రుణానికీ... కలహానికీ వెళ్లకండి | From November 28 to December 3 | Sakshi
Sakshi News home page

రుణానికీ... కలహానికీ వెళ్లకండి

Published Fri, Nov 27 2015 10:34 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 PM

రుణానికీ... కలహానికీ వెళ్లకండి

రుణానికీ... కలహానికీ వెళ్లకండి

నవంబర్ 28 నుంచి డిసెంబర్ 3 వరకు
టారో బాణి

ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఈ వారం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. వస్తు వాహనాలను. వివిధ రకాల గృహోపకరణాలను కొనుక్కుంటారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కళాత్మకంగా పని చేస్తారు. చేతినిండా డబ్బు వస్తుంది. హాయిగా, సంతోషంగా ఉంటారు. మీ అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకోండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
చాలాకాలంగా మిమ్మల్ని తికమక పెడుతూ, భయాందోళనలకు గురి చేస్తున్న వివిధ రకాల అంశాలపై మీకు ఒక స్పష్టత వస్తుంది. చేసిన పనికి ఫలితాన్ని తెలుసుకోవాలన్న ఆతృతలో ఉంటారు. ఎందుకంటే ఆ పనిని సక్రమంగా చేశానో లేదోనన్న అనుమానం మిమ్మల్ని పీడిస్తుంటుంది కాబట్టి. కలిసొచ్చే రంగు: మీగడ రంగు
 
జెమిని (మే 21-జూన్ 21)

విజయం మీ వెంటే ఉందని మీకు తెలుస్తోంది కాని, మీకు అందీ అందకుండా మిమ్మల్ని ఊరిస్తూ, మీ సహనానికి పరీక్ష పెడుతుంటుంది. మీ తండ్రి, భార్య లేదా భర్త, ఇతర కుటుంబ సభ్యులనుంచి మీరు ఎదురు చూస్తున్న సహకారం అందుతుంది. అయితే జీవితాన్ని యాంత్రికం చేసుకోవద్దు. కలిసొచ్చే రంగు: నీలం
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)
జీవితంలో లేదా కుటుంబంలో ఒక విధమైన ప్రశాంతతను పొందుతారు. కెరీర్ పరంగా స్థిమిత పడ్డానన్న భావన మీకు ఊరటనిస్తుంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా ప్రశాంతంగానే ఎదుర్కోగలిగే మార్గాన్ని కనిపెడతారు. అయితే జీవితమనేది అనుభవించడానికి కూడా అనేదాన్ని గ్రహించండి. కలిసొచ్చే రంగు: నారింజ
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

ప్రేమకోసం... జీవితంలో మీరు పొందాలనుకున్న ప్రేమకోసం తీవ్ర అన్వేషణ సాగిస్తారు. ఒకవేళ మీరు ఎదురు చూడకపోయినా, మీ ప్రేమకోసం ఎదురు చూస్తున్నానని ఒకరు చె ప్పడం మీకు ఆశ్చర్యాన్నిస్తుంది. ఏది ఏమైనా ఇది మీ జీవితంపై ప్రభావం చూపే పరిణామం అని గ్రహించండి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఏది మంచిదో తెలుసుకోలేని తికమకలో ఉన్నారు మీరు. ఈ సమయంలో ఎవరైనా మీకు సలహా ఇవ్వడం లేదా మార్గదర్శనం చేస్తే బాగుండునని ఎదురు చూస్తుంటారు. అయితే అందరికీ అన్ని విషయాలూ తెలుసునని భ్రమపడవద్దు. మీ మనసులోని మాటను మీరే చెబుతారని మీ ప్రేమికులు ఎదురు చూస్తుంటారు. కలిసొచ్చే రంగు: నారింజ
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

ప్రస్తుతం మీకు ఎదురవుతున్న రకరకాల పరిణామాల దృష్ట్యా మీరు నిర్మించుకున్న కలల సౌధం కూలిపోతుందేమోనని భయపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియని గందరగోళంలో పడతారు. అయితే మీ అంతరాత్మ చెప్పిన విధంగా నడుచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: నలుపు
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. చాలా కాలంగా మీరు అనుభవిస్తున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడతారు. ఇప్పటి నుంచి అదృష్టకరమైన సమయంగా భావించవచ్చు. జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రేమ/ ఉద్యోగం/ కెరీర్/ ప్రయాణం కోసం ఎదురు చూస్తుంటే గనక ఆలస్యం చేయవద్దు. కలిసొచ్చే రంగు: ఎరుపు
 
శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)

మీకు రావలసిన దానికోసం లేదా జరగవలసిన దానికోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. విజయమనేది మనం చేసినదాన్ని బట్టి కొంత, అదృష్టాన్ని బట్టి కొంత ఉంటుందని గ్రహించండి. అధికారాన్ని దుర్వినియోగం చేయవద్దు. సాయం చేస్తానన్న వారిపై ఎక్కువ భారాన్ని వేయవద్దు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికిది మంచి సమయం. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. జీవితమనే నౌక ఎటు తిప్పితే అటు తిరుగుతూ, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి చేరడమే జీవితమంటే! మీ భాగస్వామికి మీ సహాయ సహకారాలు అవసరమని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)
ఒంటరిగా గడపడానికి ఇది తగిన సమయం. ఒంటరితనంలోని ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవించండి. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మానసికంగా, శారీరకంగా బాగుండకపోతే నిర్లక్ష్యం చేయవద్దు. కలిసొచ్చే రంగు: పాచిరంగు
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
మరీ యాంత్రికంగా తయారు కావద్దు. జరిగేదేదో జరగనివ్వండి, ఆందోళన పడకండి. మీ మనసును కలుషితం చేయడానికి, మీ భావోద్వేగాలను దెబ్బతీయడానికి ఇతరులకు అవకాశం ఇస్తున్నారని తెలుసుకోండి. వారికి ఆ అవకాశం ఇచ్చి, తిరిగి వారిని నిందించడం సరికాదు. కలిసొచ్చేరంగు: వంకాయరంగు
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్

 
సౌర వాణి
 
ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)
గ్రహ ప్రభావం కారణంగా బంధుమిత్రులతోనూ, సహోద్యోగులతోనూ అకాల శత్రుత్వం కలిగే అవకాశం కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండడం, నిష్కారణంగా నింద వస్తే అనుభవించడమే తప్ప, ఎదురు తిరిగి సాధించుకోగల కాలం కాదిది. అలాగని మరీ మౌనంగా ఉండమని భావం కాదు. ‘కరవద్దు గాని బుస్సుమనకుండా కూడా ఉండొద్దు’ అని దీనర్థం.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)

మీరు చేస్తున్న ఉద్యోగంలో గాని వ్యాపారంలోగాని మీకు ఓ తీరు విసుగూ అసంతృప్తీ పుట్టే కాలం కావచ్చు. అంతమాత్రాన దీన్ని విడిచేయవద్దు. మరో చోటికి ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఇంతకంటే జటిలమైన పరిస్థితులు ఎదురు కావచ్చు. కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే సంతోషాన్నీ పైవాళ్ల విశ్వాసాన్నీ పొందడం మంచిది ప్రస్తుతం.
 
జెమిని (మే 21-జూన్ 21)
మొహమాటం... బద్ధకం... కొత్త ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుందో అనే సంకోచం వల్ల- కొత్త ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి కదలరు. కుటుంబానికి ఆప్తులయిన ఎవరో ఒకరు మీ స్థిరాస్తి మీద ఓ కన్నేసి ఉంచిన కారణంగా పూర్తి దురుద్దేశ్యంతో కొత్త ఆలోచనని రేకెత్తింప జేస్తారు. గమనించండి. జాగ్రత్తపడండి.
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)
లౌకిక ప్రయత్నాల వల్ల ఫలితం లేదని గ్రహించి, వయసుల తారతమ్యాన్ని విడిచి పూజాపురస్కారాల ధోరణికి వచ్చేస్తారు. దంపతుల్లో ఒకరు ఉద్యోగరీత్యా లేదా మరే కారణంగా గాని ఒక పదిరోజుల పాటు వేరే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంది. అక్కడి వాతావరణం, మనుషుల ప్రభావం లేకుండా చూసుకోగలగాలి. విందు వినోదాలతో రోజులు గడుపుతారు.
 
లియో(జూలై 24-ఆగస్టు 23)
భార్యాభర్తలు వినోద యాత్ర లేదా తీర్థయాత్ర చేస్తారు. కుటుంబంలోని ఐకమత్యంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. సంతానం అభివృద్ధికి సంబంధించిన వార్తల్ని వింటారు. ఉద్యోగంలో ఉన్నతిని లేదా వేతనాభివృద్ధిని పొందుతారు. వచ్చే పోయే బంధుమిత్రులకి మన ఇంటి విషయాలని చె ప్పాల్సిన అవసరం లేదనే యథార్థాన్ని గుర్తు చేసుకుంటారు.
 
వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)
ఓ పద్ధతీ క్రమం లేకుండా సొమ్ము అనవసరంగా ఖర్చయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ముందు జాగ్రత్త అవసరం. పొరపాటున కూడా ఈ మాసంలో రుణానికీ అలాగే కలహానికీ వెళ్లకండి. అది దీర్ఘకాల వ్యాధిలా మారే అవకాశముంది. మీ ఉద్యోగంలో మరో శాఖకి లేదా మరో ప్రదేశంలోని కార్యాలయానికో బదిలీ అవుతారు. అధికారులతో విరోధించకండి.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీరు చేసే ప్రయత్నాలన్నీ పైకి విజయవంతమైనట్లు మీరు భావించవచ్చేమో గాని అవన్నీ కరిమింగిన వెలగపండు చందమే అని గ్రహించండి. ప్రస్తుత దశ పెద్దగా యోగించేది కానందువల్ల విరోధానికీ కలహాలకీ సంబంధించిన ప్రయత్నాలు చేసినా అపకీర్తీ ఆందోళనా తప్ప ప్రయోజనం ఉండదు. పట్టుదలని విడిస్తే మంచిది.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
నిష్కారణంగా ఇబ్బందికి గురై దాదాపు ఏడాదిన్నర నుండీ అనుభవిస్తున్న మనోవేదన నుంచి కొంత సాంత్వన కలుగుతుంది. మీ నిజాయితీ, ధైర్యం, వీటికి తోడుగా మీ దైవారాధన శక్తి మీకు అండగా నిలుస్తాయి. ఎన్ని ఇబ్బందులున్నా, గురుగ్రహం అండగా ఉన్న కారణంగా ఉద్యోగాన్ని సక్రమంగా చే స్తున్నారు, చేస్తారు కూడా. దిగులు పడకండి.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
చేసిన- చేపట్టిన పనుల్లో విజయావకాశాలు మెండు. కుటుంబ, కార్యాలయ పనుల్లో మీ ప్రతిభని మీరు చాటుకున్నా, ఆరోగ్య విషయంలో తగినంత శ్రద్ధని చూపించడం లేదని గ్రహించండి. మీ జీతానికి మించిన శ్రమపడే మీరు మీ జీవితారోగ్యాన్ని గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇబ్బంది పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త!
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం విహార యాత్ర చేసే అవకాశం ఉంది. వ్యాపారాన్ని పెంచే దిశగా ఆలోచించడంలో కొద్ది జాప్యం జరుగుతూ ఉండొచ్చు. మీకు సహాయకులుగానూ, భాగస్వాములుగానూ ఉన్న ఈ సిబ్బందిలో ఏ ఒక్కరు మిమ్మల్ని వ్యతిరేకించినా నడుపుకోగల సమర్థతని సంపాదించుకోవడానికి తీవ్ర కృషి అవసరం.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

కొనుగోళ్లూ అమ్మకాలూ అనేవి ఆస్తి విషయాల్లో సర్వసాధారణం. మనవాళ్లే కదా అనే భరోసాతో మీరు కొన్ని ముఖ్యపత్రాల విషయంలో అశ్రద్ధని చేయవద్దు. వ్యవహారంలో బంధుత్వానికి చోటు లేదు. శరీరానికి చర్మవ్యాధిగాని, ఇబ్బంది పెట్టే జలుబు గాని వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్త మంచిది.
 
పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
మీకు ప్రస్తుతం జరుగుతున్నది శిక్షణ తరగతి వంటి పరిస్థితి. ఏ కుటుంబ సభ్యుల ఉద్దేశ్యం ఎటువంటిదో, ఏ మిత్రులు దేన్ని మీ నుండి ఆశిస్తున్నారో, మీరు ఏ దిశగా ప్రయాణించాలని వీరంతా ఓ ప్రణాళికని వేశారో అర్థం చేసుకోండి. ఈ అందరినీ గమనించుకోండి తప్ప, ఎవరినీ వేలెత్తి చూపే గ్రహ అనుకూల దశ ప్రస్తుతానికి మీకు లేదని గ్రహించండి.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement