పర్యాటకుల స్వర్గధామంగా వర్ధిల్లుతున్న సౌదీలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా అద్భుతమైన హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రైవేట్ ద్వీపంలో ప్రశాంతంగా నివసించాలనుకున్నా, మారుమూల ఎడారిలో విడిది కోరుకున్నా, సందడికి కేంద్రమైన చోట విలాసవంతమైన బస కోరుకున్నా...పర్యాటకుల కోసం వైవిధ్యభరిత నివాస సౌకర్యాలను అందిస్తోంది. సౌదీపై పర్యాటకుల ఆసక్తిని రెట్టింపు చేసే వాటిలో అతిధి గృహాలు కూడా ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన అద్భుతమైన నేపథ్యాలతో సెట్ చేయబడిన అతిధి గృహాలు.. అటు ప్రకృతి సౌందర్యాన్ని ఇటు సంప్రదాయం ఆధునికతను మిళితం చేస్తూ హోటల్ అనే పదానికి కొత్త నిర్వచనాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి విశేషాలు...
సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్
ఎడారి మైదానాలు హిజాజ్ పర్వతాలు వంటి మంత్రముగ్దులను చేసే నేపధ్యంతో ఉంటుంది సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ ఇది ఒక ది రెడ్ సీ రిసార్ట్, ఇది నబాటేయన్ నిర్మాణ వారసత్వం తో ఎడారి పరిసరాలకు వన్నె తెస్తుంది. ఎడారి పువ్వుతో ప్రేరణ పొందిన ఈ హోటల్ బసను, ఫంక్షన్‌లను ఒకే కప్పు క్రింద నిర్వహిస్తుంది. అతిథులు చుట్టుపక్కల ఉన్న కొండ దిబ్బల వీక్షణలను ఆస్వాదించడానికి అనుకూలంగా విల్లాలు నిర్మించారు. ఈ ప్రదేశంలో అతిథులు ఆనందించడానికి రెండు సిగ్నేచర్ రెస్టారెంట్లు, అవుట్‌డోర్ పూల్, ఫిట్‌నెస్ సెంటర్, ప్రపంచ స్థాయి సిక్స్ సెన్సెస్ స్పా ఉన్నాయి. కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ప్రపంచంలోని ఉత్తమ హోటల్‌ల జాబితాలో ’2024 హాట్ లిస్ట్’లో ఇదీ ఒకటి.
డెసర్ట్ రాక్ రిసార్ట్
అచ్చంగా లోయలూ పర్వతాల మధ్య ఉన్న డెసర్ట్ రాక్ రిసార్ట్ హోటల్ ఒక నిర్మాణ కళాఖండం దాని అద్భుతమైన సహజ ప్రకృతిని సంరక్షిస్తూ పర్వతప్రాంతంలో పూర్తిగా కలగలిసి సిపోయింది. అతిథులు రాతితో చెక్కిన గదులలో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు.
నుజుమా, ఎ రిట్జ్ కార్ల్టన్ రిజర్వ్ ది రెడ్ సీ
అద్భుతమైన సహజ సౌందర్యం స్వదేశీ డిజైన్‌తో సహజమైన హోటల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు రిట్జ్–కార్ల్టన్ రిజర్వ్‌ల ప్రత్యేక శ్రేణిలో ఇది కూడా ఒకటి. చేరింది. ఈ హోటల్ రెడ్ సీ బ్లూ హోల్ ద్వీపాల సమూహంలో భాగమైన ప్రైవేట్ ద్వీపాల సహజమైన సెట్‌లో నెలకొల్పారు. పూర్తిగా ప్రకృతి సౌందర్యంతో మమేకమై పర్యావరణ హితంగా రూపొందించిన ఈ రిసార్ట్‌లో వన్ టూ ఫోర్ బెడ్ రూమ్ పడక గదులు 63 తో పాటు బీచ్ విల్లాలు ఉంటాయి. విలాసవంతమైన స్పా, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్ల శ్రేణి...మరెన్నో ఉంటాయి.
బాబ్ సంహాన్, దిరియా
ఈ ఏడాదే ప్రారంభమైన బాబ్ సంహాన్...యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నిలిచిన దిరియాలో ప్రారంభించిన మొట్టమొదటి హోటల్‌గా ఘనత దక్కించుకుంది. సిగ్నేచర్ నజ్దీ నిర్మాణ శైలితో సమకాలీన లగ్జరీని మిళితం చేసిన ఈ హోటల్ 106 గదుల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది, అతిథులను ప్రాంతపు సంస్కృతి చరిత్రలో మమేకం చేస్తుంది. నార్త్ దిరియాలోని సుందరమైన వాడి హనీఫా,అట్–తురైఫ్ రెండింటికి దగ్గరగా ఉన్నందున, అతిథులు హోటల్ సౌకర్యాలతో పాటు సమీపంలోని ఆకర్షణలను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు.
దార్ తంతోరా, అల్ ఉలా
దార్ తంతోరా అనేది ది హౌస్ హోటల్ నుంచి ఒక ఉన్నత స్థాయి పర్యావరణ వసతి గృహం, ఇది కూడా ఇటీవలే ప్రారంభించారు. చారిత్రాత్మక అల్ ఉలా ఓల్డ్ టౌన్లో ఉన్న ఈ హోటల్... వారసత్వపు వైభవం, సమకాలీన డిజైన్స్ ల మేలు కలయిక, ఇది అతిథులను 12వ శతాబ్దానికి తిరిగి తీసుకువెళ్లడానికి వినూత్నంగా రూపుదిద్దారు, అదే సమయంలో వారికి ఆధునిక ఆతిథ్యం కూడా అందిస్తుంది. హోటల్‌లో 30 అతిథి గదులు చారిత్రాత్మక మట్టి–ఇటుక భవనాల తరహాలో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతలతో కొలువుదీరాయి.
Comments
Please login to add a commentAdd a comment