టారో బాణి | tarobani | Sakshi
Sakshi News home page

టారో బాణి

Published Fri, May 29 2015 10:41 PM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

టారో బాణి

టారో బాణి

టారో బాణి
 
ఏరిస్  (మార్చి 21- ఏప్రిల్ 20)
కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కొత్తగా ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. సాధించిన విజయాలకు, చేసిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కలిసొచ్చే రంగు: పీచ్
 
టారస్  (ఏప్రిల్ 21-మే 20)
కొత్త ఇల్లు కడతారు లేదా ఇల్లు మార తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీదైన శైలిలో అలవోకగా విజయాలు సాధించి, అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. పదిమందీ మిమ్మల్ని ప్రశంసిస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మనసులో ఏమైనా బాధ కలిగినప్పుడు గట్టిగా నవ్వుకోండి, ఆ బాధ దానంతట అదే తొలగిపోతుంది. కలిసొచ్చే రంగు: కెంపు వంటి ఎరుపు రంగు
 
 జెమిని (మే 21-జూన్ 21)
 కొన్నిరకాల సంశయాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇది తగిన సమయం. కొత్త ప్రేమబంధం ఏర్పడవచ్చు. ఏదైనా పనిని అనుకున్నప్పుడుతికమక పడకండా మీరు అనుకున్న విధంగా చేయండి. విజయం, ఆనందం మిమ్మల్ని వరిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత పసుపు
 
క్యాన్సర్  (జూన్22-జూలై 23)
 పని ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా మరింత ఉత్సాహంగా చేస్తారు. తికమకకు గురి చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు మీ మనసు మాట విని, దాని ప్రకారం నడుచుకోండి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్తకోణంలో పని చేసి, అధికారుల మన్ననలు అందుకుంటారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
 కొన్ని అనుకోని సమస్యలు చికాకు పెట్టవచ్చు. అధికారులు, పెద్దలతో వినయంగా మాట్లాడండి. వివాదాలు ఎదురైనప్పుడు రాజీధోరణిలో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఎవరు, ఎన్ని అవరోధాలు కలిగించినప్పటికీ, మీరు అనుకున్న పనులను విజయవంత ంగా పూర్తి చేస్తారు. కలిసొచ్చే రంగు: వెండి
 
వర్గో(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

అనుకోని మలుపులు మీ జీవితంలో అనుకూలమైన మార్పు తీసుకు వస్తాయి.  ఒకోసారి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టం అవచ్చు. గతం మిమ్మల్ని వెంటాడుతుంది. లోగడ చేసిన ఓ మంచిపని వల్ల ప్రస్తుతం మేలు కలుగుతుంది. శారీరక ఇబ్బందులు ఎదురైనప్పుడు రేఖి, ఫెంగ్‌షుయ్ పద్ధతులను అనుసరించడం శ్రేయస్కరం. కలిసొచ్చే రంగు: నలుపు
 
 
(లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 ఎప్పటినుంచో కలవాలనుకుంటున్న వ్యక్తిని కలుస్తారు. ఓ ప్రేమబంధంలో పడతారు. అవరోధాలను అధిగమించడానికి గట్టి ప్రయత్నం చేయండి. అందమైన కలలు కంటారు. ఊహాలోకంలో తేలిపోతారు. ప్రయాణంలో మీకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. పని ప్రదేశంలో ఒక్కసారిగా పాపులర్ అయిపోతారు. కలిసొచ్చే రంగు: పసుపు
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వారమంతా క్షణం తీరుబడి లేనట్టు గడుపుతారు. మీరు సాధించిన విజయాలను, పనిలో మీ ఒడుపును చూసి తోటివాళ్లు ఆశ్చర్యపోతారు. ఎవరు, ఏ విధంగా మాట్లాడినా అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. ఒక బంధం మిమ్మల్ని ఎంతో హాయిగా ఉంచుతుంది. జూన్ మూడున మీకు చాలా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: పిస్తా గ్రీన్
 
 శాజిటేరియస్  (నవంబర్23-డిసెంబర్ 21)
 మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఉన్న ప్రదేశం నుంచి మారవచ్చు. ఈ మార్పులన్నీ మీకు మంచిని, స్థిరత్వాన్ని కలిగించేవే కావడం ఊరట కలిగిస్తుంది. గత స్మృతులు మిమ్మల్ని బాధిస్తాయి. అయితే వాటినుంచి నేర్పుగా బయట పడటం అవసరం. ఈ గురువారం లోగా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: క్రీమ్ కలర్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
 మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించే సంఘటనలన్నీ ముగిసినట్లే. ఇతరులకు మీ వైఖరి నచ్చక పోవచ్చు. ఎవరి కోసమూ మారనక్కరలేదని గ్రహించండి.సంగీతం, చిత్రలేఖనం మీకు సాంత్వన నిస్తాయి. మీ కోసం మీరు అధిక సమయం వెచ్చించండి. ముదురు ఎరుపు, నారింజ రంగులకు ఈ వారం దూరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: తెలుపు
 
అక్వేరియస్  (జనవరి 21-ఫిబ్రవరి 19)
మీ వారం మీరు చాలా రొమాంటిగ్గా గడుపుతారు. కెరీర్ పరంగా ఇది మంచి సమయం. అ భావోద్వేగాలను కలిగించే బంధాలనుంచి బయట పడటం ఎలాగో నేర్చుకోండి. మీ సహజ స్వభావం మీకు ఇక్కడ సాయపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. వారాంతాన్ని విందు వినోదాలతో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: లేత గోధుమ
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
వ్యవహారాలలో సమతౌల్యత పాటించండి. మనసును, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. పరిసరాలను కూడా అనుకూలంగా మారుస్తుంది. మీ  జీవన గమ్యం ఎక్కడికన్నది మీ మనసును అడగండి. అప్పుడు మీకు మార్గాన్ని చూపిస్తుంది. మీరుండే ప్రదేశంలో ఆకుపచ్చటి మొక్కలను ఉంచండి... ముళ్లచెట్లు వద్దు. కలిసొచ్చే రంగు: లేత ఆకుపచ్చ
 
 ఇన్సియా కె.
 టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
సౌర వాణి
 
ఏరిస్  (మార్చి 21- ఏప్రిల్ 20)

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అనూహ్యమైన శుభవార్త ఒకటి మిమ్మల్ని ఆనందపరచవచ్చు. ఉద్యోగానికి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. తొందరలోనే శుభవార్తని వినగలరు. కలిసి రానప్పుడు నిరుత్సాహం, కలిసొచ్చిన పక్షంలో అత్యుత్సాహం చూపద్దు. సకుటుంబంగా పరమేశ్వర దర్శనం చేసుకోండి. కలిసొచ్చే సంఖ్య 7.
 
టారస్  (ఏప్రిల్ 21-మే 20)
సంతానానికీ తలిదండ్రులకీ మధ్య విద్యావిషయంలోనూ, పై చదువుల్ని చదవడానికి వెళ్లాల్సిన స్థల విషయంలోనూ ఆర్థిక విషయంలోనూ మనస్పర్ధలేర్పడవచ్చు. వ్యాపార రంగంలోని వారికి నష్టాలు ఎదురు కావచ్చు. రుణదాతలనుండి ఒత్తిడులు పెరుగుతాయి.  జాగరూకతగా లేకుంటే పరిస్థితులు మరింత వక్రిస్తాయి. కలిసొచ్చే సంఖ్య 5.
 
జెమిని (మే 21-జూన్ 21)
చిన్న పెట్టుబడులతో చేస్తున్న వ్యాపారం ఎండకాలంలో చెరువులా క్రమక్రమంగా క్షీణిస్తూ ఉండవచ్చు. రవాణా వ్యాపారస్థులకు ఆశించినంత ఆదాయం రాకపోవచ్చు. కింది స్థాయివారికీ పై అధికారులకీ సమన్వయ లోపం వల్ల ఈ ఇద్దరి మధ్యా ఇరుకున పడే ప్రమాదం ఉండవచ్చు. లౌక్యంగా నడవాల్సిన వారం ఇది. వాగ్దానాలు వద్దు. రుణాలనీయవద్దు. కలిసొచ్చే సంఖ్య 3.
 
క్యాన్సర్  (జూన్22-జూలై 23)
తాత్కాలికంగా వచ్చిన అనారోగ్యం మానసికంగా కుంగుదలకి గురి చేయవచ్చు. అనుకున్న ప్రతిపనీ వాయిదా పడుతూ లేదా సగమే పూర్తవుతూ ఉండచ్చు. గ్రహపరిస్థితుల దృష్ట్యా- మీకు సమర్థత ఉన్నప్పటికీ మీ మాట చెల్లుబడి కాకపోవచ్చు. దాన్ని అవమానకరంగా భావించకండి. ఇతరులకు సహాయపడగల వారం ఇది కాదని గ్రహించండి. కలిసొచ్చే సంఖ్య 9.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
తప్పక పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకున్న పని కాస్తా మధ్యలో అడ్డు తిరిగి పనిని విరమించే స్థాయి వరకూ వచ్చి ఎట్టకేలకు పూర్తవుతుంది. సంతానానికి ఔషధ సేవ తప్పక పోవచ్చు. భార్యాభర్తల మధ్య మూడోవ్యక్తి ద్వారా భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. వీలయినంతవరకూ తక్కువ మాట్లాడుతూ ఓర్పుతో నడవ వలసిన వారం ఇది. కలిసొచ్చే సంఖ్య 5.
 
వర్గో(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
వివాహం స్థలం పొలం గృహం.. ఇలాంటివేవో ఒకటి కలిసి రావచ్చు. సంతానానికి మంచి కళాశాలలో ప్రవేశం లభించవచ్చు. బంధుమిత్రుల రాకతో ఇల్లు కళకళ లాడుతుంది. విదేశాలనుండి పై చదువుల నిమిత్తం లేదా సన్మానం చేసే నిమిత్తం ఆహ్వానం లభించవచ్చు. నిర్మాణరంగంలో ఉన్న వారికి తృప్తికరమైన ఆదాయం లభించవచ్చు. కలిసొచ్చే సంఖ్య 7.
 
(లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
తీవ్రమైన ఆనందోళనతో ఒడిదుడుకులతో నడిచిన గత నెలకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ వారం. పెద్దలతో పరిచయాలూ వాటివల్ల కొన్ని సమస్యా పరిష్కారాలూ కావచ్చు. వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. వివాహం లేదా గృహప్రవేశం వాయిదా పడవచ్చు. ఇంట్లో పెద్దలకి అనారోగ్య సూచనలున్నాయి కాబట్టి జాగరూకత వహించక తప్పదు. కలిసొచ్చే సంఖ్య 4.
 
 స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
ఇంటిలో మీకంత గుర్తింపు ఈ వారంలో మీకు లభించకున్నా, మీకు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేష గౌరవం లభిస్తుంది. ప్రయోజనాత్మకమైన ప్రయాణాలనే చేస్తారు. పెద్దల పరిచయంతో ఎదగ దలుస్తారు. చేస్తున్న ఉద్యోగంలో కలిగే కీర్తిప్రతిష్ఠల ద్వారా స్థలాన్ని మార్పు చేసుకోవలసిన అవసరమేర్పడుతుంది. కలిసొచ్చే సంఖ్య 6.
 
శాజిటేరియస్  (నవంబర్23-డిసెంబర్ 21)
మీ మాట తీరువల్ల కొందరు మిత్రులూ అయినవాళ్లూ దూరం కావచ్చు. ఈ వారం స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు కాబట్టి, వీలయినంతవరకూ నిర్ణయాన్ని వాయిదా వెయ్యండి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయడానికి అనుకూలం కాదు. రుణాల వసూలులో మృదువుగా వ్యవహరించండి. ఘర్షణ సరికాదు. కలిసొచ్చే సంఖ్య 6.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
మీకెంతో పలుకుబడి ఉన్నా అనుకూలం కాని ప్రదేశానికి బదిలీ జరగొచ్చు. వ్యాపారం బాగానే జరుగుతున్నా,పెద్దగా లాభార్జన ఉండకపోవచ్చు. వ్యాపారం లేదా వృత్తిద్వారా  పెట్టుబడికి తగ్గ ఆర్జన లేక వృత్తి వ్యాపారాలకి స్వస్తి పలకాలనే ఆలోచన రావచ్చు. అయితే ఒక నెలపాటు వాయిదా వెయ్యండి ఆలోచనని. కలిసొచ్చే సంఖ్య 7.
 
 అక్వేరియస్  (జనవరి 21-ఫిబ్రవరి 19)
వినోద పర్యటనలూ, తీర్థయాత్రలూ దైవదర్శనాలూ చేస్తారు. అనాథాలకీ రోగులకీ ఆర్తులకీ యథాశక్తి సహాయపడతారు. కొత్తకొత్త వ్యాపార ప్రణాళికలు మీ తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైపోతూ ఉండవచ్చు. ఒక కుటుంబంలోకానీ సంస్థలో గాని వచ్చిన పొరపచ్చాన్ని మీ మాట నేర్పరితనంతో తొలగేలా చేసి గొప్ప గుర్తింపుని పొందుతారు. కలిసొచ్చే సంఖ్య 2.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడతారు. రావలసిన రుణాలని వసూలు చేసుకోగలుగుతారు. పరిస్థితికి తగినంత నేర్పరితనం మీ సొత్తయిన కారణంగా మీకు ఈ వారం మొత్తం అనుకూలమే. వైదికమైన సంస్కారాలేమున్నాయో ఆ అన్నిటినీ ఆచరింప లేకున్నా కొన్నిటిని పాటించి అందరికీ మార్గదర్శకులౌతారు. కలిసొచ్చే సంఖ్య 4.
 
మైలవరపు శ్రీనువాసరావు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement