కుక్కతో రెజ్లింగ్‌ మ్యాచ్‌.. దూల తీరింది! | Dog Beats Professional Wrestler In Smash Wrestling Match Viral | Sakshi
Sakshi News home page

కుక్కతో రెజ్లింగ్‌ మ్యాచ్‌.. దూల తీరింది!

Published Wed, Oct 12 2022 7:12 AM | Last Updated on Wed, Oct 12 2022 7:44 AM

Dog Beats Professional Wrestler In Smash Wrestling Match Viral - Sakshi

కుక్కతో రెజ్లింగ్‌ మ్యాచ్‌.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుక్క రెజ్లింగ్‌ మ్యాచ్‌ ఆడడం అంటే కండలు పీక్కుతినడమే కనిపిస్తుంది. ఇక రింగ్‌లోకి దూసుకొచ్చిన సదరు కుక్కగారు తన ప్రత్యర్థిని మట్టికరిపించి అతని సరదాను తీర్చింది. అయితే ఇదంతా కేవలం ఫన్‌ కోసం మాత్రమే. 

బార్డర్‌ కోలి అనే కుక్క బర్త్‌డే సందర్భంగా దాని యజమాని ఇలా ప్లాన్‌ చేశాడు. వెస్ట్రన్‌ఫేర్‌లోని రెజ్లింగ్‌ రింగ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే మ్యాట్‌ అంతా కలియతిరిగిన బార్డర్‌ కోలి ప్రేక్షకులకు అభివాదం చేసింది. తన ప్రత్యర్థి సైకో మైక్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. ట్రెయినర్‌ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ బార్డర్‌ కోలి మ్యాచ్‌ ఆడింది. 

ముందుగా అనుకున్న ప్రకారం కుక్క సైకో మైక్‌ మీదకు రాగానే అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత రెజ్లర్‌ను పైకి లేవకుండా మూడుసార్లు జంప్‌ చేసింది. బార్డర్‌ కోలి షాట్లపై సైకో మైక్‌ తప్పంటూ అప్పీల్‌ చేశాడు. ఆ తర్వాత అంపైర్‌ మూడుసార్లు కౌంట్‌ చేసి బార్డర్‌ కోలిని విజేతగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగానే మనం పెంచుకునే కుక్కులు విశ్వాసంగా ఉంటాయి. యజమాని మాటను తుచా తప్పకుండా పాటిస్తుంటాయి. బాంబ్‌ స్క్వాడ్‌, స్పిపర్‌ డాగ్స్‌ అంటూ కొన్ని కుక్కలు విన్యాసాల్లో ఆరితేరి ఉంటాయి. వాటికిచ్చే స్పెషల్‌ ట్రైనింగ్‌ వల్ల మనషులతో సమానంగా పనిచేస్తాయి. ఇక విదేశాల్లో రాట్‌ వీలర్స్‌, పిట్‌బుల్స్‌  లాంటి కుక్కలకు ఫైటింగ్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ ఫైట్‌కు మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ ఫైట్స్‌పై పెద్ద మొత్తంలో బెట్‌లు కాస్తూ కాసుల వర్షం పండించుకుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement