కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు మూత పడనున్నాయి. దీంతో సినిమా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే, ఈసారి కరోనా వల్ల థియేటర్‌లు మూత పడటం లేదు. కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ఇలాంటి సమస్య వచ్చింది. థియేటర్ యజమానులకు సమ్మర్‌లో ఇలాంటి ఇబ్బందులు రావడంతో కాస్త నిరుత్సాహానికి గురౌతున్నారు.
వేసవి శెలవులలో లెక్కలేనన్ని సినిమాలు విడుదల అవుతాయి. ప్రేక్షకులతో థియేటర్స్ అన్నీ నిండిపోతాయి.. కానీ ఈ ఏడాదిలో అలాంటి సందడి లేకపోవడంతో హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మే 17 నుంచి పదిరోజులపాటు మూసివేయనున్నారు. సినిమాలు విడుదల లేకపోవడంతో థియేటర్లు నడపడం భారం కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు. కనీసం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.
థియేటర్స్ బంద్‌పై ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రియాక్షన్
తెలంగాణలో థియేటర్స్ బంద్‌పై తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి స్పందించారు. థియేటర్స్ బంద్ కావడానికి కారణం చిన్న సినిమాలకు కలెక్షన్స్ లేకపోచడం పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోవడమని ఆయన అన్నారు. ప్రతి రోజు థియటర్స్ ఖర్చులు భరించలేకే తాత్కాలికంగా సింగిల్ థియేటర్స్ మూసివేయాల్సి వచ్చిందన్నారు. కేవలం ఖర్చులు భరించలేకే బంద్ చేయాల్సి వచ్చింది. కానీ, మరే ఇతర కారణాలు ఏమి లేవన్నారు. నిర్మాతలు ముందుకు వచ్చి మెయింటెనెన్స్ భరిస్తామని చెబితే థియేటర్స్ ఓపెన్ చేస్తామని విజయేందర్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment