సాక్షి,తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించి ఫేక్‌మెయిల్స్ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఫేక్‌మెయిల్స్‌పై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతిలోని ఏడు హోటల్స్‌తో పాటు రెండు ఆలయాలకు జాఫర్‌సాదిక్ పేరుతో బాంబు బెదిరింపు ఫేక్‌మెయిల్స్ వచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు.
మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్,మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది.
ఇదీ చదవండి: హత్యకు యత్నం.. పీఎస్‌కు వెళితే అక్కడా దాడి
Comments
Please login to add a commentAdd a comment