అధికారుల తనిఖీ...పలు హోటళ్లకు జరిమానా
Published Tue, Apr 4 2017 11:00 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
► నగరంలోని హోటళ్లలో జీహెచ్‌ఎంసీ అధికారుల తనిఖీలు
► పలు హోటళ్లకు జరిమానా విధించారు
హైదరాబాద్: నగరంలోని హోటళ్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు రెండవరోజు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు హోటళ్లకు, రెస్టారెంట్లకు జరిమానా విధించారు. అపరిశుభ్రంగా ఉన్నందుకు, ప్రభుత్వ అనుమతిలేని మాంసాన్ని ఉపయోగించినందుకు గాను బంజారాహిల్సెలోని ఆన్ ఓహిరీస్ హోటల్ యాజమాన్యానికి రూ.5వేలు జరిమానా విధించారు.
షాపూర్‌నగర్‌లోని సాగర్ రెస్టారెంట్‌లో అనధికార కబేళాల నుంచి తీసుకొచ్చిన మాంసం ఉపయోగించడంతో ఆ హోటల్‌ను మూసివేశారు. నల్గొండ క్రాస్ రోడ్డులోని సోహెల్ హోటల్‌లో అనుమతిలేని మాంసం ఉపయోగిస్తున్నందుకు రూ.40వేల జరిమానా విధించారు. అలాగే ఆర్టిసీ క్రాస్‌రోడ్స్‌లోని అస్టోరియా హోటల్‌కు రూ. 20వేల జరిమానా విధించారు. సికింద్రాబాద్ ఎస్.డి రోడ్‌లోని మినర్వాగ్రాండ్ హోటల్ అండ్ రెస్టారెంట్‌కు రూ. 10వేలు జరిమానా విధించారు. గచ్చిబౌలిలోని అల్‌షబా హోటల్‌లో జీహెచ్ఎంసీ అధికార ముద్రలేని మాంసాన్ని వినియోగిస్తున్నందున రూ. 20వేలు జరిమానా విధించారు. గచ్చిబౌలిలోని డ్రంక్‌యార్డ్ శివాని రెస్టారెంట్ బార్‌కు రూ. 10వేలు జరిమానా విధించారు.
Advertisement
Advertisement