availability
-
సౌదీ అతిధి గృహాల అందాలకు...పర్యాటకుల ఫిదా
పర్యాటకుల స్వర్గధామంగా వర్ధిల్లుతున్న సౌదీలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా అద్భుతమైన హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రైవేట్ ద్వీపంలో ప్రశాంతంగా నివసించాలనుకున్నా, మారుమూల ఎడారిలో విడిది కోరుకున్నా, సందడికి కేంద్రమైన చోట విలాసవంతమైన బస కోరుకున్నా...పర్యాటకుల కోసం వైవిధ్యభరిత నివాస సౌకర్యాలను అందిస్తోంది. సౌదీపై పర్యాటకుల ఆసక్తిని రెట్టింపు చేసే వాటిలో అతిధి గృహాలు కూడా ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన అద్భుతమైన నేపథ్యాలతో సెట్ చేయబడిన అతిధి గృహాలు.. అటు ప్రకృతి సౌందర్యాన్ని ఇటు సంప్రదాయం ఆధునికతను మిళితం చేస్తూ హోటల్ అనే పదానికి కొత్త నిర్వచనాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి విశేషాలు...సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ఎడారి మైదానాలు హిజాజ్ పర్వతాలు వంటి మంత్రముగ్దులను చేసే నేపధ్యంతో ఉంటుంది సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ ఇది ఒక ది రెడ్ సీ రిసార్ట్, ఇది నబాటేయన్ నిర్మాణ వారసత్వం తో ఎడారి పరిసరాలకు వన్నె తెస్తుంది. ఎడారి పువ్వుతో ప్రేరణ పొందిన ఈ హోటల్ బసను, ఫంక్షన్లను ఒకే కప్పు క్రింద నిర్వహిస్తుంది. అతిథులు చుట్టుపక్కల ఉన్న కొండ దిబ్బల వీక్షణలను ఆస్వాదించడానికి అనుకూలంగా విల్లాలు నిర్మించారు. ఈ ప్రదేశంలో అతిథులు ఆనందించడానికి రెండు సిగ్నేచర్ రెస్టారెంట్లు, అవుట్డోర్ పూల్, ఫిట్నెస్ సెంటర్, ప్రపంచ స్థాయి సిక్స్ సెన్సెస్ స్పా ఉన్నాయి. కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ప్రపంచంలోని ఉత్తమ హోటల్ల జాబితాలో ’2024 హాట్ లిస్ట్’లో ఇదీ ఒకటి.డెసర్ట్ రాక్ రిసార్ట్అచ్చంగా లోయలూ పర్వతాల మధ్య ఉన్న డెసర్ట్ రాక్ రిసార్ట్ హోటల్ ఒక నిర్మాణ కళాఖండం దాని అద్భుతమైన సహజ ప్రకృతిని సంరక్షిస్తూ పర్వతప్రాంతంలో పూర్తిగా కలగలిసి సిపోయింది. అతిథులు రాతితో చెక్కిన గదులలో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు. నుజుమా, ఎ రిట్జ్ కార్ల్టన్ రిజర్వ్ ది రెడ్ సీఅద్భుతమైన సహజ సౌందర్యం స్వదేశీ డిజైన్‌తో సహజమైన హోటల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు రిట్జ్–కార్ల్టన్ రిజర్వ్‌ల ప్రత్యేక శ్రేణిలో ఇది కూడా ఒకటి. చేరింది. ఈ హోటల్ రెడ్ సీ బ్లూ హోల్ ద్వీపాల సమూహంలో భాగమైన ప్రైవేట్ ద్వీపాల సహజమైన సెట్లో నెలకొల్పారు. పూర్తిగా ప్రకృతి సౌందర్యంతో మమేకమై పర్యావరణ హితంగా రూపొందించిన ఈ రిసార్ట్‌లో వన్ టూ ఫోర్ బెడ్ రూమ్ పడక గదులు 63 తో పాటు బీచ్ విల్లాలు ఉంటాయి. విలాసవంతమైన స్పా, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్ల శ్రేణి...మరెన్నో ఉంటాయి.బాబ్ సంహాన్, దిరియాఈ ఏడాదే ప్రారంభమైన బాబ్ సంహాన్...యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నిలిచిన దిరియాలో ప్రారంభించిన మొట్టమొదటి హోటల్‌గా ఘనత దక్కించుకుంది. సిగ్నేచర్ నజ్దీ నిర్మాణ శైలితో సమకాలీన లగ్జరీని మిళితం చేసిన ఈ హోటల్ 106 గదుల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది, అతిథులను ప్రాంతపు సంస్కృతి చరిత్రలో మమేకం చేస్తుంది. నార్త్ దిరియాలోని సుందరమైన వాడి హనీఫా,అట్–తురైఫ్ రెండింటికి దగ్గరగా ఉన్నందున, అతిథులు హోటల్ సౌకర్యాలతో పాటు సమీపంలోని ఆకర్షణలను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు.దార్ తంతోరా, అల్ ఉలాదార్ తంతోరా అనేది ది హౌస్ హోటల్ నుంచి ఒక ఉన్నత స్థాయి పర్యావరణ వసతి గృహం, ఇది కూడా ఇటీవలే ప్రారంభించారు. చారిత్రాత్మక అల్ ఉలా ఓల్డ్ టౌన్లో ఉన్న ఈ హోటల్... వారసత్వపు వైభవం, సమకాలీన డిజైన్స్ ల మేలు కలయిక, ఇది అతిథులను 12వ శతాబ్దానికి తిరిగి తీసుకువెళ్లడానికి వినూత్నంగా రూపుదిద్దారు, అదే సమయంలో వారికి ఆధునిక ఆతిథ్యం కూడా అందిస్తుంది. హోటల్లో 30 అతిథి గదులు చారిత్రాత్మక మట్టి–ఇటుక భవనాల తరహాలో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతలతో కొలువుదీరాయి. -
నయా టమాటా
సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను రబీలో పైలట్ ప్రాజెక్ట్ కింద సాగు చేయగా.. సూపర్ సక్సెస్ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్–6242, అన్సోల్, జువేల్ వంటి హైబ్రీడ్ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది. గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ లోకల్ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్‌కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్‌తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. ఒకవేళ మార్కెట్లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్‌కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి. వైరస్‌ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది. హైబ్రీడ్ రకాలకు ఊతం సంప్రదాయ నాటు వెరైటీలకు ప్రత్యామ్నాయంగా హైబ్రీడ్ వెరైటీలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్ఓ, చిత్తూరు జిల్లా -
గోదావరిలో చుక్కనీటినీ వదులుకోం
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో తమ వాటా 967 టీఎంసీల్లో చుక్కనీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. గోదావరిలో నీటిలభ్యతను తేల్చుతూ ఇటీవల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గోదావరి బోర్డుకు సమర్పించిన నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కలిసేచోట నుంచి గోదావరి నది సముద్రంలో కలిసేవరకు ఉన్న జీ–10 సబ్ బేసిన్‌లోని తెలంగాణ వాటాలో 28.847 టీఎంసీలను సీడబ్ల్యూసీ తక్కువగా చూపించిందని తప్పుబట్టింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1,486 టీఎంసీలకుగాను తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలు, ఏపీ ప్రాజెక్టులకు 518 టీఎంసీలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. జీ–10 సబ్ బేసిన్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు 287.189 టీఎంసీలు అవసరమని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మరో 126.642 టీఎంసీలు కావాలని, భవిష్యత్తులో చేపట్టనున్న ప్రాజెక్టులకు 8.887 టీఎంసీలు, విద్యుదుత్పత్తి అవసరాలకు 12.2 టీఎంసీలు అవసరమని తేల్చిచెప్పారు. జీ–10 సబ్ బేసిన్లో మొత్తం 434.918 టీఎంసీల కేటాయింపులు అవసరమని, సీడబ్ల్యూసీ నివేదికలో 406.07 టీఎంసీలను మాత్రమే చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిలభ్యత సీడబ్ల్యూసీ 498.07 టీఎంసీలని నిర్ధారించగా, సీడబ్ల్యూసీ పరిధిలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతుల ప్రకారం గోదావరి డెల్టా, పోలవరం అవసరాలకు 484.5 టీఎంసీలు అవసరమని గుర్తుచేశారు. పోలవరం దిగువ 45.83 టీఎంసీల లభ్యత ఉందని, పోలవరం అవసరాలకు 438 టీఎంసీలు సరిపోతాయని స్పష్టం చేశారు. -
హైదరాబాద్‌లో అందుబాటులోకి రాని 5జీ సేవలు?
-
Nalgonda: వ్యాక్సిన్ డోసులు ఫుల్.. స్పందన నిల్
సాక్షి, సూర్యాపేట(నల్లగొండ): నెల రోజుల క్రితం వరకు వ్యాక్సిన్ కోసం ఆస్పత్రుల ఎదుట బారులే బారులు కన్పించేవి. సరిపడా వ్యాక్సిన్ లేక అందరికీ ఇవ్వలేకపోయేవారు. దీంతో ధర్నాలు రాస్తారోకోలు చేసేవారు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. డోసులు అందుబాటులో ఉన్నా వాక్సిన్ వేసుకోవడానికి మాత్రం ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడంలేదు. సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడంలేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. ప్రధానంగా పట్టణ ప్రాంత ప్రజలు కరోనా బారినపడకుండా రెండు డోసులు వేయించుకుంటున్నా పల్లెవాసులు మాత్రం అంతగా శ్రద్ధకనబర్చడంలేదు. జిల్లా వ్యాప్తంగా 10.50లక్షల జనాభా ఉంటే 7.50లక్షల మందికి టీకా వేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా ఏడునెలల కాలంలో కేవలం 3.24లక్షల మంది మాత్రమే వేయించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 3.24 లక్షల డోసులు పూర్తి.. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ప్రక్రియ ప్రారంభమైంది. విడతల వారీ గా జిల్లా కేంద్ర ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,65,546 శాంపిల్స్ సేకరించగా.. 23,435 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ నెల 17 వరకు ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ ఆస్పత్రుల పరిధిలో వ్యాక్సినేషన్న్ ప్రక్రియ రెండు డోసులు కలిపి 3.24 లక్షలు పూర్తయింది. ఇందులో మొదటి డోసు 2,41,825 కాగా రెండో డోసు 82,901. పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ ఉన్న చోట వ్యాక్సినేషన్ కూడా ఇదే స్థాయిలో ఉంది. కానీ పీహెచ్‌సీల పరిధిలో మాత్రం పాజిటివ్ కేసులు తక్కువ శాతం ఉన్న చోట ఎక్కువగా వ్యాక్సినేషన్జరుగుతోంది. పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకోకుండా.. జనాభా ఆధారంగానే వ్యాక్సిన్ వేస్తున్నట్లు సమాచారం. పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్నచోట టీకాలు ఎక్కువ మందికి వేస్తేన్కరోనాకు కళ్లెం పడనుంది. అవగాహన కల్పించకే.. కేసులు నమోదు..? రాష్ట్ర స్థాయిలోనే జిల్లాలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి అధికారుల బృందం రెండుసార్లు జిల్లాలో పర్యటించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దున ఉన్న కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని మండలాల్లో ఎక్కువ కేసులు నమోదుకావడానికి గల కారణాలను రాష్ట్రస్థాయి బృందం జిల్లా వైద్యాధికారుల నుంచి ఆరా తీసింది. సరిహద్దున బెల్ట్ షాపులు అధికంగా ఉండటం, రెండు రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతుండటం తదితర కారణాలతో ఇక్కడ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు జిల్లా అధికారుల బృందం రాష్ట్రస్థాయి అధి కారులకు వివరించింది. అయితే ఈ బృందం పర్యటించిన తర్వాత పాజిటివ్ కేసుల శాతం తగ్గింది. ఏ ప్రాంతంలో పాజిటివ్ కేసుల శాతం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో కరోనా కట్టడికి అదేస్థాయిలో వ్యాక్సినేషన్జరగాలి. వైద్య ఆరోగ్య శాఖ ముందు చూపు లేకపోవడమో.. ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడం లేదా.. ప్రజలకు అవగాహన లేకపోవడమేమో కానీ వ్యాక్సినేషన్లో వేరియేష¯న్ ఉన్నట్లుగా బృందం గుర్తించి పరీక్షలు, టీకాలు పెంచాలని జిల్లా వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఆ వైపు అడుగులు వేయడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. రెండు నెలలకు సరిపడా టీకాలు ఉన్నాయి జిల్లాలోని ప్రజలకు కోవిడ్ టీకాలు రెండు నెలలకు సరిపడా అందుబాటులో ఉన్నాయి. 60 వేలకు పైగా కోవిడ్ టీకాలు సిద్ధంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో టీకాలు వేసుకునేందుకు ప్రజలు ముందుకువస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారికి కరోనా టీకాలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకుంటే మహమ్మారి నుంచి రక్షించబడతారు. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా టీకాల అధికారి కేసులు గుర్తించి చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నా యో గుర్తిస్తున్నాం. ఆయా చోట్ల పటిష్టచర్యలతో పాటుగా పరీక్షలు పెంచి టీకాలు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రెండోదశ కరోనా కొంతమేర తగ్గుముఖం పట్టినట్లయింది. మూడో దశను ఎదుర్కొనేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాం. ప్రజలు విధిగా మాస్క్, శానిటైజర్‌ను వినియోగించాలి. – డాక్టర్ కోటాచలం, జిల్లా వైద్యాధికారి -
గ్యాస్ షేర్లు గెలాప్!
దేశీయంగా పెరగనున్న గ్యాస్ లభ్యత, పర్యావరణానుకూల శుద్ధ ఇంధనాలకు కనిపిస్తున్న డిమాండ్ తదితర అంశాలు ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎల్పీజీ సంస్థలకు లబ్ధి చేకూర్చనున్నాయి. దేశవ్యాప్తంగా గ్యాస్ రవాణాకు అనువుగా ఏర్పాటవుతున్న మరిన్ని పైప్‌లైన్ నిర్మాణాలు ఇందుకు మద్దతివ్వనున్నాయి. వెరసి భవిష్యత్‌లో గ్యాస్ సంబంధ కంపెనీల షేర్లకు గిరాకీ పెరిగే వీలున్నట్లు స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముంబై: రానున్న కొన్నేళ్లలో పలు పట్టణాలను కలుపుతూ గ్యాస్ రవాణాకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటవుతున్నాయి. దీనికితోడు దేశ, విదేశీ మార్కెట్లలో గ్యాస్ లభ్యత పెరగనుంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వాలు పర్యావరణహిత ఇంధనాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వెరసి ఇకపై అటు గ్యాస్, ఇటు ఇంధన రవాణా కంపెనీలకు డిమాండ్ ఊపందుకోనున్నట్లు విశ్లేషకులు ఊహిస్తున్నారు. రానున్న రెండేళ్లలో అంటే 2023–24కల్లా దేశీయంగా అదనపు గ్యాస్ ఉత్పత్తి గరిష్టంగా రోజుకి 40 మిలియన్ మెట్రిక్ ప్రామాణిక ఘనపు మీటర్ల(ఎంఎంఎస్‌సీఎండీ)కు చేరే వీలున్నట్లు మోతీలా ల్ ఓస్వాల్ రీసెర్చ్ నివేదిక అభిప్రాయపడింది. ఇందుకు కేజీ బేసిన్లో బావుల నుంచి గ్యాస్ ఉత్పాదకత పెరిగే అంచనాలు జత కలిసినట్లు పేర్కొంది. ఆర్ఐఎల్ రెడీ రెండేళ్లలో ప్రైవేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ 28 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే వీలున్నట్లు మోతీలాల్ నివేదిక పేర్కొంది. దీనిలో 12.5 ఎంఎంఎస్‌సీఎండీని వేలం వేయనున్నట్లు తెలియజేసింది. దీనిలో 4.8 ఎంఎంఎస్‌సీఎండీని జామ్‌నగర్ రిఫైనరీలకోసం వినియోగించనున్నట్లు వివరించింది. ఇక మిగిలిన 12 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ ఉత్పత్తి చేసే అవకాశమున్నట్లు నివేదిక పేర్కొంది. రానున్న కాలంలో ప్రధానంగా ఎరువులు, రిఫైనింగ్–పెట్రోకెమికల్స్, సిటీగ్యాస్ పంపిణీ రంగాల నుంచి ఇంధనానికి అధిక డిమాండ్ కనిపించనున్నట్లు అంచనా వేసింది. తాజాగా పెరిగిన జోరు... రీసెర్చ్ సంస్థ సీఎల్ఎస్ఏ నివేదిక ప్రకారం దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి గత రెండు నెలల్లో 6 శాతం అంటే 4.6 ఎంఎంఎస్‌సీఎండీ పుంజుకుని ఈ జనవరికల్లా 82.3 ఎంఎంఎస్‌సీఎండీకి చేరింది. ఇందుకు తూర్పుతీర సముద్ర క్షేత్రాల నుంచి 4.4 ఎంఎంఎస్‌సీఎండీ ఉత్పత్తి పెరగడంతో 5.9 ఎంఎంఎస్‌సీఎండీకి గ్యాస్ లభ్యత చేరింది. ఆర్ఐఎల్–బీపీ క్షేత్రాలు ఇందుకు దోహదపడ్డాయి. ఎల్ఎన్జీ ట్రక్కులు పెరగడం ద్వారా రానున్న దశాబ్ద కాలంలో వార్షికంగా మరో 8–10 మిలియన్ మెట్రిక్ టన్నులకు డిమాండ్ జత కలిసే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. గ్యాస్ లభ్యత, వినియోగం పుంజుకోవడం ద్వారా గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (జీఎస్పీఎల్), గెయిల్ వంటి ఇంధన రవాణా కంపెనీలకు మేలు చేకూరనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. సామర్థ్యం ఇలా... ప్రస్తుతం వార్షికంగా దేశీ ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ సామర్థ్యం 42.5 ఎంఎంటీపీఏగా నమోదైంది. అయితే 2020లో 30 ఎంఎంటీపీఏ మాత్రమే రీగ్యాసిఫికేషన్ జరిగింది. ఇందుకు కొన్ని తాత్కాలిక అవాంతరాలు ఎదురైనట్లు నిపుణులు వెల్లడించారు. కాగా.. మరోవైపు దహేజ్, ధమ్రా, జైగఢ్ తదితర ప్రాంతాలలో ఏర్పాటవుతున్న టెర్మినళ్ల ద్వారా 24 ఎంఎంటీపీఏ అందుబాటులోకి రానుంది. ఇది పెట్రోనెట్ ఎల్ఎన్జీకి దన్నునివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అంతిమ వినియోగదారులకు గ్యాస్‌ను అందించవలసి ఉన్నట్లు చె ప్పారు. ఇందుకు అనుగుణంగా జీఎస్పీఎల్ కొన్ని కీలక పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తావించారు. వీటిలో దహేజ్–భాధుట్, అంజార్–చోటిల్లా, అంజార్–పలన్‌పూర్‌ను పేర్కొన్నారు. ఈ బాటలో 2021 జూలైకల్లా సిద్ధంకానున్న మెహశానా –భటిండా పైప్‌లైన్ వల్ల గుజరాత్ వెలుపలి గ్యాస్‌ను రవాణా చేసేందుకు వీలుంటుందని చెప్పారు. -
అందరికీ అందుబాటులో ఇసుక
సాక్షి, విజయవాడ: వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఈ నెల 21 వరకూ ఇసుక వారోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. ఇసుక కొరత తీర్చేందుకు ఇసుక రీచ్ లతో పాటు స్టాక్ డిపోలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. విజయవాడలోని భవానీపురం, షాదీఖానా, కానూరులో మూడు స్టాక్ డిపోలతో పాటు మచిలీపట్నం, మైలవరం, నూజివీడులో కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆన్లైన్లో ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం ఐదు ఇసుక రీచ్‌ల తో పాటు నాలుగు పట్టా భూములు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో వారం రోజులలో ఐదు ఇసుక రీచ్‌లు, ఐదు పట్టా భూములు అందుబాటులో కి రానున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక రీచ్ లు , స్టాక్ పాయింట్లు, స్టాక్ యార్డులు మొత్తం 15 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. -
రైళ్లు.. బస్సులు.. ఖాళీల్లేవ్ !
ప్రయాణాలపై సంక్రాంతి ప్రభావం టిక్కెట్లు అమ్మకాలు నిలిపేసిన ప్రైవేటు బస్ ఆపరేటర్లు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్‌లు తణుకు : సంక్రాంతికి ఊరు వెళదామనుకున్నా, యాత్రలకు వెళ్లాలనుకున్నా రిజర్వేషన్ చేయించుకునేందుకు వెళ్లే వారికి మాత్రం చుక్కెదురవుతోంది. ప్రధాన నగరాల నుంచి బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో బెర్తుల రిజర్వేషన్ పూర్తయిపోయింది. రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేందుకు అవకాశం ఉండటంతో ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో తర్వాత ప్రయత్నించిన వారికి నిరాశే మిగులుతోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ భర్తీ అవుతున్నాయి. మరోవైపు వెయిటింగ్ లిస్టు సైతం నిండిపోవడంతో ఒక్కో రైలులో నో రూం అని వస్తోంది. వేలాది మందిపై ప్రభావం జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా సుమారు 25 వరకు ముఖ్యమైన రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. జిల్లాకు చెందినవారు ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం, ముంబయి, చెన్నై వంటి నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు. సాధారణంగా రెండు, మూడు రోజుల పాటు వరుస సెలవులు వస్తేనే సొంతూరుకు రావాలని ఉవ్విళ్లూరుతుంటారు. సంక్రాంతికి ఈసారి విద్యాసంస్థలకు రెండు వారాలపాటు సెలవులు రావడంతో స్వస్థలాలకు చేరుకోవాలని పలువరు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన నగరాల నుంచి వచ్చే రైళ్లన్నీ నిండిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, నరసాపురం, నిడదవోలు పట్టణాల మీదుగా నిత్యం మూడు వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పండగ సమయాల్లో అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే రైళ్లలో కనీసం టిక్కెట్టు తీసుకునే స్థితి లేకుండా పోయింది. దీంతో తాత్కాల్‌పై గంపెడాశలు పెట్టుకుంటున్నారు. ఆర్టీసీదీ అదే తంతు ఆర్టీసీ అధికారులు పండగ రద్దీ కారణంగా అదనపు బస్సులు నడపాలనే యోచనలో ఉన్నారు. కొందరు తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ చేయించుకోగా మిగిలిన వారంతా పండగ తర్వాత ఆయా నగరాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులపై ఆధార పడక తప్పదు. ఈ పరిస్థితుల్లో జనవరి 20 వరకు ఖాళీల్లేవని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రైవేట్ బస్సుల్లో సాధారణ రోజుల్లో హైదరాబాద్‌కు టిక్కెట్టు ధర రూ.450 నుంచి రూ.500 వరకు ఉంటే పండుగ తర్వాత రూ. వెయ్యి పైబడి చెబుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ అదనపు సర్వీసులు నడిపినా టిక్కెట్టు ధర మాత్రం భారీగానే పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు రైళ్లన్నీ నిండుకోవడంతో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొందరు బస్సు ఆపరేటర్లు టిక్కెట్లు బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.