వారఫలాలు19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు | Varaphalalu from 19 February until 25 February 2017 | Sakshi
Sakshi News home page

వారఫలాలు19 ఫిబ్రవరి నుంచి 25 ఫిబ్రవరి 2017 వరకు

Published Sat, Feb 18 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

Varaphalalu from 19 February until 25 February 2017

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో అవాంతరాలు. ఆశించిన ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక విషయాలు నిరుత్సాహకరం. రుణదాతల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారాంతంలో ధనలాభం. కార్యసిద్ధి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోí ణి, మృగశిర 1,2 పా.)
కార్యాలలో ఆటంకాలు. బంధు మిత్రులతో మాటపట్టింపులు. చాకచక్యంగా వ్యవహరించి ముందుకు సాగడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. ఒక సమస్య తీరి మనశ్శాంతి లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మెలకువ పాటించండి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. పాతమిత్రుల కలయిక. పసుపు, లేత గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవ గ్రహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులు, సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగు. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పాతసంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. ప్రత్యర్థులు దగ్గరవుతారు. మీ శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు.  కళాకారులకు అవకాశాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
సకాలంలో పనులు పూర్తి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది.  ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. బం«ధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారుల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలలో మార్పులు. తెలుపు, గులాబీరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
రాబడికి మించిన ఖర్చులు. సన్నిహితులు, బంధువులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు నిరాశాజనకంగా ఉంటుంది.  ఆరోగ్యం మందగిస్తుంది.  ఒక సమాచారం కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలు కొంత అంసతృప్తి కలిగిస్తాయి.  ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు చికాకులు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ధనలాభం. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇబ్బందులు ఎదురైనా అధిగమించి వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలతో తొందరపాటు వద్దు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ వృథా కాదు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
శ్రమకు తగ్గ ఫలితం. అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి. సమస్యల నుంచి గట్టెక్కుతారు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. . స్వల్ప అనారోగ్యం. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో ధనలాభం. శు¿¶ వార్తలు. గులాబీ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు మన్నిస్తారు. శుభకార్యాలలో  పాల్గొంటారు. బాకీల వసూలు. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల. సన్నిహితులlసహాయసహకారాలు అందుతాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. భూములు, వాహనాల కొనుగోలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు, రాజకీయవర్గాలకు పదవులు. స్వల్ప అనారోగ్యం, ఖర్చులు. ఎరుపు, లేత పసుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో అకారణ విరోధం. ఆలోచనలు కలసిరావు. కుటుంబ బాధ్యతలు. ప్రత్యర్థులతో అప్రమత్తంగా మెలగండి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని సమస్యలు తీరతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలో పేరు ప్రతిష్ఠలు. విద్యార్థులు, నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కార్యజయం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. వారం చివరిలో ధనవ్యయం, కుటుంబ కలహాలు. నీలం, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కార్యజయం. ఆదాయవృద్ధి. ఒత్తిడులు తొలగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్నిసమస్యలు, వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యనిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. వ్యయప్రయాసలు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
సమస్యలను నేర్పుతో పరిష్కరించుకుంటారు. మీ ప్రతిభాపాటవాలకు గుర్తింపు. సంఘంలో ప్రత్యేక గౌరవం. బంధువర్గం సహకరిస్తుంది. అవసరాలు తీరతాయి. పనులు చకచకా పూర్తవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభార ం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు అనుకూలం. వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement