వార ఫలాలు(29-01-2017 to 4-02-2017) | week (29-01-2017 to 04-02-2017) | Sakshi
Sakshi News home page

వార ఫలాలు(29-01-2017 to 4-02-2017)

Published Sat, Jan 28 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

వార ఫలాలు(29-01-2017 to  4-02-2017)

వార ఫలాలు(29-01-2017 to 4-02-2017)

29 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2017 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. లేత ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు ఒత్తిడులు తొలగి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి, పెద్దల ప్రశంసలు అందుకుంటారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు జరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందవచ్చు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం అవుతాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లేదా జీతాల పెంపు ఉండవచ్చు. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ప్రతికూలంగా ఉన్న కోర్టు కేసులు సైతం అనుకూల దిశగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం ఉంది. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారుల కృషి ఫలిస్తుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషులు సహాయపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
అనుకున్న కార్యాలు కొంత మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం అవసరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీ  ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలకు మంచి లాభాలు దక్కుతాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడటం వల్ల ఉద్యోగులకు నూతనోత్సాహం కలుగుతుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా ఇతరులనుంచి రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. బంగారు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో
29 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2017 వరకు


మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం మీరు కొంత మందకొడిగా, బద్ధకంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, సరదాగా గడుపుదామా అని ఎదురు చూస్తుంటారు. ప్రేమ సఫలమవుతుంది. ఇష్టమైన వారితో, మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. శ్రద్ధ తీసుకోవలసి వస్తుంది. అంతా సుఖాంతమై, విందు వినోదాలలో మునిగి తేలుతారు.
కలిసొచ్చే రంగు: వెండి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
ఆస్తుల కొనుగోలు కోసం మదుపు చేస్తారు. మీలో ఈవారమంతా ఆశ్చర్యానందాలు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. కెరీర్‌పరంగా రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. దూరప్రయాణం ఉండొచ్చు. చిక్కు సమస్యలలో ఉన్న మిత్రులను మీ తెలివితేటలతో బయట పడేసి, వారి అభిమానాన్ని చూరగొంటారు.
కలిసొచ్చే రంగు: గోధుమ

మిథునం (మే 21 – జూన్‌ 20)
మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలలో మునిగి తేలుతారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు.
కలిసొచ్చే రంగు: గచ్చకాయ/బూడిదరంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఆదాయానికి మించి ఖర్చు చేయవలసి రావడం వల్ల అప్పులు చేయక తప్పదు. ఆలోచనలలో అస్థిరత నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చెలరేగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు సహజమే అయినా, ముఖ్య నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం.
కలిసొచ్చే రంగు: నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. కలిసొచ్చే రంగు: రుద్రాక్ష వన్నె

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కెరీర్‌ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: అరిటాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆర్థికంగా చాలా బాగుంటుంది. షాపింగ్‌ చేస్తారు. నూత్న వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టును పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. అంతమాత్రాన నిశ్చింత పనికిరాదు. జరగవలసిన కార్యాలమీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య పొరపచ్ఛాలు ఏర్పడతాయి.
కలిసొచ్చే రంగు: పసుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. బహుమతులు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని చిక్కుముళ్లు వాటంతట అవే విడిపోయి, గొప్ప స్వాంతన కలుగుతుంది. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. కలిసొచ్చేరంగు: ఆకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆదాయానికి మించి ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లోనూ, వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
కలిసొచ్చే రంగు: గులాబీ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు.  ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడి, మీకు కొన్ని విషయాలలో భరోసా ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో సామరస్యంతో మెలగడం అవసరం. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు.
కలిసొచ్చే రంగు: మబ్బురంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
 ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాల్యజ్ఞాపకాలలో మునిగి తేలుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. అనవసర వివాదాలు. వాదోపవాదాలు జరగకుండా జాగ్రత్త అవసరం.
కలిసొచ్చే రంగు: తెలుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. కొత్త శక్తి పుంజుకుంటారు. విదేశాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. ఆసక్తికరమైన వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్‌ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు.
కలిసొచ్చే రంగు: పసుపు
టారో ఇన్సియా అనలిస్ట్‌
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement