మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. బంధువుల సహకారంతో ముందడుగు వేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. çపసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రో ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సా«ధిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులతో పరిచయం. ఒక కీలక నిర్ణయంలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. చికాకులు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. అనుకూల పరిస్థితులు ఉంటాయి. చిరకాల మిత్రుల నుంచి పిలుపురావచ్చు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. కార్యజయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళాకారులకు పురస్కారాలు, సన్మానాలు. వారం చివరిలో మానసిక అశాంతి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఎట్టకేలకు చేపట్టిన కార్యక్రమాలు çపూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. రాబడి కొంత పెరిగి రుణబాధలు తొలగుతాయి. కాంట్రాక్టర్లకు శు¿¶ వార్తలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహవంతంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. ధనవ్యయం. తెలుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొంతమేరకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. మిత్రుల సహాయం పొందుతారు. వాహన, గృహయోగాలు. పరిచయాలు పెరుగుతాయి. వివాదాల నుంచి బయటపడతారు. మీ శక్తియుక్తులు బయటపడతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు సంభవం. రాజకీయవర్గాలకు కలసివచ్చే సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, లేతఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. రాబడి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఇంటా బయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు సత్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. చికాకులు. నేరేడు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. వృథా ఖర్చులు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. జీవితాశయం నెరవేరే సమయం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త మిత్రుల పరిచయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తు,వస్త్రలాభాలు. విద్యార్థులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకూలత. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కళాకారులకు యత్నకార్యసిద్ధి. వార ం మధ్యలో కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యయప్రయాసలు. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
బంధువులతో విభేదాలు ఏర్పడవచ్చు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులు, విద్యార్థులు శ్రమానంతరం ఫలితం దక్కించుకుంటారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని పొరపాటు నిర్ణయాలతో ఆప్తులను దూరం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ప్రముఖుల సహాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. నలుపు, లేత పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆలోచనలు కలసివస్తాయి. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు తీరి ఊరట చెందుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు శ్రమ తగ్గుతుంది. ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. బంగారు, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయస్వామిని పూజించండి.
వారఫలాలు : 26 ఫిబ్రవరి నుంచి 4 మార్చి 2017 వరకు
Published Sun, Feb 26 2017 1:51 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
Advertisement
Advertisement