సాక్షి, తిరుపతి: నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్ సవాల్‌గా మారగా, మూడు హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్‌ఐ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.
తిరుపతి, తిరుమల అత్యంత సేఫ్‌గా ఉన్నాయని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతి వాసులు, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. కాగా, తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్, మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment