
థియేటర్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు
మల్కాజిగిరి:మల్కాజిగిరిలోని సాయిరాం థియేటర్‌కు బాంబు బెదిరింపు రావడంతో పేక్షకులతో పాటు పోలీసులు ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ..శనివారం రాత్రి 9.34కు సాయిరాం థియేటర్‌లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేయడంతో వారు మల్కాజిగిరి పోలీసులకు అప్రమత్తం చేశారు. దీంతో హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకున్న ఏసీపీలు సందీప్, వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ ప్రేక్షకులను బయటికి పంది బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో థియేటర్‌లోని పార్కింగ్ ఏరియా, క్యాంటిన్, థియేటర్‌లోపల తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రేక్షకులను సినిమా థియేటర్ లోనికి అనుమతించారు. ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.