టారో బాణి (జూన్ 6 నుంచి జూన్ 12 వరకు) | Taro bani (from June 6 to June 12) | Sakshi
Sakshi News home page

టారో బాణి (జూన్ 6 నుంచి జూన్ 12 వరకు)

Published Fri, Jun 5 2015 10:40 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

టారో బాణి (జూన్ 6 నుంచి జూన్ 12 వరకు)

టారో బాణి (జూన్ 6 నుంచి జూన్ 12 వరకు)

టారో బాణి
అనూహ్యమైన అవకాశాలు కలిసి వస్తాయి. మీ కలలను సాకారం చేసుకోగలిగే వారం ఇది. సన్నిహితులతో మీకున్న సంబంధాలు కొత్తశిఖరాలను చేరుకుంటాయి. మిమ్మల్ని మీరు మరింతగా పట్టించుకోవాలి. చేసే పనులను మరింత నమ్మకంతో చేయాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని మరికాస్త దృఢపరచుకోవాలి.
కలిసొచ్చే రంగు: పర్పుల్
 
పాతస్మృతుల తలపులతో మీకు కొత్త శక్తి వస్తుంది. విలాసంగా ఖర్చు చేసుకోగలిగేంత డబ్బు సంపాదిస్తారు. బంగారు కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి ఇది తగిన తరుణం. ఇంతరకూ ఉన్న అన్ని అననుకూలతలనూ చాలా సులభంగా అధిగమిస్తారు.
కలిసొచ్చే రంగు: నారింజ
 
ఆలస్యాలు, అడ్డంకులూ తొలగిపోయి, పనులు చకచకా జరుగుతాయి. మీ బంధు, మిత్రవర్గంలో మీరే చర్చనీయాంశం అవుతారు. అందరూ మీపై ప్రశంసలు కురిపిస్తారు. మీరు ఎవరి కంట పడకుండా అయితే ఉండాలనుకుంటున్నారో, వారే మీకెదురవుతారు. హాయిగా నవ్వుకోవడమే మీ రుగ్మతలకు సరైన మందు.
కలిసొచ్చే రంగు: మావిచిగురు రంగు
 
ఇది మీకు చాలా రొమాంటిగ్గా, సంతోషంగా గడిపే వారం. ప్రేమ, ఆనందం పొంగి పొర్లుతాయి. సాయం చేయదలచుకున్న వారికి మీరు అనుకున్న రీతిలో సాయం చేయడం మంచిది.  చక్కటి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఈ వారం మీరు కొందరు మిత్రులు, సన్నిహితుల సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులకి తగిన సమాధానం చెబుతారు.
కలిసొచ్చే రంగు:వంకాయ రంగు
 
ఈ వారం మీకు కొత్త సవాళ్లు ఎదుర యినప్పటికీ సరైన రీతిలో పరిష్కరించుకుంటారు. మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత చురుగ్గా మీ పనులను పూర్తి చేయవలసిన వారం ఇది. ఇంతకాలంగా మీ శక్తినంతటినీ హరించి వేస్తూ, మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలను ఎలా ఎదుర్కొనాలో ఒక అవగాహనకు వస్తారు. ఒక ప్రేమబంధంలో పడతారు.
కలిసొచ్చే రంగు: పింక్
 
మీ విశ్వాసాలమీద, నిర్ణయాల మీద మీరు స్థిరంగా నిలబడ వలసిన వారం ఇది. ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చేముందు దానిని మీరు నిలబెట్టుకోగలరా లేదా అని ఒకటికి రెండుమార్లు ఆలోచించడం మంచిది. మొత్తం మీద ఇది మీరు ఉన్న రంగంలో విస్తరణని, చేపట్టిన పనులలో విజయాన్ని ఇచ్చే వారం.
కలిసొచ్చే రంగు: పీచ్
 
ఎంతోకాలం నుంచి చేయాలని తపన పడుతున్న పనిని ఈ వారం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మీలో కలిగే భావోద్వేగాలను అణచుకోవడం కష్టమే అవుతుంది. మీ సమస్యల పరిష్కారానికి రేఖీ మంచి మార్గం. ఖర్చులు అడ్డూ అదుపు లేకుండా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది.
కలిసొచ్చే రంగు: పర్పుల్
 
ఏ మార్గంలో వెళ్తే గమ్యస్థానాన్ని చేరుకుంటారో మీకు తెలుసు కాబట్టి ఇక ఆలసించకండి.  వ్యాపార నిర్ణయం కోసం మీరు వేసుకున్న అంచనాలు ఫలిస్తాయి. మీ అంతరాత్మ చెబుతున్న దానిని మనసు పెట్టి వింటే మీరు ఎవరి మాట వినాలో మీకే తెలుస్తుంది. మీ ప్రేమబంధాన్ని కొనసాగిస్తారు.
కలిసొచ్చే రంగు: ఆరంజ్
 
మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఓసారి చూసుకోండి. నడక నిదానమైనా, నడిచే మార్గం సరైనదైతేనే మీరు విజయం వైపు పయనిస్తారని, ఉన్నత శిఖరాలను చేరుకుంటారని గ్రహించండి. మీ మనసులోని కోరికలను నెరవేర్చుకునేందుకు ఈ గురువారమే తగిన సమయం.
కలిసొచ్చే రంగు: సిల్వర్
 
ఇది మీకు మంచి విజయాన్ని, పుష్కలంగా డబ్బును ఇచ్చే వారం. జీవితమన్నాక ఎత్తు పల్లాలు రెండూ ఉంటాయని మరచిపోవద్దు. కొత్త ఆలోచనలు చేయడానికి కానీ, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి కానీ ఇది తగిన సమయం కాదు. మీ ఇంటిలో తూర్పువైపున వెదురు మొక్కను నాటండి.
కలిసొచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్
 
మీ ప్రేమ వ్యవహారాలకు, కెరీర్‌కు ఇది కలిసొచ్చే వారం. పరీక్షలలో విజయం సాధిస్తారు. సినిమా థియేటర్‌లో ఉన్నా, ఇరుగు, పొరుగు ఇళ్లల్లో హస్కు వేస్తున్నా, మీ ఉద్యోగంలో మీరు లీనమై ఉన్నా సరే, అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఈ శనివారం మీ ప్రేమకు ఆహ్వానం చెబుతారు. కలిసొచ్చే రంగు:ఎల్లో షేడ్స్
 
పుష్కలంగా డబ్బు చేతికందుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లేదా కొత్త ఉద్యోగంలో చేరతారు. ముఖ్యమైన కాంట్రాక్టుల మీద, డాక్యుమెంట్ల మీద సంతకం చేస్తారు. మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరుస్తారు. గ్రీన్ క్రిస్టల్‌ను ధరించడం ద్వారా మరింత ధనాన్ని, అనుకూలతలని ఆకర్షించవచ్చు.
కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్

ఇన్సియా కె.
టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
 
సౌర వాణి
 
శక్తికి మించిన వాగ్దానాలనీ, మొక్కులనీ, దానధర్మాలనీ, పూజాపురస్కారాలనీ చేయదలచి ఇబ్బందిలో పడబోతున్న వారం ఇది. అప్పు చేసి మరీ మీరు చేయబోయే దానం కుటుంబంలో వ్యతిరేకతకి అవకాశాన్నీయవచ్చు. విందులూ వినోద పర్యటనలూ మానసిక ఆనందాన్ని కలిగించవచ్చునేమో కానీ అప్పు చేసి చేయవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దు.
 
ఇంట్లో కలహాలూ ఉద్యోగంలో అనైక్యత మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. దైవధ్యానం, తక్కువ మాట్లాడటం అనేవి ఈ సమస్యకి పరిష్కార మార్గాలు. దూరపు చుట్టాలకోసం మరింతగా శ్రమించనవసరం లేద నే నిర్ణయానికి రాగలిగితే శారీరకంగానూ మానసికంగానూ కొంత ఊరట కలుగుతుంది. అనవసర పనుల్ని మానాలనే నిర్ణయానికి రాండి ఈ వారంలో.
 
మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొంత అసంతృప్తి కలిగించవచ్చు. ఉద్యోగంలో పై అధికారి సరిగా లేనివాడైనా ఎలా చిరునవ్వుతో పలకరిస్తున్నామో ఈ తాత్కాలిక అనైకమత్య పరిస్థితిలో ఆ నటనని మీ జీవిత భాగస్వామి పట్ల ప్రదర్శించడం అవసరం. తలిదండ్రులతో విరోధాన్ని లేకుండా మాట మెత్తనిదనాన్ని చూపండి ఈ వారంలో.
 
మీదైన శైలిలో మీరు సాగితే విజయం మీదే. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోక, పనివైపు అడుగులు వేయండి. కలిసొచ్చే వారం ఇది. కాలాన్ని వృథా చేయకుండా మీ అభివృద్ధి కోసమే వినియోగించుకోండి. పండితులైతే పుస్తక ముద్రణ/రచనలు మొదలైనవీ, గాయకులైతే సీడీల విడుదలా కచ్చేరీలూ వంటివీ.. ప్రయత్నించండి. అలాగే ఇతర రంగాలవారూ ప్రయత్నించండి.
 
మిమ్మల్ని గురించి మీరు అంచనా వేసుకోండి. సరైన మార్గదర్శి లభించినా గుడ్డిగా నమ్మకుండా ప్రయాణాన్ని సాగిస్తే చక్కగా ఉంటుంది మీ జీవితం. ఆ నిర్ణయాన్ని తీసుకోవలసిన వారం ఇదని గమనించండి. కుటుంబ వ్యవహారాలని గుంభనగా ఉంచుకోండి. ఇతర ఉద్యోగ వ్యాపార విషయాల అభివృద్ధిని గురించే చర్చించండి మార్గదర్శి అనిపించిన వారితో.
 
ఓ శుభవార్త మీ ఇంటి తలుపును తట్టవచ్చు. చెప్పలేనంత ఆనందం వెల్లివిరియవచ్చు. పొదుపు తప్పక చేయాల్సి రావచ్చు ఆ శుభకార్య నిర్వహణ కోసం. ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశానికి బదలీ కావడమో లేదా విదేశాలకి వెళ్లవలసి రావడమో జరగవచ్చు. సిద్ధంగా ఉండండి తగిన పత్రాలతో. తీర్థయాత్రలలో కానీ, దైవకార్యక్రమాలలో గానీ భాగస్వాములు కావలసి రావచ్చు.  
 
అసూయ, అనవసర ద్వేషాల వల్ల మానసిక అశాంతి కలగవచ్చు. లౌక్యంగా ప్రవర్తించండి. మీ మధ్యవర్తిత్వం ఓ మొండి సమస్యకు పరిష్కారం కావచ్చు. మీ వ్యవహార శైలి, నేర్పరితనంతో మీ సమర్థతని నిరూపించుకుని, మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన వారం ఇది. హామీలూ, వాగ్దానాలూ సంతకాలూ వద్దేవద్దు. జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా వ్యవహరించండి.
 
ముఖ్య వ్యవహారమొకటి చర్చల దశకి వస్తుంది. మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి అధర్మం, అసత్యాల వైపుకి వెళ్లకండి. మొదటి నుండీ ఏ మార్గంలో ప్రయాణిస్తూ వచ్చారో అదే మార్గంలో వెళ్లండి తప్ప- వారూ వీరూ చెప్పిన సూచనలు, సలహాల ప్రకారం తోవ తప్పి నడిచే వారం కాదిది. వంచన వైపుకి ఆలోచనని పోనీయకండి.
 
తాత్కాలికంగా అనుకూల కాలం కాని కారణంగా మీరు ప్రారంభించిన నిర్మాణ కార్యక్రమానికి అవరోధాలు రావడం గాని, తీవ్ర అభ్యంతరం కారణంగా మధ్యలో ఆపుదల గాని సంభవించవచ్చు. ఈ దశలో అనారోగ్యమూ జతకావచ్చు. ఒక కష్టానికి మరొకటి జత అయినప్పటికీ, చేయగలిగినంత జపాన్ని చేస్తూనే ఉంటే, ఒడ్డెక్కగలుగుతారు ఈ వారంలోనే.  
 
ఈ వారం మీకు అనుకోని నింద లేదా అనుమానం లేదా ఓ తొందర పాటు చర్య ఎదురు కావచ్చు. కుంగిపోవద్దు. చాలా తొందరలోనే ఆ పొరపాటు ఎవరిదో అందరికీ అర్థమై, ఆ నింద, అనుమానం దానంతట అదే తొలగిపోతుంది అనుభవంతో పాటు నిర్ణయాత్మక శక్తీ ధైర్యమూ మీకు లభిస్తాయి కాబట్టి.
 
అయినవాళ్ల మీద అనుమానాలనీ రేకెత్తించి, మీ నుంచి దూరం చేసేందుకు తగిన ప్రయత్నాలు కొందరు ఈ వారంలో చేయవచ్చు. వారు చెప్పబోయే చాడీలకి చెవిని అప్పగించనే వద్దు. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ  స్వయం నిర్ణయాన్ని తీసుకోండి. మీ దంపతులు ఆలోచించుకుని ఏ పనినైనా చేసుకోండి తప్ప మూడోవ్యక్తికి అవకాశాన్నీయకూడదని గమనించండి.
 
రాజకీయ రంగం వారికి కీర్తి ప్రతిష్ఠలని ఇనుమడింప చేసే వారం ఇది. వారి ప్రతిభకి గుర్తింపు లభించే రోజులివి. వ్యాపార రంగం వారికి వారాంతానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగిపోయిన పనులకి కదలిక ఏర్పడుతుంది. ఆర్థికంగా లోటు కనిపించవచ్చునేమోగాని మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు,సంస్కృత పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement