Mailavarapu srinuvasa Rao
-
టారో బాణి (జూన్ 6 నుంచి జూన్ 12 వరకు)
టారో బాణి అనూహ్యమైన అవకాశాలు కలిసి వస్తాయి. మీ కలలను సాకారం చేసుకోగలిగే వారం ఇది. సన్నిహితులతో మీకున్న సంబంధాలు కొత్తశిఖరాలను చేరుకుంటాయి. మిమ్మల్ని మీరు మరింతగా పట్టించుకోవాలి. చేసే పనులను మరింత నమ్మకంతో చేయాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని మరికాస్త దృఢపరచుకోవాలి. కలిసొచ్చే రంగు: పర్పుల్ పాతస్మృతుల తలపులతో మీకు కొత్త శక్తి వస్తుంది. విలాసంగా ఖర్చు చేసుకోగలిగేంత డబ్బు సంపాదిస్తారు. బంగారు కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి ఇది తగిన తరుణం. ఇంతరకూ ఉన్న అన్ని అననుకూలతలనూ చాలా సులభంగా అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: నారింజ ఆలస్యాలు, అడ్డంకులూ తొలగిపోయి, పనులు చకచకా జరుగుతాయి. మీ బంధు, మిత్రవర్గంలో మీరే చర్చనీయాంశం అవుతారు. అందరూ మీపై ప్రశంసలు కురిపిస్తారు. మీరు ఎవరి కంట పడకుండా అయితే ఉండాలనుకుంటున్నారో, వారే మీకెదురవుతారు. హాయిగా నవ్వుకోవడమే మీ రుగ్మతలకు సరైన మందు. కలిసొచ్చే రంగు: మావిచిగురు రంగు ఇది మీకు చాలా రొమాంటిగ్గా, సంతోషంగా గడిపే వారం. ప్రేమ, ఆనందం పొంగి పొర్లుతాయి. సాయం చేయదలచుకున్న వారికి మీరు అనుకున్న రీతిలో సాయం చేయడం మంచిది. చక్కటి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఈ వారం మీరు కొందరు మిత్రులు, సన్నిహితుల సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులకి తగిన సమాధానం చెబుతారు. కలిసొచ్చే రంగు:వంకాయ రంగు ఈ వారం మీకు కొత్త సవాళ్లు ఎదుర యినప్పటికీ సరైన రీతిలో పరిష్కరించుకుంటారు. మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత చురుగ్గా మీ పనులను పూర్తి చేయవలసిన వారం ఇది. ఇంతకాలంగా మీ శక్తినంతటినీ హరించి వేస్తూ, మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలను ఎలా ఎదుర్కొనాలో ఒక అవగాహనకు వస్తారు. ఒక ప్రేమబంధంలో పడతారు. కలిసొచ్చే రంగు: పింక్ మీ విశ్వాసాలమీద, నిర్ణయాల మీద మీరు స్థిరంగా నిలబడ వలసిన వారం ఇది. ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చేముందు దానిని మీరు నిలబెట్టుకోగలరా లేదా అని ఒకటికి రెండుమార్లు ఆలోచించడం మంచిది. మొత్తం మీద ఇది మీరు ఉన్న రంగంలో విస్తరణని, చేపట్టిన పనులలో విజయాన్ని ఇచ్చే వారం. కలిసొచ్చే రంగు: పీచ్ ఎంతోకాలం నుంచి చేయాలని తపన పడుతున్న పనిని ఈ వారం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మీలో కలిగే భావోద్వేగాలను అణచుకోవడం కష్టమే అవుతుంది. మీ సమస్యల పరిష్కారానికి రేఖీ మంచి మార్గం. ఖర్చులు అడ్డూ అదుపు లేకుండా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కలిసొచ్చే రంగు: పర్పుల్ ఏ మార్గంలో వెళ్తే గమ్యస్థానాన్ని చేరుకుంటారో మీకు తెలుసు కాబట్టి ఇక ఆలసించకండి. వ్యాపార నిర్ణయం కోసం మీరు వేసుకున్న అంచనాలు ఫలిస్తాయి. మీ అంతరాత్మ చెబుతున్న దానిని మనసు పెట్టి వింటే మీరు ఎవరి మాట వినాలో మీకే తెలుస్తుంది. మీ ప్రేమబంధాన్ని కొనసాగిస్తారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఓసారి చూసుకోండి. నడక నిదానమైనా, నడిచే మార్గం సరైనదైతేనే మీరు విజయం వైపు పయనిస్తారని, ఉన్నత శిఖరాలను చేరుకుంటారని గ్రహించండి. మీ మనసులోని కోరికలను నెరవేర్చుకునేందుకు ఈ గురువారమే తగిన సమయం. కలిసొచ్చే రంగు: సిల్వర్ ఇది మీకు మంచి విజయాన్ని, పుష్కలంగా డబ్బును ఇచ్చే వారం. జీవితమన్నాక ఎత్తు పల్లాలు రెండూ ఉంటాయని మరచిపోవద్దు. కొత్త ఆలోచనలు చేయడానికి కానీ, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి కానీ ఇది తగిన సమయం కాదు. మీ ఇంటిలో తూర్పువైపున వెదురు మొక్కను నాటండి. కలిసొచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ మీ ప్రేమ వ్యవహారాలకు, కెరీర్‌కు ఇది కలిసొచ్చే వారం. పరీక్షలలో విజయం సాధిస్తారు. సినిమా థియేటర్లో ఉన్నా, ఇరుగు, పొరుగు ఇళ్లల్లో హస్కు వేస్తున్నా, మీ ఉద్యోగంలో మీరు లీనమై ఉన్నా సరే, అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఈ శనివారం మీ ప్రేమకు ఆహ్వానం చెబుతారు. కలిసొచ్చే రంగు:ఎల్లో షేడ్స్ పుష్కలంగా డబ్బు చేతికందుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లేదా కొత్త ఉద్యోగంలో చేరతారు. ముఖ్యమైన కాంట్రాక్టుల మీద, డాక్యుమెంట్ల మీద సంతకం చేస్తారు. మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరుస్తారు. గ్రీన్ క్రిస్టల్‌ను ధరించడం ద్వారా మరింత ధనాన్ని, అనుకూలతలని ఆకర్షించవచ్చు. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి శక్తికి మించిన వాగ్దానాలనీ, మొక్కులనీ, దానధర్మాలనీ, పూజాపురస్కారాలనీ చేయదలచి ఇబ్బందిలో పడబోతున్న వారం ఇది. అప్పు చేసి మరీ మీరు చేయబోయే దానం కుటుంబంలో వ్యతిరేకతకి అవకాశాన్నీయవచ్చు. విందులూ వినోద పర్యటనలూ మానసిక ఆనందాన్ని కలిగించవచ్చునేమో కానీ అప్పు చేసి చేయవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంట్లో కలహాలూ ఉద్యోగంలో అనైక్యత మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. దైవధ్యానం, తక్కువ మాట్లాడటం అనేవి ఈ సమస్యకి పరిష్కార మార్గాలు. దూరపు చుట్టాలకోసం మరింతగా శ్రమించనవసరం లేద నే నిర్ణయానికి రాగలిగితే శారీరకంగానూ మానసికంగానూ కొంత ఊరట కలుగుతుంది. అనవసర పనుల్ని మానాలనే నిర్ణయానికి రాండి ఈ వారంలో. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొంత అసంతృప్తి కలిగించవచ్చు. ఉద్యోగంలో పై అధికారి సరిగా లేనివాడైనా ఎలా చిరునవ్వుతో పలకరిస్తున్నామో ఈ తాత్కాలిక అనైకమత్య పరిస్థితిలో ఆ నటనని మీ జీవిత భాగస్వామి పట్ల ప్రదర్శించడం అవసరం. తలిదండ్రులతో విరోధాన్ని లేకుండా మాట మెత్తనిదనాన్ని చూపండి ఈ వారంలో. మీదైన శైలిలో మీరు సాగితే విజయం మీదే. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోక, పనివైపు అడుగులు వేయండి. కలిసొచ్చే వారం ఇది. కాలాన్ని వృథా చేయకుండా మీ అభివృద్ధి కోసమే వినియోగించుకోండి. పండితులైతే పుస్తక ముద్రణ/రచనలు మొదలైనవీ, గాయకులైతే సీడీల విడుదలా కచ్చేరీలూ వంటివీ.. ప్రయత్నించండి. అలాగే ఇతర రంగాలవారూ ప్రయత్నించండి. మిమ్మల్ని గురించి మీరు అంచనా వేసుకోండి. సరైన మార్గదర్శి లభించినా గుడ్డిగా నమ్మకుండా ప్రయాణాన్ని సాగిస్తే చక్కగా ఉంటుంది మీ జీవితం. ఆ నిర్ణయాన్ని తీసుకోవలసిన వారం ఇదని గమనించండి. కుటుంబ వ్యవహారాలని గుంభనగా ఉంచుకోండి. ఇతర ఉద్యోగ వ్యాపార విషయాల అభివృద్ధిని గురించే చర్చించండి మార్గదర్శి అనిపించిన వారితో. ఓ శుభవార్త మీ ఇంటి తలుపును తట్టవచ్చు. చెప్పలేనంత ఆనందం వెల్లివిరియవచ్చు. పొదుపు తప్పక చేయాల్సి రావచ్చు ఆ శుభకార్య నిర్వహణ కోసం. ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశానికి బదలీ కావడమో లేదా విదేశాలకి వెళ్లవలసి రావడమో జరగవచ్చు. సిద్ధంగా ఉండండి తగిన పత్రాలతో. తీర్థయాత్రలలో కానీ, దైవకార్యక్రమాలలో గానీ భాగస్వాములు కావలసి రావచ్చు. అసూయ, అనవసర ద్వేషాల వల్ల మానసిక అశాంతి కలగవచ్చు. లౌక్యంగా ప్రవర్తించండి. మీ మధ్యవర్తిత్వం ఓ మొండి సమస్యకు పరిష్కారం కావచ్చు. మీ వ్యవహార శైలి, నేర్పరితనంతో మీ సమర్థతని నిరూపించుకుని, మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన వారం ఇది. హామీలూ, వాగ్దానాలూ సంతకాలూ వద్దేవద్దు. జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా వ్యవహరించండి. ముఖ్య వ్యవహారమొకటి చర్చల దశకి వస్తుంది. మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి అధర్మం, అసత్యాల వైపుకి వెళ్లకండి. మొదటి నుండీ ఏ మార్గంలో ప్రయాణిస్తూ వచ్చారో అదే మార్గంలో వెళ్లండి తప్ప- వారూ వీరూ చెప్పిన సూచనలు, సలహాల ప్రకారం తోవ తప్పి నడిచే వారం కాదిది. వంచన వైపుకి ఆలోచనని పోనీయకండి. తాత్కాలికంగా అనుకూల కాలం కాని కారణంగా మీరు ప్రారంభించిన నిర్మాణ కార్యక్రమానికి అవరోధాలు రావడం గాని, తీవ్ర అభ్యంతరం కారణంగా మధ్యలో ఆపుదల గాని సంభవించవచ్చు. ఈ దశలో అనారోగ్యమూ జతకావచ్చు. ఒక కష్టానికి మరొకటి జత అయినప్పటికీ, చేయగలిగినంత జపాన్ని చేస్తూనే ఉంటే, ఒడ్డెక్కగలుగుతారు ఈ వారంలోనే. ఈ వారం మీకు అనుకోని నింద లేదా అనుమానం లేదా ఓ తొందర పాటు చర్య ఎదురు కావచ్చు. కుంగిపోవద్దు. చాలా తొందరలోనే ఆ పొరపాటు ఎవరిదో అందరికీ అర్థమై, ఆ నింద, అనుమానం దానంతట అదే తొలగిపోతుంది అనుభవంతో పాటు నిర్ణయాత్మక శక్తీ ధైర్యమూ మీకు లభిస్తాయి కాబట్టి. అయినవాళ్ల మీద అనుమానాలనీ రేకెత్తించి, మీ నుంచి దూరం చేసేందుకు తగిన ప్రయత్నాలు కొందరు ఈ వారంలో చేయవచ్చు. వారు చెప్పబోయే చాడీలకి చెవిని అప్పగించనే వద్దు. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ స్వయం నిర్ణయాన్ని తీసుకోండి. మీ దంపతులు ఆలోచించుకుని ఏ పనినైనా చేసుకోండి తప్ప మూడోవ్యక్తికి అవకాశాన్నీయకూడదని గమనించండి. రాజకీయ రంగం వారికి కీర్తి ప్రతిష్ఠలని ఇనుమడింప చేసే వారం ఇది. వారి ప్రతిభకి గుర్తింపు లభించే రోజులివి. వ్యాపార రంగం వారికి వారాంతానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగిపోయిన పనులకి కదలిక ఏర్పడుతుంది. ఆర్థికంగా లోటు కనిపించవచ్చునేమోగాని మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. డా॥మైలవరపు శ్రీనివాసరావు,సంస్కృత పండితులు -
టారో బాణి
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కొత్తగా ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. సాధించిన విజయాలకు, చేసిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కలిసొచ్చే రంగు: పీచ్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) కొత్త ఇల్లు కడతారు లేదా ఇల్లు మార తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీదైన శైలిలో అలవోకగా విజయాలు సాధించి, అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. పదిమందీ మిమ్మల్ని ప్రశంసిస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మనసులో ఏమైనా బాధ కలిగినప్పుడు గట్టిగా నవ్వుకోండి, ఆ బాధ దానంతట అదే తొలగిపోతుంది. కలిసొచ్చే రంగు: కెంపు వంటి ఎరుపు రంగు జెమిని (మే 21-జూన్ 21) కొన్నిరకాల సంశయాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇది తగిన సమయం. కొత్త ప్రేమబంధం ఏర్పడవచ్చు. ఏదైనా పనిని అనుకున్నప్పుడుతికమక పడకండా మీరు అనుకున్న విధంగా చేయండి. విజయం, ఆనందం మిమ్మల్ని వరిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత పసుపు క్యాన్సర్ (జూన్22-జూలై 23) పని ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా మరింత ఉత్సాహంగా చేస్తారు. తికమకకు గురి చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు మీ మనసు మాట విని, దాని ప్రకారం నడుచుకోండి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్తకోణంలో పని చేసి, అధికారుల మన్ననలు అందుకుంటారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) కొన్ని అనుకోని సమస్యలు చికాకు పెట్టవచ్చు. అధికారులు, పెద్దలతో వినయంగా మాట్లాడండి. వివాదాలు ఎదురైనప్పుడు రాజీధోరణిలో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఎవరు, ఎన్ని అవరోధాలు కలిగించినప్పటికీ, మీరు అనుకున్న పనులను విజయవంత ంగా పూర్తి చేస్తారు. కలిసొచ్చే రంగు: వెండి వర్గో(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) అనుకోని మలుపులు మీ జీవితంలో అనుకూలమైన మార్పు తీసుకు వస్తాయి. ఒకోసారి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టం అవచ్చు. గతం మిమ్మల్ని వెంటాడుతుంది. లోగడ చేసిన ఓ మంచిపని వల్ల ప్రస్తుతం మేలు కలుగుతుంది. శారీరక ఇబ్బందులు ఎదురైనప్పుడు రేఖి, ఫెంగ్‌షుయ్ పద్ధతులను అనుసరించడం శ్రేయస్కరం. కలిసొచ్చే రంగు: నలుపు (లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఎప్పటినుంచో కలవాలనుకుంటున్న వ్యక్తిని కలుస్తారు. ఓ ప్రేమబంధంలో పడతారు. అవరోధాలను అధిగమించడానికి గట్టి ప్రయత్నం చేయండి. అందమైన కలలు కంటారు. ఊహాలోకంలో తేలిపోతారు. ప్రయాణంలో మీకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. పని ప్రదేశంలో ఒక్కసారిగా పాపులర్ అయిపోతారు. కలిసొచ్చే రంగు: పసుపు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వారమంతా క్షణం తీరుబడి లేనట్టు గడుపుతారు. మీరు సాధించిన విజయాలను, పనిలో మీ ఒడుపును చూసి తోటివాళ్లు ఆశ్చర్యపోతారు. ఎవరు, ఏ విధంగా మాట్లాడినా అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. ఒక బంధం మిమ్మల్ని ఎంతో హాయిగా ఉంచుతుంది. జూన్ మూడున మీకు చాలా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: పిస్తా గ్రీన్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఉన్న ప్రదేశం నుంచి మారవచ్చు. ఈ మార్పులన్నీ మీకు మంచిని, స్థిరత్వాన్ని కలిగించేవే కావడం ఊరట కలిగిస్తుంది. గత స్మృతులు మిమ్మల్ని బాధిస్తాయి. అయితే వాటినుంచి నేర్పుగా బయట పడటం అవసరం. ఈ గురువారం లోగా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: క్రీమ్ కలర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించే సంఘటనలన్నీ ముగిసినట్లే. ఇతరులకు మీ వైఖరి నచ్చక పోవచ్చు. ఎవరి కోసమూ మారనక్కరలేదని గ్రహించండి.సంగీతం, చిత్రలేఖనం మీకు సాంత్వన నిస్తాయి. మీ కోసం మీరు అధిక సమయం వెచ్చించండి. ముదురు ఎరుపు, నారింజ రంగులకు ఈ వారం దూరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: తెలుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీ వారం మీరు చాలా రొమాంటిగ్గా గడుపుతారు. కెరీర్ పరంగా ఇది మంచి సమయం. అ భావోద్వేగాలను కలిగించే బంధాలనుంచి బయట పడటం ఎలాగో నేర్చుకోండి. మీ సహజ స్వభావం మీకు ఇక్కడ సాయపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. వారాంతాన్ని విందు వినోదాలతో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: లేత గోధుమ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వ్యవహారాలలో సమతౌల్యత పాటించండి. మనసును, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. పరిసరాలను కూడా అనుకూలంగా మారుస్తుంది. మీ జీవన గమ్యం ఎక్కడికన్నది మీ మనసును అడగండి. అప్పుడు మీకు మార్గాన్ని చూపిస్తుంది. మీరుండే ప్రదేశంలో ఆకుపచ్చటి మొక్కలను ఉంచండి... ముళ్లచెట్లు వద్దు. కలిసొచ్చే రంగు: లేత ఆకుపచ్చ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అనూహ్యమైన శుభవార్త ఒకటి మిమ్మల్ని ఆనందపరచవచ్చు. ఉద్యోగానికి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. తొందరలోనే శుభవార్తని వినగలరు. కలిసి రానప్పుడు నిరుత్సాహం, కలిసొచ్చిన పక్షంలో అత్యుత్సాహం చూపద్దు. సకుటుంబంగా పరమేశ్వర దర్శనం చేసుకోండి. కలిసొచ్చే సంఖ్య 7. టారస్ (ఏప్రిల్ 21-మే 20) సంతానానికీ తలిదండ్రులకీ మధ్య విద్యావిషయంలోనూ, పై చదువుల్ని చదవడానికి వెళ్లాల్సిన స్థల విషయంలోనూ ఆర్థిక విషయంలోనూ మనస్పర్ధలేర్పడవచ్చు. వ్యాపార రంగంలోని వారికి నష్టాలు ఎదురు కావచ్చు. రుణదాతలనుండి ఒత్తిడులు పెరుగుతాయి. జాగరూకతగా లేకుంటే పరిస్థితులు మరింత వక్రిస్తాయి. కలిసొచ్చే సంఖ్య 5. జెమిని (మే 21-జూన్ 21) చిన్న పెట్టుబడులతో చేస్తున్న వ్యాపారం ఎండకాలంలో చెరువులా క్రమక్రమంగా క్షీణిస్తూ ఉండవచ్చు. రవాణా వ్యాపారస్థులకు ఆశించినంత ఆదాయం రాకపోవచ్చు. కింది స్థాయివారికీ పై అధికారులకీ సమన్వయ లోపం వల్ల ఈ ఇద్దరి మధ్యా ఇరుకున పడే ప్రమాదం ఉండవచ్చు. లౌక్యంగా నడవాల్సిన వారం ఇది. వాగ్దానాలు వద్దు. రుణాలనీయవద్దు. కలిసొచ్చే సంఖ్య 3. క్యాన్సర్ (జూన్22-జూలై 23) తాత్కాలికంగా వచ్చిన అనారోగ్యం మానసికంగా కుంగుదలకి గురి చేయవచ్చు. అనుకున్న ప్రతిపనీ వాయిదా పడుతూ లేదా సగమే పూర్తవుతూ ఉండచ్చు. గ్రహపరిస్థితుల దృష్ట్యా- మీకు సమర్థత ఉన్నప్పటికీ మీ మాట చెల్లుబడి కాకపోవచ్చు. దాన్ని అవమానకరంగా భావించకండి. ఇతరులకు సహాయపడగల వారం ఇది కాదని గ్రహించండి. కలిసొచ్చే సంఖ్య 9. లియో (జూలై 24-ఆగస్టు 23) తప్పక పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకున్న పని కాస్తా మధ్యలో అడ్డు తిరిగి పనిని విరమించే స్థాయి వరకూ వచ్చి ఎట్టకేలకు పూర్తవుతుంది. సంతానానికి ఔషధ సేవ తప్పక పోవచ్చు. భార్యాభర్తల మధ్య మూడోవ్యక్తి ద్వారా భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. వీలయినంతవరకూ తక్కువ మాట్లాడుతూ ఓర్పుతో నడవ వలసిన వారం ఇది. కలిసొచ్చే సంఖ్య 5. వర్గో(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) వివాహం స్థలం పొలం గృహం.. ఇలాంటివేవో ఒకటి కలిసి రావచ్చు. సంతానానికి మంచి కళాశాలలో ప్రవేశం లభించవచ్చు. బంధుమిత్రుల రాకతో ఇల్లు కళకళ లాడుతుంది. విదేశాలనుండి పై చదువుల నిమిత్తం లేదా సన్మానం చేసే నిమిత్తం ఆహ్వానం లభించవచ్చు. నిర్మాణరంగంలో ఉన్న వారికి తృప్తికరమైన ఆదాయం లభించవచ్చు. కలిసొచ్చే సంఖ్య 7. (లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) తీవ్రమైన ఆనందోళనతో ఒడిదుడుకులతో నడిచిన గత నెలకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ వారం. పెద్దలతో పరిచయాలూ వాటివల్ల కొన్ని సమస్యా పరిష్కారాలూ కావచ్చు. వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. వివాహం లేదా గృహప్రవేశం వాయిదా పడవచ్చు. ఇంట్లో పెద్దలకి అనారోగ్య సూచనలున్నాయి కాబట్టి జాగరూకత వహించక తప్పదు. కలిసొచ్చే సంఖ్య 4. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఇంటిలో మీకంత గుర్తింపు ఈ వారంలో మీకు లభించకున్నా, మీకు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేష గౌరవం లభిస్తుంది. ప్రయోజనాత్మకమైన ప్రయాణాలనే చేస్తారు. పెద్దల పరిచయంతో ఎదగ దలుస్తారు. చేస్తున్న ఉద్యోగంలో కలిగే కీర్తిప్రతిష్ఠల ద్వారా స్థలాన్ని మార్పు చేసుకోవలసిన అవసరమేర్పడుతుంది. కలిసొచ్చే సంఖ్య 6. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ మాట తీరువల్ల కొందరు మిత్రులూ అయినవాళ్లూ దూరం కావచ్చు. ఈ వారం స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు కాబట్టి, వీలయినంతవరకూ నిర్ణయాన్ని వాయిదా వెయ్యండి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయడానికి అనుకూలం కాదు. రుణాల వసూలులో మృదువుగా వ్యవహరించండి. ఘర్షణ సరికాదు. కలిసొచ్చే సంఖ్య 6. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీకెంతో పలుకుబడి ఉన్నా అనుకూలం కాని ప్రదేశానికి బదిలీ జరగొచ్చు. వ్యాపారం బాగానే జరుగుతున్నా,పెద్దగా లాభార్జన ఉండకపోవచ్చు. వ్యాపారం లేదా వృత్తిద్వారా పెట్టుబడికి తగ్గ ఆర్జన లేక వృత్తి వ్యాపారాలకి స్వస్తి పలకాలనే ఆలోచన రావచ్చు. అయితే ఒక నెలపాటు వాయిదా వెయ్యండి ఆలోచనని. కలిసొచ్చే సంఖ్య 7. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వినోద పర్యటనలూ, తీర్థయాత్రలూ దైవదర్శనాలూ చేస్తారు. అనాథాలకీ రోగులకీ ఆర్తులకీ యథాశక్తి సహాయపడతారు. కొత్తకొత్త వ్యాపార ప్రణాళికలు మీ తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైపోతూ ఉండవచ్చు. ఒక కుటుంబంలోకానీ సంస్థలో గాని వచ్చిన పొరపచ్చాన్ని మీ మాట నేర్పరితనంతో తొలగేలా చేసి గొప్ప గుర్తింపుని పొందుతారు. కలిసొచ్చే సంఖ్య 2. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడతారు. రావలసిన రుణాలని వసూలు చేసుకోగలుగుతారు. పరిస్థితికి తగినంత నేర్పరితనం మీ సొత్తయిన కారణంగా మీకు ఈ వారం మొత్తం అనుకూలమే. వైదికమైన సంస్కారాలేమున్నాయో ఆ అన్నిటినీ ఆచరింప లేకున్నా కొన్నిటిని పాటించి అందరికీ మార్గదర్శకులౌతారు. కలిసొచ్చే సంఖ్య 4. మైలవరపు శ్రీనువాసరావు