
సాక్షి, తిరుపతి: నగరంలో మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. వరద రాజస్వామి గుడిలో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. ఆదివారం కూడా మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
మూడో రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తుండగా, జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హోటళ్లు, ఆలయాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గత మూడు రోజులుగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment