ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి | Exercise caution in commuting | Sakshi
Sakshi News home page

ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి

Published Fri, Dec 18 2015 10:39 PM | Last Updated on Sun, Sep 3 2017 2:12 PM

ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి

ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి

డిసెంబర్ 19 నుంచి 25 వరకు
టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
మీ అంతర్వాణి శక్తి, దానితోబాటే మీరు చెప్పే జోస్యమూ ఫలిస్తూ వస్తుంది. అంతర్వాణిని జాగ్రత్తగా ఆలకించి, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం మీకెంతో ఉపకరిస్తుంది. వాగ్దానాలను నెరవేర్చడంలో అలక్ష్యం చేయవద్దు. అలాగే మీకు ఇతరులు చేసిన వాగ్దానాలు కూడా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
అదృష్టం వరిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యక్తిగతమైన విషయాలు, వృత్తిసంబంధమైన విషయాలలో మీరు అనుకున్న విధానంలోనే ముందుకెళ్లడం మంచిది. లీగల్  డాక్యుమెంట్ లేదా కాంట్రాక్ట్‌పై చేసే ఒక సంతకం మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవితం మీకు అనుకూలమైన మలుపు తిరుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్
 
జెమిని (మే 21-జూన్ 21)
మీరు ఏమైతే కోరుకుంటున్నారో, దేని గురించయితే కలలు కంటున్నారో అది ఈ వారం తప్పక నెరవేరుతుంది. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మనోవ్యాధి లేదా శారీరక రుగ్మత తొలగిపోయి, జీవితం ఎంతో సంతోషంగా, ఆనందకరంగా సాగుతుంది. బంధువులు లేదా హితుల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)

మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల నుంచి బయట పడతారు. మీరు అనుకున్న పనులు, సాధించాలనుకున్న లక్ష్యాలు ఎవరి ద్వారా అవుతాయనుకుంటున్నారో వారిద్వారా ఆత్మవిశ్వాసంతో చేయించుకుంటారు. తండ్రి సూచనలు, సహకారం, అండదండలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: నారింజ
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

ఇతరులతో శాంతిని, సామరస్యాన్ని, సత్సంబంధాలను కోరుకుంటున్నట్లయితే ఈ వారం అవి మీకు సంపూర్ణంగా లభిస్తాయి. జీవితం తిరిగి మీ చెప్పుచేత ల్లోకొస్తుంది. ఆర్థిక ఒడుదొడుకుల నుంచి బయటపడతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రశాంతంగా, సహనంగా ఉండవలసిన సమయమిది. కలిసొచ్చే రంగు:వంకాయరంగు
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
పనిపరంగా, కెరీర్‌పరంగా కొద్దిపాటి సందిగ్ధపరిస్థితులు నెలకొనవచ్చు. వాటిమూలంగా మీకు నిస్సత్తువగా అనిపిస్తుంది. అయితే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త శక్తిని పుంజుకుని సంసిద్ధంగా ఉంటారు. ప్రేమ విషయంలో సున్నితమైన పరిస్థితి ఎదురవుతుంది. మనసు దృఢం చేసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

నిశ్చితార్థం కుదురుతుంది లేదా భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. జరిగిన పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలో ఒక శుభకార్యం జరగడమో లేదా విందు వినోదాలలో పాల్గొనడమో జరగవచ్చు. అయితే  న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడుచుకోవడాన్ని మరచిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఊదారంగు
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా చాలా అదృష్టకరంగా గడుస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రేమ లేదా వైవాహిక బంధం బలంగా మారుతుంది. రొమాన్స్‌లో పడతారు. జరుగుతున్న వాటిని అడ్డుకోవాలని చూడొద్దు. జీవితమనే ప్రవాహం ఎటు తీసుకెళితే అటు కొట్టుకెళ్లడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
వ్యాపారపరంగా కొత్త అవకాశం రావచ్చు. కాదనకుండా చేస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొత్త పనిని చేపట్టడానికిది అనుకూలమైన సమయం. ప్రకృతిలో మమేకమై హాయిగా, విశ్రాంతిగా గడుపుతారు. లేనిపోని భయాలన్నింటినీ అవతలకు నెట్టి జీవితాన్ని సంతోషంగా అనుభవించడం నేర్చుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఈ వారం కొంచెం అసహనంగా, చికాకుగా అనిపిస్తుంది. అవిశ్రాంతంగా గ డుపుతారు. కొన్ని విషయాలలో మార్పుచేర్పులు అవసరం కావచ్చు. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు మలుచుకోవలసిన బాధ్యత మీదే. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: నీలం
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీకొచ్చిన పనులు, నిపుణతలను మరొకరితో పంచుకుని, వారికి వచ్చిన వాటిని మీరు తెలుసుకోవడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ నైపుణ్యం పెరుగుతుంది. రావలసిన డబ్బందుతుంది. ఇంటి ఆవరణలో మొక్కలు నాటండి, ఇంటిని పచ్చదనంతో నింపండి. అదృష్టం కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
 
సౌర వాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)

ప్రయోజనాత్మకమైన ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణాల కాలంలో వస్తువుల భద్రత అతి ముఖ్యమని గ్రహించండి ఈ వారం. దాంతోపాటు వాహన ప్రయాణాన్ని మీరే గనక నడుపుతూ చేస్తున్న పక్షంలో నిదానించి ప్రయాణించండి. ప్రమాదమేమీ లేదుగానీ తగుమాత్రపు జాగ్రత తప్పనిసరి అని గ్రహించండి.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
వ్యవసాయదారులై న పక్షంలో అనాలోచితంగా పొలాలని తెగనమ్మకండి. ఇలా చేతికి ధనం వచ్చిన కారణంగా తాత్కాలికంగా కొత్త చిక్కులొచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు చదువుకునే దశలోనే ఉన్నట్లయితే మీరు వారి పక్కనే కూర్చుని మీకు మీరు చదువుకుంటూ వాళ్లని చదువుకునేలా చేయండి.
 
జెమిని (మే 21-జూన్ 21)
ఇష్టం లేని పని అయినప్పటికీ కుటుంబానికి శ్రేయోదాయకం కాబట్టి ఆ పనిలో భాగస్వాములు కావడం మంచిది. వృత్తి లేదా ఉద్యోగమే కాదు; కుటుంబంతో గడపడమూ అత్యవసరమని భావించండి. పొరపచ్చాలు పెద్దవి కాకుండా జాగ్రత్తపడండి. సంతానం విషయంలో ఎక్కువమొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. మాటలో తేలిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.
 
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధనం అందుతుంది. ఎంతో శ్రమతో సంపాదించిన ధనం తిరిగి మీకు చెందడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. దానధర్మాలపట్ల, తీర్థయాత్రలకి వెళ్లాలనే ఊహాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఇతరుల్ని నిందించకండి పదిమందిలో. అది చిలవలు పలవలై మిమ్మల్ని ఇరకాటంలో పెట్టొచ్చు.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
ధైర్యసాహసాలే పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారంలో మీకు మంచి లాభం చేకూరే అవకాశముంది. ఇతరులకి ఏదైనా వాగ్దానాన్ని చేసి ఉన్నట్లయితే, వెంటనే దానిని నెరవేర్చండి. లేని పక్షంలో ఆ విషయాన్ని చెప్పెయ్యండి తప్ప నెత్తిమీదికి తెచ్చుకోకండి. ఇతరుల వస్తువుల్నీ సొమ్ముల్నీ మీ దగ్గర భద్రపరచలేనని చెప్పండి.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 అవసరాలు పోను అనూహ్యంగా కొంత ధనం చేతికందుతుంది. ఆ ధనానికి అప్పు చేసి మరీ మరికొద్ది ధనాన్ని చేర్చి ఇళ్లస్థలాన్ని లేదా పొలాన్ని కొనాలనుకుంటారు. అయితే తొందరపడి ఎక్కువ మొత్తం వెచ్చించకండి. వ్యవహారాన్ని తెగ్గొట్టుకోకుండా జాగ్రత్తగా బేరసారాలు చేసి, విజయాన్ని సాధించండి.
 
లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

ఆర్థికంగా కొద్దిగా బలహీనంగా ఉండచ్చు. ఇంటికి బంధువుల రాకపోకలు హెచ్చుగా ఉన్న కారణంగా విసుగ్గా, చికాకుగా అన్పించవచ్చు. జీవితంలో పట్టుదల, ప్రతీకారం, విద్వేషం... ఇవే మన ధ్యేయాలైన పక్షంలో మనశ్శాంతి అనే మాటే మనకి గగనకుసుమమౌతుందని భావించాలి. పెద్దల మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరమని గ్రహించండి.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
దాంపత్య జీవితమనేది వాణిజ్యపు ఒప్పందంలా ఈ రాశిలోని కొందరి విషయంలో ఉండొచ్చు. అదే తీరుగా సంతానానికి తమ ఇల్లు ఓ విహారయాత్రాశాల లాగానో వినోదమందిరంగానో అన్పించవచ్చు. దాపరికం లేకుండా ఇంటివిషయాలని వివరించి చెప్పి, ఓ తీరు నమ్మకాన్ని కుటుంబ సభ్యులకి కల్గించడం ఈ వారంలో అవసరం.
 
శాజిటేరియస్  (నవంబర్23-డిసెంబర్ 21)

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరేమనుకున్నా నాకేమిటనే దృక్పథం పెరిగిపోతుంది. అయితే ఎదుటివారు తమ ఓటమిని అంగీకరించిన పక్షంలో వారికి దాసులయిపోయే వీరి స్వభావం వల్ల వారికి కీలుబొమ్మలుగా మారిపోతారు ఈవారంలో. ఇతరుల దృష్టిలో మీరు తండ్రిమాట వింటారనే పేరుంటుంది కానీ అది కేవలం పేరుకి మాత్రమే అని గ్రహించాలి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
కుటుంబాన్ని మీ అదుపులో పెట్టుకుంటారు. ఇతరులకి సహాయపడటం మంచిదేకాని, వారికి సహాయపడే క్రమంలో ఇంటిని మరచిపోవ ద్దు. అన్నింటా మిమ్మల్ని విజయం వరించే ఈ వారంలో మీరు సంయమనంతో వ్యవహరించని పక్షంలో వ్యయమనేది మీ అంచనాలు మించవచ్చు. అప్పులు వద్దు ఈ వారంలో.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

కలిసొచ్చే వారం ఇది మీకు. మీ బంధుజనంతో విందువినోదాలతో కాలక్షేపం చేస్తారు. మీ ఇంటి విషయాలని గూర్చిన ఆసక్తికర చ ర్చ జరిగి దానిలో కొత్త నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధి పథాన సాగుతారు. దాంతోపాటు ఇందరు అండగా ఉన్నార నే మనోధైర్యాన్ని పొందుతారు. చర్మవ్యాధి విషయంలో నిర్లక్ష్యం తగదు.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
వ్యక్తిగత కీర్తిని గురించి మీరు ఆలోచించరు. చిన్న అవమానం జరిగినా పట్టించుకోరు ఈ వారంలో. అనుక్షణం మీ గురించి మీరు పట్టించుకునే లక్షణం ఉన్నకారణంగా కష్టాలు దాదాపు దరిచేరవు. అది సంతోషించదగ్గ పరిణామం. ఆధ్యాత్మిక బోధల్ని వింటూ మంచి రచనల్ని చదివే అలవాటున్న మీకు తాత్కాలికంగా వచ్చిన కష్టమనేది పెద్దగా బాధించదు.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement