Tarot insiya
-
వారఫలాలు : 12 ఫిబ్రవరి నుంచి 18 ఫిబ్రవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాన్వేషణలో విజయం. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారు. కోర్టు వ్యవహారాలు, ఇతర సమస్యల నుంచి కొంత విముక్తి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహం. ఎరుపు, లేత గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు కొంత అనుకూలం. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కవచ్చు. మీనుంచి సన్నిహితులు సాయం కోరతారు. కొంత శ్రమపడ్డా అనుకున్న పనులు పూర్తి కాగలవు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు గుర్తింపు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) రుణబాధలు, సమస్యలు తీరే సమయం. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. సోదరులు, సోదరీలతో వివాదాల సర్దుబాటు. దేవాలయాలు సందర్శిస్తారు. ముఖ్య నిర్ణయాలలో కుటుంబసభ్యుల సలహాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు కొత్తహోదాలు. లేతఆకుపచ్చ, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం ఉత్తమం. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. ఆరోగ్య, కుటుంబసమస్యలు చికాకుపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగులు చేసేయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. అయితే వారం చివరిలో అనూహ్యంగా అనుకూల ఫలితాలు పొందుతారు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆదాయానికి లోటు ఉండదు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు లక్ష్యాలు సాధించే దిశగా పయనిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. తెలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి కొంత పెరిగి అవసరాలు తీరతాయి. భూవివాదాల నుంచి బయటపడతారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవీయోగం. నేరేడు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆశించిన ఆదాయం సమకూరుతుంది. ఆలోచనలు కార్యరూపం. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. శత్రువులు మిత్రులుగా మారతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు పురోగతి. పసుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న రాబడి పొందుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. దూరప్రాంతాల నుంచి పిలుపు రావచ్చు. ఒక అవకాశం అప్రయత్నంగా లభిస్తుంది, సద్వినియోగం చేసుకోండి. సంతానరీత్యా మంచి పేరు లభిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊరట. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన ఆహ్వానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. మీ నేర్పు, ఓర్పుతో సమస్యలు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని బాకీలు సైతం వసూలవుతాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. బంగారు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నిరుద్యోగులకు శుభవార్తలు. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక సమస్యలు తీరి, రుణఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందే అవకాశం. యుక్తితో వ్యవహరించి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి. ఉద్యోగులకు హోదాలు, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. నీలం, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) బంధుమిత్రుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న ఆశయాలు సాధనలో మిత్రులు సహకరిస్తారు. ఇంటిలో శుభకార్యాలు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు. ఉద్యోగులకు వారం చివరిలో అనుకూల పరిస్థితి. కళాకారులు అవకాశాలు దక్కించుకునేందుకు మరింత కృషి చేయాలి. నలుపు, లేత గులాబీరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ప్రతిభావంతులుగా గుర్తింపు రాగలదు. వాహనాలు, గృహ కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. ఎరుపు, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని పూజించండి. -
వారఫలాలు 5 ఫిబ్రవరి నుంచి 11 ఫిబ్రవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థికపరమైన ఇబ్బందులు చికాకులు తప్పవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. విమర్శలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. పనులలో అవరోధాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశాజనకం. ఉద్యోగులకు పనిభారం మరింతగా పెరుగుతుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో కొంత అనుకూలత. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చన చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. మీ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగులకు Sకీలక సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు తథ్యం. తెలుపు, చాక్లెట్‌రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణాలయ దర్శనం మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యయప్రయాసలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. కుటుంబంలో సమస్యలు కొంతమేరకు పరిష్కారం. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులు,మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఆకుపచ్చ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు,బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. వాహన,గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకున్న హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఈవారం పట్టింది బంగారమే. ఆశించినంత ఆదాయం. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు కూడా మీ దారికి వస్తారు. కార్యక్రమాలలో విజయం. వాహనయోగం. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత ్తపెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు ఊహించని ప్రగతి. ఎరుపు, లేతపసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కుటుంబానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. సోదరులు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు,నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పూదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆదాయానికి మించి ఖర్చులు. పనులు మధ్యలోనే విరమిస్తారు. ఆలోచనలలో అస్థిరత. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. నిర్ణయాలలో నిదానం అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులు మరింత శ్రద్ధ వహించాలి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో హామీలు వద్దు. ఇతరుల విమర్శలకు తలవొగ్గడం ఉత్తమం. పనులు వాయిదా వేస్తారు. రాబడి తగ్గినా అవసరాలు తీరతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. సోదరుల ద్వారా ఆశించిన సహాయం అందుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు రద్దు. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలులో పెడతారు. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు పురస్కారాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు ఆదరణ చూపుతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. వాహనయోగం. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పనిభారం తగ్గే అవకాశం. కళాకారులకు ఒక అవకాశం ఉత్సాహాన్నిస్తుంది. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థులు,నిరుద్యోగులకు ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు కొంత వరకూ అనుకూలం. పసుపు, నలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బందులు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పకపోవచ్చు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామికవర్గాలకు సమస్యలు ఎదురుకావచ్చు. గులాబీ, లేత ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. -
వార ఫలాలు(29-01-2017 to 4-02-2017)
29 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2017 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పసుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, సన్నిహితులు సహాయపడతారు. కొంతకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. లేత ఎరుపు, బంగారు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా అ«ధిగమిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం జరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు ఒత్తిడులు తొలగి, కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసి, పెద్దల ప్రశంసలు అందుకుంటారు. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు జరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందవచ్చు. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. గృహనిర్మాణయత్నాలు సానుకూలం అవుతాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లేదా జీతాల పెంపు ఉండవచ్చు. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. ప్రతికూలంగా ఉన్న కోర్టు కేసులు సైతం అనుకూల దిశగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం ఉంది. తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం సంతృప్తినిస్తుంది. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులతో సఖ్యత. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారుల కృషి ఫలిస్తుంది. పసుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శ్రేయోభిలాషులు సహాయపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సొగుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. ఎరుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అనుకున్న కార్యాలు కొంత మందకొడిగా సాగుతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి, మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం అవసరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. గులాబీ, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలకు మంచి లాభాలు దక్కుతాయి. కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడటం వల్ల ఉద్యోగులకు నూతనోత్సాహం కలుగుతుంది. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. నలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. నీలం, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఎంతోకాలంగా ఇతరులనుంచి రావలసిన సొమ్ము సమయానికి చేతికి అందుతుంది. రుణబాధల నుంచి విముక్తి కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది.. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు జరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. బంగారు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 29 జనవరి నుంచి 4 ఫిబ్రవరి 2017 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీరు కొంత మందకొడిగా, బద్ధకంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, సరదాగా గడుపుదామా అని ఎదురు చూస్తుంటారు. ప్రేమ సఫలమవుతుంది. ఇష్టమైన వారితో, మనసుకు నచ్చినవారితో సరదాగా గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. శ్రద్ధ తీసుకోవలసి వస్తుంది. అంతా సుఖాంతమై, విందు వినోదాలలో మునిగి తేలుతారు. కలిసొచ్చే రంగు: వెండి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఆస్తుల కొనుగోలు కోసం మదుపు చేస్తారు. మీలో ఈవారమంతా ఆశ్చర్యానందాలు కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. కెరీర్‌పరంగా రకరకాల అవకాశాలు వచ్చి ఏది ఎంచుకోవాలా అన్న సందేహంలో పడేస్తాయి. దూరప్రయాణం ఉండొచ్చు. చిక్కు సమస్యలలో ఉన్న మిత్రులను మీ తెలివితేటలతో బయట పడేసి, వారి అభిమానాన్ని చూరగొంటారు. కలిసొచ్చే రంగు: గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విందువినోదాలలో మునిగి తేలుతారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. కలిసొచ్చే రంగు: గచ్చకాయ/బూడిదరంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఆదాయానికి మించి ఖర్చు చేయవలసి రావడం వల్ల అప్పులు చేయక తప్పదు. ఆలోచనలలో అస్థిరత నెలకొంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు చెలరేగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు సహజమే అయినా, ముఖ్య నిర్ణయాలు తీసుకునే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం అవసరం. కలిసొచ్చే రంగు: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులు కలుస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక గురువులు పరిచయం అవుతారు. వారు చెప్పిన మాట వింటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. కలిసొచ్చే రంగు: రుద్రాక్ష వన్నె కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. భూమి పరమైన ఒక వ్యవహారంలో తిరుగుతారు. పాత బాకీలు తీర్చేసి, నిశ్చింతగా ఉంటారు. అనుకోని దూర ప్రయాణం తగలవచ్చు. మీలోని చాలా సందేహాలకు ధ్యానం సరైన సమాధానం చెబుతుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురు కావచ్చు. ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి, తగిన వైద్యపరీక్షలు చేయించుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: అరిటాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థికంగా చాలా బాగుంటుంది. షాపింగ్ చేస్తారు. నూత్న వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టును పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టును చేజిక్కించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఉన్న అవరోధాలను అధిగమిస్తారు. అంతమాత్రాన నిశ్చింత పనికిరాదు. జరగవలసిన కార్యాలమీద దృష్టిపెట్టడం మంచిది. ప్రేమవ్యవహారాలలో శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికీ మీకూ మధ్య పొరపచ్ఛాలు ఏర్పడతాయి. కలిసొచ్చే రంగు: పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. బహుమతులు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఉండవచ్చు. ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని చిక్కుముళ్లు వాటంతట అవే విడిపోయి, గొప్ప స్వాంతన కలుగుతుంది. మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గం సుగమం అవుతుంది. కలిసొచ్చేరంగు: ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆదాయానికి మించి ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. కొత్త ఆదాయ మార్గాలకోసం అన్వేషిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లోనూ, వృత్తి, వ్యాపారాలలోనూ అవరోధాలు ఏర్పడవచ్చు. బెంబేలెత్తకుండా, సన్నిహితుల సహకారంతో నేర్పుగా పరిష్కరించుకోవడం అవసరం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ, ఉన్నంతలోనే దానధర్మాలు చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: గులాబీ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వ్యయప్రయాసలు.. వృథా ఖర్చులు. ప్రయాణంలో కొత్త పరిచయాలు ఏర్పడి, మీకు కొన్ని విషయాలలో భరోసా ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో సామరస్యంతో మెలగడం అవసరం. సృజనాత్మకంగా ఆలోచించి, మీ కలలు నిజం చేసుకుంటారు. కలిసొచ్చే రంగు: మబ్బురంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారమంతా మీకు అనుకూలంగా గడుస్తుంది. తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాల్యజ్ఞాపకాలలో మునిగి తేలుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు ఉండవచ్చు. అనవసర వివాదాలు. వాదోపవాదాలు జరగకుండా జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. కొత్త శక్తి పుంజుకుంటారు. విదేశాలనుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల దిశలో పయనిస్తాయి. ఉద్యోగులకు అనుకూలత. ఆసక్తికరమైన వార్తలు వింటారు. కొత్త ప్రాజెక్టులు దక్కించుకుంటారు. జలుబు, సైనస్ సమస్యలు బాధించవచ్చు. విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. కలిసొచ్చే రంగు: పసుపు టారో ఇన్సియా అనలిస్ట్ -
అంతా విజయమే!
2017 సంవత్సర ఫలితాలు మేషం (మార్చి 21– ఏప్రిల్ 20) రాశులలో వీరు మొదటి రాశికి చెందిన వారు కనుక జీవితంలో కూడా ఏదైనా ట్రెండ్ సృష్టించడంలో మొదటి వరుసలో ఉంటారు. 2017 సంవత్సరం వీరికి కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంవత్సరపు మొదటి భాగం చాలా బాగుంటుంది. మీకు సహకరించని అంశాలను ప్రకృతి తన సహజపద్ధతిలో తొలగిస్తుంది. కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ రాశివారు తమ లోపలి విషయాలు ఒకరితో చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాము అనుకున్నది చేస్తారు. వృత్తి పరంగా ఇంటి నుంచి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఒక అందమైన ప్రదేశంలో సొంత ఇల్లు కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పుట్టినరోజు, ఇతర వేడుకలకు వృత్తి నుంచి విరామం తీసుకొని వినోదం పొందండి. ఈ విరామంలో మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావలసిన శక్తియుక్తులను కూడగట్టుకోండి. మిమ్మల్ని నొప్పించే ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. ప్రేమలో సరైన భాగస్వామిని ఎంచుకోండి. ఈ సంవత్సరం మీరు కోరుకునే అనుబంధాలు దక్కుతాయి. కలిసొచ్చేవి : రంగు: ఆరంజ్; వారం: ఆదివారం; అంకె: 1 వృషభం (ఏప్రిల్ 21–మే 20) వృషభరాశికి వాడి అయిన కొమ్ములతో ఉండే వృషభం చిహ్నం. ఇది స్థిరత్వానికీ, దృష్టికోణానికి సంకేతం. అయితే వీరికి ఈ సంవత్సరం కొంచెం మందకొడిగా నడిచే అవకాశం ఉంది. ఆశలు, ఆశయాలు భారీగా ఉన్నా ఆ సంగతి బయటకు చెప్పక మనసులోనే పెట్టుకుని ఉంటారు. అసలు గత సంవత్సరం కోసం ఏం నిర్ణయాలు తీసుకున్నామా అని ఒకసారి పరికించుకోండి. కొంచెం ఓపిక అవసరం. టీమ్‌తో పాటు కలిసి పని చేయడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామిక ధోరణి ఉండాలి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ప్రయాణాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రేమకు, వివాహానికి ఈ సంవత్సరం అంత అనుకూలం కాదు. మిమ్మల్ని మీరు వెతుక్కోవడంలో మరింత లోతులకు వెళతారు.మీ పనే మీకు దైవం. మీ పనిలో మిమ్మల్ని కొట్టే చెయ్యి ఉండదు. ఆర్థిక పరంగా మంచి లబ్ధి కనిపిస్తోంది. పెట్టుబడులకు ఇది కలిసివచ్చే కాలం. ఏవైనా కోర్సులు చదవాలనుకునేవారికి కూడా ఈ కాలం కలిసి వస్తుంది. కలిసొచ్చేవి : రంగు: పసుపు; వారం: మంగళవారం; అంకె: 2 మిథునం (మే 21–జూన్ 21) ఈ 2017వ సంవత్సరం మీకు కలిసొస్తుంది. గతంలో చేసిన కృషికి తగ్గ ఫలితం ఈ కొత్త ఏడాదిలో లభిస్తుంది. అందుకే ఈ 2017లో వచ్చే కొత్త అవకాశాలను అందుకోవడం కోసం మీ మనసును తెరచి ఉంచుకోండి. భావోద్వేగపరమైన పరిణతి వస్తుంది. అయితే, ప్రేమ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద మీ మానసిక భావోద్వేగాలు పెచ్చుమీరి, పరిస్థితులపై వాటిదే పైచేయి కాకుండా చూసుకోండి. కొత్త ఇమేజ్ తెచ్చుకోవడానికి ఈ కొత్త ఏడాది భలే మంచి టైమ్. ఎప్పటిలానే, ఆరోగ్యం మీదే మీ చూపు అంతా! చాలా మంది ఆరోగ్యబాటలో పయనించడానికి మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. ఈ 2017లో మీకు లాటరీలు తగిలే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన విజయాలు అందుకుంటారు. మీ అదృష్టం మరింత పెరగాలంటే, దక్షిణపు దిక్కున ఫినిక్స్ బొమ్మను ఉంచండి. దీని వల్ల బోలెడన్ని అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటన్నిటినీ మీరు బంగారంలా వాడుకోవచ్చు. కలిసొచ్చేవి: రంగు: బంగారం; వారం: ఆదివారం; అంకె: 9 కర్కాటకం (జూన్22–జూలై 23) ఎంత కష్టపడి పని చేస్తే అంత ఫలితం. విజ్ఞానం పెంచుకోవడానికీ, నైపుణ్యాలను అలవరచుకోవడానికీ ఇదే తగిన సమయం. రానున్న సంవత్సరాల్లో బలంగా నిలదొక్కు కొని నిలబడడానికి ముందుగానే లక్ష్యం నిర్దేశించుకొని, ముందడుగు వేయడం అవసరం. కొత్త ఏడాదిలో మీకు వేసవి కన్నా, శీతకాలం చాలా బాగా కలిసొస్తుంది. ఈసారి మీరు మరీ కొట్టొచ్చినట్లుండే ముదురు రంగు దుస్తులు వాడకండి. మీకు ప్రేమ చాలా ముఖ్యం. ప్రేమ లేకుండా జీవితమే లేదని భావిస్తారు. అందుకే, ఆ ప్రేమాన్వేషణలో ఉంటూ, ఎవరితోనైనా ఇట్టే ప్రేమలో పడిపోతుంటారు. కానీ, చాలా సందర్భాల్లో అన్ని ప్రేమలూ ఫలించవు కాబట్టి, కాస్తంత గుండె దిటవు చేసుకొని ముందుకు అడుగేయండి. మీ మనసుకు నచ్చేవాళ్ళను వెతుక్కోవడానికి ఇది సరైన సమయం కాకపోతేనేం, ఈ ఏడాది కాకపోతేనేం వచ్చే ఏడాదైనా దొరుకుతారని గుర్తించండి. ఈ ఏడాది మీ పుట్టినరోజు తరువాత మీ ప్రేమ జీవితం మరింత మెరుగవుతుందని గ్రహించండి. కలిసొచ్చేవి : అదృష్ట సంఖ్య: 6; రంగు: సీ గ్రీన్; వారం: గురువారం సింహం (జూలై 24–ఆగస్టు 23) సగర్వంగా, కొండొకచో అహంకారంగా అనిపిస్తున్నా, నమ్మకంగా, ధైర్యంగా ముందుకు సాగడం సింహ రాశి వారి లక్షణం. సౌహార్దంగా ఉంటారు. ఇతరుల పట్ల దయతో, మంచి ఉత్సాహంగా ముందుకు సాగుతుంటారు. ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, ప్రయాణాలు, లాటరీలు – అన్నీ మీకు ఈసారి కలిసొస్తాయి. మీ ఆశయాలు, లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఇతరులను ఎవరినీ మీ మార్గంలోకి అడ్డుగా రానివ్వకండి. ఉద్యోగం, పని విషయంలో ఈ ఏడాది మీకు ఎక్కడ లేని శక్తి, ఉత్సాహం ఉంటాయి. కొత్త ఏడాది ఆరంభంలో మీరు పట్టిందల్లా బంగారమే. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. దాని మీద దృష్టి పెట్టండి. మీ ప్రేమ విషయంలో మీ మనసులోని మాటను నిజాయతీగా చెప్పేయడం మంచిది. సింహరాశి వారికి తగిన వ్యక్తులు దొరుకుతారు. ఇంట్లో దక్షిణ మూలలో రెండు ఎర్ర కొవ్వత్తులు వెలిగించండి. దాంతో, మీకు మరింత ప్రేమ, ప్రణయం లభిస్తాయి. కలిసొచ్చేవి: అదృష్ట సంఖ్య: 4; రంగు: అగ్ని జ్వాల లాంటి కమలాపండు రంగు; వారం: ఆదివారం కన్య (ఆగస్టు24–సెప్టెంబర్ 23) ఈ రాశి వారికి ఈ ప్రపంచం ఒక్కటే నాకు చాలదు అనే ధోరణి ఉంటుంది కనుక వీరి జీవితం సవాళ్లతో నిండి ఉంటుంది. వీళ్లు జీవితం నుంచి ముక్తసరిగా కాకుండా ఎక్కువ ఆశించడం దానికి కారణం. ఇది మీరు మీ జీవిత గమనాన్ని విశ్వసించాల్సిన సమయం. మీకు ఆ సంగతి తెలుసు. అందుకు సిద్ధపడండి. కొంచెం అనిశ్చితి మొదట చోటు చేసుకున్నా మమ్మిల్ని మీరు స్థిరపరుచుకొని ముందుకు సాగండి. అంతేతప్ప మిమ్మల్ని మీరు వెనక్కు లాక్కోండి. సమయం వచ్చేసింది. ధైర్యంగా అడుగువేస్తే మీరు ఏమేమి కోరుకున్నారో అవన్నీ పొందుతారు. న్యాయపరమైన లావాదేవీలు పరిష్కృతమవుతాయి. జూన్ తర్వాత అంతా బాగుంటుంది. కొన్ని ఊహించని పరిణామాలు మీకు ఆర్థికపరంగా అనుకూలంగా మారుతాయి. మీ పాత స్నేహితులు, పాత అనుబంధాలు మళ్లీ తారసపడి మీ గతంలోని హుషారును, కొంత కోలాహాలాన్ని తీసుకొని వస్తాయి. భౌతిక విషయాలు ఆధ్యాత్మిక విషయాల మధ్య సమన్వయం పాటించండి. కలిసొచ్చేవి: రంగు: లేలేత గులాబీ (టెర్రకోట పింక్); సంఖ్య: 3; వారం: బుధవారం తుల (సెప్టెంబర్ 24– అక్టోబర్ 23) మీ స్నేహం, మీ సమ్మోహన శక్తి, మీ ఆతిథ్యం... కొత్త సంవత్సరంలో అందర్నీ మీ చుట్టూ తిప్పుకుంటాయి. 2017 మీ జీవితానికి మంచి మలుపు. రోజులు సాఫీగా, సమతులంగా గడుస్తాయి. అనుకున్నదాన్ని సాధించడానికి మీకున్న పరిమితులను దాటుకుని మరీ ప్రయత్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే దుస్తులపై దృష్టి పెడతారు. మనసులను వశం చేసుకుంటారు. అభిమాన్ని చూరగొంటారు. కొత్త వ్యక్తులకు మీరు ఆత్మీయులైపోతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా జీర్ణకోశంపై ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇతర విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దూకుడు తగ్గించాలి. ఆలోచనల వేగాన్ని నియంత్రించుకోవాలి. ప్రారంభ మాసాలు కొంచెం అయోమయంగా ఉంటాయి. అలాగని ఆందోళన చెందనవసరం లేదు. 5వ అంకెకు దూరంగా ఉండండి. మే నెలలో డబ్బుకు కాస్త ఇబ్బంది అవుతుంది. ఫిబ్రవరి, నవంబర్ నెలల్లో ప్రయాణాలు. కలిసొచ్చేవి : రంగు : లేత నీలం (పాస్టల్ బ్లూ); వారం : బుధవారం; అంకె : 3 వృశ్చికం (అక్టోబర్ 24–నవంబర్ 22) సమర్థత మీ రహస్య ఆయుధం. దెబ్బ తగిలినా కోలుకోగల సామర్థ్యం మీ సొంతం. కొత్త అవకాశాల కోసం మీరు ఎంతోకాలంగా వేచిచూస్తున్నారు. కానీ ఎన్నో అవకాశాలు ఈ ఏడాది మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఒత్తిళ్లు ఎదుర్కోవడం అన్నది ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మీ వెన్నంటే ఉన్నా... ఆ తర్వాతి విజయాలు ఆ ఒత్తిడుల తాకిడికి ఉపశమనంలా పనిచేస్తాయి. కొన్ని విజయాలు మిమ్మల్ని వరించడానికి ఈ ఏడాది సంసిద్ధంగా ఉన్నాయి. ఒక మార్మికమైన, దివ్యమైన శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీరు సంసిద్ధం చేసుకునే కొత్త కొత్త వ్యూహాల కారణంగా భవిష్యత్తులో మీకు భద్రత సమకూరుతుంది. పోరాటపటిమను ప్రదర్శిస్తుంటారు. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని మరింతగా ఇష్టపడటానికి మీకు ఉన్న ఈ గుణమే దోహదపడుతుంది. ఫిబ్రవరి, ఆగస్టు, అక్టోబర్ నెలలు మిమ్మల్ని కాస్త ఒత్తిడికి గురిచేస్తాయి. జనవరి, డిసెంబరు నెలల్లో దూరప్రయాణాలకు అవకాశం కలగవచ్చు. కలిసొచ్చేవి : రంగు : ఇటుక ఎరుపు (బ్రిక్ రెడ్); వారం : మంగళవారం; నంబరు : 2 ధనుస్సు (నవంబర్23–డిసెంబర్ 21) ఉన్న చోటే కుదురుగా ఉండిపోడానికి ఇష్ట పడరు. స్వేచ్ఛగా విహరించేందుకు నిత్యం మార్గాలను అన్వేషిస్తుంటారు. ప్రయాణాలకు ప్రాధాన్యం ఇస్తారు. తత్వవేత్తలు, చింతనాపరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. చర్చల్లో పాల్గొంటారు. వాదోపవాదాల కారణంగా మీ విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. దేన్నయినా తేలిగ్గా తీసుకుంటారు. కానీ సూక్ష్మంగా విశ్లేషిస్తారు. మీరు కోరుకున్నది మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అక్టోబరులో మనసైన వారు చేరువవుతారు. జూన్ తర్వాత మాత్రమే చేతిలో కాస్త డబ్బుల ఆడతాయి. వ్యక్తిగత ప్రయాణాలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉద్యోగ రీత్యా కూడా మీరు విదేశీయానం చేస్తారు. మీది వ్యాపారం అయితే కొత్త వ్యాపారం, మీరు ఉద్యోగి అయితే కొత్త ఉద్యోగం జత కలుస్తుంది. అవసరంలో ఉన్నవారికి అడక్కుండానే సహాయం చేస్తారు. జూలై నుంచి మీ జీవితం అత్యద్భుతంగా ముందుకు సాగుతుంది. కొండాకోనల్లో, పచ్చని ప్రకృతి నీడలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. కలిసొచ్చేవి : రంగు : లేలేత ఊదా (రాయల్ పర్పుల్); వారం : గురువారం; అంకె : 9 మకరం (డిసెంబర్ 22–జనవరి 20) ఆధిక్య భావన, తీవ్ర ఆకాంక్ష, పట్టువిడుపులేని స్వభావం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. అంచెలన్నీ దాటి చకచకా అందలం చేరుకుంటారు. పై అధికారులకు మీ ముక్కుసూటితనం కొంత అసహనం కలిగించినప్పటికీ మీరు వారికి ప్రియమైన వ్యక్తి అవుతారు. ఇది మీకు ‘సక్సెస్ ఇయర్’. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలతో మీ లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. కలల్ని నిజం చేసుకుంటారు. వచ్చిన అనేక మెరుగైన అవకాశాల్లో నుంచి మరింత మెరుగైన దాన్ని ఎంచుకోవడం మీకు కష్టమయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. మార్పును అంగీకరించని మీ తత్వాన్ని 2017 కొద్దిగానైనా సడలిస్తుంది. అదీ మంచికే. ప్రేమకు మీరు తల ఒగ్గుతారు. ప్రేమ కోసం మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. అంటే రాజీ పడతారు. ప్రేమలో అవతలి వ్యక్తి అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇస్తారు. మార్చి, ఏప్రిల్, మే నెలలు మీకు అనుకూలమైనవి. జూలై నుంచి ఆరోగ్యం పూర్తిగా మెరుగవుతుంది. కలిసొచ్చేవి : రంగు : ముదురాకు పచ్చ (ఫారెస్ట్ గ్రీన్); వారం : శనివారం; సంఖ్య : 12 కుంభం (జనవరి 21–ఫిబ్రవరి 19) ఈ ఏడాది ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. ప్రేమలో విజయాలు, మీ సంతోషం కొనసాగుతాయి. గతంలోని చేదు అనుభవాలు తుడిచిపెట్టుకుపోతాయి. మీ దిగులు, బెంగ వంటి వాటిని ఎలా అధిగమించాలా అని తర్కబద్ధంగా ఆలోచిస్తారు. మీ జీవితంలోకి ఒక మహిళ ప్రవేశించి, మిమ్మల్ని చాలా ప్రభావితం చేస్తుంది. ఆమె కీలకమైన భూమిక పోషిస్తుంది. ఒకవేళ మీరు మహిళ అయి ఉంటే మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటారు. ఈ ఏడాది మీ సంపద అనూహ్యంగా పెరుగుతుంది. కుటుంబం నుంచి అమితమైన ఆనందం లభ్యమవుతుంది. దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు దగ్గరవుతారు. సంతోషాలు, ఆనందాలు అందరితో పంచుకుంటారు. ఆరోగ్యపరంగా ఏడాది మీకు అత్యుత్తమమైంది. అనంత విశ్వం నుంచి మీకు సమకూరే సంతోషాలతో ఈ ఏడాది మీకు ఎంతగా కలిసి వస్తుందంటే... ఆనందాల సింహాసనంపై కూర్చున్న రారాజులాగా మీరు ఫీలవుతారు. గుడిగంటల వంటి సంతోషాల ప్రకంపనలు మిమ్మల్ని ఎప్పుడూ సందడిగా ఉండేలా చేస్తాయి.కలిసొచ్చేవి : రంగు : నీలిమందు రంగు; వారం : శని; అంకె : 9 మీనం (ఫిబ్రవరి 20–మార్చి 20) మీరు ఒకింత సున్నిత మనస్కులు. మీ మనసుకు తగ్గట్లుగానే ఒక అద్భుతమైన కలల ప్రపంచం మీ ముందు ఆవిష్కృతమైనట్లుగా ఈ ఏడాది అంతా అనిపిస్తుంటుంది. ఈ ఏడాది ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని సమస్యలు ముందు ఉన్నా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని తేలిగ్గానే అధిగమిస్తారు. కొన్ని పొరబాట్లు జరిగేందుకు ఆస్కారం ఉన్నప్పటికీ గత అనుభవాల కారణంగా మీరు వాటిని దొర్లనివ్వకుండా జాగ్రత్తపడతారు. మీ బాంధవ్యాల విషయంలో అపార్థాలకు తావివ్వకుండా మీ ఆలోచనలను పంచుకోడానికి సిద్ధంగా ఉండండి. దాంతో మీ ఆలోచనలను వారూ సానుకూలంగా తీసుకుంటారు. దాంతో ఎన్నో ఇక్కట్లు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులకు ఆస్కారం ఉంది. మీ ఆదాయానికీ, ఖర్చులకూ సమన్వయం ఉంది. అయితే కొత్త ఆస్తులు సమకూర్చుకోడానికి తగిన అవకాశాలను సైతం ఈ కొత్త ఏడాది మీ ముందుకు తీసుకువస్తుంది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు మరింత సానుకూలంగా ఉంటుంది. కలిసొచ్చేవి : రంగు : నీలిపచ్చ (సీ గ్రీన్); వారం : గురువారం; నంబరు : 4 టారో అనలిస్ట్, టారో ఇన్సియా -
వారఫలాలు (25-12-2016 to 31-12-2016)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. చేపట్టిన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీల్లో చికాకులు తొలగుతాయి. కొన్ని విషయాలలో కార్యోన్ముఖులై ముందడుగు వేస్తారు. ఉద్యోగయోగం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు అనుకూలం. నీలం, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. కళాకారులకు సన్మానయోగం. లేత ఎరుపు, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వారం మొదట్లో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం మందగిస్తుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. కొంత నిరుత్సాహంగా ఉన్నా క్రమేపీ అనుకూల పరిస్థితి ఉంటుంది. రాబడికి లోటు ఉండదు. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులు అందుతాయి. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. లేత పసుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన కొన్ని పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. ఒక సమస్య నేర్పుగా పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. ఎరుపు, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రాబడికి మించి ఖర్చులు ఎదురవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. అయినవారే సమస్యలు సృష్టించే పరిస్థితులు ఉండవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులో ఆనందంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు. నీలం, బంగారు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృపిక్తరం. కొన్ని రుణాలు తీరతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎరుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయులు,బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు శ్రమకు ఫలితం పొందుతారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. నలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుందరకాండ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అనుకున్న ఆదాయం సమకూరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఇంటిలో శుభకార్యాలు. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) వారం ప్రారంభంలో స్వల్ప అవాంతరాలు ఎదురైనా అనుకున్న పనులు పూర్తి చే స్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరి ఊరట చెందుతారు. కొన్ని సమస్యలను సమయస్ఫూర్తితో చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహ స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (25 డిసెంబర్ నుంచి 31 డిసెంబర్, 2016 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ వారమంతా అవిశ్రాంతంగా పని చేసినా, చురుగ్గా ఉంటే కానీ, పనులు తొందరగా పూర్తి కావని గ్రహించండి. పనిలో మీకు బృందసాయం లభిస్తుంది. మీ శక్తిసామర్థ్యాలకు మరింత పదును పెట్టుకుని, శ్రద్ధాసక్తులతో పనిని పూర్తి చేస్తారు. ప్రేమ ఫలిస్తుంది. విందు, విహార యాత్రలను ఆస్వాదిస్తారు. మనసు చెప్పినట్లు నడచుకోండి. కలిసి వచ్చే రంగు: మబ్బురంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కాలంతో పోటీగా పరుగెత్తుతూ పని చేసే మిమ్మల్ని అర్థం చేసుకోవడం మీ సహ^è రుల వల్ల కాదు. పాతబంధాలు బలపడతాయి. దానితోబాటు మీ స్నేహితులు, బంధుమిత్ర సన్నిహితుల జాబితాలో కొత్తపేర్లు చేరతాయి. ఏ సమస్య వచ్చినా, తగిన పరిష్కారం కనుగొనడంలో మీకు మీరే సాటి. ప్రకృతి ఉత్పాదనల వాడకంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కలిసివచ్చే రంగు:ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) భద్రతకు, విజయానికి ప్రాధాన్యత ఇస్తారు. ఊహించినంత ఆనందంగా, సాఫీగా రోజులు గడవడం లేదనిపిస్తుంటుంది. అయితే, ప్రణాళికాబద్ధంగా చేయడం వల్ల తగిన ఫలితం ఉంటుందని గ్రహించండి. సొంత వ్యాపారులకు ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని, లాభాలను కళ్లజూస్తారు. ప్రేమ కొత్త మలుపులు తీసుకోవచ్చు. మీ రుగ్మతలకు సంగీత చికిత్స ఉపకరిస్తుంది. కలిసివచ్చే రంగు: లేత వంకాయంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని ఒక కొత్తలోకంలో మిమ్మల్ని మీరు మరచిపోతారు. మీకున్న విజ్ఞానంతో, మీవైన కొత్త ఆలోచనలతో ఇతరులను బాగా ఆకట్టుకుంటారు. మీ బాధలు, పాతజ్ఞాపకాలను మరచిపోయేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తారు. అందరితోనూ శాంతి, సామరస్యాలతో మెలిగేందుకు ప్రయత్నిస్తారు. కుటుంబంతో కలసి దూరప్రయాణం చేస్తారు. ప్రకృతి ఒడిలో మీకు మంచి స్వాంతన లభిస్తుంది. కలిసి వచ్చే రంగు: వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇనుమడించిన ఉత్సాహంతో పనులు ప్రారంభిస్తారు. ప్రజా సంబంధాలను మరింత మెరుగు పరచుకోవడంలో బిజీగా ఉంటారు. ఆఫీసులో పనులు చురుగ్గా జరుగుతాయి. ఆందోళనలను పక్కనబెట్టి వృత్తిగతమైన మెలకువలతో పని చేయండి. సహోద్యోగులకు మీ ఆలోచనలు నచ్చకపోతే వినమని బలవంతపెట్టకండి. గొంతునొప్పి బాధించవచ్చు. కలిసి వచ్చే రంగు: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటాబయటా కూడా మంచి మార్పులు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. శాలరీ పెరగవచ్చు. మీ అంచనాలు ఫలిస్తాయి. రిస్క్ తీసుకుని చేసిన పనులనుంచి మంచి లాభాలు వస్తాయి. శక్తిసామర్థ్యాలతో ఉత్సాహంగా పనిచేస్తారు. అందంగా, యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు. ఒక శుభకార్యంలో బిజీగా ఉంటారు. కలిసి వచ్చే రంగు: లేత అరిటాకు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీ వాక్చాతుర్యం, ప్రజాసంబంధాల సాయంతో మీ జీవితాన్ని మలుపు తిప్పేంత ప్రభావవంతమైన పెద్ద ప్రాజెక్టును దక్కించుకుంటారు. చేపట్టిన ప్రతిపనిలోనూ విజయాన్ని సాధిస్తారు. వెన్ను, వీపు నొప్పి బాధించవచ్చు. ప్రేమలో విజయాన్ని అందుకుంటారు. మీరు అనుకున్న పనులను చేయడానికి ఇది తగిన సమయం. పనిలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురు కావచ్చు. కలిసి వచ్చే రంగు: గులాబీ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) మీ వ్యాపార భాగస్వాములు మీపట్ల పూర్తి సానుకూల ధోరణిలో ఉంటారు. పనిలో ఆందోళనలను, అవరోధాలను అధిగమిస్తారు. మీ ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు ఇందుకు ఉపకరిస్తాయి. మానసిక ఒత్తిడిని పోగొట్టుకునేందుకు నృత్యం, సంగీతం వంటి సంప్రదాయ కళలను అభ్యసిస్తారు. మీ పనిలో ఉత్పాదకతను సాధించేందుకు ఇది తగిన సమయం. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కలిసి వచ్చే రంగు: బూడిద రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త ఆదాయ వనరులను అన్వేషిస్తారు. అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. మీ కోరికలకూ, ఆదాయానికీ, తాహతుకూ సమన్వయాన్ని సాధించండి. తెగిపోయిన ఒక బంధాన్ని ప్రేమతో అతికే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం ఇప్పటికైనా చేయకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. కలిసి వచ్చే రంగు: నిండు ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సన్నిహితులు, బంధువులకు సరైన సమయంలో సరైన సలహాలనిచ్చి వారిని కాపాడతారు. వారి మనసును గెలుచుకుంటారు. మిమ్మల్ని చూసి చెవులు కొరుక్కునేవాళ్ల గురించి పట్టించుకోకండి. కరుణ, సానుభూతితో మెలగండి. మీరు చేపట్టిన ప్రాజెక్టులో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కొత్తదుస్తులు కొనుగోలు చేస్తారు. కలిసి వచ్చే రంగు: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ వారం మీకు చాలా అదృష్టకరంగా ఉంటుంది. విజయాల బాటలో నడుస్తారు. ఇతరుల ప్రేమను గెలుచుకుంటారు. మీ ఆధ్యాత్మికత, భక్తిభావం, పరోపకార గుణాలే మిమ్మల్ని కాపాడుతూ వున్నాయని గ్రహించండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే వాటి విషయంలో. మీకు ఇష్టమైన వారితోనూ, మిమ్మల్ని ఇష్టపడేవారితోనూ ఎక్కువ సమయం గడపండి. కలిసి వచ్చే రంగు: గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తిపరంగా విజయం సాధించాలంటే దానికి అనుగుణంగా నడుచుకుంటూ, కష్టపడి పని చేస్తేనే సాధ్యమని గ్రహించండి. ప్రేమించిన వారికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. పురాతన నగలు, వస్తువులు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తారు. అందరితో కలసి మెలసి ఉండటం ద్వారా సానుకూల భావనలను నింపుకోండి. వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత ఆకుపచ్చ టారో ఇన్సియా అనలిస్ట్ -
మీ కలలు నెరవేరతాయి...
జనవరి 23 నుంచి 29 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొంతకాలంగా మానసిక ఒత్తిడితో, అశాంతితో బాధపడుతున్నవారికి ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆలోచనలను ఇతరులతో పంచుకుంటారు. వారి ఆలోచనలను మీరు అవలంబిస్తారు. కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త అవకాశం మీ తలుపు తట్టబోతోంది. బహుశ ఈ అవకాశం మీ జీవితాన్ని మలుపు తిప్పేది కావచ్చు. మీ లక్కీ నంబర్ 21. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) విజయవంతంగా, అదృష్టకరంగా నడుస్తుందీవారం. మీ బంధాలు, బంధుత్వాలు, భావోద్వేగాలే మిమ్మల్ని శాసించడం లేదా మీ మనస్సును ప్రభావితం చేయడం జరగవచ్చు. కొన్ని విషయాలలో సంప్రదాయాన్ని పాటిస్తూ, పెద్దలు చెప్పిన శాస్త్రీయవిధానాలను అనుసరించడం మంచిది. ఇతరులకిచ్చిన వాగ్దానాల విషయంలో పునరాలోచన అవసరం. మీ వాగ్ధాటి, మాటలలోని చమత్కారం మీకు బాగా ఉపయోగపడతాయి. కలిసొచ్చే రంగు: పగడపు రంగు జెమిని (మే 21-జూన్ 21) మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వేచ్ఛ లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగం మాని, కొత్త ప్రదేశంలో కొత్త ఉద్యోగం కోసం వెతకాలనుకుంటారు. ట్రావెల్ బిజినెస్ కోసం ఎదురు చూస్తారు. ఉన్నట్టుండి మీలో ఏదో మార్పు వచ్చి, ఆధ్యాత్మిక విషయాలవైపు మొగ్గు చూపుతారు. జీవితాన్ని సంపూర్ణంగా, స్వేచ్ఛగా జీవించాలని తెలుసుకుంటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. పని మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: ముదురు ఊదా క్యాన్సర్(జూన్22-జూలై 23) ఈ వారమంతా మీకెంతో సామరస్యపూర్వకంగా గడుస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సంతృప్తి లభిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం వస్తుంది. ఎప్పటినుంచో ఉన్న ఒక ఆలోచనను అమలులో పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మీలాగే ఆలోచించే మరికొందరిని కలుపుకుని కొత్త వ్యాపారాన్ని లేదా ప్రాజెక్టును చేపడతారు. అయితే కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించాలని గుర్తుంచుకోండి. కలిసొచ్చే రంగు: లేత పసుప్పచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) జీవితంలో ముందుకు దూసుకెళతారు. ఒక కొత్త వ్యాపారాన్ని చేపట్టే ఆలోచన రావడమే కాదు, దానిని వెంటనే అమలు పరిచి, దాని విజయాన్ని, దానినుంచి మంచి లాభాలను అందుకుంటారు కూడా! దూరప్రాంతానికి ప్రయాణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారాన్ని పెంచుకోకండి. ఒక బంధం విషయంలో అభద్రతాభావాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ధైర్యం అంటే మీ మనసులో ఉన్నదాన్ని నిర్భయంగా చెప్పడం, అవతలివాళ్లు చెప్పేదానిని నిర్భయంగా వినడం కూడా అని విన్స్టన్ చర్చిల్ అన్నట్లుగా ప్రశాంతంగా, నిమ్మళమైన మనస్సుతో ఉండటం, మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయడం మంచి ఫలితాలనిస్తుంది. అయితే నిదానమే ప్రధానం అన్న సూక్తిని అన్ని విషయాల్లోనూ అమలు చేయాలనుకోవడం సబబు కాదు. ప్రేమ విషయంలో నిబ్బరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: నారింజ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) పని చేసీ చేసీ అలసిపోయిన శరీరం, మనస్సు సేదతీరవలసిన సమయమిది. తగినంత విశ్రాంతి లేకపోతే రీఛార్జ్ కాలేరు కదా! డబ్బు గడించడంలో మీ తెలివితేటలను, జ్ఞానాన్ని ఉపయోగించండి. నిష్ఠుర సత్యాల విషయంలో సంయమనాన్ని పాటించండి. మీరూ, మీ ప్రియతములు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.అవివాహితులకు వివాహసూచన ఉంది. సవాళ్లు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ధ్యానం ద్వారా సత్పలితాలను పొందవచ్చు. కలిసొచ్చే రంగు: పింక్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మన ఆలోచనలే మనం. మనం దేని గురించయితే తీవ్రంగా ఆలోచిస్తామో, చివరికి దానిని పొంది తీరుతాం అంటాడు బుద్ధభగవానుడు. అంటే ఎప్పుడూ ఏదో జరుగుతుందన్న నెగటివ్ ఆలోచనలు బుర్రలోకి రానివ్వకుండా సానుకూల ఆలోచనలతో ఉంటే అంతా మంచే జరుగుతుందని గ్రహించాలన్నమాట. ఒక కొత్త వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి ద్వారా లాభాన్ని పొందుతారు లేదా గతంలో పెట్టిన మదుపు నుంచి వడ్డీ లభిస్తుంది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఉల్లాసకరమైన సమయం.అనూహ్యమైన అభివృద్ది... అదీ అతివేగంగా జరుగుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఏదైనా వినోద, విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. మీరు ఏమి చేసినా, దానిని ఇతరులు కూడా అనుసరించేలా ఉంటుందీవారం. ఒక స్నేహితుని విషయంలో ఉదారంగా వ్యవహరించి, పెద్దమొత్తంలో డబ్బు సాయం చేస్తారు. ప్రేమ వ్యవహారం అకస్మాత్తుగా మొదలవుతుంది. అంతే వేగంగా ముగిసిపోతంంది కూడా! కలిసొచ్చే రంగు: అల్లం రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ వారం మీకు వినోదాత్మకంగా గడుస్తుంది. విందులు, వేడుకలు జరుగుతాయి. ఒక పార్టీకి ఆహ్వానం అందుతుంది. ఆఫీసులో ఒక పనివిషయంలో విభిన్నంగా వ్యవహరించడం వల్ల కొన్ని తీవ్రపరిణామాలను చవి చూడవలసి రావచ్చు. లాభాలు, ఆదాయాల గురించి కంగారు పడవద్దు. మెల్లగా అందుతాయి. రొమాన్స్ విషయంలో కొత్త పంథాను అనుసరిస్తారు. ఉల్లాసం, ఉత్సుకత పరవళ్లు తొక్కుతుంటాయి. కలిసొచ్చే రంగు: మెరిసే పసుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వ్యాపారం నుంచి మంచి లాభాలు అందుకుంటారు. కెరియర్ గురించి మీరు బంగారు కలలెన్నో కంటుండవచ్చు అయితే వాటిని కనీసం కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకపోతే ఎలా? మీ ఆలోచనలను వారితో చెబితే వారు కూడా మీకు సాయం చేస్తారు కదా! మీ చిరకాల కోరిక ఒకటి ఈవారం తీరుతుంది. ఇద్దరు పరిణత వయస్కుల మధ్య కొంత కాలంగా సాగుతున్న బంధం ఒకటి దృఢపడుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న గోధుమ రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పనికి సంబంధించిన సమాచారం లేదా సందేశం అందుతుంది. తేలికగా అయిపోతాయనుకున్న పనులకు కూడా ఎక్కువ శ్రమపడాల్సి రావడం, చిన్న పనికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనలు చేయాల్సి రావడం వంటివి ఉండవచ్చు. అయినా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలనివ్వవద్దు. మనసును దృఢం చేసుకోండి. అప్పుడప్పుడు ప్రకృతిలో గడుపుతూ ఉండండి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. కలలు నెరవేరతాయి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేస్తున్న ప్రతిపనిలోనూ ఉదాశీనతా భావం కలగవచ్చు. యంత్రనిర్మాణం, యంత్రపరికరాలతో చేసే వ్యాపారం వంటిది మీ వృత్తి అయినా, వాహనాలకి సంబంధించిన వ్యాపారమే అయినా కొద్దిగా శ్రద్ధని పాటించవలసిన వారం ఇది. శారీరకమైన ప్రమాదాలు జరక్కుండా భద్రతని గురించిన కొద్ది శ్రద్ధని వహించాలి. వాహనాలు నడపడంలో కూడా జాగ్రత్త అవసరం. ఇది ముందుజాగ్రత్త మంచినదే ఆప్తవాక్యమే. టారస్(ఏప్రిల్ 21-మే 20) శారీరకంగా మీరెంత పనిని చేయడానికైనా వెనుకాడరు. పైగా ఆ పనిలో విజయాన్ని సాధించాననే ఆనందంతో ఉండే మనస్తత్వం కూడా మీది. అయితే శారీరక శ్రమకి తట్టుకోగలిగినంత శక్తి మీకు మీ మనసులో లేని కారణంగా మానసికమైన ఒత్తిడికి గురై శ్రమపడతారు. ముఖ్యంగా మీ గొప్పదనాన్ని గుర్తించలేని, పైగా తప్పుబట్టాలనే ఈర్ష్యాదృష్టితో ఉన్న అధికారుల కారణంగా అలసటకి గురవుతారు. నిరుత్సాహ పడచ్చు. జెమిని (మే 21-జూన్ 21) ఎంతో ధనవంతులమనే అభిప్రాయంతో ఉన్న మీరు ఈ వారంలో మీ ఆదాయం వ్యయం నిల్వ గురించిన పరిశీలనని మీకు మీరే కావాలని చేసుకోవచ్చు. దాంతో కొంత అసంతృప్తికి గురవుతారు. మరింత సంపాదించాలనే అభిప్రాయానికి వస్తారు. విందువిలాసాలనీ, వ్యర్థవ్యయాలనీ ఆడంబరాలనీ దూరం చేసుకోవాలని నిర్ణయిస్తారు. ఒక మంచి అనుభవజ్ఞుణ్ణి మార్గదర్శకుడిగా ఎంచుకుంటారు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) కొత్తవైన ఆస్తులని కొనాలనే బలమైన ఉద్దేశ్యంతో మీ కుటుంబ సభ్యులని రుణం అడుగుతారు. చేసేది మంచిపనే అయినప్పటికీ, సామూహికంగా మీరు కొన్న భూముల్నీ ఇళ్లనీ... అన్ని ఆస్తులనీ అప్పు, వడ్డీ మొత్తం .. ఇలా వివరాలని అద్దంలో చూసుకుంటున్న తీరుగా కుటుంబ సభ్యులందరినీ సమావేశపరచి మరీ చెప్పండి. దాంతో ఇప్పటివరకూ దాగి ఉన్న అపోహలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచిది కూడా. లియో (జూలై 24-ఆగస్టు 23) స్పష్టమైన అవగాహనతో చెప్పదలచిన అంశాన్ని సూటిగా చెప్పగల మీరు లౌక్యంగానూ డొంక తిరుగుడుగానూ వ్యవహారాన్ని చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది మీ స్వభావానికే విరుద్ధం కాబట్టి నిర్భయంగా, నిర్మొహమాటంగా ప్రవర్తించండి. ఆది నిష్ఠురం ఎప్పుడూ మంచిది తప్ప చివరికొచ్చాక మీ వ్యవహార భాగస్వాములతో అంత్యనిష్ఠురం ఏమాత్రమూ సరైన పద్ధతీ కాదు ఉపద్రవమయం కూడా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ వ్యవహార ప్రణాళిక ముందునుండీ సరైన తీరులో ఉన్న కారణంగానూ దైవానుకూల్యం కారణంగానూ మీ పనులన్నీ అనుకున్నవి అనుకున్నట్లే పూర్తవుతాయి. స్వదేశీయులు విశేశానికి వెళ్లాలనే బలమైన ఆలోచనతో ఉన్నా కూడా విదేశాలకి వెళ్లలేరు. ఇదొక విధంగా మీకు అనుకూలమే తాత్కాలికంగా. ఉన్నంతోనే సర్దుకుని మనస్సంతోషంగా ఉండాలనే ధోరణి ప్రవేశించబోతోంది తొందరలోనే. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆలోచన ఒక తీరుగా, ఆచరణ మరొక తీరుగా- భయం ఒక దిశగా, ధైర్యం మరొక దిశగా- ఆశ ఒక పక్కగా, నిరాశ మరొక పక్కగా సాగుతూ ఔను- కాదు, జరుగుతుంది- జరగదు అనే ఈవిధమైన రెండుతీరుల భిన్న భిన్న దృక్పథాలతో జరుగుతుంది ఈవారం. నష్టం అవమానం గర్వభంగం... వంటివేమీ ఉండనే ఉండవు కానీ ఈ అన్నీ జరిగినంత ఆందోళన మాత్రం మనసుకి కలగవచ్చు జ్యోతిషం ప్రకారం. ఇప్పటికైనా ప్రతీకార బుద్ధిని మానాలి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రభుత్వం నుండి రావలసిన అనుమతులుగానీ, ఆజ్ఞలుగానీ సకాలంలో అందుతాయి. వారి సహకారం తప్పక లభిస్తుంది. మీ కుటుంబానికి- ముఖ్యంగా దాంపత్యానికి సంబంధించిన వ్యవహారం ఎటూ తేలకుండా అలాగే ఉంటుంది. న్యాయస్థానం మధ్యవర్తి రాయబారం పూజాపురస్కారాలూ... ఇవన్నీ ఆకాశానికి గురిపెట్టి కొట్టిన బాణాల్లా నిష్ర్పయోజనాలే కావచ్చు ఈ వారంలో మాత్రం. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకోకుండా ఓ శుభకార్యం కలిసి రావచ్చు. ఆ కారణంగా ఇంటినిండుగా బంధువులూ మిత్రులూ పోగుపడొచ్చు. మీ వ్యవహారశైలీ ధర్మబద్ధ విధంగా మాట్లాడే మీ తీరూ కారణంగా మీ నిజాయితీతనం గుర్తింపబడి సక్రమంగా ముగుస్తాయి పనులన్నీ. కొత్త వ్యాపారపు ఆలోచన వద్దు. ఉద్యోగిగా ఉ ండడానికే ప్రాధాన్యమీయండి. విజయం నా సొంతమనుకుంటూ అహకరించకండి. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) ఖర్చులో ఖర్చు అనుకుంటూ పుణ్యక్షేత్రాలకి ప్రయాణం కడతారు. ఉన్నంతలో ధ ర్మకార్యాలనుకుంటూ దానాలనీ ధర్మాలనీ చేస్తారు. పనిలో పని అన్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్న బంధువుల ఇళ్ల తలుపు తడతారు. మాటలో మాట కలుపుదామనుకుంటూ నూతన వ్యాపార ఆలోచనని తెలియజేస్తారు పదిమంది మధ్యలో. దాంతో మీ నూతన వ్యాపారపు గుట్టు బయట పడే అవకాశం వస్తుంది. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కష్టపడీ పడీ ఉద్యోగం కోసం ఎదురు చూసిన మీకు తొందర్లోనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. నిచ్చెన ఎక్కేటప్పుడు మొదటి మెట్టు మీదనే కాలు పెట్టి ఎక్కాలన్నట్టు జీతం తక్కువ అనే ఆలోచన మాని చేరడం ఎంతైనా మంచిది మీకు. సంతాన లాభం ఉంది. చదువుతున్న సంతానానికి తగినంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఉత్తమ విద్యావంతుల్ని చేయగలుగుతారు. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) ఎందుకో తెలియదుగానీ మనుష్యుల వల్ల కాకుండా పెంపుడు జంతువుల కారణంగానో పక్షుల కారణంగానో కొంత ఇబ్బంది పడే సూచనలు కన్పిస్తున్నాయి- తగుజాగ్రత్తలతో ఉండడం మంచిది కదా! మీ కుటంబంలోనికి చుట్టపు చూపుగా వచ్చిన బంధువు కారణంగా మనఃస్పర్ధ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన మేరకే ఉండండి. మరీ ఎక్కువా తక్కువా వద్దు. డా" మైలవరపు శ్రీనివాసరావు -
వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోవద్దు!
2016 జనవరి 9 నుంచి 15 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) దీర్ఘకాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన కనిపిస్తోంది. అదే మీరు అవివాహితులయినట్లయితే మీ ప్రేమబంధం కొద్దిపాటి సవాళ్లతో కూడుకుని ఉంటుంది. మీ ప్రేమను గెలిపించుకోవడానికి ఇంచుమించు ముళ్లబాట మీద నడవాల్సి వస్తుంది. కెరీర్‌కి, పనికి సంబంధించి కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది. కలిసొచ్చేరంగు: వైట్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) వృత్తిపరంగా స్థిరత్వం వస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది. దీర్థకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి వివాదమొకదానికి ఈ వారంలో సులభ పరిష్కారం లభించనుంది. వ్యాపారంలో లేదా పనిలో పెట్టుబడి పెట్టండి. మంచి రాబడి ఉంటుంది. కలిసొచ్చే రంగు: బ్లూ జెమిని (మే 21-జూన్ 21) పనిప్రదేశంలోనూ, ఇంటిలోనూ కొన్ని ప్రధానమైన మార్పులు సంభవించవచ్చు. వాటిప్రభావం మీపై గణనీయంగా పడుతుంది. అయితే భయపడాల్సిన పనిలేదు. మంచే జరుగుతుంది. ఇంటిని లేదా ఆఫీస్‌ని అందంగా అలంకరిస్తారు. అదృష్టం కలిసొస్తుంది. కొన్ని మార్మిక సంఘటనలు జరగవచ్చు. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. కలిసొచ్చే రంగు: రెడ్ క్యాన్సర్(జూన్22-జూలై 23) కుటుంబ సమస్యల పరిష్కారంలో దైవబలం తోడుగా ఉండటం వల్ల విజయం సాధిస్తారు. వృత్తిపరమైన సమస్యలను అధిగమిస్తారు. ప్రేమజీవితం రసకందాయంలో పడుతుంది. అంతా ఫలప్రదంగా నడుస్తుంది. ఒక సంఘటన నుంచి గుణపాఠాన్ని నేర్చుకుంటారు. మీలో మార్పు వస్తుంది. షాపింగ్‌తో బిజీగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ లియో (జూలై 24-ఆగస్టు 23) విస్తృతంగా ప్రయాణాలు ఉండవచ్చు.గతంలో ఆరంభించిన ఒకపనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవడంలో గందరగోళం నెలకొంటుంది. ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీ చుట్టూ చేరి మిమ్మల్ని ప్రభావితం చేయాలని చూసే వారు ఉన్నప్పటికీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఎల్లో. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) కెరీర్లో మీరనుకున్న విధంగా ముందుకు వెళ్తున్నందుకు సంతోషిస్తారు. మీ ప్రత్యర్థి కంపెనీ నుంచి మీకు ఉద్యోగావకాశం వస్తుంది దానిని అంత తేలిగ్గా కొట్టేయవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితం మలుపు తిరగవచ్చు. ఎక్సర్సైజ్లు, వాకింగ్ వంటివి చేస్తూ ఆరోగ్యంపై దృష్టి సారించవలసిన తరుణమిది. కలిసొచ్చే రంగు: గ్రీన్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరించి ఒక సమస్యను ఎదుర్కొనవలసి వస్తుంది. ఇది మీ సహనానికి పరీక్ష. ధైర్యంగా, నిబ్బరంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. పరిస్థితులను జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో ఎదుర్కొనండి. తొందరపాటు, అధైర్యంవద్దు. బేలతనం అసలేవద్దు. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఈ వారం ప్రమాద సూచన కనిపిస్తోంది. మీ మనస్తత్వం ప్రకారం సాహసాలు చేయడానికి ఇష్టపడరు కానీ, చేయడం వల్ల మీకు బాగానే కలిసొస్తుంది. ఆర్థికంగా కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ ఏమాత్రం కంగారుపడవద్దు. అంతా సజావుగానే గడుస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఏ విధంగా పావులు కదిపితే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. కానీ మీరు ఏదో జంకుతో వెనుకంజ వేస్తున్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లండి మంచే జరుగుతుంది. బిజినెస్‌పరంగా మీ అంచనాలు ఫలిస్తాయి. పైస్థాయి వారితో కొన్ని ఒప్పందాలు కుదురుతాయి. ప్రేమజీవితం పట్ల కొంచెం విసుగు జనించవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు నారింజ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అడుగులు ఆలస్యంగా పడుతున్నాయని బాధపడవద్దు. ఆచితూచి అడుగులు వేయడం లాభదాయకమే కానీ, నష్టం కలిగించదని గుర్తుంచుకోండి. అధ్యయనం మీద దృష్టి పెట్టండి. మనశ్శాంతిగా ఉండండి. గొంతెమ్మ కోరికలను వెనక్కు నెట్టి, మీ అంతర్గత శక్తిసామర్థ్యాలను వెలికి తీయండి. షాపింగ్‌లో బిజీగా ఉంటారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ధనం సమృద్ధిగా లభిస్తుంది.అనుకున్నవి జరగలేదని నిరుత్సాహపడకండి. దేనికైనా దాని టైమ్ వచ్చినప్పుడే అవుతుందని గుర్తుంచుకోండి. మీ ఇంటి ముంగిట లేదా పెరడులో తూర్పుదిశగా వెదురుమొక్కని నాటడం వల్ల కలిసొస్తుంది. మీ కుటుంబంలో కొత్త సభ్యులు జతకూడతారు. వారి రాక మీకెంతో ఆనందం కలిగిస్తుంది. కలిసొచ్చేరంగు: గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సినిమా హాలుకు వెళ్లినా, ఇరుగుపొరుగుతో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నా, కొత్త ఉద్యోగంలో చేరినా, అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీ ప్రియతముల రాక ఆనందం కలిగిస్తుంది. ఆఫీస్‌లో మీకిచ్చిన పనులను సమర్థంగా చేసి, శభాషనిపించుకుంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: ఎల్లో టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చెప్పలేనంత మానసిక ధైర్యం మీకొస్తుంది. ఏదో జరిగిపోతుందేమో అనే ఆందోళన పూర్తిగా తొలగిపోతుంది. కింది ఉద్యోగులూ పై అధికారులూ తోటి ఉద్యోగస్థులూ కూడా పూర్తి సహకారాన్నందిస్తారు. వ్యాపారస్థులకి తోటి భాగస్వాములు అండగా నిలబడతారు. ప్రభుత్వాధికారుల నుండి ఏ తీరు వేధింపులూ పరిశీలనలూ పరీక్షలూ లేక సుఖంగా గడుస్తుంది ఈ వారం. టారస్ (ఏప్రిల్ 21-మే 20) దంపతుల్లో వాదవివాదాలు పెరుగుతాయి. అయితే అన్యోన్యతా విషయంలో ఇబ్బంది తలెత్తదు. ఒక ముఖ్యమైన పనిని చేపట్టే విషయంలో ‘ఔను- కాదు’ అనే చర్చలే తప్ప పరస్పర నిందారోపణలు కావు కాబట్టి దాంపత్యానికి లోటు లేదు. సమస్య ఉండదు. ఈ సమస్యా నివారణ /పరిష్కార దిశలో మరొకరికి అవకాశాన్నివ్వకూడదని గ్రహించుకోవాలి. జెమిని (మే 21-జూన్ 21) అకస్మాత్తుగా వచ్చిన అనుకోని ధనంతో వస్తువులనీ ఆభరణాలనీ కొంటారు. వీలయినంత వరకూ కుటుంబాన్ని గురించిన గుంభనతో ఉండడం అంటే అన్నింటినీ వెల్లడించి చెప్పేయడం ప్రస్తుతానికి అంత మంచిది కాదు. చేస్తున్న ప్రతిపనినీ శ్రద్ధ పెట్టి చేయాల్సిందే తప్ప ఏదో యాంత్రికంగా చేయకూడదు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) తేలికగా అంటే మరొకరి అవసరం ఏమాత్రమూ లేని పనుల్ని పూర్తి చేసుకోండి. కష్టమైన పనుల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. శత్రువులు ప్రయత్నిస్తారు కాని మిమ్మల్ని ఏమీ చేయలేరు. మీ బాధ్యతలకి తోడుగా మరిన్ని /బాధ్యతగాని చేపట్టవలసి వస్తే మొగమాటం లేకుండా చేయలేననే మీ అశక్తతని నిదానంగా చెప్పండి. లియో (జూలై 24-ఆగస్టు 23) చేయవలసిన పనుల్లో ఏది మీతోనే పూర్తి చేసుకోగల అవకాశముందో ఆ పనుల్ని వాయిదా వేసుకోకుండా ముగించుకోండి. ఇతరుల సహకారం ప్రమేయమున్న పనుల్ని నెత్తిమీద పెట్టుకోకండి ఈ వారంలో. మీ ఉద్యోగానికో వృత్తికో వ్యాపారానికో ఓ అదనపు బాధ్యత అప్పగించే పరిస్థితులు రావచ్చు. సిద్ధపడి ఉండండి మానసికంగా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కింది ఉద్యోగుల అభినందనలూ, మీపై అధికారుల ప్రశంసలూ మీకెంతో ఆనందాన్ని కల్గిస్తాయి. మీ గురించి మీరు ఆలోచించుకోండి తప్ప మీ గొప్పదనాన్ని చూపించుకోవడం కోసం మరెవరి విషయాన్నో తలకెత్తుకుని శ్రమపడకండి. మీ గురించి మీరు మర్తిగా పట్టించుకోవలసి వారం ఇది అనుకోండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) వడ్డించిన విస్తరీ, వడ్డించేందుకు వ్యక్తీ, చక్కటి భోజనశాలా... ఇలా అన్నీ ఉన్నా కూడా కాలదన్నుకుంటూ ఏదో దురదృష్టం మిమ్మల్ని వెన్నాడుతున్నట్లుగా భావించుతారు మీరు. మీ వ్యక్తిగత జీవితాన్ని గురించి మీకంటే రెండురెట్ల వయసుసున్న అనుభవజ్ఞుల్ని ముఖ్యంగా పక్షపాత బుద్ధి లేకుండా ధర్మాన్ని చెప్పేవారిని సంప్రదించండి. మీ సమస్య మొత్తం తీరిపోతుంది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీకు అన్యాయం జరుగుతోందన్న విషయం సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత సత్యం. ధర్మానికీ న్యాయానికీ కట్టుబడి ఉన్న మీకు జరిగిన అన్యాయానికి బెదిరిపోకండి. కత్తులూ కటారులూ కాకుండా ధర్మఖడ్గంతోనే పోరాడుతూనే ఉండండి. పట్టుదల విడవకండి. శత్రువులు దిగొస్తారు. శరీర శ్రమకీ మానసికమైన ఒత్తిడికీ సిద్ధపడి పోరాడండి. విజయం మీదే. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) విందులతో వినోదాలతో చక్కగా గడుస్తుంది ఈ వారం. దూరపు ప్రయాణాలు చేయడంగానీ, స్థలాన్ని మార్చడం గానీ జరగొచ్చు. వద్దని అనుకున్నా ఎంతగా వారించినా మీ కుటుంబంలో ఇతరుల జోక్యం తప్పనిసరి కావచ్చు. దానికి కారణం మీరు లోగడ వారికిచ్చిన చనువే. మీ కుటుంబం సుఖంగా ఉండాలంటే మౌనంగా ముభావంగా ఉండడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీరు మీదైన వృత్తి కాకుండా మీలో దాగిన ఇతర రంగాలలోని ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోగల అవకాశం వస్తుంది. తద్వారా మీ కీర్తిప్రతిష్ఠలు మరింతగా పెరిగే సూచన కనిపిస్తోంది. మీరు చెప్పదలచిన ఏ మాటనైనా పరుష భాషతోనూ కఠిన వైఖరితోనూ చెప్పడం వల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది. మాట మెత్తగా, భావం గట్టిగా ఉండాలని గమనించండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అన్నదమ్ముల మధ్యా అప్పచెల్లెళ్ల మధ్యా మంచి సహకారం పెంపొందుతుంది. వృత్తిలో అనుకూల పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంలో చక్కటి అనుకూలమైన ఫలితాలు కన్పిస్తాయి. పోటీ పరీక్షలకి వెళ్లాలనీ ఉద్యోగంలో అలాగే వ్యాపారం లేదా వృత్తిలో మరింత అభివృద్ధి సాధించాలనీ ఓ ఆలోచన వస్తుంది. దాన్ని అమలు చేయడం మంచిది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) అన్ని రంగాల్లోనూ అననుకూలత కన్పిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యంలో నష్టాలు కన్పించవచ్చు. ఉద్యోగంలో తోటివారితో అభిప్రాయభేదాలూ మనఃస్పర్థలూ కన్పించవచ్చు. అనుకోకుండా బంధువులకి చెందిన ఓ స్థిరమైన ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. కృషి చేసి సాధించుకోండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి
డిసెంబర్ 19 నుంచి 25 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ అంతర్వాణి శక్తి, దానితోబాటే మీరు చెప్పే జోస్యమూ ఫలిస్తూ వస్తుంది. అంతర్వాణిని జాగ్రత్తగా ఆలకించి, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం మీకెంతో ఉపకరిస్తుంది. వాగ్దానాలను నెరవేర్చడంలో అలక్ష్యం చేయవద్దు. అలాగే మీకు ఇతరులు చేసిన వాగ్దానాలు కూడా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) అదృష్టం వరిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యక్తిగతమైన విషయాలు, వృత్తిసంబంధమైన విషయాలలో మీరు అనుకున్న విధానంలోనే ముందుకెళ్లడం మంచిది. లీగల్ డాక్యుమెంట్ లేదా కాంట్రాక్ట్‌పై చేసే ఒక సంతకం మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవితం మీకు అనుకూలమైన మలుపు తిరుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ జెమిని (మే 21-జూన్ 21) మీరు ఏమైతే కోరుకుంటున్నారో, దేని గురించయితే కలలు కంటున్నారో అది ఈ వారం తప్పక నెరవేరుతుంది. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మనోవ్యాధి లేదా శారీరక రుగ్మత తొలగిపోయి, జీవితం ఎంతో సంతోషంగా, ఆనందకరంగా సాగుతుంది. బంధువులు లేదా హితుల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల నుంచి బయట పడతారు. మీరు అనుకున్న పనులు, సాధించాలనుకున్న లక్ష్యాలు ఎవరి ద్వారా అవుతాయనుకుంటున్నారో వారిద్వారా ఆత్మవిశ్వాసంతో చేయించుకుంటారు. తండ్రి సూచనలు, సహకారం, అండదండలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) ఇతరులతో శాంతిని, సామరస్యాన్ని, సత్సంబంధాలను కోరుకుంటున్నట్లయితే ఈ వారం అవి మీకు సంపూర్ణంగా లభిస్తాయి. జీవితం తిరిగి మీ చెప్పుచేత ల్లోకొస్తుంది. ఆర్థిక ఒడుదొడుకుల నుంచి బయటపడతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రశాంతంగా, సహనంగా ఉండవలసిన సమయమిది. కలిసొచ్చే రంగు:వంకాయరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పనిపరంగా, కెరీర్‌పరంగా కొద్దిపాటి సందిగ్ధపరిస్థితులు నెలకొనవచ్చు. వాటిమూలంగా మీకు నిస్సత్తువగా అనిపిస్తుంది. అయితే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త శక్తిని పుంజుకుని సంసిద్ధంగా ఉంటారు. ప్రేమ విషయంలో సున్నితమైన పరిస్థితి ఎదురవుతుంది. మనసు దృఢం చేసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) నిశ్చితార్థం కుదురుతుంది లేదా భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. జరిగిన పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలో ఒక శుభకార్యం జరగడమో లేదా విందు వినోదాలలో పాల్గొనడమో జరగవచ్చు. అయితే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడుచుకోవడాన్ని మరచిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఊదారంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా చాలా అదృష్టకరంగా గడుస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రేమ లేదా వైవాహిక బంధం బలంగా మారుతుంది. రొమాన్స్‌లో పడతారు. జరుగుతున్న వాటిని అడ్డుకోవాలని చూడొద్దు. జీవితమనే ప్రవాహం ఎటు తీసుకెళితే అటు కొట్టుకెళ్లడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వ్యాపారపరంగా కొత్త అవకాశం రావచ్చు. కాదనకుండా చేస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొత్త పనిని చేపట్టడానికిది అనుకూలమైన సమయం. ప్రకృతిలో మమేకమై హాయిగా, విశ్రాంతిగా గడుపుతారు. లేనిపోని భయాలన్నింటినీ అవతలకు నెట్టి జీవితాన్ని సంతోషంగా అనుభవించడం నేర్చుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం కొంచెం అసహనంగా, చికాకుగా అనిపిస్తుంది. అవిశ్రాంతంగా గ డుపుతారు. కొన్ని విషయాలలో మార్పుచేర్పులు అవసరం కావచ్చు. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు మలుచుకోవలసిన బాధ్యత మీదే. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: నీలం పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీకొచ్చిన పనులు, నిపుణతలను మరొకరితో పంచుకుని, వారికి వచ్చిన వాటిని మీరు తెలుసుకోవడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ నైపుణ్యం పెరుగుతుంది. రావలసిన డబ్బందుతుంది. ఇంటి ఆవరణలో మొక్కలు నాటండి, ఇంటిని పచ్చదనంతో నింపండి. అదృష్టం కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ప్రయోజనాత్మకమైన ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణాల కాలంలో వస్తువుల భద్రత అతి ముఖ్యమని గ్రహించండి ఈ వారం. దాంతోపాటు వాహన ప్రయాణాన్ని మీరే గనక నడుపుతూ చేస్తున్న పక్షంలో నిదానించి ప్రయాణించండి. ప్రమాదమేమీ లేదుగానీ తగుమాత్రపు జాగ్రత తప్పనిసరి అని గ్రహించండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) వ్యవసాయదారులై న పక్షంలో అనాలోచితంగా పొలాలని తెగనమ్మకండి. ఇలా చేతికి ధనం వచ్చిన కారణంగా తాత్కాలికంగా కొత్త చిక్కులొచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు చదువుకునే దశలోనే ఉన్నట్లయితే మీరు వారి పక్కనే కూర్చుని మీకు మీరు చదువుకుంటూ వాళ్లని చదువుకునేలా చేయండి. జెమిని (మే 21-జూన్ 21) ఇష్టం లేని పని అయినప్పటికీ కుటుంబానికి శ్రేయోదాయకం కాబట్టి ఆ పనిలో భాగస్వాములు కావడం మంచిది. వృత్తి లేదా ఉద్యోగమే కాదు; కుటుంబంతో గడపడమూ అత్యవసరమని భావించండి. పొరపచ్చాలు పెద్దవి కాకుండా జాగ్రత్తపడండి. సంతానం విషయంలో ఎక్కువమొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. మాటలో తేలిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధనం అందుతుంది. ఎంతో శ్రమతో సంపాదించిన ధనం తిరిగి మీకు చెందడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. దానధర్మాలపట్ల, తీర్థయాత్రలకి వెళ్లాలనే ఊహాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఇతరుల్ని నిందించకండి పదిమందిలో. అది చిలవలు పలవలై మిమ్మల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. లియో (జూలై 24-ఆగస్టు 23) ధైర్యసాహసాలే పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారంలో మీకు మంచి లాభం చేకూరే అవకాశముంది. ఇతరులకి ఏదైనా వాగ్దానాన్ని చేసి ఉన్నట్లయితే, వెంటనే దానిని నెరవేర్చండి. లేని పక్షంలో ఆ విషయాన్ని చెప్పెయ్యండి తప్ప నెత్తిమీదికి తెచ్చుకోకండి. ఇతరుల వస్తువుల్నీ సొమ్ముల్నీ మీ దగ్గర భద్రపరచలేనని చెప్పండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అవసరాలు పోను అనూహ్యంగా కొంత ధనం చేతికందుతుంది. ఆ ధనానికి అప్పు చేసి మరీ మరికొద్ది ధనాన్ని చేర్చి ఇళ్లస్థలాన్ని లేదా పొలాన్ని కొనాలనుకుంటారు. అయితే తొందరపడి ఎక్కువ మొత్తం వెచ్చించకండి. వ్యవహారాన్ని తెగ్గొట్టుకోకుండా జాగ్రత్తగా బేరసారాలు చేసి, విజయాన్ని సాధించండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆర్థికంగా కొద్దిగా బలహీనంగా ఉండచ్చు. ఇంటికి బంధువుల రాకపోకలు హెచ్చుగా ఉన్న కారణంగా విసుగ్గా, చికాకుగా అన్పించవచ్చు. జీవితంలో పట్టుదల, ప్రతీకారం, విద్వేషం... ఇవే మన ధ్యేయాలైన పక్షంలో మనశ్శాంతి అనే మాటే మనకి గగనకుసుమమౌతుందని భావించాలి. పెద్దల మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరమని గ్రహించండి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) దాంపత్య జీవితమనేది వాణిజ్యపు ఒప్పందంలా ఈ రాశిలోని కొందరి విషయంలో ఉండొచ్చు. అదే తీరుగా సంతానానికి తమ ఇల్లు ఓ విహారయాత్రాశాల లాగానో వినోదమందిరంగానో అన్పించవచ్చు. దాపరికం లేకుండా ఇంటివిషయాలని వివరించి చెప్పి, ఓ తీరు నమ్మకాన్ని కుటుంబ సభ్యులకి కల్గించడం ఈ వారంలో అవసరం. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరేమనుకున్నా నాకేమిటనే దృక్పథం పెరిగిపోతుంది. అయితే ఎదుటివారు తమ ఓటమిని అంగీకరించిన పక్షంలో వారికి దాసులయిపోయే వీరి స్వభావం వల్ల వారికి కీలుబొమ్మలుగా మారిపోతారు ఈవారంలో. ఇతరుల దృష్టిలో మీరు తండ్రిమాట వింటారనే పేరుంటుంది కానీ అది కేవలం పేరుకి మాత్రమే అని గ్రహించాలి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కుటుంబాన్ని మీ అదుపులో పెట్టుకుంటారు. ఇతరులకి సహాయపడటం మంచిదేకాని, వారికి సహాయపడే క్రమంలో ఇంటిని మరచిపోవ ద్దు. అన్నింటా మిమ్మల్ని విజయం వరించే ఈ వారంలో మీరు సంయమనంతో వ్యవహరించని పక్షంలో వ్యయమనేది మీ అంచనాలు మించవచ్చు. అప్పులు వద్దు ఈ వారంలో. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కలిసొచ్చే వారం ఇది మీకు. మీ బంధుజనంతో విందువినోదాలతో కాలక్షేపం చేస్తారు. మీ ఇంటి విషయాలని గూర్చిన ఆసక్తికర చ ర్చ జరిగి దానిలో కొత్త నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధి పథాన సాగుతారు. దాంతోపాటు ఇందరు అండగా ఉన్నార నే మనోధైర్యాన్ని పొందుతారు. చర్మవ్యాధి విషయంలో నిర్లక్ష్యం తగదు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వ్యక్తిగత కీర్తిని గురించి మీరు ఆలోచించరు. చిన్న అవమానం జరిగినా పట్టించుకోరు ఈ వారంలో. అనుక్షణం మీ గురించి మీరు పట్టించుకునే లక్షణం ఉన్నకారణంగా కష్టాలు దాదాపు దరిచేరవు. అది సంతోషించదగ్గ పరిణామం. ఆధ్యాత్మిక బోధల్ని వింటూ మంచి రచనల్ని చదివే అలవాటున్న మీకు తాత్కాలికంగా వచ్చిన కష్టమనేది పెద్దగా బాధించదు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
రుణానికీ... కలహానికీ వెళ్లకండి
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వస్తు వాహనాలను. వివిధ రకాల గృహోపకరణాలను కొనుక్కుంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కళాత్మకంగా పని చేస్తారు. చేతినిండా డబ్బు వస్తుంది. హాయిగా, సంతోషంగా ఉంటారు. మీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ టారస్ (ఏప్రిల్ 21-మే 20) చాలాకాలంగా మిమ్మల్ని తికమక పెడుతూ, భయాందోళనలకు గురి చేస్తున్న వివిధ రకాల అంశాలపై మీకు ఒక స్పష్టత వస్తుంది. చేసిన పనికి ఫలితాన్ని తెలుసుకోవాలన్న ఆతృతలో ఉంటారు. ఎందుకంటే ఆ పనిని సక్రమంగా చేశానో లేదోనన్న అనుమానం మిమ్మల్ని పీడిస్తుంటుంది కాబట్టి. కలిసొచ్చే రంగు: మీగడ రంగు జెమిని (మే 21-జూన్ 21) విజయం మీ వెంటే ఉందని మీకు తెలుస్తోంది కాని, మీకు అందీ అందకుండా మిమ్మల్ని ఊరిస్తూ, మీ సహనానికి పరీక్ష పెడుతుంటుంది. మీ తండ్రి, భార్య లేదా భర్త, ఇతర కుటుంబ సభ్యులనుంచి మీరు ఎదురు చూస్తున్న సహకారం అందుతుంది. అయితే జీవితాన్ని యాంత్రికం చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం క్యాన్సర్(జూన్22-జూలై 23) జీవితంలో లేదా కుటుంబంలో ఒక విధమైన ప్రశాంతతను పొందుతారు. కెరీర్ పరంగా స్థిమిత పడ్డానన్న భావన మీకు ఊరటనిస్తుంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ప్రశాంతంగానే ఎదుర్కోగలిగే మార్గాన్ని కనిపెడతారు. అయితే జీవితమనేది అనుభవించడానికి కూడా అనేదాన్ని గ్రహించండి. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) ప్రేమకోసం... జీవితంలో మీరు పొందాలనుకున్న ప్రేమకోసం తీవ్ర అన్వేషణ సాగిస్తారు. ఒకవేళ మీరు ఎదురు చూడకపోయినా, మీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నానని ఒకరు చె ప్పడం మీకు ఆశ్చర్యాన్నిస్తుంది. ఏది ఏమైనా ఇది మీ జీవితంపై ప్రభావం చూపే పరిణామం అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఏది మంచిదో తెలుసుకోలేని తికమకలో ఉన్నారు మీరు. ఈ సమయంలో ఎవరైనా మీకు సలహా ఇవ్వడం లేదా మార్గదర్శనం చేస్తే బాగుండునని ఎదురు చూస్తుంటారు. అయితే అందరికీ అన్ని విషయాలూ తెలుసునని భ్రమపడవద్దు. మీ మనసులోని మాటను మీరే చెబుతారని మీ ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. కలిసొచ్చే రంగు: నారింజ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ప్రస్తుతం మీకు ఎదురవుతున్న రకరకాల పరిణామాల దృష్ట్యా మీరు నిర్మించుకున్న కలల సౌధం కూలిపోతుందేమోనని భయపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియని గందరగోళంలో పడతారు. అయితే మీ అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: నలుపు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. ఇప్పటి నుంచి అదృష్టకరమైన సమయంగా భావించవచ్చు. జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రేమ/ ఉద్యోగం/ కెరీర్/ ప్రయాణం కోసం ఎదురు చూస్తుంటే గనక ఆలస్యం చేయవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) మీకు రావలసిన దానికోసం లేదా జరగవలసిన దానికోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. విజయమనేది మనం చేసినదాన్ని బట్టి కొంత, అదృష్టాన్ని బట్టి కొంత ఉంటుందని గ్రహించండి. అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దు. సాయం చేస్తానన్న వారిపై ఎక్కువ భారాన్ని వేయవద్దు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికిది మంచి సమయం. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. జీవితమనే నౌక ఎటు తిప్పితే అటు తిరుగుతూ, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి చేరడమే జీవితమంటే! మీ భాగస్వామికి మీ సహాయ సహకారాలు అవసరమని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) ఒంటరిగా గడపడానికి ఇది తగిన సమయం. ఒంటరితనంలోని ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవించండి. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా, శారీరకంగా బాగుండకపోతే నిర్లక్ష్యం చేయవద్దు. కలిసొచ్చే రంగు: పాచిరంగు పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) మరీ యాంత్రికంగా తయారు కావద్దు. జరిగేదేదో జరగనివ్వండి, ఆందోళన పడకండి. మీ మనసును కలుషితం చేయడానికి, మీ భావోద్వేగాలను దెబ్బతీయడానికి ఇతరులకు అవకాశం ఇస్తున్నారని తెలుసుకోండి. వారికి ఆ అవకాశం ఇచ్చి, తిరిగి వారిని నిందించడం సరికాదు. కలిసొచ్చేరంగు: వంకాయరంగు టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) గ్రహ ప్రభావం కారణంగా బంధుమిత్రులతోనూ, సహోద్యోగులతోనూ అకాల శత్రుత్వం కలిగే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండడం, నిష్కారణంగా నింద వస్తే అనుభవించడమే తప్ప, ఎదురు తిరిగి సాధించుకోగల కాలం కాదిది. అలాగని మరీ మౌనంగా ఉండమని భావం కాదు. ‘కరవద్దు గాని బుస్సుమనకుండా కూడా ఉండొద్దు’ అని దీనర్థం. టారస్ (ఏప్రిల్ 21-మే 20) మీరు చేస్తున్న ఉద్యోగంలో గాని వ్యాపారంలోగాని మీకు ఓ తీరు విసుగూ అసంతృప్తీ పుట్టే కాలం కావచ్చు. అంతమాత్రాన దీన్ని విడిచేయవద్దు. మరో చోటికి ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఇంతకంటే జటిలమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే సంతోషాన్నీ పైవాళ్ల విశ్వాసాన్నీ పొందడం మంచిది ప్రస్తుతం. జెమిని (మే 21-జూన్ 21) మొహమాటం... బద్ధకం... కొత్త ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుందో అనే సంకోచం వల్ల- కొత్త ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి కదలరు. కుటుంబానికి ఆప్తులయిన ఎవరో ఒకరు మీ స్థిరాస్తి మీద ఓ కన్నేసి ఉంచిన కారణంగా పూర్తి దురుద్దేశ్యంతో కొత్త ఆలోచనని రేకెత్తింప జేస్తారు. గమనించండి. జాగ్రత్తపడండి. క్యాన్సర్(జూన్22-జూలై 23) లౌకిక ప్రయత్నాల వల్ల ఫలితం లేదని గ్రహించి, వయసుల తారతమ్యాన్ని విడిచి పూజాపురస్కారాల ధోరణికి వచ్చేస్తారు. దంపతుల్లో ఒకరు ఉద్యోగరీత్యా లేదా మరే కారణంగా గాని ఒక పదిరోజుల పాటు వేరే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం, మనుషుల ప్రభావం లేకుండా చూసుకోగలగాలి. విందు వినోదాలతో రోజులు గడుపుతారు. లియో(జూలై 24-ఆగస్టు 23) భార్యాభర్తలు వినోద యాత్ర లేదా తీర్థయాత్ర చేస్తారు. కుటుంబంలోని ఐకమత్యంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. సంతానం అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని వింటారు. ఉద్యోగంలో ఉన్నతిని లేదా వేతనాభివృద్ధిని పొందుతారు. వచ్చే పోయే బంధుమిత్రులకి మన ఇంటి విషయాలని చె ప్పాల్సిన అవసరం లేదనే యథార్థాన్ని గుర్తు చేసుకుంటారు. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఓ పద్ధతీ క్రమం లేకుండా సొమ్ము అనవసరంగా ఖర్చయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ముందు జాగ్రత్త అవసరం. పొరపాటున కూడా ఈ మాసంలో రుణానికీ అలాగే కలహానికీ వెళ్లకండి. అది దీర్ఘకాల వ్యాధిలా మారే అవకాశముంది. మీ ఉద్యోగంలో మరో శాఖకి లేదా మరో ప్రదేశంలోని కార్యాలయానికో బదిలీ అవుతారు. అధికారులతో విరోధించకండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీరు చేసే ప్రయత్నాలన్నీ పైకి విజయవంతమైనట్లు మీరు భావించవచ్చేమో గాని అవన్నీ కరిమింగిన వెలగపండు చందమే అని గ్రహించండి. ప్రస్తుత దశ పెద్దగా యోగించేది కానందువల్ల విరోధానికీ కలహాలకీ సంబంధించిన ప్రయత్నాలు చేసినా అపకీర్తీ ఆందోళనా తప్ప ప్రయోజనం ఉండదు. పట్టుదలని విడిస్తే మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) నిష్కారణంగా ఇబ్బందికి గురై దాదాపు ఏడాదిన్నర నుండీ అనుభవిస్తున్న మనోవేదన నుంచి కొంత సాంత్వన కలుగుతుంది. మీ నిజాయితీ, ధైర్యం, వీటికి తోడుగా మీ దైవారాధన శక్తి మీకు అండగా నిలుస్తాయి. ఎన్ని ఇబ్బందులున్నా, గురుగ్రహం అండగా ఉన్న కారణంగా ఉద్యోగాన్ని సక్రమంగా చే స్తున్నారు, చేస్తారు కూడా. దిగులు పడకండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) చేసిన- చేపట్టిన పనుల్లో విజయావకాశాలు మెండు. కుటుంబ, కార్యాలయ పనుల్లో మీ ప్రతిభని మీరు చాటుకున్నా, ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధని చూపించడం లేదని గ్రహించండి. మీ జీతానికి మించిన శ్రమపడే మీరు మీ జీవితారోగ్యాన్ని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇబ్బంది పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త! క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాన్ని పెంచే దిశగా ఆలోచించడంలో కొద్ది జాప్యం జరుగుతూ ఉండొచ్చు. మీకు సహాయకులుగానూ, భాగస్వాములుగానూ ఉన్న ఈ సిబ్బందిలో ఏ ఒక్కరు మిమ్మల్ని వ్యతిరేకించినా నడుపుకోగల సమర్థతని సంపాదించుకోవడానికి తీవ్ర కృషి అవసరం. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కొనుగోళ్లూ అమ్మకాలూ అనేవి ఆస్తి విషయాల్లో సర్వసాధారణం. మనవాళ్లే కదా అనే భరోసాతో మీరు కొన్ని ముఖ్యపత్రాల విషయంలో అశ్రద్ధని చేయవద్దు. వ్యవహారంలో బంధుత్వానికి చోటు లేదు. శరీరానికి చర్మవ్యాధిగాని, ఇబ్బంది పెట్టే జలుబు గాని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త మంచిది. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) మీకు ప్రస్తుతం జరుగుతున్నది శిక్షణ తరగతి వంటి పరిస్థితి. ఏ కుటుంబ సభ్యుల ఉద్దేశ్యం ఎటువంటిదో, ఏ మిత్రులు దేన్ని మీ నుండి ఆశిస్తున్నారో, మీరు ఏ దిశగా ప్రయాణించాలని వీరంతా ఓ ప్రణాళికని వేశారో అర్థం చేసుకోండి. ఈ అందరినీ గమనించుకోండి తప్ప, ఎవరినీ వేలెత్తి చూపే గ్రహ అనుకూల దశ ప్రస్తుతానికి మీకు లేదని గ్రహించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు