బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని ఏడు పాఠశాలలకు ఒకేసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒకేసారి ఏడు పాఠశాలకు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. బెదిరింపులు వచ్చిన పాఠశాలలకు హుటాహుటినా చేరుకొని పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. స్కూళ్ల నుంచి విద్యార్థులను ఖాళీ చేశారు.
‘మీ పాఠశాలలో శక్తివంతమైన బాంబులు పెట్టాం. అప్రమత్తం అవ్వండి. ఇది జోక్ కాదు సీరియస్. బాంబులు పేలితే మీతో సహా వందలాది మంది ప్రాణాలు కోల్పోతారు. వెంటనే పోలీసులకు కాల్ చేసి వాటిని తొలగించండి. ఆలస్యం చేయకండి. ఇప్పుడంతా మీ చేతుల్లోనే ఉంది.’ అని లేఖలో రాసుంది.
అయితే ఇప్పటి వరకు ఏ పాఠశాలలోనూ పేలుడు పదార్థాలు లభించలేదని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్ తెలిపారు. ఇవి నకిలీ బెదిరింపులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సోదాలు కొనసాగుతున్నాయని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పంత్ పేర్కొన్నారు.
బాంబ్ బెదిరింపులు వచ్చిన పాఠశాలలు
1. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, వర్తుర్
2. గోపాలన్ ఇంటర్నేషనల్ స్కూల్, మహదేవపుర
3. కొత్త అకాడమీ స్కూల్
4. సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్
5. ఇండియన్ పబ్లిక్ స్కూల్, గోవింద్‌పురా
6.ఎబెనెజర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఎలక్ట్రానిక్ సిటీ
చదవండి: జూనియర్ ఆర్టిస్టుల పేరుతో 95 మంది దుబాయ్‌కి.. తీరా అక్కడకు వెళ్తే..
Comments
Please login to add a commentAdd a comment