మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో విజయం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కోర్టు వ్యవహారాలు, ఇతర సమస్యల నుంచి కొంత విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహం. ఎరుపు, లేత గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. మీనుంచి సన్నిహితులు సాయం కోరతారు. కొంత శ్రమపడ్డా అనుకున్న పనులు పూర్తి కాగలవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రుణబాధలు, సమస్యలు తీరే సమయం. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సోదరులు, సోదరీలతో వివాదాల సర్దుబాటు. దేవాలయాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత్తహోదాలు. లేతఆకుపచ్చ, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం ఉత్తమం.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకుపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు చేసేయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. అయితే వారం చివరిలో అనూహ్యంగా అనుకూల ఫలితాలు పొందుతారు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆదాయానికి లోటు ఉండదు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధించే దిశగా పయనిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. తెలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నేరేడు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆలోచనలు కార్యరూపం. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు పురోగతి. పసుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న రాబడి పొందుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి పిలుపు రావచ్చు. ఒక అవకాశం అప్రయత్నంగా లభిస్తుంది, సద్వినియోగం చేసుకోండి. సంతానరీత్యా మంచి పేరు లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊరట. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన ఆహ్వానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. మీ నేర్పు, ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. బంగారు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నిరుద్యోగులకు శుభవార్తలు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక సమస్యలు తీరి, రుణఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందే అవకాశం. యుక్తితో వ్యవహరించి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగులకు హోదాలు, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. నీలం, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
బంధుమిత్రుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న ఆశయాలు సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఇంటిలో శుభకార్యాలు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు వారం చివరిలో అనుకూల పరిస్థితి. కళాకారులు అవకాశాలు దక్కించుకునేందుకు మరింత కృషి చేయాలి. నలుపు, లేత గులాబీరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రతిభావంతులుగా గుర్తింపు రాగలదు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. ఎరుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి.
వారఫలాలు : 12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
Published Sat, Feb 11 2017 11:52 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement