journeys
-
World Longest Train Trips: ప్రపంచంలోని పొడవైన రైలు ప్రయాణాలు (ఫోటోలు)
-
ఇక అన్ని ప్రయాణాలకూ ఒకే కార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించడానికి వీలుగా ఒకే కార్డును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు రెండో వారంలోగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ అంశంపై సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు... తొలుత హైదరాబాద్‌లోని ప్రజారవాణా వ్యవస్థ మొత్తానికి కలిపి వినియోగించేలా ఈ కార్డును అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదట మెట్రోరైల్, ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి వీలుగా ఈ కార్డులను జారీ చేస్తామని, సమీప భవిష్యత్తులో ఇదే కార్డుతో ఎంఎంటీఎస్, క్యాబ్ సేవలు, ఆటోలను కూడా వినియోగించుకొనేలా విస్తరి స్తామని మంత్రులు తెలిపారు. పౌరులు వారి ఇతర కార్డుల మాదిరే దీన్ని కొనుగోళ్లకు కూడా వినియోగించేలా వన్ కార్డ్ ఫర్ అల్ నీడ్స్ మాదిరి కామన్ మొబిలిటీ కార్డు ఉండాలని మంత్రులు అధికారులకు సూచించారు. ఈ కార్డుగల ప్రయా ణికులు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వినియోగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోటా వినియోగించుకొనేందుకు అవకాశం ఉంటుందని మంత్రులు తెలిపారు. మరోవైపు కామన్ మొబిలిటీ కార్డుకు ఒక పేరును సూచించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పౌరుల నుంచి పేర్లను కోరుతూ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో అరవింద్ కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు. -
హ్యాపీ జర్నీ!
►ప్రమాదాలు లేని ప్రయాణానికి సూత్రాలు ►సిఫార్సు చేసిన మలేసియా సంస్థ సాక్షి, హైదరాబాద్: దసరా సెలవులు వచ్చాయి. అంతా కుటుంబాలతో ప్రయాణాలకు సిద్ధమవుతారు. సొంత ఊళ్లకు వెళ్లేందుకు చాలా మంది వ్యక్తిగత వాహనాలనే వాడుతుంటారు. ఇలాంటి సుదూర ప్రయాణాలు సాఫీగా సాగడానికి ముందు జాగ్రత్తలు అవసరం. వీటిపై ‘మలేసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ రీసెర్చ్’ఓ సమగ్ర అధ్యయనం చేసింది. ఈ నివేదికను ఇటీవల విడుదల చేసింది. సేఫ్ అండ్ హ్యాపీ జర్నీకి ప్రాథమిక సూత్రాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ప్రయాణానికి బయలుదేరే ముందు... వాహనానికి సర్వీసింగ్ ఎప్పుడు అయింది? మళ్లీ ఎప్పుడు చేయించాలి? అనేవి సరిచూసుకోవాలి. ∙ప్రయాణించాల్సిన మార్గాన్ని ముందే నిర్దేశించుకోవడంతో పాటు అవసరమైన స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. ∙ప్రయాణించే/ డ్రైవింగ్ చేసే వాహనానికి అనువైన, పూర్తి సురక్షితమైన మార్గాన్నే ఎంచుకోవాలి. ∙ఎట్టి పరిస్థితుల్లోనూ వాహన సామర్థ్యానికి మించి ప్రయాణించకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ∙వాహనంలో అవసరమైనంత ఖాళీ ఉండేలా... పిల్లల కోసం చైల్డ్సీట్స్/ బూస్టర్స్ తప్పనిసరి చేసుకుంటూ, సీట్బెల్ట్స్ను సరిచూసుకోవాలి. వాహనం టైర్లు బయలుదేరే ముందు వాహన టైర్ల స్థితి, అందులో గాలి తదితరాలను క్షుణ్ణంగా గమనించాలి. టైర్లు సక్రమంగా లేకపోయినా, సామర్థ్యానికి మించి ఎక్కినా మార్గమధ్యంలో టైర్లు పాడవుతాయి. పక్కాగా ఉన్న టైర్లు వాడితే సమయం, ఇంధనం ఆదా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలూ తగ్గుతాయి. సుదూర ప్రయాణాలు చేసేప్పుడు... రాత్రి 10 గంటలు, ఆ తర్వాత డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగే ఆస్కారం నాలుగు రెట్లు ఎక్కువ. ∙ఆవలింతలు, ఏకాగ్రత లోపించడం, కళ్లు మండటం, బద్దకం, స్పందన వేగం తగ్గడం ఇవన్నీ అలసటకు నిదర్శనాలని గుర్తించాలి. ∙ ప్రతి రెండు గంటల డ్రైవింగ్ తర్వాత కాస్త విరామం తీసుకోవడం ఉత్తమం. ∙వీలుంటే డ్రైవింగ్ బాధ్యతల్ని లైసెన్స్ కలిగిన మరో డ్రైవర్‌కు అప్పగించడం లేదా కాసేపు ఆగడం చేయాలి. ∙20 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే చాలు.. అలసట పోయి శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి. ∙డ్రైవింగ్ చేసేప్పుడు మద్యంతో పాటు పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల్ని వినియోగించడం చేయకూడదు. ∙కాఫీ వంటివి తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ వీటినీ తీసుకోకపోవడమే మంచిది. ∙మంచినీళ్లు తాగడంతో పాటు పండ్లు వంటి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. విజన్... రహదారిపై ఉన్న వస్తువులు, వ్యక్తులకు సంబంధించిన 90 శాతం సమాచారం డ్రైవింగ్ కళ్లే అతడికి అందిస్తాయి. ∙ ద్విచక్ర వాహన చోదకులు, పాదచారులు ఆకర్షణీయంగా ఉండే దుస్తులు ధరించాలి. ∙ప్రయాణం ప్రారంభించే ముందే వైపర్, హెడ్లైట్ల పనితీరు పరీక్షించుకోవాలి. ∙వాహనచోదకులు... ప్రధానంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఉదయం పూట హెడ్లైట్లు వినియోగించడం ఉత్తమం. మొబైల్ ఫోన్... డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడితే ప్రమాదాలు జరిగే అవకాశం నాలుగు రెట్లు పెరిగినట్లే. ఇయర్ఫోన్లు, బ్లూటూత్ వంటివి వినియోగించినా... సెల్‌ఫోన్ వినియోగం డ్రైవర్ ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. సీట్ బెల్ట్... ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాహనం వెనుక భాగంలో కూర్చున్న వారికంటే డ్రైవర్, ఆ పక్క సీటులో కూర్చున్న వారికే ఐదు రెట్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారు కచ్చితంగా సీట్‌బెల్ట్ పెట్టుకోవాలి. ∙వాహనంలో ప్రయాణిస్తున్న వారు వాహన వేగంతో సమానంగా ముందుకు వెళ్తున్నట్లే. ఏదైనా అవాంతరం ఎదురై వాహనం హఠాత్తుగా ఆగితే... అదే వేగంతో అందులోని వారు డ్యాష్‌బోర్డ్/ స్టీరింగ్/ ముందు సీట్లకు ఢీకొని క్షతగాత్రులవుతారు. అలా కాకుండా సీట్‌బెల్ట్ కాపాడుతుంది. వేగం... మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనచోదకుడికి తనకు ఎదురయ్యే ముప్పును తక్షణం గుర్తించడం, వాహనాన్ని ఆపడం సకాలంలో సాధ్యం కాదు. ∙పరిమితికి మించి 10 శాతం వేగంతో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగితే సాధారణ స్థితికంటే 21 శాతం అధికంగా గాయాలవుతాయి. 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే తీవ్రమైన గాయాలు, కొన్ని సందర్భాల్లో మృత్యువుకూ ఆస్కారం ఉంది. 46 శాతం అధిక వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురైతే మరణించడానికే అవకాశాలు ఎక్కువ. వెనుక నుంచి వచ్చే వాహనాలతో... కొందరు కార్ల వెనుక అద్దం సమీపంలో సామానులు ఉంచుతారు. దీనివల్ల వెనుక వచ్చే వాహనం కనిపించక ప్రమాదాలు జరగొచ్చు. ∙ప్రతి రెండు వాహనాల మధ్యా కనీసం 2 సెకన్లు ప్రయాణించే దూరం ఉండాలి. వెనుక వాహనం స్పీడు గంటకు 60 కిమీ ఉంటే... ముందు వాహనానికి కనీసం 33 మీటర్ల దూరంలో ఉండాలి. ∙టోల్గేట్లు, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు క్యూ జంపింగ్ చేయకూడదు. -
ప్రయాణాలలో జాగ్రత్త పాటించండి
డిసెంబర్ 19 నుంచి 25 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ అంతర్వాణి శక్తి, దానితోబాటే మీరు చెప్పే జోస్యమూ ఫలిస్తూ వస్తుంది. అంతర్వాణిని జాగ్రత్తగా ఆలకించి, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలగడం మీకెంతో ఉపకరిస్తుంది. వాగ్దానాలను నెరవేర్చడంలో అలక్ష్యం చేయవద్దు. అలాగే మీకు ఇతరులు చేసిన వాగ్దానాలు కూడా నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) అదృష్టం వరిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యక్తిగతమైన విషయాలు, వృత్తిసంబంధమైన విషయాలలో మీరు అనుకున్న విధానంలోనే ముందుకెళ్లడం మంచిది. లీగల్ డాక్యుమెంట్ లేదా కాంట్రాక్ట్‌పై చేసే ఒక సంతకం మీకు ఎంతో మేలు చేస్తుంది. జీవితం మీకు అనుకూలమైన మలుపు తిరుగుతుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ జెమిని (మే 21-జూన్ 21) మీరు ఏమైతే కోరుకుంటున్నారో, దేని గురించయితే కలలు కంటున్నారో అది ఈ వారం తప్పక నెరవేరుతుంది. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మనోవ్యాధి లేదా శారీరక రుగ్మత తొలగిపోయి, జీవితం ఎంతో సంతోషంగా, ఆనందకరంగా సాగుతుంది. బంధువులు లేదా హితుల నుంచి బహుమతులు అందుతాయి. కలిసొచ్చే రంగు: దొండపండు రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితుల నుంచి బయట పడతారు. మీరు అనుకున్న పనులు, సాధించాలనుకున్న లక్ష్యాలు ఎవరి ద్వారా అవుతాయనుకుంటున్నారో వారిద్వారా ఆత్మవిశ్వాసంతో చేయించుకుంటారు. తండ్రి సూచనలు, సహకారం, అండదండలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: నారింజ లియో (జూలై 24-ఆగస్టు 23) ఇతరులతో శాంతిని, సామరస్యాన్ని, సత్సంబంధాలను కోరుకుంటున్నట్లయితే ఈ వారం అవి మీకు సంపూర్ణంగా లభిస్తాయి. జీవితం తిరిగి మీ చెప్పుచేత ల్లోకొస్తుంది. ఆర్థిక ఒడుదొడుకుల నుంచి బయటపడతారు. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రశాంతంగా, సహనంగా ఉండవలసిన సమయమిది. కలిసొచ్చే రంగు:వంకాయరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పనిపరంగా, కెరీర్‌పరంగా కొద్దిపాటి సందిగ్ధపరిస్థితులు నెలకొనవచ్చు. వాటిమూలంగా మీకు నిస్సత్తువగా అనిపిస్తుంది. అయితే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త శక్తిని పుంజుకుని సంసిద్ధంగా ఉంటారు. ప్రేమ విషయంలో సున్నితమైన పరిస్థితి ఎదురవుతుంది. మనసు దృఢం చేసుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) నిశ్చితార్థం కుదురుతుంది లేదా భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేస్తారు. జరిగిన పరిణామాలు ఆనందం కలిగిస్తాయి. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తాయి. కుటుంబంలో ఒక శుభకార్యం జరగడమో లేదా విందు వినోదాలలో పాల్గొనడమో జరగవచ్చు. అయితే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా నడుచుకోవడాన్ని మరచిపోవద్దు. కలిసొచ్చే రంగు: ఊదారంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. ఈ వారమంతా చాలా అదృష్టకరంగా గడుస్తుంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ప్రేమ లేదా వైవాహిక బంధం బలంగా మారుతుంది. రొమాన్స్‌లో పడతారు. జరుగుతున్న వాటిని అడ్డుకోవాలని చూడొద్దు. జీవితమనే ప్రవాహం ఎటు తీసుకెళితే అటు కొట్టుకెళ్లడం మంచిది. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వ్యాపారపరంగా కొత్త అవకాశం రావచ్చు. కాదనకుండా చేస్తే మంచి అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొత్త పనిని చేపట్టడానికిది అనుకూలమైన సమయం. ప్రకృతిలో మమేకమై హాయిగా, విశ్రాంతిగా గడుపుతారు. లేనిపోని భయాలన్నింటినీ అవతలకు నెట్టి జీవితాన్ని సంతోషంగా అనుభవించడం నేర్చుకోండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం కొంచెం అసహనంగా, చికాకుగా అనిపిస్తుంది. అవిశ్రాంతంగా గ డుపుతారు. కొన్ని విషయాలలో మార్పుచేర్పులు అవసరం కావచ్చు. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు మలుచుకోవలసిన బాధ్యత మీదే. మీ శక్తి సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టండి. కలిసొచ్చే రంగు: నీలం పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మీకొచ్చిన పనులు, నిపుణతలను మరొకరితో పంచుకుని, వారికి వచ్చిన వాటిని మీరు తెలుసుకోవడం వల్ల మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీ నైపుణ్యం పెరుగుతుంది. రావలసిన డబ్బందుతుంది. ఇంటి ఆవరణలో మొక్కలు నాటండి, ఇంటిని పచ్చదనంతో నింపండి. అదృష్టం కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ టారో ఇన్సియా టారో అనలిస్ట్ రేకీ గ్రాండ్ మాస్టర్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ప్రయోజనాత్మకమైన ప్రయాణాలు చేస్తారు. అయితే ప్రయాణాల కాలంలో వస్తువుల భద్రత అతి ముఖ్యమని గ్రహించండి ఈ వారం. దాంతోపాటు వాహన ప్రయాణాన్ని మీరే గనక నడుపుతూ చేస్తున్న పక్షంలో నిదానించి ప్రయాణించండి. ప్రమాదమేమీ లేదుగానీ తగుమాత్రపు జాగ్రత తప్పనిసరి అని గ్రహించండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) వ్యవసాయదారులై న పక్షంలో అనాలోచితంగా పొలాలని తెగనమ్మకండి. ఇలా చేతికి ధనం వచ్చిన కారణంగా తాత్కాలికంగా కొత్త చిక్కులొచ్చే అవకాశం ఉంది. మీ పిల్లలు చదువుకునే దశలోనే ఉన్నట్లయితే మీరు వారి పక్కనే కూర్చుని మీకు మీరు చదువుకుంటూ వాళ్లని చదువుకునేలా చేయండి. జెమిని (మే 21-జూన్ 21) ఇష్టం లేని పని అయినప్పటికీ కుటుంబానికి శ్రేయోదాయకం కాబట్టి ఆ పనిలో భాగస్వాములు కావడం మంచిది. వృత్తి లేదా ఉద్యోగమే కాదు; కుటుంబంతో గడపడమూ అత్యవసరమని భావించండి. పొరపచ్చాలు పెద్దవి కాకుండా జాగ్రత్తపడండి. సంతానం విషయంలో ఎక్కువమొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. మాటలో తేలిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ధనం అందుతుంది. ఎంతో శ్రమతో సంపాదించిన ధనం తిరిగి మీకు చెందడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తారు. దానధర్మాలపట్ల, తీర్థయాత్రలకి వెళ్లాలనే ఊహాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఇతరుల్ని నిందించకండి పదిమందిలో. అది చిలవలు పలవలై మిమ్మల్ని ఇరకాటంలో పెట్టొచ్చు. లియో (జూలై 24-ఆగస్టు 23) ధైర్యసాహసాలే పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారంలో మీకు మంచి లాభం చేకూరే అవకాశముంది. ఇతరులకి ఏదైనా వాగ్దానాన్ని చేసి ఉన్నట్లయితే, వెంటనే దానిని నెరవేర్చండి. లేని పక్షంలో ఆ విషయాన్ని చెప్పెయ్యండి తప్ప నెత్తిమీదికి తెచ్చుకోకండి. ఇతరుల వస్తువుల్నీ సొమ్ముల్నీ మీ దగ్గర భద్రపరచలేనని చెప్పండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అవసరాలు పోను అనూహ్యంగా కొంత ధనం చేతికందుతుంది. ఆ ధనానికి అప్పు చేసి మరీ మరికొద్ది ధనాన్ని చేర్చి ఇళ్లస్థలాన్ని లేదా పొలాన్ని కొనాలనుకుంటారు. అయితే తొందరపడి ఎక్కువ మొత్తం వెచ్చించకండి. వ్యవహారాన్ని తెగ్గొట్టుకోకుండా జాగ్రత్తగా బేరసారాలు చేసి, విజయాన్ని సాధించండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆర్థికంగా కొద్దిగా బలహీనంగా ఉండచ్చు. ఇంటికి బంధువుల రాకపోకలు హెచ్చుగా ఉన్న కారణంగా విసుగ్గా, చికాకుగా అన్పించవచ్చు. జీవితంలో పట్టుదల, ప్రతీకారం, విద్వేషం... ఇవే మన ధ్యేయాలైన పక్షంలో మనశ్శాంతి అనే మాటే మనకి గగనకుసుమమౌతుందని భావించాలి. పెద్దల మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరమని గ్రహించండి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) దాంపత్య జీవితమనేది వాణిజ్యపు ఒప్పందంలా ఈ రాశిలోని కొందరి విషయంలో ఉండొచ్చు. అదే తీరుగా సంతానానికి తమ ఇల్లు ఓ విహారయాత్రాశాల లాగానో వినోదమందిరంగానో అన్పించవచ్చు. దాపరికం లేకుండా ఇంటివిషయాలని వివరించి చెప్పి, ఓ తీరు నమ్మకాన్ని కుటుంబ సభ్యులకి కల్గించడం ఈ వారంలో అవసరం. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఎవరేమనుకున్నా నాకేమిటనే దృక్పథం పెరిగిపోతుంది. అయితే ఎదుటివారు తమ ఓటమిని అంగీకరించిన పక్షంలో వారికి దాసులయిపోయే వీరి స్వభావం వల్ల వారికి కీలుబొమ్మలుగా మారిపోతారు ఈవారంలో. ఇతరుల దృష్టిలో మీరు తండ్రిమాట వింటారనే పేరుంటుంది కానీ అది కేవలం పేరుకి మాత్రమే అని గ్రహించాలి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) కుటుంబాన్ని మీ అదుపులో పెట్టుకుంటారు. ఇతరులకి సహాయపడటం మంచిదేకాని, వారికి సహాయపడే క్రమంలో ఇంటిని మరచిపోవ ద్దు. అన్నింటా మిమ్మల్ని విజయం వరించే ఈ వారంలో మీరు సంయమనంతో వ్యవహరించని పక్షంలో వ్యయమనేది మీ అంచనాలు మించవచ్చు. అప్పులు వద్దు ఈ వారంలో. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కలిసొచ్చే వారం ఇది మీకు. మీ బంధుజనంతో విందువినోదాలతో కాలక్షేపం చేస్తారు. మీ ఇంటి విషయాలని గూర్చిన ఆసక్తికర చ ర్చ జరిగి దానిలో కొత్త నిర్ణయాలు తీసుకుని, అభివృద్ధి పథాన సాగుతారు. దాంతోపాటు ఇందరు అండగా ఉన్నార నే మనోధైర్యాన్ని పొందుతారు. చర్మవ్యాధి విషయంలో నిర్లక్ష్యం తగదు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వ్యక్తిగత కీర్తిని గురించి మీరు ఆలోచించరు. చిన్న అవమానం జరిగినా పట్టించుకోరు ఈ వారంలో. అనుక్షణం మీ గురించి మీరు పట్టించుకునే లక్షణం ఉన్నకారణంగా కష్టాలు దాదాపు దరిచేరవు. అది సంతోషించదగ్గ పరిణామం. ఆధ్యాత్మిక బోధల్ని వింటూ మంచి రచనల్ని చదివే అలవాటున్న మీకు తాత్కాలికంగా వచ్చిన కష్టమనేది పెద్దగా బాధించదు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
తిరిగొచ్చేదాక డౌటే
- ప్రమాదం అంచున ప్రయాణం - ఇష్టారాజ్యంగా వాహన రాకపోకలు - పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం - అధికారుల నామమాత్రపు తనిఖీలు - గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు నెల్లూరు (రవాణా): అస్తవ్యస్తమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు అమలు చేయని అధికారులు వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటినుంచి పనిమీద వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటారో లేదోనన్న భయం ప్రస్తుతం జనాన్ని వెంటాడుతోంది. మృత్యువు ఎప్పుడు ఏరూపంలో కంబళిస్తుందో ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఓవైపు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మరో వైపు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రమాదంలో 21 మంది అమాయకులు ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. వాహనాల మయం జిల్లాలో మొత్తం 5 లక్షలకుపైగా వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. వాటిలో 2.80 లక్షల బైక్‌లు, 30వేల ఆటోలు, ట్రాక్టర్లు 29,000, లారీలు 19,000, కార్లు 36,000, క్యాబ్‌లు, మాక్సీక్యాబ్‌లు 3వేలు, టౌన్ బస్సులు 81, టూరిస్టు, ట్రావెల్స్ 170, మిగిలినవి ఇతర వాహనాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 169 కి.మీ మేర జాతీయ రహదారి ఉంది. హైవేతో పాటు ముంబై, బెంగళూరు వెళ్లే ప్రధాన రోడ్లు ఉన్నాయి. అయితే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పోలీసులు, రవాణా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పరిమితికి మించి ప్రయాణం... ప్రధానంగా ఆటోలు, మాక్సీక్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దూరపు ప్రాంతాలకు మాక్సీక్యాబ్లును ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్‌తో కలిపి 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇన్నోవాలో ఏడుగురు, తుపాన్ వాహనంలో 10మంది, మాక్సీక్యాబ్లో ఎనిమిదిమంది, టెంపోలో 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంది. అయితే వాహనాన్ని బట్టి 10 నుంచి 25 మందికిపైగా ఎక్కించుకుని రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే ఆటోలో కేవలం ముగ్గుర్ని మాత్రమే ఎక్కించుకోవాలి. కానీ ఆటోలో 10మందికి పైగా ఎక్కించుకుని ప్రయాణం చేస్తున్నారు. అలాగే హైవేపై రాత్రివేళల్లో ఇష్టారీతిన వాహనాలను ఆపడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ నామమాత్రంగా మారింది. హైవే నిబంధనలు పట్టించుకోరు హైవేపైకి ఆటో రాకూడదన్న నిబంధన ఉంది. అయితే దాదాపు ఎక్కువ ఆటోలు జాతీయ రహదారిపైనే నిత్యం తిరుగుతుంటాయి. ప్రధానంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా డ్రైవర్ పక్కన ఎవరిని కూర్చోబెట్టకూడదన్న నిబందన ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల నామమాత్రపు తనిఖీలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, సుదూర ప్రాంతాలకు ఒక్కరే డ్రైవింగ్, మితిమీరిన వేగం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన రోజు అధికారులు హడావుడి చేసి మిగిలిన రోజులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. అలాగే ప్రధానంగా జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ స్పీడుబ్రేకర్లు ఉన్న ప్రాంతంలో ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే వాటిపై దృష్టిపెట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరముంది.