం. వాహనయోగం. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత ్తపెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ప్రగతి. ఎరుపు, లేతపసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కుటుంబానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. సోదరులు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు,నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పూదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆదాయానికి మించి ఖర్చులు. పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆలోచనలలో అస్థిరత. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. నిర్ణయాలలో నిదానం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక వ్యవహారాలలో హామీలు వద్దు. ఇతరుల విమర్శలకు తలవొగ్గడం ఉత్తమం. పనులు వాయిదా వేస్తారు. రాబడి తగ్గినా అవసరాలు తీరతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సోదరుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు రద్దు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలులో పెడతారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు పురస్కారాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ చూపుతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గే అవకాశం. కళాకారులకు ఒక అవకాశం ఉత్సాహాన్నిస్తుంది. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన చేయండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు,నిరుద్యోగులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొంత వరకూ అనుకూలం. పసుపు, నలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఎదురుకావచ్చు. గులాబీ, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.